👉సీఎం జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి*
మాజీ ఎమ్మెల్యే,టీడీపీ కీలక నేత కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా ఎద్దల చెరువు వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ నేత,మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్టువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,అనుచరులుతో వైయస్ఆర్ సీపీలో చేరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు,నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
👉బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ గురించి అందరికి తెలిసిందే.ఆర్యన్ దర్శకుడు, రచయిత కూడా.ఇక గతేడాది ‘స్టార్‌డమ్’ అనే వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్ ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు బాగా ఆదరించడంతో ఆర్యన్ కూడా తనదైన స్టైల్లో గుర్తింపు దక్కించుకున్నాడు.అయితే..సినిమా విషయాలు పక్కన పెడితే.. ఆర్యన్ డేటింగ్ రూమార్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు.
ఈస్టార్ కిడ్ పలు సెలబ్రెటీస్‌తో పిక్స్ దిగుతూ నెట్టింట హైలెట్ అవుతూ ఉంటాడు.ఈ క్రమంలోనే ఆర్యన్ 25 ఏళ్ల వయసులోనే చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడంటూ సోషల్ మీడియాలో టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోకొత్త పేరు వినిపిస్తుంది.బ్రెజిలియన్ నటి లారిస్సా బోనేసితో కూడా ఆర్యన్ డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్. అంతే కాకుండా వీరిద్దరి గురించి గతంలో కూడా పలు డేటింగ్ వార్తలు రావడంతో నెటిజన్లు వీరిపై ఓ కన్ను వేశారు. ఇందులో భాగంగా.. ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రెజిలియన్ నటి లారిస్సా బోనేసితో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని ఫాలో అవుతన్నట్లు గుర్తించారట.దీంతో అతడు లారిస్సా డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలు రోజురోజులు బలపడుతున్నాయి.
*500 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక*
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తంబళ్లపల్లి,ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన 500 కుటుంబాలు వైసీపీని వీడాయి.గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో రెండు గ్రామాలకు చెందిన 500 కుటుంబాలు టిడిపి పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు టిడిపిలో చేరుతున్నారని అన్నారు. 2024 ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
👉మార్కాపురం చెన్నకేశవ స్వామి ఆలయ గోపుర కలశ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న కేపీ దంపతులు*….
మార్కాపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో జరిగిన గోపుర కలశ ప్రతిష్ట మహోత్సవంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుటుంబ సభ్యులతో కలిసి గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునరెడ్డి ఆయన సతీమణి కల్పనరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి,ఆ స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు .. ……………..👉 వైసీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీ పల్లి,వెలిగండ్లలో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
👉కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు……..
సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు…డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో దాడులు.
👉గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు క్రిష్ణా కిషోర్ రెడ్డి గురువారం కంభం పట్టణంలోని తెలుగు వీధి బెస్త కళ్యాణ మండపంలో జరుగుతున్న కోడి వీరయ్య, వెంకట లక్ష్మమ్మ దంపతుల కుమారుడు ఆంజనేయులు, శివ మహేశ్వరిల వివాహ వేడుక మహోత్సవంలో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.