సీఎం కేజరి వాల్ కు హైకోర్టు ఊరట..ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్..గిద్దలూరు వైకాపా టిడిపిలలో హోరాహోరీ చేరికలు..వైసీపీకి ఆమంచి రాజీనామా!..భర్త,ప్రియుడు ఇద్దరూ కావాలి..మహిళ నిరసన!

👉ఢిల్లీ ముఖ్యమంత్రి కేజరివాల్ కు హైకోర్టు నుండి ఊరట లభించింది…అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రి అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూసేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా..ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.ఈ పిల్‌పై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.జస్టిస్‌ మన్మోహన్‌,జస్టిస్‌ మన్మీత్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరాలతో కూడిన ఢిల్లీ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గురువారం ఆ పిల్‌ను కొట్టేసింది.అరెస్ట్ అయిన తర్వాత కూడా సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం పూర్తిగా కేజ్రీవాల్‌ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.ఇక ఈ అంశంపై రాష్ట్రపతి లేదా గవర్నర్‌లను సంప్రదించాలని హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలని.. కానీ అది కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయమని కోర్టు తెలిపింది.ఇది న్యాయస్థానం అని.. కోర్టులు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన గానీ..గవర్నర్‌ పాలన గానీ విధించిన సందర్భాలు ఉన్నాయా అని పిటిషనర్‌ను ప్రశ్నించింది.దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పిటిషనర్‌కు చెప్పింది.ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడంతో రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయడం లేదని తాము ఎలా చెప్పగలం అంటూ ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అది నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉందని.. అలాంటి లెఫ్టినెంట్ గవర్నర్‌కు తాము మార్గదర్శకాలు సూచించాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చట్టం ప్రకారం ఏం చేయాలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేస్తారని పేర్కొంది. కోర్టు పిటిషన్‌ను కొట్టి వేయడంతో.. పిటిషనర్ విష్ణు గుప్తా.. తన పిల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ప్రస్తావించనున్నట్లు వెల్లడించారు.ఇక ఇప్పటికే అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ మార్చి 28 వ తేదీన సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

👉ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్..ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించటమే లక్ష్యం:జిల్లా ఎస్పీ ..

ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాల మేరకు ఇంటలిజెన్స్ (SIB) నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఐ.పి.యస్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ని,ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ASP (క్రైమ్)యస్.వి. శ్రీధర్ రావు,AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు,డిఎస్పీలు,సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు పాల్గొని పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ముందుగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన జిల్లా ఎస్పీకి పోలీసులు గౌరవ వందనంతో స్వాగతం పలికారు.జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు.ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు.గతంలో ప్రకాశం జిల్లాలో ట్రైనీ ఐపీఎస్ గా పనిచేశారు.

👉కోటా నరసింహులు మృతి వైఎస్సార్సీపీ పార్టీకి తీరని లోటు..అంత్యక్రియల్లో పాల్గొని వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే అన్నా.. మార్కాపురం ఎమ్మెల్యే కె.పి…..గుండెపోటుతో మృతిచెందిన గిద్దలూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఆర్యవైశ్య సంఘ నాయకులు కోటా నరసింహులు అకాల మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి తీరనిలోటని మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి,గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థి,మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి లు అన్నారు. గురువారం గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం గ్రామం లోని కోటా నరసింహులు పార్థివదేహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డిలు మాట్లాడుతూ పార్టీకి కోటా అందించిన సేవలు మరువలేవని,ఇటువంటి మంచి మిత్రున్ని కోల్పోవడం బాధాకరమని ఇటువంటి వ్యక్తి దొరకడం చాల అరుదని అన్నారు.ఈ అంతిమయాత్రలో కోటా శ్రీనివాసులు, పోలేపల్లి నరేంద్ర,దాసరి సురేష్, గర్రె సుబ్బారావు తదితర వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు,ఆర్యవైశ్య సంఘ సభ్యులు,గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు.

👉ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కుందూరు..

పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి అన్నారు. పట్టణంలోని 7వ వార్డులో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొని మాట్లాడారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఆయన ఉపవాస దీక్ష విడిపించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, ముస్లింలు పాల్గొన్నారు.

👉గురువారం రాత్రి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ ఏమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పరిచయ కార్యక్రమం లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి, జనసేన మరియు బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఏమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు,కుమార్తె వెంట ఎమ్మెల్యే రవి కుమార్, టీడీపీ నేతలు మాగుంట తదితరులు పాల్గొన్నారు……………👉కంభం పట్టణ వైకాపా నాయకులు సుభాని తదితరులను కలిసిన గిద్దలూరు వైకాపా అభ్యర్థి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి……..👉టిడిపి నుండి వైకాపాలోకి భారీ చేరికలు..బేస్తవారిపేట మండలం కొత్త మల్లాపురంలో తెలుగుదేశంపార్టీ నుండి 20 కుటుంభాలు గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జీ శాసన సభ్యులు కుందురు నాగార్జునరెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో గురువారం చేరడం జరిగింది.కార్యక్రమంలో ఎంపీపీ ఓసురారెడ్డి,జడ్పీటీసీ రాజయ్య ఎంపీటీసీ శ్రీనువాసులు సీనియర్ నాయకుడు కోటయ్య తదితరులు పాల్గొన్నారు ..     👉రాచర్ల మండలంలో టీడీపీ కి భారీ షాక్..వైసీపీలోకి వలసల జోరు*…గిద్దలూరు నియోజకవర్గంలో ఊర్లు ఊర్లు ఊడ్చేస్తున్న కేపీ!!!

రాచర్ల మండలంలో టీడీపీభారీ షాక్ తగిలింది, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నేత్రుత్వంలో నియోజకవర్గంలో వైసీపీ లోకి కొనసాగుతున్న వలసల జోరుతో,టీడీపీ, జనసేన పార్టీకి బీటలు వాలుతున్నాయి.రాచర్ల మండలంలోని రంగారెడ్డి పంచాయతీకీ చెందిన రంగారెడ్డి పల్లె , సత్తేలి గ్రామల నుంచి మొత్తం 50 కుటుంబాలు మరియు అనముల పల్లె గ్రామనికి చెందిన 30 కుటుంబాలు,అచ్చంపల్లె గ్రామానికి చెందిన 30 కుటుంబాలు…మొత్తం రాచర్ల మండలంలో 110 కుటుంబాలు టీడీపీకి, జనసేన పార్టీకి గుడ్ బై చెపుతూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. .👉కంభం పట్టణ వైకాపా నాయకులు సుభాని తదితరులను కలిసిన గిద్దలూరు వైకాపా అభ్యర్థి మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి.👉ఇటీవల వైకాపా నుండి టిడిపిలో చేరిన కంభం మండల నాయకులను సైతం తిరిగి వైకాపాలోకి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు భోగట్ట..???

👉‘భర్త, ప్రియుడు.. ఇద్దరూ కావాలి’.. విద్యుత్‌ స్తంభం ఎక్కి మహిళ నిరసన! వీడియో వైరల్….ఆమె ముగ్గురు పిల్లల తల్లి. భర్త, పిల్లలతో ఎంతో సంతోషంగా సాగిపోతుంది ఆమె కాపురం. అయితే భర్తకు తెలియకుండా ఆమె ప్రియుడితో రహస్యంగా సంబంధం పెట్టుకుంది. ఈ విషయం బట్టబయలు కావడంతో తనకు భర్తతోపాటు ప్రియుడు కూడా కావాలంటూ మొండిపట్టు పట్టింది. కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించక పోవడంతో.. సదరు మహిళ కరెంట్ స్తంభం ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. తాను భర్త, ప్రియుడు ఇద్దరితో కలిసి ఉంటానని, అందుకు అంగీకరిస్తేనే కిందికి దిగివస్తానని డిమాండ్ చేసింది. గమనించిన స్థానికులు .. ఆమెను కాపాడేందుకు యత్నించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో బుధవారం (ఏప్రిల్‌ 3) చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

*వైసీపీ కి ఆమంచి రాజీనామా!!!

వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ప్రకాశం జిల్లా ముఖ్య నేత ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు.తన భవిష్యత్తు కార్యాచరణను ఈనెల తొమ్మిదో తేదీన ప్రకటిస్తానని తెలిపారు.చీరాల వైసీపీ టికెట్ ఆశించిన ఆమంచి కృష్ణమోహన్ పర్చూరు వైసీపీ ఇంచార్జి పదవికి రాజీనామా చేశారు.ఐనప్పటికీ వైసీపీ చీరాల ను కరణం వెంకటేష్ కు కేటాయించింది.ఈ క్రమంలో మౌనంగా ఉన్న ఆమంచి..ఇటీవల కాలంలో చీరాలలో పలు ప్రాంతాల్లో వైసిపి టికెట్ ఆమంచి కేటాయించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.ఈ పరిస్థితుల్లో వైసిపి నుంచి ఎటువంటి సానుకూలత కనిపించని సమయంలో ఆయన మంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు.చీరాల నియోజవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనతో ఆమంచి కృష్ణమోహన్ ఉన్నట్లు సమాచారం.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం