జగన్ పై ధ్వజమేత్తిన ఎత్తిన చంద్రబాబు..ఆమంచిస్వాములు తీరుపై జనసైనికుల ఆగ్రహం..గిద్దలూరు వైకాపా,టిడిపిలలో చేరికలు..చలివేంద్రం ఏర్పాటు చేసిన బాజీద్ బాషా.

👉జగన్ పై ధ్వజమేత్తిన ఎత్తిన చంద్రబాబు ..

*టీడీపీకి ఏకపక్ష ఓటుతో వైసీపీని ఇంటికి సాగనంపాలని మోసం చేసేవాళ్లను కాదు…ప్రజాసేవ చేసి జీవితాలు మార్చేవారినే ఎన్నుకోవాలని,జగన్ నాసిరకం మద్యం తాగి అనేకమంది అనారోగ్యంపాలు..అధికారంలోకి రాగానే మార్కాపురం కేంద్రంగా జిల్లా చేస్తా..పూర్తికాని వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించిన జగన్ ను ఏమనాలి?..వెలుగొండకు పునాది వేసింది నేనే.. పూర్తి చేసి నీరందించేదీ నేనే..గోదావరి నీళ్లు సాగర్ కాల్వకు మళ్లిస్తే కరవే ఉండదు..గల్లాలో డబ్బులు లేక పెన్షన్ ఇవ్వలేదు…నెపం మాపై నెడతావా.?జగన్ పాలనలో రాష్ట్ర దుస్థితిపై ప్రతి చోటా చర్చించాలి..ఎర్రచందనం స్మగ్లర్ చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా నిలబెట్టారు..చిత్తుగా ఓడించండి..ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డిని గెలిపించండి..మార్కాపురం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు* ఇప్పటి వరకు 15 సభలు పెడితే ప్రజల్లో విపరీతంగా స్పందన వచ్చింది. ఎన్డీఏ గెలుపు ఖాయమయ్యింది. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుంది. 5 ఏళ్ల శ్రమకు, కష్టానికి మే 13 నుంచి చెక్ పెట్టబోతున్నాం. ప్రతి చోట ప్రజలు చర్చ చేయాలి. .మీ పిల్లల భవిష్యత్ ను నా మీద నమ్మకం వదిలిపెడుతున్నారు. ఏడు, ఎనిమిదోవ తరగతి చదవే పిల్లల్లోను ఉత్సాహం ఉంది.  బటన్ నొక్కా అని జగన్ రెడ్డి ప్రతి రోజూ రాగం పాడుతున్నారు. బటన్ నొక్కింది ఎంత? జనం దగ్గర బొక్కింది ఎంత? జగన్ నొక్కింది ఎంతో సమాధానం చెప్పే ధైర్యం ఉందా?  ఒంగోలులో కొండేపి తప్పా అన్నింటిలోను జగన్ ను గెలిపించినా ఒక్క పని అయినా చేశారా?. ఈ ప్రాంతంలో నీళ్లుంటే బంగారం పండించే రైతులున్నారు? నాడు సమైక్యాంధ్రలో నీళ్లు కావాలని మీరు నన్ను అడిగితే వెలుగొండకు శంకుస్థాపన చేశాను. మళ్లీ దానిని నిర్వీర్యం చేశారు, కోర్టు లిటిగేషన్ లో పెట్టారు. నేను అధికారంలోకి వచ్చిన తరువాత సమస్యలన్నింటిని పరిస్కారం చేసి పనులు ముమ్మరం చేశాను.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికే నీళ్లు వచ్చి ఉండేవి. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్ కు తెచ్చి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలి. • జగన్ పాదయాత్రలో నెత్తి మీద చెయ్యి పెట్టి నిమిరాడు, ముద్దులు పెట్టడంతో ఐస్ అయ్యారు. ఇప్పుడు 5 ఏళ్లల్లో గుద్దులే గుద్దులు, బాదుడే బాదుడు, కేసులే కేసులు.  వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉంటే 15 లక్షల మందికి తాగు నీరు, 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందే ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు.. ఈ ప్రాజెక్టు పూర్తికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తే డబ్బులకి కక్కుర్తితో కాంట్రాక్టర్ ను మార్చి నాశనం చేశారు. 80 శాతం టీడీపీ పూర్తి చేస్తే 20 శాతం పూర్తి చేయలేని దద్దమ్మ మూడు రాజధానులు కడతానంటున్నాడు.• వెలిగొండను పూర్తి చేశాకే ఓట్లు అడుగుతానన్నాడు. రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మొన్న పరదాల చాటున వచ్చి రిబ్బన్ కట్ చేసి పారిపోయాడు. • పూర్తి చేయని ప్రాజెక్టుకు బుద్దున్నోడు ఎవడైనా ప్రారంభోత్సవం చేస్తారా? కాని జగన్ చేశాడు..దేవుడి స్క్రిప్ట్ వెలిగొండను ప్రారంభించింది, పూర్తిచేసింది, నీళ్లు ఇవ్వబోయేది నేనే. పోలవరం 72 శాతం పనులు పూర్తి చేస్తే జగన్ రెడ్డి గుత్తేదారుడిని మార్చి నాశనం చేశారు.. మార్కాపురాన్ని కొత్త జిల్లాగా తీసుకువస్తాను.. రామాయపట్నం పోర్టు కోసం అన్ని పనులు పూర్తి చేశాను. జగన్ రెడ్డి వచ్చాక టెండర్లు రద్దు చేసి డబ్బుల కోసం లాలూచీ పడి రివర్స్ టెండర్ కు పాల్పడ్డారు.• ఇండోనేషియా నుంచి ఏషియా పల్స్ ఫ్యాక్టిరీని రూ.25వేల కోట్ల పెట్టుబడితో తెస్తే పారిపోయేలా చేశారు.• నీళ్లు తీసుకువచ్చి, జిల్లాను రాజధానిగా చేసి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తాం.• సంక్షేమం పేరుతో ఒట్టి బటన్ నొక్కుతున్నారు. 2014-19లో సంక్షేమానికి పెద్ద పీట వేసింది టీడీపీ..సంక్షేమం అంటే గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్. 1983లో రూ.2 కిలో బియ్యం, రూ.50 కరెంట్ చార్జీలు, పక్కా ఇళ్లు, వంటి పథకాలకు శ్రీకారం చుట్టింది ఆయనే.• 2014-19లో సంక్షేమానికి 19 శాతం ఖర్చు పెడితే జగన్ ఖర్చు పెట్టింది 15.6 శాతం మాత్రమే..అన్న క్యాంటీన్ పెడితే రద్దు చేశారు, చంద్రన్న బీమాను సైతం రద్దు చేశారు..విదేశ విద్య, పండుగ కానుక, రంజాన్ తోఫా వంటి 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ టీడీపీ.. నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు. మద్యపాన నిషేదం ఎందుకు చేయలేదు?• బటన్ నొక్కుడు వలన 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి. రూ.200 కరెంట్ బిల్లు రూ.1000 పెంచావు.  నీ బటన్ నొక్కుడు వలనే పెట్రోల్, డీజీల్, సేల్స్ టాక్స్, ఆస్థిపన్ను, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. చెత్త పన్ను వేశాడు..జాబ్ క్యాలెండర్ బటన్ ఎందుకు నొక్కలేదు. జాబు రావాలంటే బాబు రావాలి. మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే బాబు రావాలి. గంజాయి రావాలంటే జగన్ రావాలి.. మనం జాబు తెస్తే జగన్ గంజాయి తెచ్చాడు. • జగన్ తాగు నీళ్ల బదులు జే బ్రాండ్ తెచ్చాడు..నిత్యావసర ధరలు తగ్గించేందుకు, సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేదం, గుంటలు పడే రోడ్లు బాగు, కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చేందుకు, రైతులకు డ్రిప్ ఇవ్వడానికి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సబ్ ప్లాన్ కోసం ఎందుకు బటన్ నొక్కలేదు.• రూ.10 ఇచ్చి రూ.100 దోచేసిన దొంగ జగన్.. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, దానిని పంచుతాం. రూ.10 ఇచ్చి వేల రూపాయల సంపాదించే ఆలోచన చేస్తాం.• రూ.13 లక్షల కోట్ల అప్పు సాక్షి పేపర్, భారతీ కడుతుందా? • రూ.60 మద్యం నేడు రూ.200 కి పెరిగింది. ఒక క్వార్టర్ కు రూ.140 అంటే రెండు క్వార్టర్లు రూ. 280 ఎవరి జేబులోకి వెళుతున్నాయి.  నాశిరకం మద్యంతో ప్రజలు ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. దురాశాపరుడు ప్రజల జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డల తాళిబొట్లు తెంచుతున్నాడు.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని చెప్పి తానే మెడలు దించాడు. 5 ఏళ్లల్లో కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురాలేకపోయారు. వ్యక్తిగత కేసులు తప్పా జగన్ రెడ్డికి ఏమీ పట్టదు.• మద్యనిషేధం చేస్తే ఓట్లు అడుగుతానన్నాడు. మద్యం మీద రూ.25వేల కోట్లు అప్పు తెచ్చారు.• సీపీఎస్ వారంలో రద్దు చేస్తానని హామీనిచ్చి మాట తప్పి మడమ తిప్పాడు. ప్రతి ఏటా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోడమే జగన్ విశ్వసనీయత ..మొదటి సంతకం డీఎష్సీ, జాబ్ క్యాలెండర్ మీద పెడతాను. హూ కిల్డ్ బాబాయ్? జగన్ రెడ్డికి తెలియదందటా? నిందితులను పక్కన పెట్టుకొని బాధితులపై కేసులు పెడుతున్నారు.సొంత చెల్లిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు..ఇలాంటి వ్యక్తులు రావడమే కలియుగం.బాబాయ్ ని చంపేవాళ్లు మనకి కావాలా? కోడి కత్తి నాటకం ఆడేవాళ్లు కావాలా?కంటైనరల్లలో డబ్బులు పంపే వాళ్లు కావాలా? బీజేపీతో పొత్తుపెట్టుకున్నందుకు ముస్లింలను రెచ్చగొడుతున్నారు. పార్లమెంట్ లో ముస్లింల బిల్లులు కేంద్రం ప్రవేశపెడితే అక్కడ మద్ధతు ఇచ్చి ఇక్కడ నాటకాలాడుతున్నారు. అబ్దులు సలాన్ని వేధించడంతో నలుగురు కుటుంబం సభ్యులు ఆత్మహత్య చేసుకునేలా చేశారు..ఉర్దూ రెండో భాషగా చేశాం. మైనార్టీ కార్పొరేషన్ పెట్టాం. హైదరాబాద్, కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం హైదరాబాద్ లో హజ్ పెట్టాం. విభజన తరువాత కడప, విజయవాడలో హజ్ హౌస్ లు కట్టాం. 30వేల మంది ఆడబిడ్డలకు దుల్హన్ పథకం ఇచ్చాం.విదేశీ విద్య అందించాం. కాని జగన్ రెడ్డి 5 ఏళ్లల్లో ముస్లింలకు ఒక్క పథకం ఇచ్చావా?కూటమి మా కోసం కాదు ఈ రాష్ట్రం కోసం, ప్రజలు గెలవాలంటే ఈ కూటమి గెలవాలి..రూ.13 లక్షల కోట్ల అప్పులు చేశారు. పిల్లల్ని చదివించుకోవాలి, రోడ్లు వేసుకోవాలి, ప్రాజెక్టులు కట్టాలి, తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం మా బాధ్యత..మన కులపోడు అని ఓటు వేస్తే కరెంట్ చార్జీలు పెంచకుండా మానేశాడా.మన మతం వాడు అని ఓటేస్తే వాళ్లకు మాత్రం లిక్కర్, నిత్యావసర ధరలు తగ్గించారా? సమర్ధుడు రావాలి, ప్రజలను ముందుకు తీసుకువెళ్లే నాయకత్వం కావాలి..హైటెక్ సిటిని కట్టాం, శంషాబాద్ ఎయిర్ పోర్టు, అవుటర్ రింగ్ రోడ్లు అని వేసేంది టీడీపీనే.  విభజన రోజున తెలంగాణ తలసరి ఆదాయం, మన తలసరి ఆదాయం 35 శాతం వ్యత్యాసం. నా 5 ఏళ్ల కష్టానికి తలసరి ఆదాయం పెంచాం. 27 శాతానికి తగ్గించారు. నేనుంటే తెలంగాణకు సమానంగా రెండు ముందకు వెళ్లేవి..జగన్ రెడ్డి 45 శాతానికి తీసుకువెళ్లే పేదలను నిరుపేదలుగా మార్చారు. బటన్ నొక్కుడుతో మీకు న్యాయం జరిగిందా? మీ పొలాలకు నీళ్లు వచ్చాయా? పిల్లల జీవితాలు మారాయా? జగన్ బటన్ నొక్కుడుతో సమస్యలు పెరిగిపోయాయి..నానా రకాల పేర్లతో 9 సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. కరెంట్ అందుబాటులో లేదు. ఒంగోలు పుష్పాకు మీరు ఓటు వేస్తారా? చిత్తూరులోను మరో రెడ్ శాండిల్ స్మగ్లర్ ను పెట్టాడు. .18 ఏళ్లు పైబడిన ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇద్దరుంటే రూ.3వేలు, ముగ్గురుంటే రూ.4,500వేలు,నలుగుంటే రూ.6వేలు ఇస్తాం.  తల్లికి వందనం పేరుతో ఒక బిడ్డ ఉంటే రూ.15వేలు, ఇద్దరుంటే రూ.30వేలు, ముగ్గురుంటే రూ.45వేలు, నలుగురుంటే రూ.60వేలు ఇస్తాం.  నేను దీపం పెడితే జగన్ రెడ్డి దీపం ఆపేశాడు. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామన్నారు..ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. నేను డ్రైవర్ గా ఉంటాను. మీ భద్రతకు నాది భరోసా. చంద్రన్న బస్సు అని చెప్పండి..రైతును రాజు చేస్తాను.. రూ.20వేలు అన్నదాతకు డబ్బు ఇస్తామన్నారు. ఇంటింటికి మంచి నీరు. బీసీలకు రక్షణ చట్టం. 50 ఏళ్లకే ఫించన్ ఇస్తాం. యువగళం పేరుతో 20 లక్షల ఉద్యగాలు ఇస్తాం రూ.3వేల నిరుద్యోగ భృతి. మేము పరిశ్రమలు తెస్తాం..రూ.200 పించన్ రూ.2000 చేసింది టీడీపీ. మళ్లీ రూ.4000 పెంచి ఇస్తాం.నేడు గళ్లాలో డబ్బులు లేకుండా పించన్ ఇవ్వలేదు. ఖజానా ఖాళీ అయ్యింది. ఆ నెపం మన మీద వేస్తున్నాడు.ఇంటి దగ్గర ఉన్న వాళ్లకే పించన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే,తమ్ముడు,మామ, బావమరిదులు ఈ నియోజకవర్గాన్ని పంచేసుకున్నారు..సమ్మర్ స్కోరేజీ ట్యాంక్ పనులు పూర్తి చేసి తాగు నీరు అందిస్తామన్నారు.

👉ఆమంచి పార్టీ కోసం ఏమి చేశారు..కాపులు మధ్య చిచ్చు పెడుతూ విభేదాలు సృష్టి స్తున్నారు..కులాన్ని రెచ్చగొడుతున్నారు.. పవన్ కళ్యాణ్ బాటలో నడిచే సాయిబాబును కాదని తనకు ఇంఛార్జి పదవి కావాలనడం అన్యాయం..జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచిస్వాములు పై విరుచుకు పడ్డ జనసైనికులు..

జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆమంచిస్వాములు తీరు పై జనసైనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.గిద్దలూరు నియోజక వర్గంలో కాపుల మధ్య చిచ్చు పెడుతూ విభేదాలు సృష్టి స్తున్నారని.. పొత్తు అని చెప్పి మూకుమ్మడిగా బలిజలు ఓట్లు వేయడం వలన ఎన్నికల అనంతరం మీ పరిస్థితి కరివేపాకు లాగా అయిపోతుందని కులాన్ని రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.జనసేన పార్టీలో చేరిన మూడు నెలలకే చీరాల నియోజక వర్గంలో ఇంఛార్జిగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పదవి ఇచ్చారని,ఇచ్చిన తరువాత పార్టీ కోసం ఆయన ఏమి చేశారని సూటిగా ప్రశ్నించారు.ఐదు నెలల క్రితం పార్టీ లోకి వచ్చిన ఆమంచి స్వాములు ప్రకాశం జిల్లాలో కాపు సంఘం అధ్యక్షుడని చెప్పుకొని,కాపులను ఉద్దరిస్తాను,నాలాంటి నాయకుణ్ణి నమ్మండి,నా లాంటి నాయకుణ్ణి కాపాడుకోవాలని చెపుతారని ..చీరాల నియోజక వర్గంలో కొన్ని సందర్భాల్లో నేను తోపునని చెప్పే ఆయన చీరాల నియోజక వర్గంలో ఎన్ డి ఏ కూటమి అభ్యర్ధి గెలుపునకు కృషి చేయాలని కోరారు.2008 నుండి 15 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ బాటలో నడిచే సాయిబాబును కాదని ఆమంచి స్వాములు తనకు ఇంఛార్జి పదవి కావాలని కోరడం సమంజసం కాదని ఖండించారు.జనసేన పార్టీ,టీడీపి పార్టీ,బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించాలని గిద్దలూరు నియోజక వర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు ,మండల నాయకులు,కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరులు బలంగా నిర్ణయించుకున్నారన్నారు.గిద్దలూరు నియోజక వర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బలంగా నమ్మిన వ్యక్తి గా గిద్దలూరు నియోజక వర్గం ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు,జిల్లా నాయకులు,మండల నాయకులు పార్టీ కోసం పని చేస్తున్నారని, గిద్దలూరు నియోజక వర్గంలో ఎంతో ప్రశాంత మైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల తర్వాత అందరూ కలసి మెలసి వుంటారని,కానీ ఆమంచి రాజకీయ ఎదుగుదల కోసం కులాన్ని రెచ్చ గొడుతు పబ్బం గడుపు కావాలని చూస్తున్నారని ఆరోపించారు.తనకు గిద్దలూరు జనసేన బలిజ కులం చెందిన మెజారిటీ నాయకులు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఓట్లు వేయడానికి సిద్దంగా వున్నారన్నారు.ఆయన వ్యవహరించే విధానం వలన వైసిపికి మేలు జరిగే విధంగా వుందని,ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పార్టీ కోసం పని చేయాలని, తనకు అన్యాయం జరిగిందని మీరంతా అండగా నిలబడాలని కోరడం సమంజసం కాదని,నాయకులను కార్యకర్తలను తప్పు దోవ పట్టించడం మంచిది కాదని ఆరోపించారు.కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు,జిల్లా సంయుక్త కార్యదర్సులు కాల్వ బాల రంగయ్య, గజ్జలకొండ నారాయణ,కంభం మండల అధ్యక్షులు తాడిసెట్టీ ప్రసాద్,బెస్తవారపేట మండల అధ్యక్షుడు ముంతల మధు సుదన్ రెడ్డి,అర్ధవీడు మండల అధ్యక్షులు కలగొట్ల అల్లురయ్య,రాచర్ల మండల అధ్యక్షులు అలిశెట్టి వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శులు దమ్ము తిరుపాలు,తుమ్మలపల్లి లోకేష్,సంయుక్త కార్యదర్సులు వేము ప్రవీణ్,షేక్ అజ్మతుల్ల,మీనిగ నాగేశ్వర రావు, కార్యదర్సులు ఇల్లురీ అనిల్ కుమార్,గాజుల సురేష్,చట్టీ శ్రీను,శ్రీపతి కృష్ణయ్య,గుర్రాల రామకృష్ణ,పార్శ బాలయ్య,కోళ్ల రమణ,బీరల శంకర్,బాలరాజు,రంగయ్య,మాచర్ల వెంకట రెడ్డి,దేవసహయం,వి డాని,ముత్యాల సాయి,బండి పిచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన ఆర్యవైశ్య ప్రముఖులు*

బెస్తవారిపేట పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు అమ్మవారిశాల ఆలయ శాశ్వత ధర్మకర్త బొంతల లక్ష్మణ స్వామి, ఆర్యవైశ్య సెక్రటరీ గర్రె రంగయ్య, ఆర్యవైశ్య నాయకులు షేగు గంగాధర్, మాజీ సెక్రటరీ చాటకొండు సత్యనారాయణ, 7వ వార్డు మెంబర్ శివ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో ఆర్యవైశ్య సోదరులంతా అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామన్నారు.*

👉దూదేకులు వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేయాలి..

ఎమ్మెల్యే గా తనను,ఎంపీ గా చెవిరెడ్డిని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి..రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నుండి పోటీ చేస్తున్న తనను అత్యంత భారీ మెజారిటీ తో గెలిపించాలని గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు…ఆదివారం ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన దూదేకుల ఆత్మీయ సమావేశం లో కుందూరు నాగార్జునరెడ్డి పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేసే వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకురావాలన్నారు..సంక్షేమ పథకాలు లబ్ది పొందిన లబ్ధిదారులు జగనన్న కు వైసీపీ ప్రభుత్వంకి అండగా ఉండాలన్నారు.వైసీపీ పాలనలో మంచి జరిగింటేనే మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నామన్నారు.. అనంతరం  దూదేకుల సంఘసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డిని ఘనంగా సన్మానించారు..కార్యక్రమంలో వైసీపీనాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,దూదేకుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

👉పెద్దల పేరిట మంచినీటి చలివేంద్రం ఏర్పాటు..

కంభం పట్టణానికి చెందిన వైసీపీ నాయకుడు షేక్ బాజీద్ భాష తన తాతయ్య ల్యాండ్ లార్డ్, లతీఫ్ సాహెబ్, తన తండ్రి స్వర్గీయ మహబూబ్ బాషా జ్ఞాపకార్థం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ఆవరణలో ఉచిత మంచినీటి కూలింగ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.చలివేంద్రాన్ని లతీఫ్ సాహెబ్ భార్య అయిన శతాధిక వృద్ధురాలు హనీఫాబీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే  ప్రాంతంలో, దూరప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికుల దాహార్తి తీర్చాలని సదుద్దేశంతో తన పెద్దల పేరిట ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు బాజీద్ బాషా ను ప్రశంసించారు.కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జాకీర్ హుస్సేన్, కో ఆప్షన్ మేంబర్ సయ్యద్ సలీం,మాజీ కో ఆప్షన్ హుస్సేన్ భాష, కంభం సర్పంచ్ పల్నాటి బోడయ్య, డిష్ మున్నా, ఎంపీటీసీ మహమ్మద్ రఫీ, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మహబూబ్ బేగ్, లయన్ సభ్యులు పేర్లి గుండయ్య, రిటైర్డ్ ఎస్.ఐ కొండయ్య, నెంబర్.1 బాషా, చికెన్ బాబు, సలాం, బాబ్జి, కరీముల్లా బేగ్, షాకీర్ బేగ్, వలి, ఉపాధ్యాయులు రసూల్ బేగ్,ఆర్ .టీ .సి కంట్రోలర్ పఠాన్ మొహిద్దిన్ ఖాన్, పఠాన్ రసూల్ ఖాన్  మన బాల్యం గ్రూప్ సభ్యులైన ఉస్మాన్, రమేష్, వెంకటేష్ గౌడ్, ఆంజనేయులు, రాజేష్, సరోజ, శివలక్ష్మి, సౌజన్య, సోఫియా, అరుణ పాల్గొన్నారు.

7k network
Recent Posts

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు