సీఎం జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన అమలాపురం జనసేన నాయకులు..జగన్ పై ధ్వజమెత్తిన షర్మిల,సునీత!!!..గిద్దలూరువైసీపీ,టీడీపీలో కొనసాగుతున్న చేరికలు..రెబల్ గా పోటీ చేస్తానంటున్న ఆమంచి..

👉సీఎం జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన అమలాపురం జనసేన ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు-

సీఎం జగన్‌ సమక్షంలో మేమంతా సిద్ధం యాత్ర సందర్భంగా  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి శెట్టిబత్తుల రాజబాబు-*

👉బాబు బంధం ప్రజలతో కాదు ఫెవికాల్ తో- సీఎం జగన్….చంద్రబాబుకు ప్రజలతో బంధం లేదు. కానీ, అతని బంధం ఫెవికాల్‌తో ఉందని,ఎందుకంటే మీరు అతనిని మానిఫెస్టో లేదా ఏదైనా మంచి చేశారా అని అడిగిన ప్రతిసారీ, నోటికి ఫెవికాల్ పూసుకుంటాడు నోరు ముసుకుంటాడని ఎద్దేవా చేశారు.

👉షర్మిలను ఎందుకు దూరం పెట్టారు.. వివేకానంద కేసులో నిందితుడికి టికెట్ ఎలా ఇచ్చారు..సునీత కీలక వ్యాఖ్యలు..!!!

ఒకప్పుడు వైసీపీలో కీలక భూమిక పోషించిన షర్మిళ.. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్నీ తానై అన్నట్లుగా నడిపించిన షర్మిళ..అనంతర కాలంలో పార్టీకి ఎందుకు దూరయమ్మారనే విషయంపై సునీత స్పందించారు. ఇందులో భాగంగా…సీబీఐ కేసుల్లో జగన్‌ అరెస్టయి జైలులో ఉన్న సమయంలో షర్మిల పార్టీని భుజాన వేసుకుని నడిపించిందని సునీత గుర్తుచేశారు. అనంతరం జరిగిన పరిణామాలే షర్మిళను పార్టీ నుంచి దూరం పెట్టడానికి కారణమని తెలిపారు. ఇందులో భాగంగా…జగన్ వెంట కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు,ఎంపీలు రాజీనామా తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో షర్మిళ తీవ్రంగా ప్రచరం చేసి గెలిపించారని చెప్పిన సునీత…ఆ ఎన్నికల్లో విజయం తర్వాత షర్మిళకు ఆదరణ వస్తోందనే కారణంతో పక్కనపెట్టారని తెలిపారు. అయితే…2014 ఎన్నికల్లో కడప నుంచి ఆమె పోటీ చేస్తారని అంతా భావించారని..అయితే ఆ స్థానాన్ని అవినాష్ కు ఇవ్వాలని నిర్ణయించారని..అది వివేకాకు ఇష్టం లేదని.. తర్వాత జరిగిన పరిణామాలే తన తండ్రిని బలి తీసుకున్నాయన్నట్లుగా సునీత వివరించారు!మరోపక్క కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించి,పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిళ…వివేకా కేసులో అవినాశ్‌ ను సీబీఐ నిందితుడిగా తేల్చిందని చెప్పారు.ఇదే సమయంలో… హత్య కేసులో నిందితుడిగా ఉన్నవారికి సీఎం జగన్‌ టికెట్‌ ఎలా ఇస్తారని షర్మిళ ప్రశ్నించారు.చిన్నాన్న హత్య వ్యవహారంలో జగన్‌ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు!

👉వైఎస్సార్ బీజేపీ కి వ్యతిరేకి.. కొడుకు జగన్ బిజెపికి బానిస..ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ బీజేపీ కి ఎప్పుడు వ్యతిరేకి..మతం పేరుతో చిచ్చు పెట్టేది బీజేపీ..వైఎస్సార్ కొడుకు జగన్ మోహన్ రెడ్డి బీజేపీ కి బానిస..ముస్లీం లకు జగన్ సమాధానం చెప్పాలని షర్మిలా రెడ్డి ఒక ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు .గోద్రా లో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని బీజేపీకి బానిస అయిన జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు.జగన్ ముస్లింలకు ఎన్నో వాగ్ధానాలు చేశాడుఇమామ్ లకు 15 వేలు వేతనం అన్నాడు.ముస్లీం బ్యాంక్ అన్నాడు.చనిపోతే 5 లక్షల భీమా అన్నాడు.ఎన్నో హామీలు ఇచ్చి మరిచాడని ముస్లీం పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు.బాబు,జగన్ ఇద్దరు ముస్లీం ల పక్షాన లేరని బీజేపీ రాష్ట్రానికి ఎం చేసిందని వీళ్ళు బానిసలు అయ్యారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలన్నారు.విభజన హామీలు ఒక్కటి సైతం బీజేపీ నెరవేర్చలేదని హోదాపై బీజేపీ మోసం చేసిందన్నారు.వైఎస్సార్ బ్రతికి ఉంటే కడప స్టీల్ ఎప్పుడో పూర్తి అయ్యేదని కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ కింద మార్చారని,మూడు సార్లు శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.ఎంపిలు నిద్ర పోతున్నారని,స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్క రోజు కూడా కడప స్టీల్ మీద మాట్లాడలేదని ఆరోపించారు.కడప – బెంగళూర్ రైల్వే లైన్ వైఎస్సార్ ఆశయం.కడప లైన్ ను జగన్ వద్దన్నారని,సిబిఐ నిందితుడు గా అవినాష్ రెడ్డి మీద ముద్ర వేసిందని నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డి కి మళ్ళీ ఎలా టిక్కెట్ ఇచ్చారని,బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ఎందుకు అసలు నిజం దాచి పెడుతున్నారని ప్రశ్నించారు.సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నారని,మీరు నేరం చేయక పోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారని, నిందితులను ఎందుకు కాపాడుతున్నారన్నారు.జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని,హత్యారాజకీయాలు ప్రోత్సహించే వారికి బుద్ది చెప్పాలన్నారు.సిబిఐ నిందితుడని చెప్తున్న అవినాష్ రె డ్డికి టిక్కెట్ ఇవ్వడంతోనే నేను పోటీ చేస్తున్నానన్నారు .కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని,వైఎస్సార్ లాగ సేవ చేస్తానని అన్నారు.

👉జగన్ రెడ్డి పాలనలో రైతులకు కన్నీరే *

ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రైతులకు యేటా 20 వేలు…..రాష్ట్రంలో రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వ్యవసాయాన్ని దండుగ చేశాడని గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పర్యటనలో భాగంగా 5వ రోజు కంభం మండలంలోని లింగోజీపల్లె, తెల్లదిన్నే,ఎల్. కోట, ఔరంగాబాద్,నడింపల్లె, సైదాపురం,కందులాపురం, సూరేపల్లె,రావిపాడు, జంగంగుంట్ల,కాగితాల గూడెం, హాజరత్ గూడెం,దర్గా, దేవనగరం,పెద్దనల్లకాల్వ, చిన్న నల్లకాల్వ,లింగాపురం, ఎర్రబాలెం గ్రామాలలో పర్యటించిన ఆయన గ్రామ పెద్దలు,మహిళలు, రైతులను, అవ్వ తాతలను ప్రతీ ఒక్కరిని కలుసుకొని నాడు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ,వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులను పట్టించుకోక పొగా పంట పొలాల మోటార్లకు మీటర్లు బిగించి రైతుల నడ్డి విరిచిందన్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే అన్నదాత పథకం ద్వారా రైతులకు యేటా రూ. 15 వేల రూపాయలు అందించటం జరుగుతుందన్నారు.అదే విధంగా మహిళా సంక్షేమం కోసం మహాశక్తి పథకం,బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టం వంటి పథకాలతో సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశ పెట్టటం జరిగిందన్నారు.మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అసెంబ్లీ కూటమి అభ్యర్దిగా పోటీ చేయుచున్న తనకు, ఎంపీ అభ్యర్దిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు, మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గోన్నారు.

👉ఎన్నికల ప్రచారంలో కేపీ సతీమణి కల్పనా రెడ్డి..గిద్దలూరు పట్టణంలోని 5వ వార్డులో ఇంటింటికి తిరిగి మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డికి మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కల్పనా రెడ్డి కోరారు ..👉సొంతగూటికి చేరిన కో-ఆప్షన్ మెంబెర్ దమ్మల జనార్దన్..

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలోకి చేరిన గిద్దలూరు మున్సిపాలిటీ కో-ఆప్షన్ మెంబర్,ఆర్యవైశ్య ప్రముఖులు దమ్మల జనార్దన్ తిరిగి గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, గిద్దలూరు మున్సిపాలిటీ కౌన్సిలర్స్,వైసీపీ నాయకులు ఆర్యవైశ్య ప్రముఖుల సమక్షంలో ఈరోజు తిరిగి సొంత గూటికి వైసీపీలోకి చేరారు.వారికి నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించినారు….👉అర్ధవీడు మండలంలో టీడీపీకి ఎదురుదెబ్బ..!!! గిద్దలూరు వైసీపీలోకి కొనసాగుతున్న చేరికలు..

గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి నేత్రుత్వంలో నియోజకవర్గంలో వైసీపీ లోకి కొనసాగుతున్న వలసల జోరు.అర్ధవీడు మండలంలోని గన్నేపల్లె గ్రామానికి చెందిన సుమారు 20 కుటుంబాలు టీడీపీకి, జనసేన పార్టీకి గుడ్ బై చెపుతూ గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు.👉 కంభం మండలంలో వైసీపీని టిడిపిలో చేరిన ప్రముఖులు..కంభం మండలంలో ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటన సందర్భంగా కందులాపురం గ్రామంలో మాజీ వార్డు మెంబరు ముద్దార్స్ శ్రీనివాసులు, ఔరంగాబాద్ పంచాయతీలోని నడింపల్లె గ్రామంలో కైరంకొండ రంగసాయి,రావిపాడు గ్రామంలో వైసీపీ నాయకులు ఎక్కులూరి శ్రీరాములు,కలగట్ల జయరాములు,సయ్యద్ బాషా,వీరిశెట్టి వెంకట సుబ్బయ్య (పాలు)కొమరోలు పట్టణానికి చెందిన బండి వెంకటసుబ్బయ్య వారి కుటుంబ సభ్యులు వైసిపిని వీడి టిడిపిలో చేరారు. వారిని అశోక్ రెడ్డి టిడిపి కండవాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

*గిద్దలూరు జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా ఆమంచి స్వాములు..

కంభంలో శుక్రవారం జనసేన పార్టీ నాయకులు ఆమంచి స్వాములు కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. తాను గిద్దలూరు నియోజకవర్గం జనసేన పార్టీ రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు గిద్దలూరు ఎమ్మెల్యే టికెట్ రాకుండా కుట్రలు జరిగాయన్నారు.ఇక్కడ జనసేనను గెలిపించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు గిఫ్టుగా ఇస్తానని ఆమంచి స్వాములు అన్నారు. ఇకనుంచి తాను గిద్దలూరు నియోజకవర్గంలోనే నివాసం ఉంటానన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!