సొంత ని.వర్గంలోనే చంద్రబాబుకు ఎదురు దెబ్బ?..జగన్ ఛానల్లో డిబేట్‌ చేద్దామంటున్న సునీత.. గుంటూరులో రజినమ్మకు ఎదురు దెబ్బ?..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

జగన్ ఛానల్లో డిబేట్‌ చేద్దామంటున్న సునీత… సంచలన వ్యాఖ్యలు!

వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కడప,హైదరాబాద్ లలో స్పందించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి… తాజాగా అమరావతిలో మరోసారి స్పందించారు. “మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ కడపలో పర్యటించిన నేపథ్యంలో…మరోసారి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన చర్చ మరింత బలంగా సాగుతోంది.ఇందులో భాగంగా చిన్నాన్న వైఎస్ వివేకాను ఎవరు చంపారనేది పైనున్న దేవుడికి,వివేకాకు, కడప ప్రజలకు తెలుసని.. చంపిన వారు బయట దర్జాగా తిరుగుతున్నారని జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.దీంతో ఈ విషయంపై ఇప్పటికే స్పందించిన నర్రెడ్డి సునీత.. మరోసారి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.”మేమంతా సిద్ధం” బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్… వివేకాను చంపిందెవరో దేవుడు,కడప జిల్లా ప్రజలకు తెలుసని ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే కడప,హైదరాబాద్ లలో స్పందించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి… తాజాగా అమరావతిలో మరోసారి స్పందించారు. ఇందులో భాగంగా… వైఎస్ వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని చెబుతున్నారు.. అలాంటప్పుడు మీరు కూడా ఆ జిల్లా ప్రజల్లో ఒకరు కదా.. అంటే వివేకాను ఎవరు హత్య చేశారో,ఎవరు చేయించారో కూడా మీకు తెలిసినట్లే కదా అని జగన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు సునీత. తెలిసినప్పుడు ప్రజలక్ చెప్పాలి కదా అని అన్నారు. “ఒక కడప జిల్లా వాసిగా ఈ విషయం తెలిసినప్పుడు ఎందుకు బయటపెట్టడం లేదు..ఆ విషయం వెల్లడించాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉంది కదా? అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అతని ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటపడతాయనే భయపడుతున్నారా?”అని జగన్ ని ప్రశ్నించిన సునీత… “నాతో నేరుగా మాట్లాడాలంటే మీ ఛానల్ కి వస్తాను.. డిబేట్ చేద్దాం.. నిజానిజాలు బయటకు వస్తాయి” అని వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలో… వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ప్రజలు అంతా గ్రహిస్తున్నారని.. వాస్తవాలు ఏమిటో వారికి తెలుసని.. కడప, హైదరాబాద్ లలో తాను అడిగిన ప్రశ్నలకు ఒక అన్నగా కాకపోయినా.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా సమాధానం చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. ఇదే సమయంలో తన హత్యను ఎన్నికల్లో జగన్ వాడుకున్నారని.. ఐదేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు మరోసారి ఆ ప్రయత్నాలకు తెరతీశారని అన్నారు.

👉రజినమ్మ ఇది పేట కాదు గుంటూరు అని గుర్తుంచుకో!!! గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న వైసీపీ నాయ‌కురాలు, మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి లోక‌ల్ సెగ బాగా త‌గులుతోంది. చిల‌క‌లూరి పేట నుంచి వ‌ల‌స వ‌చ్చి.గుంటూరు వెస్ట్‌లో పోటీ చేస్తున్న ర‌జ‌నీ ఇక్క‌డ ప్ర‌లోభాల‌కు గురిచేసేందుకు.. మహిళా ఓటు బ్యాంకును త‌న‌వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా న‌డుస్తోంది. అయితే.. దీనిని స్థానికులు తిప్పికొడుతున్నారు. “మేమేన్నా.. అమ్ముడు పోయేవాళ్ల‌మా? “ అని నిల‌దీస్తున్నారు.అంతేకాదు.. ఇది చిల‌క‌లూరిపేట కాదు.. గుంటూరు అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా.. క‌నీసం స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌కుండానే ఓట్లు అడిగేందుకు ప్ర‌య త్నిస్తున్నారంటూ..పెద్ద ఎత్తున మ‌హిళ‌లు విమ‌ర్శిస్తున్నారు. నిజానికి ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రో నియోజ‌క‌వ‌ర్గానికి మారినంత మాత్రాన నాయ‌కుల గురించి ప్ర‌జ‌ల‌కు తెలియంది ఏమీ కాదు.గ‌త నియోజ క‌వ‌ర్గంలో ఎలా ? రియాక్ట్ అయ్యారు. అనేది ఖ‌చ్చితంగా చూస్తారు. అంతేకాదు..ఏం చేస్తారు ? ఏం చేయ‌రు..అనేది కూడా అంచ‌నా వేసుకుంటారు.ఈ విష‌యాల‌ను మ‌రిచిపోయి..ర‌జ‌నీ..ఏదో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే త‌న రాజ‌కీయాలు ప్రారంభిస్తున్న ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని స్థానికులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ముఖ్యంగా అంగ‌న్ వాడీ మ‌హిళ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించిన‌ప్పుడు..క‌నీసం వారికి సంఘీభావంగా ఓ మ‌హిళా మంత్రిగా కూడా విడ‌ద‌ల ర‌జ‌నీ స్పందించ‌లేద‌ని వారు వాపోతున్నారు. వేత‌నాలు పెంచాల‌న్న‌.. మునిసిప‌ల్ కార్మికుల విష‌యంలోనూ ఆమె రియాక్ట్ కాలేదు.అంటే.. స‌మ‌స్య‌ల‌కు, ప్ర‌జ‌ల అభిప్రాయాల‌కు ఆమె క‌డుదూరం అనే వాద‌న‌నే వినిపించారు.ఈ నేప‌థ్యంలో స్థానికులు ర‌జ‌నీ వ్య‌వ‌హార శైలిపై నిప్పులు చెరుగుతున్నారు.చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌నే ప‌రిష్క‌రించ‌లేన‌ప్పుడు..మంత్రిగా ఉండీ మ‌న‌సు రాన‌ప్పుడు..ఇప్పుడు గుంటూరు వెస్ట్‌లో ఏం రాజ‌కీయాలు వెల‌గ‌బెడ‌తార‌ని వారు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు.అదే స‌మయంలో మాట తీరు కూడా ఆమెది బాగోద‌నే టాక్ వినిపిస్తోంది.ముందు మెత్త‌గా మాట్లాడ‌తార‌ని త‌ర్వాత క‌నీసం ప‌ట్టించుకోర‌ని టాక్..

👉సొంత నియోజకవర్గంలోనే చంద్రబాబుకు ఎదురు దెబ్బ??? 

చిత్తూరులో ఏడవ రోజు “మేమంతా సిద్ధం”అనే బస్సు యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈరోజు అమ్మగారిపల్లి నుంచి సీఎం వైఎస్ జగన్ బయలుదేరారు.. బస్సు యాత్రకు అటు కార్యకర్తలు ఇటు ప్రజలు భారీగా తరలివచ్చారు..యాత్రలో భాగంగా కుప్పం నియోజకవర్గం టిడిపి నుంచి కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం ఇప్పుడు చంద్రబాబుకు భారీ దెబ్బ తగిలిందని చెప్పవచ్చు.. కుప్పం నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి చిత్తూరు మాజీ జిల్లా పరిషత్తు చైర్మన్ ఎం సుబ్రహ్మణ్యం నాయుడు, కృష్ణమూర్తి బేతప్పలు అమ్మగారిపల్లి స్టేట్ పాయింట్ వద్ద వైసీపీలో చేరారు.ఇక మాజీ మంత్రి కుతూహలమ్మ కుమారుడే ఈ ఏ. హరికృష్ణ ..2019లో టిడిపి తరఫున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే.అయితే అప్పుడు ఎన్నిక లలో ఓటమి పాలయ్యారు.ఇప్పుడు ఆయన జగన్ సమక్షంలో టిడిపి పార్టీ నుంచి వైసీపీ పార్టీలోకి చేరినట్లు తెలుస్తోంది..ఇకపోతే ఈసారి ఈ కారణం వల్లే టికెట్ దక్కలేదు.అందుకే మనస్తాపం చెందిన ఆయన వైసీపీలోకి చేరడంతో ఆయనను వైయస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి కూడా పాల్గొన్నారు.మరోవైపు చిత్తూరు జిల్లాలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్రకు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు.👉 నేతలు ఒకరి తర్వాత ఒకరు ఇలా టిడిపిని వదిలి వైసీపీలోకి చేరుతున్నారు దీనికి కారణం పొత్తు అని చెప్పవచ్చు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలు మూడో కలసి పొత్తు పెట్టుకున్నా ఈ నేపథ్యంలోనే ఆశలు పెట్టుకున్న నేతలకు టికెట్లు దొరకడం లేదు.ఈ నేపథ్యంలోనే మనస్థాపం చెందిన చాలామంది సీనియర్ నేతలు ఇలా టిడిపిని వదిలి వైసిపి లోకి చేరడం హాట్ టాపిక్ గా మారింది..మరి ఈ బదిలీలను చంద్రబాబు ఎంతవరకు ఆపుతారో చూడాలి.

👉గుప్త నిధుల తవ్వకాల కలకలం..అంబాపురం అమ్మవారి గుడిలో…*_గుడి రాళ్ళు పెకలించిన దుండగులు…_పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు..

ప్రకాశంజిల్లా కొనకమిట్ల మండలం అంబాపురం గ్రామంలో _అంత్యత పురాతన దేవాలయమైన త్రిపురసుందరీ దేవాలయంలో గుప్త నిధుల కొసం త్రవ్వకాలు…దేవాలయం వెనుక వైపునుండి కొండ రాళ్ళు పెకలించి గర్భగుడిలోకి పొవటానికి ప్రయత్నం…_విచారిస్తున్న పొలిసులు…_

👉*వైసీపీ పాలనలో బెస్తలకు న్యాయం..కుందూరు నాగార్జునరెడ్డికి బెస్త సంఘం మద్దతు..

గిద్దలూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డికి బెస్త సంఘం మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపిన అర్థవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామ బెస్త సంఘం నాయకులు.మొహిద్దిన్ పురం గ్రామ సర్పంచ్ కందుల రామక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాలు వారు నాగార్జున రెడ్డికి సంఘీభావం తెలిపారు.

*గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మత్స్యకార భరోసా హామీని నెరవేర్చి మా బ్రతుకుల్లో వెలుగులు నింపారన్నారు.ఈ ఐదు ఏళ్ళ పాలనలో బెస్తలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని తెలియజేశారు. మత్స్యకార కుటుంబాలను అన్నివిధాలుగా అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం మన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని అన్నారు., బెస్తసోదరులకు సరైన ఉపాధి కల్పించి వారిని రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకువచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో బెస్త సోదరులంతా ఏకమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసి,రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో పోటీ చేయుచున్న కెపి నాగార్జున రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు.

👉గలిజేరుగుల్ల గ్రామపంచాయతీ పరిధిలోని చెన్నుపల్లి గ్రామంలో కొండమల్లు లింగయ్య,అధిలక్ష్మమ్మ,పెద్దమల్లు తిరుమలయ్య యొక్క రెండు పురిల్లు పూర్తిగా కాలి దగ్ధం అయిన విషయం తెలుసుకున్న కేపి.నాగర్జున రెడ్డి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు..వారి కుటుంబాలకు నెలకు సరిపడు నిత్యావసర సరుకులును అందజేశారు.రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని గ్రామస్తులు తెలియజేసారు.స్థానిక వైయస్సార్ సీపీ నాయకుల సమక్షంలో దప్పిలి సంభూత్ రెడ్డి కుమారుడు తిరుపతి రెడ్డి ,ఎంపీటీసీ కుంపటి సురేష్, లక్ష్మీకాంత్ రెడ్డి,అంకిత ప్రసాద్,బాలయ్య,లక్ష్మయ్య,గండు కృష్ణుడు,వెంకటేశ్వర్లు చెన్నుపల్లే నాయకులు పాల్గొన్నారు..👉అనంతరం ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కంభం మండలం జంగంగుంట్ల గ్రామంలో కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

👉ముత్తుములకు మద్దతుగా టిడీపీలో చేరిన మాజీ జడ్పీటీసీ అనుచరులు*..

రాచర్ల మండలం, చినగానిపల్లె గ్రామంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించిన సందర్బంగా మాజీ జడ్పీటీసీ సభ్యులు కుప్పా రంగసాయి  నివాసంలో ఏర్పాటు చేసిన తేనిటీ విందులో పాల్గోన్నారు. అశోక్ రెడ్డి సమక్షంలో మాజీ జడ్పీటీసీ ఆధ్వర్యంలో వారి అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని కుప్పా రంగసాయి తెలిపారు.కార్యక్రమంలో మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.👉గిద్దలూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి 3వ రోజు బెస్తవారిపేట మండలం, కోనపల్లె పంచాయతీ నుండి తన పర్యటనను ప్రారంభించారు.👉బెస్తవారిపేట మండలం, సింగసాని పల్లె గ్రామంలో పర్యటించిన అనంతరం గ్రామస్థులతో సమావేశమై మే 13న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలియించాలని కోరిన అశోక్ రెడ్డి.👉కంభం మండలం, పోరుమామిళ్లపల్లె గ్రామంలో శ్రీ అల్లూరి పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గిద్దలూరు టిడిపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి” సోదరుడు “ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి”

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..