*డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు…ఎవరూ నమ్మవద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు*…*అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..*హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య (మెదక్ జిల్లా కొల్చారం) ..* దళారుల మాటలు నమ్మకండి.. జిల్లా ఎస్పీ పి జగదీష్ .. *నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం… *మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి…*పేలిపోయిన విమానం,70 మంది మృతి.. *మహిళ అనుమానాస్పద మృతి (గుంటూరు జిల్లా నంబూరు) .. *మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు .. *ఏపీ రాజ‌కీయం.. నాడు – నేడు : ఎవ‌రి లాభం వారిదే ..! ..*శ్రీ గంధం తరలిస్తున్న దొంగలు ముఠా అరెస్ట్ (చిత్తూరు)

👉వైద్య ఆరోగ్యశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్‌ ప్రొవైడర్
190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు నిర్ణయం
108 సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా రూ.4 వేలు
అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు
ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్యసేవా కార్యక్రమం
ప్రతి మండలంలో జన ఔషధి స్టోర్స్ ఏర్పాటు-చంద్రబాబు

👉 ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్*
* నెలకో జిల్లా చొప్పున పర్యటన
ప్రజా పాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగనున్నారు. కొత్త ఏడాది నుంచి జనం మధ్యకు వెళ్లి వారి ఇబ్బందులు తీసుకొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి నెల ఒక జిల్లాను ఎంచుకొని పర్యటిస్తారు. ఆ జిల్లాలో వెనుకబడిన, గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపు చేసేలా ఏర్పాట్లు ఉండాలని తన కార్యాలయ అధికారులకి దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని సమస్యలు, ప్రజల స్థితిగతులు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. రోజంతా ప్రజలతో మమేకమవుతారని తెలిపారు.
👉కడప జిల్లా.అనుమానస్పద స్థితిలో యర్రగుంట్ల పారిశుద్ధ కార్మికుడు మృతి.
యర్రగుంట్ల పాత మున్సిపల్ కార్యాలయం మరుగుదొడ్డిలో అయ్యవారు అనే పారిశుద్ధ కార్మికుడు మృతి చెందాడు.
మృతి చెందిన కార్మికుడు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నాడు. సంఘటన స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ శేష ఫణి పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉 మెదక్ జిల్లా కొల్చారం పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సాయికుమార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ క్వార్టర్ ఆవరణలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య
చేసుకున్నాడు.
👉అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..*
*టీటీడీ ఉద్యోగినని ఫేక్ మెసేజ్ లు పంపి రూ. లక్షా పదివేలు వసూలు చేసిన కేటుగాడు..*కృష్ణ చైతన్య పేరుతో సూపరిటెండెంట్ హోదాతో నకిలీ ఐడీ కార్డు*
*మోసాన్ని గుర్తించి టీటీడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేసిన ఖమ్మం వాసి శ్రీకాంత్*
👉 నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం…
మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి….
మొదటి కాన్పు కోసం ఆస్పత్రిలో అడ్మిట్ అయిన దామరచర్ల (మం) జైలోతు తండాకు చెందిన రాజేశ్వరి
నిన్న మగ శిశువుకు జన్మనిచ్చిన రాజేశ్వరి
వైద్యుల నిర్లక్ష్యంతో రాజేశ్వరి మృతి చెందిందని మృతురాలు బంధువుల ఆరోపణ..భాద్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన..
👉 *మహిళా అనుమానస్పద మృతి*
గుంటూరు నంబూరు గ్రామం భాస్కర్ నగర వద్ద నివాసం ఉంటున్న మృతురాలు…సంఘటన స్థలానికి చేరుకున్న పెద్దకాకాని పోలీసులు.మృతురాలు షేక్ మల్లిక గా గుర్తించిన పోలీసులు.మల్లికాకు ఇద్దరు సంతానం..వంటిపై గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు…

👉 పేలిపోయిన విమానం,70 మంది మృతి..
మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం..
సౌత్ కొరియాలో షాక్కు గురిచేస్తున్న విమాన ప్రమాద దృశ్యాలు ..విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా రన్ వేను రాసుకుంటూ వెళ్లి గోడను ఢీకొట్టిన్న ఫ్లైట్….
ఒక్కసారిగా ఫ్లైట్ పేలిపోయి భారీగా చెలరేగిన మంటలు….
ఆ సమయంలో విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది
👉డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు…అలాంటి వాటిని ఎవరూ నమ్మవద్దు: *ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు*

ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట… డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు పలువురు వ్యక్తులను బెదిరించి కోట్లు కొల్లగొడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి.ఈ పరిణామాలపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. చట్టంలో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి బెదిరింపులను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని అన్నారు.ఈ ఏడాది సైబర్ క్రైమ్ కు సంబంధించి 916 కేసులు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. 2024లో సైబర్ నేరాల ద్వారా మోసగాళ్లు రూ.1,229 కోట్లు తస్కరించారని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
*సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెట్టడంపై ఇప్పటిదాకా 572 కేసులు నమోదు చేశామని, ఆయా కేసుల్లో నిందితులపై రౌడీ షీట్ తరహాలో సైబర్ షీట్ తెరుస్తామని చెప్పారు.
*మార్చి 31 నాటికి కమాండ్ కంట్రోల్ కార్యాలయంతో 1 లక్ష సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలను వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈగల్’ వ్యవస్థ గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ప్రజల్లోకి బలంగా వెళుతోందని అన్నారు. గంజాయి కాకుండా ఇతర పంటలు సాగు చేయాలని గిరిజనులకు చెబుతున్నామని డీజీపీ వెల్లడించారు.
*ఇక,దేశంలో తొలిసారిగా ఏపీలోనే ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ని ప్రారంభించారని వివరించారు. నేరాల నమోదు నుంచి కేసు విచారణ వరకు ‘స్మార్ట్ పోలీస్ ఏఐ’ సాంకేతికత సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు. విజయవాడలో ట్రాఫిక్, ప్రజా రద్దీ నియంత్రణకు ఏఐ సాంకేతికత ఓ అస్త్రంలా ఉపయోగపడుతుందని తెలిపారు.
*డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ చొరబడడం పట్ల విచారణ జరుపుతున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. భూ కబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పీడీ యాక్ట్ కేసులు పెడతామని స్పష్టం చేశారు.
👉 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారుల మాటలు నమ్మకండి.. జిల్లా ఎస్పీ పి జగదీష్ అనంతపురం:
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ పి.జగదీష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడూ ప్రతిభ ఆధారంగానే వస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. ఈ ప్రక్రియ యావత్తు పారదర్శకంగా జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రక్రియలో వాడుతుండటం వల్ల ఎక్కడా అక్రమాలకు తావుండదనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను ఎవరైనా మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు బాగా ప్రాక్టీస్ చేసుకురావాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
** ఈనెల 30 నుండీ జనవరి 17 వరకు జరిగే ఈవెంట్స్ కు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులో నిర్దేశించిన తేదీల్లో ఉదయం 5 గంటలకు స్థానిక నీలం సంజీవరెడ్డి మైదానంలో హాజరు కావాలి. తమతో పాటు అడ్మిట్ కార్డ్, స్టేజ్-1, స్టేజ్-2 అప్లికేషన్ కాపీలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు ఒరిజినల్స్ తీసుకురావడంతో పాటు ఒక సెట్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఈవెంట్స్ ఉన్న అభ్యర్థులు ఆయా నిర్ధేశిత తేదీలలో అనంతపురం పి.టి.సి తూర్పు గేటు నుండీ ప్రవేశించాలి
*అభ్యర్థులతో పాటు ఎవరైనా వెంట వచ్చినా పి.టి.సి కు తూర్పున ఉన్న రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు ప్రారంభమయ్యే పాయింట్ వద్దే ఆగిపోవాలి. ఈవెంట్స్ జరిగే ప్రదేశానికి అనుమతి ఉండదు. అభ్యర్థొక్కరు మాత్రమే ఈవెంట్స్ ప్రదేశానికి రావాల్సి ఉంటుంది
** ట్రాఫిక్ ఆంక్షలు పాటించి ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలి
*ఈనెల 30 వ తేదీ తెల్లవారుజామున 4 గంటల నుండి జనవరి 17 వ తేదీ వరకు పి.టి.సి కు తూర్పున ఉన్న మరియు రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉన్న రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఎలాంటి రాకపోకలు ఉండవు. ఈవెంట్స్ ముగిసే వరకు జరిగే అన్ని రోజుల్లోను పోలీసులు ఈ ఆంక్షలు అమలు చేయనున్నారు
*రాంనగర్, లక్ష్మినగర్ మిట్టల మీదుగా మొదటి, రెండవ, మూడవ, తదితర రోడ్లకు వెళ్లే వాహనదారులు లక్ష్మీనగర్ నాగులకట్ట నుండీ సంజీవరెడ్డి బిల్డింగ్ సర్కిల్ మరియు జన్మభూమి రోడ్డుల మీదుగా నడిమివంకల మీదుగా వెళ్లాలి
*మొదటి, రెండవ, మూడవ, తదితర రోడ్ల నుండీ రాంనగర్, లక్ష్మీనగర్, రహమత్ నగర్ రైల్వే బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు పిటిసి ఉత్తరం వైపునున్న సర్వీసు రోడ్డు ద్వారా నడిమివంక, జన్మభూమిరోడ్డు, సంజీవరెడ్డి బిల్డింగ్ సర్కిల్ మీదుగా లక్ష్మీనగర్ నాగులకట్ట నుండీ వెళ్లాలి.
👉 చిత్తూరు ..శ్రీ గంధం తరలిస్తున్న దొంగలు ముఠా అరెస్ట్
సుమారు ఏడు లక్షల విలువగల శ్రీగంధం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం 11 మంది అరెస్టు జిల్లా అటవీశాఖ అధికారి భరణి
👉 ఏపీ రాజ‌కీయం.. నాడు – నేడు : ఎవ‌రి లాభం వారిదే ..!
గ‌తంలో వైసీపీ ఉన్న‌ప్పుడు అయినా.. ఇప్పుడు కూట‌మి ఉన్న‌ప్పుడు అయినా.. అంతా స‌మానం! రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రుల‌య్యేది ఒక్క పంపకాల విష‌యంలోనే. ఎన్నిక‌ల వేళ పొట్లాడుకున్న కొట్టాడుకున్న నాయ‌కులు కూడా.. ఏదైనా పంప‌కాల విష‌యానికి వ‌స్తే మాత్రం గుట్టు చ‌ప్పుడు కాకుండా.. పంచేసుకుంటారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక్క మ‌న‌ద‌గ్గ‌రే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా అమ‌ల‌వుతోంది. దీనికి ఎవ‌రూ అతీతులు కారు. గ‌తంలో వైసీపీ ఉన్న‌ప్పుడు అయినా.. ఇప్పుడు కూట‌మి ఉన్న‌ప్పుడు అయినా.. అంతా స‌మానం! విశాఖ నుంచి అనంత‌పురం వ‌ర‌కు.. అనేక ప్రాజెక్టులు ఇప్పుడు రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో ప్రైవేటు, గ‌వ‌ర్న‌మెంటుకు సంబంధించి సంస్థ‌లు ఉన్నాయి. వీటికి సంబంధించి కొన్ని వైసీపీ హ‌యాంలో ఏర్పాటు చేసిన‌వి ఉన్నాయి. కొన్ని అంత‌కు ముందే టీడీపీ ప్ర‌భుత్వంలో ఉన్న‌వి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం జ‌రుగుతోందంటే.. ఆయా ప్రాజెక్టుల‌పై స‌హ‌జంగానే అధికార పార్టీ నాయ‌కుల ఆధిప‌త్యం ఉంటుంది. ఏదో ఒక రూపంలో కొంత సొమ్ము ఆశించ‌డం స‌హ‌జం. అనుమ‌తులు.. ఇత‌ర‌త్రా సంగ‌తుల పేరుతో.. ఆయా ప్రాజెక్టుల‌పై ఆధిపత్యం కోసం నాయ‌కులు ప్ర‌యత్నిస్తారు. ఈ క్ర‌మంలో ఎవ‌రికి ద‌క్కాల్సిన రూపాయి వారికి ద‌క్కాల్సిందే..! దీనిలో త‌ర త‌మ బేధాలు లేవు. గ‌తంలో వైసీపీ నేత‌లు తీసుకున్నార‌ని.. ఆరోపించిన టీడీపీ నాయ‌కులు ఇప్పుడు అదే బాట‌లో త‌మ లాభాలు తాము అందుకుంటున్నారు. పైగా.. ఎవ‌రికీ ఏమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తారు. ఎవ‌రూ ఏమీ గుర్తు ప‌ట్ట‌న‌ట్టే భావిస్తారు. కానీ, ఎక్క‌డో ఒక‌చోట మాత్రం వారు దొరికిపోతూనే ఉన్నారు. అనంత‌పురంలో కియా ప‌రిశ్ర‌మ‌ను గ‌తంలో వైసీపీ ఎంపీ ఒక‌రు బెదిరించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు సేమ్ టు సేమ్‌. కాక‌పోతే.. పార్టీ జెండా మారిందంతే. విశాఖ‌లో ఓ కీల‌క హోట‌ల్ ముందు.. గ‌తంలో వైసీపీ నాయ‌కుడి ఫొటోలు-ఆశీస్సులు ఉండేవి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్‌. కాక‌పోతే.. రంగు మారింది అంతే..!! కాకినాడ నుంచి తిరుప‌తి వ‌ర‌కు కూడా.. అనేక ప్రాజెక్టుల ప‌రిస్థితి ఇలానే ఉంది. కానీ.. ఈవిష‌యంలో ఎవ‌రూ ర‌చ్చ చేసుకోరు. ఎవ‌రూ రోడ్డున ప‌డ‌రు. అంతా.. స‌ర్వ‌స‌మాన‌త్వం పాటిస్తారు. ద‌టీజ్ పాలిటిక్స్‌..!!
👉 మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు ఇటీవల తనను కలిసిన కార్యకర్తలు రెడ్ బుక్ వేధింపులను జగన్ దృష్టికి తీసుకువెళితే అందుకు ప్రతిస్పందనగా కార్యకర్తలు ఎవరికి వారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలని జగన్ చెబుతున్నారని సమాచారం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని నిత్యం విమర్శిస్తున్న ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడు తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాయమని సలహా ఇస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న అధికారుల పేర్లు కార్యకర్తలే గుర్తుంచుకునేలా రెడ్ బుక్ రాసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా అధికారులపై చర్యలు తీసుకుంటామని అధినేత జగన్ అభయమిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తనను కలిసిన కార్యకర్తలు రెడ్ బుక్ వేధింపులను జగన్ దృష్టికి తీసుకువెళితే అందుకు ప్రతిస్పందనగా కార్యకర్తలు ఎవరికి వారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలని జగన్ చెబుతున్నారని సమాచారం.
*రెడ్ బుక్ అనగానే మంత్రి నారా లోకేశ్ టక్కున గుర్తుకు వస్తారు. ప్రతిపక్షంలో ఉండగా 2023లో యువగళం పాదయాత్ర చేసిన లోకేశ్ అప్పట్లో అధికార పార్టీ నేతలు, అధికారులు టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అటువంటి వారి పేర్లను ఎర్ర బుక్ లో రాస్తున్నానని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత తాను తీసుకుంటానని విస్తృతంగా ప్రచారం చేశారు. చెప్పినట్లే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్కులో పేర్లు ఉన్నాయని చెబుతున్న అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వెయిటింగులో పెట్టేశారు. పోలీసు అధికారులనైతే వీఆర్ కు పంపారు. అదేవిధంగా మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసులు నమోదు చేయడంతోపాటు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పటికే రెడ్ బుక్ లో రెండు చాప్టర్లు పూర్తి చేశామని, త్వరలో మూడో చాప్టర్ తెరుస్తానని మంత్రి హోదాలో లోకేశ్ స్వయంగా ప్రకటించారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు అప్పట్లో వైసీపీకి అనుకూలంగా పనిచేశారని ప్రచారంలో ఉన్న అధికారులు రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో నేతలు, కార్యకర్తలు రెడ్ బుక్ అమలుపై మాజీ సీఎం జగన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో కూడా జగన్ రెడ్ బుక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.
అధికారులు రెడ్ బుక్ పేరు చెబితేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది.దీంతో నేతలు, కార్యకర్తలు రెడ్ బుక్ అమలుపై మాజీ సీఎం జగన్ కు వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో కూడా జగన్ రెడ్ బుక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ రెడ్ బుక్ పేరుతో వేధిస్తుంటే తాము గుడ్ బుక్ రాస్తామని, మంచి చేసిన వారిని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఆ బుక్ ద్వారా గుర్తుంచుకుని అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని గతంలో జగన్ ప్రకటించారు. ఇక వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి గ్రీన్ బుక్ రాస్తానని చెప్పారు. ఇలా రెడ్ బుక్ స్థానంలో వైసీపీ రెండు పుస్తకాలు రాస్తామని చెప్పారు. ఆ రెండు పుస్తకాలు రాస్తున్నారో లేదో కానీ, ఇప్పుడు కార్యకర్తలే రెడ్ బుక్ రాసుకోవాలని చెప్పడం క్యాడర్ లో హుషారు తెప్పిస్తోందంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై వరుస కేసులు నమోదవుతున్న సమయంలో వారిన ఓదార్చేందుకు మాజీ సీఎం జగన్ రెడ్ బుక్ రాయాలని పురమాయిస్తున్నారా? లేక నిజంగా ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాస్తామని చెప్పడం ద్వారా క్షేత్రస్థాయి నుంచి అధికారులను అదుపులో పెట్టే ప్లాన్ చేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఏదిఏమైనా ఏపీలో రాజ్యాంగం బదులుగా అన్ని పార్టీలూ రెడ్ బుక్ అంటూ కొత్త పుస్తకాలు రాసుకోవడం విచిత్రంగా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.