👉టాలీవుడ్ లో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో పాల్గొంటూ ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రస్తుతం ఎక్కువగా ఎన్నికల వైపు ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే బీజేపీ టిడిపి పార్టీతో పొత్తు కలుపుకొని ఈసారి ఎలక్షన్స్ లో నిలబడే విధంగా ప్లాన్ చేశారు. ఇప్పటికే అన్ని పార్టీల సైతం తమ అభ్యర్థులు పోటీ చేసే జాబితాలను కూడా విడుదల చేశారు. ఈ క్రమంలోనే మవోయిస్టు కీలక నేత గణేష్ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలపైన స్పందిస్తూ ఒక లేఖను కూడా రాయడం జరిగింది..ముఖ్యంగా సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించినటువంటి జనసేన పార్టీ పైన తీవ్రమైన విమర్శలను సైతం చేశారు.👉ఆయన పార్టీని స్థాపించేటప్పుడు తమ పార్టీ కూడా కమ్యూనిజం భావాజలం కలిగి ఉంటుందంటూ వెల్లడించారు.కానీ అతడు ప్రస్తుతం బిజెపితో పొత్తు పెట్టుకుని మరి రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కు స్థిరమైన రాజకీయ విధానం అనేది లేదని అతనికి విశ్వాసనీయత చాలా తక్కువ అని..సినీ గ్లామర్ కాపు కులస్తుల గుర్తింపుతోనే రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిపోయింది అంటూ మావోయిస్టు గణేష్ సైతం ఒక లేఖ ద్వారా వెల్లడించారు.దీంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు..ఇప్పటివరకు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ను ఇదే విధంగానే విమర్శిస్తూ ఉన్నారు ఇప్పుడు మావోయిస్టు కూడా విమర్శిస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.. ఇటివలె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి డైలాగులను కూడా విడుదల చేయగా అందులో కూడా పొలిటికల్ పరంగా ఉండడంతో అసలు ఈ సినిమాకు పొలిటికల్ కలుపు తగిలిస్తే ఎవరు చూస్తారు అంటూ పలువురు అభిమానులు వాపోతున్నారు.మరి ఆ మావోయిస్టు రాసినటువంటి లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
తాగు నీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తారోకో..ప్రకాశం జిల్లా..
పెద్దదోర్నాల పంచాయితీ పరిధిలోని ఇనముక్కల ఎస్సీ పాలెం మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో కేజీ రోడ్డుపై రాస్తారోకో చేశారు.నీళ్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. గత్యంతరం లేక పొలాలకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని తెలిపారు. ట్యాంకర్ ల ద్వారా రోజు మార్చి రోజు నీటిని సరఫరా చేయడం మూలంగా ఇబ్బందులు తప్పడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ప్రతి రోజూ నీటిని సరఫరా చేసి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. దాదాపు గంటసేపు రాస్తారోకో చేయడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.ఎస్ఐ అంకమ్మరావు అక్కడకు చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దన్నారు .సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని చెప్పారు.దీంతో రాస్తారోకోను విరమించారు.కార్యక్రమంలో దాదాపు వంద మహిళలు ఖాళీ బిందెలతో పాల్గొన్నారు.
*కేపీ సమక్షంలో వైసీపీ లో చేరిన పది ఎస్సీ కుటుంబాలు..గిద్దలూరు..వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట అంబేద్కర్ కాలనీకి చెందిన 10 ఎస్సీ కుటుంబాలు టీడీపీ ని విడి వైసీపీ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా వారికీ వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు*……………………👉 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పాలుగుల్ల అనసూయమ్మ..
గిద్దలూరు పట్టణ 8వ వార్డ్ లో పాలుగుల్ల అనసూయమ్మను గిద్దలూరు వైయస్సార్ సిపి అభ్యర్థి కేపీ.నాగార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించినారు. 👉 కేపీ.సమక్షంలో వైసీపీ లో చేరిన సంజీవరానిపేట 30ఎస్సీ కుటుంబాలు..గిద్దలూరు ..వైసీపీ ఇంచార్జి కేపీ నాగార్జున రెడ్డి సమక్షంలో సంజీవరానిపేట గ్రామానికి చెందిన 30 ఎస్సీ కుటుంబాలు టీడీపీ ని విడి వైసీపీ పార్టీలో చేరారు….ఈ సందర్బంగా వారికీ కేపీ నాగార్జున రెడ్డి వైసీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినారు……👉 *కుందురు నాగార్జున రెడ్డికి పిడతల.. మద్దతు .
గిద్దలూరులో వైసీపీ నేత పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైసిపి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డిని భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు.సీఎం జగన్ మోహన్ రెడ్డితో కలిసినప్పుడు గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని సీఎం జగన్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని కోరారు.అనంతరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ… సీఎం జగన్ పై ఉన్న అభిమానంతో గిద్దలూరు ప్రజలు పులివెందుల తర్వాత అత్యధిక ఓట్ల మెజారిటీ 2019 ఎన్నికలలో అందించారని మరో మారు అదేవిధంగా తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కుందూరు నాగార్జున రెడ్డి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.సీఎం జగన్ అందించిన సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు కూడా సీఎం జగన్ ను కొనియాడుతున్నాయన్నారు.కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు,పిడతల అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.