👉జగన్ పై, సజ్జల పై షర్మిల సంచలన వ్యాఖ్యలు..
తాజాగా కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిళ.. తన సోదరి, వైఎస్ వివేకా కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా… ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల పాటు కుంభకర్ణుడిలా నిద్రపోయి,ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్రలేచారని విమర్శించారు.ఏపీలో ఎటు చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్రమాలు,దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు మాత్రమే ఉన్నాయని.. అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. ఇదే క్రమంలో… తన తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్ద పీట వేశారని చెప్పిన షర్మిళ… జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే లేదని,కడప స్టీల్ ఫ్యాక్టరీని గాలికి వదిలేశారని ఫైరయ్యారు! కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయ్యి ఉంటే.. ప్రత్యక్షంగా పాతిక వేల మందికి, పరోక్షంగా మరో 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. అనంతరం వైఎస్ వివేకా వ్యవహారంపై స్పందించిన షర్మిళ… వివేకా హత్య జరిగి ఐదేళ్లు అవుతున్నా హత్య చేసిన వారు బయట తిరగుతున్నారని మండిపడ్డారు.అవినాశ్ రెడ్డిని నిందితుడని సీబీఐ చెప్పినప్పటికీ మళ్లీ అతడికే జగన్ టికెట్ ఇచ్చారని విమర్శించారు! స్వయంగా సీఎం జగన్ కి బాబాయ్ అయినా కూడా వివేకా విషయంలో కనీస న్యాయం జరిగే పరిస్థితి లేదని దుయ్యబట్టారు.ఇదే సమయంలో…నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే తాను పోటీలో నిలుచున్నట్లు పునరుద్ఘాటించారు.
*బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు ఆదివారం వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించిన వైఎస్ షర్మిళ… ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇందులో భాగంగా… “నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటావా? నేను ఎవరిని అనుకుంటున్నవ్? రాజన్న బిడ్డని గుర్తుపెట్టుకో! అధికార మదం తలకెక్కిందా?అంటూ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో”నువ్వూ.. నీ కొడుకు పేమెంట్ తీసుకుని నన్ను,సునీతను పలుమార్లు పలు విధాలుగా హింసించారు! సోషల్ మీడియాలో హేలన చేశారు.నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు”అంటూ షర్మిళ తీవ్రస్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు!ఇదే క్రమంలో..ఇలాంటి సజ్జలకి సలహాదారుగా నియమించడం జగన్ చేసుకున్న ఖర్మంటూ షర్మిల వ్యాఖ్యానించారు. అనంతరం వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపైనా వైఎస్ షర్మిళ స్పందించారు.ఇందులో భాగంగా…వివేకా లాంటి మంచి మనిషి నేడు భూతద్దం పెట్టి వెతికినా దొరకరని చెప్పిన షర్మిళ..అలాంటి మంచి మనిషిని నరికి చంపేశారని అన్నారు. ఇదే సమయంలో… చిన్నాన్నను చంపినవాళ్లకు, చంపించిన వాళ్లకు మధ్య ఎన్నో లావాదేవీలున్నాయని తెలిపారు.వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినా కూడా ఆ నిందితుడుని జగన్ కాపాడుతున్నారని అన్నారు. ఈ సమయంలో…చిన్నాన్న కుటుంబానికి న్యాయం చేయకపోగా..మళ్లీ అదే మనిషికి టిక్కెట్ ఇచ్చారని చెప్పిన షర్మిళ..ఇది అహంకరం కాపోతే మరేమిటని నిలదీశారు.ఈ అన్యాయం అడ్డుకోవడానిమే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షర్మిల పునరుద్ఘాటించారు.
👉షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు….షర్మిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.మనిషై పుట్టాక కనీసం విచక్షణా జ్ఞానం ఉండాలని అవినాష్ రెడ్డి అన్నారు. విజ్ఞత కలిగిన ఎవరు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్న అవినాష్ రెడ్డి ..ఎన్నైనా అనండి, ఎంతైనా ప్రచారం చేసుకోండి అని స్పష్టం చేశారు.బురదచల్లి తుడుచుకోమని చెప్పడం మామూలైపోయిందన్న అవినాష్ రెడ్డి .. తుడుచుకుంటూ పొతే, బురదచల్లుతూనే ఉంటారని అన్నారు.మాట్లాడేవాళ్లు ఎంతైనా మాట్లాడుకోవచ్చని.. ఆ వ్యాఖ్యలను వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. మాట్లాడే వాళ్లది మనిషి పుట్టుకే అయితే కొంచమైనా విజ్ఞత,విచక్షణ ఉంటుందంటూ అవినాష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
👉బేస్తవారిపేట లో రోడ్డు ప్రమాదం..
ప్రకాశం జిల్లా బేస్తవారి పేట టౌన్ నందు స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన జాతీయ రహదారి పై కారు బొలెరో వాహనము ఎదురు ఎదురుగా ఢీకొనడం జరిగింది.కారు గుంటూరు కి వెళ్తున్న క్రమంలో కంభం నుండి గిద్దలూరుకు కూల్ డ్రింక్స్ లోడుతో వెళ్తున్న బొలోర వాహనము బ్రిడ్జిపై ఎదురెదురుగా ఢీకొనడంతో కారు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కారుకు బెలూన్ ఓపెన్ కావడంతో కారు డ్రైవర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడటం జరిగింది. సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి బేస్తవారిపేట హెడ్ కానిస్టేబుల్ జయరాజు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ట్రాఫిక్ సమస్య అంతరాయం కలవకుండా క్రేన్ తో వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు
*”చిన్నారి దానకర్తల.. పెద్ద దానం”*
CIO (చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్) రాజమండ్రి తరపున పిల్లల్లో దాతృత్వ గుణం పెంపొందించే దిశగా ‘Nhanne sdaqedaar’ అనే అంశంపై యాక్టివిటీ నిర్వహించటమైనది. తోటి మానవులకు సహాయపడటం దేవునికి అత్యంత ఇష్టమైన కార్యమని పిల్లలకు బోధిస్తూ వారు దాచుకున్న డబ్బులలో కొంత దానం చేయాలని ప్రోత్సాహించగా.. పిల్లలు తమ డిబ్బీలలో దాచుకున్బ డబ్బులు తీసుకువచ్చి సామూహికంగా ఓ వృధ్దాశ్రమానికి వెళ్ళి తమ చేతుల మీదుగా అక్కడి వృధ్దులకు పండ్లు, రొట్టెలు అందించారు.