మేమంతా సిద్ధం యాత్రలో చేరికలు..చంద్రబాబుపై ధ్వజమెత్తిన జగన్..ఉధృత ప్రచారంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి,ఎమ్మెల్యే అన్నా..మాగుంట సమక్షంలో చేరికలు..దొనకొండలో మాగుంట చందన ప్రచారం

👉తెలుగుదేశం,జనసేన, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీల నుంచి ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కీలక నేతలు..*

గుంటూరు జిల్లా నంబూరు వద్ద ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన డాక్టర్‌ కె శివకుమార్, కె నాగరాజు, కందుల రాజా, భరత్, సునీల్‌ రెడ్డి, మంగిరెడ్డి.వైయస్సార్సీపీలో చేరారు.వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించారు..కార్యక్రమంలో ప్రత్తిపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి బలసాని కిరణ్ కుమార్‌ తో పాటు వైకాపా నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.👉 అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు ఉన్న నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని,గత చంద్రబాబు పాలనను మీరు చూశారు 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు.ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీబిడ్డ అడుగులు వేశాడన్నారు.58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను.రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానన్నారు.చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు.చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు.2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి.ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామన్నారు.

👉ప్రకాశం జిల్లా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు కంట్రోల్ రూమ్…..

జిల్లాలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టరేట్ లో 9100121605 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు.ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 8న జిల్లాలోకి సాగర్ జలాలు విడుదలయ్యాయని తెలిపారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీరు వృధా కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేస్తే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

👉నా ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమే..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీఅన్నా రాంబాబును,ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని గెలిపించండి….రానున్న ఎన్నికల్లో ఆదరించి ఆశీర్వదించండని,తాను వేసే ప్రతి అడుగూ ప్రజా సేవ కోసమేనని మార్కాపురం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని మార్కాపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి,ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు.శనివారం మార్కాపురం టౌన్ లోని 4 వ బ్లాక్ లోని శివాలయం ఆర్చి,కోనేటి వీధి ప్రాంతాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచార కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా ప్రతి గడపకు వెళ్లి జగనన్న పాలనలో అందించిన మంచిని వివరించి కరపత్రాలను అందచేశారు.అనంతరం ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు………….

👉ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శనివారం కొండపి నియోజకవర్గం జరుగుమల్లి పొన్నలూరు టంగుటూరు శిoగరాయకొండ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి,ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్టీ జె ఆర్ సుధాకర్ బాబు రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కొండేపి వైసిపి అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరయ్యి కార్యకర్తల పరిచయ కార్యక్రమంలో ప్రసంగించారు.

👉గిద్దలూరు నియోజకవర్గం కంభంలో గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సమక్షంలో మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ నజీర్ బాషా కుమారులు సయ్యద్ రఫీ మరియు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. కార్యక్రమంలో కుప్పా రంగసాయి , తెలుగుదేశం,జనసేన, బిజెపి మండల అధ్యక్షులు మరియు పలువురు నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 దర్శి నియోజకవర్గం దొనకొండ లో “మాగుంట చారిటబుల్ ట్రస్ట్” మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన,ఈసందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు.కార్యక్రమంలో ఆత్మకూరి బ్రహ్మయ్య, చెరుకూరి ఆదిలక్ష్మి,శ్రీకోటయ్య మరియు పలువురు మహిళలు పాల్గొన్నారు.👉 దర్శి నియోజకవర్గంలో కురిచేడు రోడ్డులోని PST కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ,బిజెపి ఐ. టి ఉద్యోగస్తుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న దరిశి శాసనసభ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీ.కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి సతీమణి చందన,లలిత్ సాగర్,కౌన్సిలర్ వి సి రెడ్డి పలువురు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు,ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!