మోడీకి జగన్ రైట్ హ్యాండ్,చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్..మరి పవన్?..సెల్ ఛార్జింగ్ పెడుతుంటే మంటలు..నలుగురు మృతి..వైసీపీకి గుడ్ బై చెప్పిన కంభం జడ్పీటీసీ,రాచర్ల మాజీ జడ్పీటీసీ..బాలినేని కలిసిన ఎమ్మెల్యే కె.పి.

మోడీకి జగన్ రైట్ హ్యాండ్,చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్..మరి పవన్???

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలమైన సారధిగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు.తనకు ఎదురు తిరిగిన వారిని ఏదో విధంగా, ఏదో ఒక కేసులో ఇరికిస్తుండడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనతో దోస్తీ చేయడానికి ఏపీలోని అన్ని పార్టీలూ పోటీ పడుతూనే ఉన్నాయి.పొత్తులు కట్టి బాహాటంగా కొన్ని పార్టీలు ముందుకు వస్తే పొత్తు లేకపోయినా తెర వెనక అవగాహానతో కొన్ని పార్టీలు ఉంటున్నాయి.అలా ఏపీ రాజకీయం బీజేపీ చాణక్యం గురించి అర్ధం కాని వారు బహుశా ఆ మాత్రం పాలిటిక్స్ తెలిసిన వారిలో ఎవరూ ఉండరు అనే చెప్పాలి. మోడీకి ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయి అని ఏవరినైనా అడిగితే పాతికకు పాతిక అని చెబుతారు.అదేంటి బీజేపీ ఆరు ఎంపీ సీట్లకే పోటీ చేస్తోంది కదా అంటే పోటీ చేసినవి గెలిచినా గెలవకపోయినా మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్లు బీజేపీవే అన్న జవాబు సెటైరికల్ గా వస్తుంది. అంటే ఏపీలో అన్ని పక్షాలతో బీజేపీ రాజకీయంతో పులిహోర కలుపుతోందని దాని అర్ధం.మరి ఇంతలా తెలిశాక కూడా ఏపీలో బీజేపీకి ఇబ్బంది అవుతుందని ఎవరైనా అనుకుంటారా అసలు ఎదురు లేదనే అనుకుంటారు.అందుకే ఒక మాట ఏపీ పాలిటిక్స్ లో గట్టిగా వినిపిస్తుంది. అదేంటి అంటే మోడీకి జగన్ రైట్ హ్యాండ్,చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్ అని.ఈ ఇద్దరినీ అలా తన వెంట బెట్టుకుని ఏపీ రాజకీయాన్ని మొత్తం మోడీ శాసిస్తున్నారు అని అంటున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన సభ అని అంటున్నారు. ఆ సభలో చంద్రబాబు మోడీని ఆకాశానికి ఎత్తేశారు.మోడీ లేని దేశాన్ని ఊహించలేమని అన్నారు. ఆయన్ని ప్రపంచ గురువు అనేశారు.మరి దానికి బదులుగా మోడీ చంద్రబాబుని ఒక్క మాట అయినా పొగిడారా.బాబు అనుభవం గొప్పది అని ఒక్క పదం అయినా వాడారా అంటే అది కూడా లేదని తమ్ముళ్ళే గొణుక్కుంటున్నారు.సరే బాబుని పొగడలేదు. కనీసం జగన్ ని తిడితే కడుపారా తృప్తిగా ఉండేది కదా. 2019లో బాబుకు పోలవరం ఏటీఎం అని ఘాటు పదాలతో విరుచుకుని పడినట్లుగా జగన్ అవినీతి అనకొండ అని మోడీ లాంటి వారు అంటే ఆ లెక్కే వేరు కదా.అపుడైనా తమ్ముళ్లకు బాబుకు ఎంతో సంతృప్తిగా ఉండేది కదా. ఆ పని అయినా చేశారా అంటే అసలు లేదు కదా. మరి ఇదేమిటి అని అంతా అనుకోరా.సరే అటు జగన్ సీఎం ఇటు చంద్రబాబు మాజీ సీఎం ఈ ఇద్దరి విషయంలో మోడీ బ్యాలెన్స్ గానే ఉంటున్నారనుకున్నా జనసేన పేరుతో పార్టీని నడుపుతూ మోడీ కలకాలం దేశానికి ప్రధానిగా ఉండాలి అని ఎక్కిన ప్రతీ వేదిక మీద పవన్ కళ్యాణ్ గట్టిగానే చెబుతున్నారు కదా.పోనీ ఆయన గురించి ఒక్క మంచి మాట మాట్లాడారా అంటే అసలు పవన్ గురించి మోడీకి పెద్దగా ఏ రకమైన ఒపీనియన్ లేదు అని అంటున్నారు. 👉ఇది మరింత చిత్రమైన వ్వవహారమే కదా. ఏపీలో చూసుకుంటే మోడీ మార్క్ పొలిటికల్ కోణంలో బాబు జగన్ మాత్రమే కావాలని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి పార్టీలే బలంగా ఉన్నాయి. ఈ ఇద్దరు వద్దనే బలమైన ఓటు బ్యాంక్ ఉంది.ఈ ఇద్దరికే ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా దక్కుతాయి అని అంటున్నారు. అందుకోసమే ఈ ఇద్దరినీ తన వైపు ఉంచుకున్నారని అంటున్నారు.అక్కడ జగన్ ని తిట్టలేదు, బాబుని పొగడలేదు. ఇలా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ మోడీ ధన్యుడిని అనిపించుకుంటున్నారు అని పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి.మోడీ తనకు దేవుడని ఆరాధ్యుడని పవన్ అనుకోవచ్చు.మోడీ మాత్రం పవన్ ని కూరల్లో కరివేపాకు లాగానే తీసి పక్కన పెడుతున్నారని అంటున్నారు.ఆయన ఫోకస్ అంతా ఏపీ అంటే జగన్ చంద్రబాబు అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు. వారిద్దరూ సీరియస్ పొలిటీషియన్స్.వారిద్దరే బీజేపీకి ఏపీ నుంచి బలంగా నిలబడతారు అన్న లెక్కలు ఉన్నాయట.వారి వల్లనే రేపటి రోజున కేంద్రంలో బీజేపీ మరింత ఎక్కువ సీట్లను తన ఖాతాలో కలుపుకోవడానికి వీలు అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయట.అందుకే ఎవరినీ నొప్పించక తాను నొవ్వక అన్న తీరున ఏపీ రాజకీయాల్లో మోడీ మాస్టార్ తనదైన స్టైల్ ని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.ఇక పవన్ అయితే తానే పొత్తులను కలిపాను బీజేపీ వద్ద పెద్దల చీవాట్లు తిన్నాను అని భ్రమ పడుతున్నారు.బీజేపీ జాతీయ పార్టీ.. ఢక్కా మెక్కీలు తిన్న పార్టీ.తనకు ఎవరు అవసరమో ఎప్పటికి ఏది చేయాలో అంత తెలియకుండా ఉంటుందా.బీజేపీ ప్లాన్ 2024లో టీడీపీతో చేతులు కలపాలని ఎపుడో పెట్టుకుని ఉంది.అదే సమయంలో అటు బాబు కానీ జగన్ కానీ ఇండియా కూటమి వైపు తొంగి చూడరాదు అన్నది కూడా కమలం పార్టీ ఫిలాసఫీ. గుత్త మొత్తంగా ఏపీలో పాతిక సీట్లు బీజేపీ వైపు టర్న్ కావాలన్నదే వారి పట్టుదల.సౌత్ లో ఇంత పెద్ద నంబర్ తో సీట్లు ఇచ్చే స్టేట్ బీజేపీకి మరోకటి లేనే లేదు. అందుకే బీజేపీ ఏపీ మీద ఇలా ఫోకస్ పెట్టింది.మొత్తానికి పవన్ చిలకలూరిపేట సభలో మోడీని అపర భగీరధుడిగా పోల్చారు.కానీ బీజేపీ గంగలో ఏపీలో అన్ని పార్టీలు మునిగాయన్న సత్యాన్ని సినీ స్టార్ గానే ఇంకా ఉంటూ వస్తున్న పవన్ కి ఎపుడు తెలిసేనో అన్నదే డౌట్.😱

👉సెల్ ఛార్జింగ్ పెడుతుంటే మంటలు.. నలుగురు చిన్నారులు మృత్యువాత యూపీలోని మేరఠ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూలీ పని చేసుకొని జీవనం సాగించే జానీ – బబిత దంపతులకు నలుగురు సంతానం. ఫోన్ ఛార్జింగ్ అని సింఫుల్ గా తీసుకోవద్దు. చిన్న తేడా వస్తే ప్రాణాలకే ముప్పు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ ఫోన్ ఛార్జర్ లో లోపం ఉన్నా.. మీ ఛార్జర్ వైరు సరిగా లేకున్నా.. మీరు ఛార్జింగ్ కోసం పెట్టే హోల్డర్ లో తేడా ఉన్నా కూడా అది మీ ప్రాణాల్ని తీస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. తాజాగా అలాంటి ఘోర ఉదంతం ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే వేళలో చెలరేగిన మంటలు నలుగురు చిన్నారుల ప్రాణాల్ని తీసిన వైనం షాకింగ్ గా మారింది. యూపీలోని మేరఠ్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. కూలీ పని చేసుకొని జీవనం సాగించే జానీ – బబిత దంపతులకు నలుగురు సంతానం. వారి పేర్లు సారిక (10), నిహారిక (8), సంస్కార్ (6), కలు (4). ఎప్పటిలానే శనివారం రాత్రి సెల్ ఫోన్ కు చార్జింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా షార్టు సర్క్యుట్ చోటు చేసుకుంది.దీంతో మంటలు చెలరేగి దుప్పటికి అంటుకున్నాయి.నలుగురు చిన్నారులు మరణించారు.తస్మాత్ జాగ్రత్త..!!!

👉వైసిపికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన కంభం జడ్పీటీసీ,రాచర్ల మాజీ జడ్పీటీసీబత్తిని లలితా కుమారి ,అర్ధవీడు ఎంపీపీ, తురిమెళ్ళ, మాగుటూరు సర్పంచులు..గిద్దలూరు నియోజకవర్గంలో  వలసల జోరు కొనసాగుతూనే ఉంది.కంభం పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో  కంభం జడ్పీటీసీ సభ్యురాలు కొత్తపల్లి జ్యోతి,కొత్తపల్లి శ్రీను,అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకట్రావ్, తురిమెళ్ళ సర్పంచ్ మాదా సుభద్ర,మాదా నాగేశ్వరరావు మాగుటూరు సర్పంచ్ కేతావత్ ఈశ్వరిభాయి,జయరాం నాయక్,సాగర్,కందులాపురం మాజీ ఎంపీటీసీ కటికల భాస్కర్,ఆర్యవైశ్య నాయకులు బిజ్జాల కిషోర్, లు వారి అనుచరులు 500 కుటుంబాలతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన వార్డు మెంబర్ గజ్జ అంకయ్య గౌడ్, తడవ వెంకటేశ్వర్లు, గుర్రం శ్రీరాములు, జి. నారాయణ, పత్తి పాండు తదితరులతో పాటు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుజ్జుల.రమణారెడ్డి ఉన్నారు.

*టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ లు*   రాచర్ల మండలం, చోళవీడు గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్  ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో చోళవీడు గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బత్తిని లలితా కుమారి,మాజీ సర్పంచ్ బత్తిని వెంకటేశ్వర్లు, ఒక మాజీ ఎంపీటీసీ, ఒక విద్యా కమిటీ చైర్మన్, ముగ్గురు వార్డు మెంబర్లు, కాపు సంఘ ముఖ్య నాయకులు, గ్రామంలోని 100 కుటుంబాలతో సహా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ గుడిమెట్ట రంగనాయకులు, విద్యా కమిటీ ఛైర్మెన్ గుడిమెట్ట రంగయ్య, 5వార్డు మెంబర్ బత్తిని కృష్ణయ్య, 6వ వార్డు మెంబర్ బత్తిని అచ్చమ్మ, 1వ వార్డు చల్లా గురువయ్య, మాజీ వార్డు మెంబర్ పేర్ల నేమిలయ్య, మండల టీడీపీ అధ్యక్షులు కటికే యోగానంద్ మరియు టీడీపీ నాయకులు పాల్గోన్నారు.

:*బాలినేని ని మర్యాదపూర్వకంగా కలిసిన కేపీ*

ఒంగోలులో మాజీ  మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని. శ్రీనివాస రెడ్డిని గిద్దలూరు వైసీపీ ఇంచార్జి,మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఆయనతో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుజ్జుల.రమణారెడ్డి ఉన్నారు*…

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు

పెద్దన్న అంటే ..ఇచ్చింది గుండుసున్నా !..కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణపై కక్ష చూపించారు..అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి..సీఎం రేవంత్.. హర్షం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు..పొదిలి నగర పంచాయితీలోని మున్సిపల్ కార్మికులకు 6నెలల హెల్త్ అలవెన్స్ బకాయిలను చెల్లించాలి..రాష్ట్రస్థాయి బండలాగుడి పోటీలను ప్రారంభించిన ఎంపీపీ అమూల్య…