బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు .. పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!..రంజాన్ వేడుకలలో ఎంపీ మాగుంట,ఎమ్మెల్యే కేపీ..విస్తృత పర్యటన లో ముత్తుముల..యశోద హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స

👉బీజేపీ నేతలపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ..రాజకీయంగా బతకడానికే బీజేపీ వాళ్లు రాముడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారు.దమ్ముంటే బీజేపీ లీడర్ చెప్పి రాజకీయం చేయాలని సవాల్ విసిరారు. బీజేపీ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చిగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మించకముందు నుండే అక్కడ హిందువులు పూజలు చేసుకోవడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. దేశంలో మత ఘర్షణలు సృష్టించడంలో బీజేపీ ఎక్స్‌ఫర్ట్ అని సెటైర్ వేశారు. గాంధీ ఫ్యామిలీ పవర్ పాలిటిక్స్ చేస్తే ఈపాటికి బీజేపీ ఏమయ్యేదోనని అన్నారు. అప్పటి ప్రధాని పీవీ తల్చుకుంటే ఎల్‌కే అద్వానీ రథయాత్ర చేసేవారా అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

👉పిఠాపురం నుంచి కే.పవన్ కల్యాణ్ పోటీ!..సింబల్ తెలిస్తే షాకే!…కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేనకు సరికొత్త చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి! ఇప్పటికే జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ను ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్ చేసిందనే వార్తలు అల్లకల్లొలంగా మారిన సంగతి తెలిసిందే!జనసేన అభ్యర్థులు పోటీ చేయని చోట్ల కూటమికి ఇది చాలా పెద్ద ఇబ్బంది అని చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే..తాజాగా జనసేనానికి మరో చిక్కొచ్చి పడేలా ఉందని తెలుస్తుంది!అవును..రానున్న ఎన్నికల్లో భీమవరం, గాజువాకల్లో కాకుండా పిఠాపురంలోనే తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.దీంతో… పవన్ కల్యాణ్ ఈసారి ఎలాగైనా గెలుస్తారని జనసైనికులు చెబుతున్నారు.మరోపక్క ఈసారి కూడా పవన్ ని ఓడించాలని అధికార పార్టీ కంకణం కట్టుకుందని అంటున్నారు.మరోపక్క… పవన్ ని వైసీపీ వాళ్లు కాదు.. టీడీపీ వాళ్లే ఓడిస్తారని,ఇదో రకం స్కెచ్ అని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.ఆ సంగతులు అలా ఉంటే…తాజాగా పిఠాపురంలో తన అభ్యర్థిని నిలబెట్టనుందంట నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ.ఈ పార్టీ పిఠాపురం అభ్యర్థి పేరు కే. పవన్ కల్యాణ్ కాగా..వారి ఎన్నికల గుర్తు బకెట్! దీంతో..ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. కే. పవన్ కల్యాణ్ అనే వ్యక్తి గాజు గ్లాసుని పోలిన బకెట్ గుర్తుపై పిఠాపురంలో పోటీ అనే అంశం ఇప్పుడు జనసైనికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు!కాగా…ఈ సమస్య కేవలం పిఠాపురానికే పరిమితం కాదని తెలుస్తుంది.రానున్న ఎన్నికల్లో బకెట్ సింబల్ ఉన్న తమను పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరించారని,ప్రలోభ పెట్టారని నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, ఎంపీ బాలశౌరిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు షేక్ జలీల్ తెలిపారు.ఇదే సమయంలో… మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తనను ఏకంగా తుపాకీతో బెదిరించాడని షేక్ జలీల్ ఆరోపించారు.గాజు గ్లాస్, బకెట్ గుర్తు చూడటానికి ఒకేలా ఉంటున్నాయనే ఉద్దేశంతో తమను పోటీ చేయవద్దని జనసేన నేతలు బెదిరింపులకు దిగుతున్నారని జలీల్ చెప్పారు.ఇదే క్రమంలో..ఐదు కోట్లు ఇస్తామని కూడా ఆశ చూపారన్న జలీల్..తాను అందుకు ఒప్పుకోలేదని చెప్పిన సంగతీ తెలిసిందే!

👉మార్కాపురం డిఎస్పీ ఆఫీస్ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గరుడ్ సునీల్….జిల్లాలోని పోలీస్ కార్యాలయం,స్టేషన్ల యొక్క స్థితిగతులు,సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో భాగంగా బుధవారం మార్కాపురం సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ నిర్వహించారు. ముందుగా సబ్ డివిజన్ చుట్టూ ఉన్న ఆవరణాన్ని మరియు పాత బిల్డింగ్ ను పరిశీలించారు.రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాలోని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, గ్రామలను సందర్శించి ప్రత్యేక దృష్టి సారించాలని,క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా చట్టపరమైన చర్యలుండాలని, నేర చరిత్ర కల్గిన వ్యక్తులు, ట్రబుల్ మాంగర్స్ పై ప్రత్యేక నిఘా కొనసాగించాలని, గ్రామాల్లోని ప్రజలతో మమేకమై ఎన్నికల ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పించాలని,ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. MCC పట్ల పూర్తి అవగాహన కల్గి ఉండాలని, ఎన్నికల నియమావళికి కట్టుబడి విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ బాల సుందరం, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు మరియు సిబ్బంది ఉన్నారు.

👉 ఉపాస్ మరియు యశోద హాస్పిటల్ ఆధ్వర్యంలో అత్యంత డిఫికల్ట్ అయిన గుండె బృహా దమని విచ్చేదనం అత్యంత అరుదైన కేసు ను శస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా ప్రాణదానం చేసినట్లు యశోద హాస్పిటల్ చీఫ్ కార్డియాక్ డాక్టర్ సత్య శ్రీధర్ కాలే . ఉపాస్ కార్డియాక్ డాక్టర్ శ్రీధర్ చివుకుల తెలిపారు.

👉ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రంజాన్ పండుగ సందర్బంగా కొనిజేడు ఈద్గా లో నమాజ్ లో పాల్గొని ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసినారు.కార్యక్రమం లో మస్తాన్ వలి,ఆరిఫ్,అయినాబత్తిన ఘనశ్యామ్,తాతా ప్రసాద్ మరియు పలువురు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

నేడు దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పమిడి రమేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,కార్యక్రమంలో ఆయనతోపాటు దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్ సాగర్,దివి రమేష్, కౌన్సిలర్ వి.సి.రెడ్డి మరియు పలువురు టిడిపి నాయకులు,జనసేన నాయకులు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

👉 నేడు దర్శి లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పమిడి రమేష్ జన్మదిన వేడుకల్లోపాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి,

కార్యక్రమంలో ఆయనతోపాటు దర్శి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ భర్త లలిత్ సాగర్,దివి రమేష్, కౌన్సిలర్ వి.సి.రెడ్డి మరియు పలువురు టి. డి. పి నాయకులు, జనసేన నాయకులు,బిజెపి నాయకులు పాల్గొన్నారు.

*రంజాన్ వేడుకల్లో గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు..కంభం,గిద్దలూరు

పట్టణాలలోని ఈద్‌గాహ్‌లో రంజాన్ సందర్భంగా గిద్దలూరు టౌన్ ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన రంజాన్‌ వేడుకల్లో గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి,వారితో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

👉ఇంటింటి ప్రచారంలో ముత్తుముల సోదరీ గీత..

గిద్దలూరులో అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే ప్రజల మద్య స్థానికంగా నివాసం ఉండే అశోక్ రెడ్డిని గెలిపించాలని,వారి సోదరీ గీత గారు ప్రజలను కోరారు. గురువారం బేస్తవారిపేట పట్టణంలోని గాంధీ బజారు,నెహ్రూ బజారు,జగన్నాయకుల వీధుల్లో ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.నాడు తెలుగుదేశం హయాంలో అశోక్ రెడ్డి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు.మే 13న జరిగే ఎన్నికల్లో స్థానికంగా నివాసం ఉండే గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డికి, మరియు ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గార్లకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

👉ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో భాగంగా గిద్దలూరు మండలం, తిమ్మాపురం వెల్లుపల్లె గ్రామాలలో  పర్యటించారు.ఈ సందర్భంగా ఆ గ్రామాల మహిళలు,ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!