పవన్ పచ్చి మోసగాడు పోతిన..వైకాపాలో చేరిన పోతిన!..పవన్ పై రేణుక సంచలన వ్యాఖ్యలు..గంజాయి విక్రెతల అరెస్టు..గిద్దలూరు టిడిపిలో చేరికలు..

👉మేమంతా సిద్దం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమక్షంలో జనసేన,తెలుగుదేశం పార్టీల నుండి వైకాపాలో చేరిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు..

విజయవాడ పశ్చిమ ని.వర్గం నుంచి వైకాపాలో చేరిన జనసేన ని.వర్గ ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్‌..మహేష్ ను  వైకాపా కండువా కప్పి…పార్టీలోకి ఆహ్వానించిన సీఎం వైయస్‌.జగన్‌.జనసేన నుంచి మహేష్ తోపాటు  వైకాపాలో విజయవాడ పట్టణ ఉపాధ్యక్షుడు వెన్న శివశంకర్,పశ్చిమ నియోజకవర్గం డివిజన్‌ అధ్యక్షులు షేక్‌ అమీర్‌ బాషా,పి శ్రీనివాసరావు, ఎస్‌ రాముగుప్తా,పిల్లా వంశీకృష్ణ, సోమిగోవిందరావు, ఎం.హనుమాన్,సయ్యద్‌ ముబీనా,జెల్లి రమేష్, పలువురు నేతలు పార్టీలో చేరారు.

👉జనసేనకు రాజీనామా చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పోతిన మహేష్‌.ఆ పార్టీ చీఫ్‌ పవన్‌కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు.పవన్‌ ఏం చేస్తున్నారో కనీసం ఆయనకు కూడా అర్థం కావడం లేదన్నారు.స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పవన్‌ పని చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు పోతిన.పార్టీ నిర్మాణం, క్యాడర్‌ గురించి పవన్‌కల్యాణ్ ఏనాడూ పట్టించుకోలేదన్నారు. పవన్‌ది అంతా నటనేనంటూ దుమ్మెత్తిపోశారు.పవన్‌ సిద్ధాంతాలు స్వార్థపూరితమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ గురించి తెలిసే గతంలో ప్రజలు ఆయనను రెండు చోట్ల చిత్తుచిత్తుగా ఓడగోట్టారంటూ ఫైర్ అయ్యారు. 25 రోజుల తర్వాత జనసేన పరిస్థితి ఏంటో చెప్పగలరా అంటూ పవన్‌కు ప్రశ్నలు సంధించారు పోతిన. 21 సీట్లతో పార్టీకి, ప్రజలకు ఏం భవిష్యత్ ఇవ్వగలరంటూ పవన్‌కు సవాల్‌ విసిరారు.👉జనసేన కోసం కష్టపడ్డ వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు పోతిన. జనసేనలో పని చేసిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ వారికి ఎందుకు సీట్లు ఇచ్చారో..కార్యకర్తలకు పవన్‌ సమాధానం చెప్పాలన్నారు.కాపు సామాజికవర్గాన్ని పవన్‌ బలి పెడుతున్నారని ఆరోపించారు.కాపు యువతను మోసం చేయోద్దని పవన్‌ను కోరారు.త్వరలోనే తన వద్ద ఆధారాలు బయటపెడతానన్నారు.👉వీరమహిళలకు పదవీకాలం పొడిగించి మిగతా పదవులకు ఎందుకు పొడిగించలేదన్నారు.గతంలో పవన్‌ తల్లిని దూషించిన సుజనా చౌదరికి ఎలా సీటు ఇచ్చారని ప్రశ్నించారు పోతిన. పచ్చ నోట్లు పడేస్తే అన్ని మర్చిపోతారా అంటూ పవన్‌ను నిలదీశారు. ఈ అంశంపై కచ్చితంగా పవన్‌ సమాధానం చెప్పాలన్నారు. రాజధాని ప్రాంతంలో జనసేనను పవన్‌ చంపేశారన్నారు. బీజేపీ సీట్లు సర్దుబాటు చేయమని టీడీపీకి చెప్తే..జనసేన సీట్లు ఎందుకు త్యాగం చేసిందని ప్రశ్నించారు పోతిన. పొత్తు కుదుర్చింది జనసేన పార్టీ ఐతే సీట్లు ఎందుకు తగ్గించుకోవాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పోటీ చేయడానికి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా అంటూ పవన్‌ను కడిగిపారేశారు పోతిన.పార్టీకి విధేయుడిగా ఉంటే నమ్మక ద్రోహం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పోతిన. టీడీపీ, జనసేన మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నాయని..రాబోయే రోజుల్లో జనసేన అడ్రస్ గల్లంతు అవడం ఖాయమని జోస్యం చెప్పారు పోతిన. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం,తెనాలి నియోజకవర్గాల్లో సర్వే చేసి గెలిచే పశ్చిమ నియోజకవర్గాన్ని ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చిందో చెప్పాలన్నారు.బీసీలే త్యాగాలు చేయాలా..కమ్మ సామాజికవర్గం త్యాగాలు చేయదా అంటూ పవన్‌ను ప్రశ్నించారు.పశ్చిమ నియోజకవర్గం పెత్తందారులకు కాకుండా మరొకరికి ఇచ్చి ఉంటే సహకరించే వాళ్లమన్నారు పోతిన.

👉రేణు దేశాయ్ గురించి తెలిసిందే.కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా,మోడల్‌గా, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె..అప్పుడే పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడినట్లు సమాచారం. కొన్నాళ్లకు పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన తర్వాత..పలు కారణాల చేత పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ విడాకులు తీసుకుని విడిపోయారు.

ప్రస్తుతం పిల్లల బాగోగులు చూసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటోంది.అడపాదడపా మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికర కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటోంది రేణు దేశాయ్.ఈక్రమంలోనే మరోసారి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా అయ్యాయి.అయితే..రేణు దేశాయ్‌తో విడిపోవడానికి ముందే పవన్ కల్యాన్ రష్యా అమ్మాయి అన్నా లెజినోవాతో ప్రేమలో పడినట్లు సమాచారం.ఈ మేరకు ఆమెతో సహజీవనం స్టార్ట్ చేసిన తర్వాతే..రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చినట్లు టాక్. ఈ విషయం మీదే రేణు మాట్లాడుతూ..‘ఆయన ఒక లేడీతో బేబీని కన్నారు.ఈ మాటలు నేను ఈజీగా చెబుతున్నా,కానీ రియల్‌గా అంత ఈజీగా లేదు.పవన్‌ కళ్యాణ్‌‌ని పిచ్చిగా ఇష్టపడే లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో.. మీరొకసారి ఆలోచించండి.మీరు ఆయన భార్యగా ఉండి ఉంటే..ఆయన ఇలా మీతో చేస్తే..11 ఏళ్ల పెళ్లి తర్వాత వేరే ఆమెతో బేబీని కని ఉంటే మీకు ఒకేనా.అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటోంది’ అంటూ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

👉గంజాయి అమ్మకాలు జరుపుతున్న వ్యక్తులు అరెస్టు నగదు స్వాధీనం..

ప్రకాశం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు,అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె.నాగేశ్వరరావు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు,ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పర్యవేక్షణలో తేది 09-04-2024 చీమకుర్తి సెబీ సీఐ ఇ.మారయ్యబాబు వారి సిబ్బంది కలిసి చీమకుర్తి పట్టణ పరిధి లో గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఒడిషా రాష్ట్రం మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కు చెందిన ఇద్దురు వ్యక్తులను మధ్యవర్తుల సమక్ష్మంలో అరెస్టు చేసి వారి నుండి 2 కిలోల 260 గ్రాముల (2.26kgs) గంజాయిని మరియు రెండు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొన్నారు,వాటి కొనుగులు విలువ పది వేలు మరియు మార్కెట్ ధర ఇరవై వేలు,రెండు సెల్ ఫోన్స్ విలువ రెండు వేలు,మొత్తం ప్రాపర్టీ విలువ రూ రూ 40వేలు.అందులో ఒడిశా రాష్ట్రంకు చెందిన యుదిస్టిర్ అను వ్యక్తి చీమకుర్తి పట్టణంలో హెయిర్ కట్ సెలూన్ లో పనిచేస్తు చీమకుర్తి పట్టణంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ లలోని పనిచేయు కూలీలకు గంజాయి విక్రయిస్తుoటాడు. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్ చెందిన పేర్నమిట్ట సెంట్రింగ్ పనిచేయుచున్న గోలం మండల్ తో పరిచయం ఏర్పడి అతడు కుడా పేర్నమిట్ట గ్రామంలో గ్రానైట్ ఫ్యాక్టరీ లలోని పనిచేయు కూలీలకు గంజాయి విక్రయిస్తుoటాడు. పైతెలిపిన గంజాయిని యుదిస్టిర్ అనే వ్యక్తి ఒడిశా రాష్ట్రము లోని ఫుల్భాని అటవీ ప్రాంతంలో ఆదివాసీల వద్ద కొనుగోలు చేసి చీమకుర్తి పట్టణంకు తీసుకోచ్చి గోలం మండల్ ఇస్తుండగా పట్టుకోవడమైనది.తదుపరి చర్యల నిమిత్తం వారిద్దరినీ కోర్టు ద్వారా రిమాండ్ కు పంపడమైనది.చీమకుర్తి సెబ్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి అమ్మకాలు, రవాణా మరియు త్రాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుటామని ఒంగోలు సెబ్ ఇ ఎస్ తెలిపినారు.ఈదాడిలో ఇ ఐ ఇ. మారయ్యబాబు,ఇ ఎసై వినీతరెడ్డి ,ఇ హెచ్ సి యూసఫ్ షరిఫ్ ,ఇ సి. కె .వి . రామిరెడ్డి పాల్గొన్నారు.

👉ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జరుగుమల్లి గ్రామంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు.

👉మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి  మంగళవారం రాత్రి పొదిలిలో ముస్లిం సోదరులకు ఇఫ్తియార్ విందు ఇచ్చారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 200 కుటుంబాలు..

గిద్దలూరు మండలం, ముండ్లపాడు గ్రామంలో ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో ఒక మాజీ ఎంపీటీసీ సభ్యుడు మరియు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 100 కుటుంబాలు, 50 నూర్భాషా కుటుంబాలు, 50 రజక కుటుంబాలు మొత్తం 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో టీడీపీలో చేరిన ఎంపీటీసీ పడిగపాటి శేఖర్, మరియు మాజీ వార్డు మెంబర్లు పీక్కిలి కాశయ్య, దూదేకుల చిన్న ఖాసీంపీరా, కొట్టాల దస్తగిరి,ఆరవీటి శ్రీను పాల్గోన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!