గాజు గ్లాసు:బీజేపీ ఆటలో భాగమేనా..సీఎం జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యలు..పవన్ పై పోతిన ఘాటు వ్యాఖ్యలు..ప్రకాశం జిల్లాలో హేమాహేమీల నామినేషన్లు.. వైకాపా టీడీపీలలో చేరికల పై చేరికలు .

👉జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం వైఎస్ జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. నర్సాపురంలో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్ధి శ్రీనివాస వర్మ కు మద్దతుగా చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను అన్నింటికీ తెగించిన వాడిని అన్నారు. జగన్ కి నేనేమిటో తెలియదు, నా తెగింపు అంతకంటే తెలియదు అని అన్నారు. జగన్ ఎంత అనుకుంటే అంతకు పదింతలు తాను తెగింపు చూపిస్తాను అన్నారు.

తనను పూర్తిగా తెగించిన వాడినని ఆయన అన్నారు. తాను జగన్ వంటి నియంతను ఎదిరించడానికే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ అన్నారు. తాను రాజకీయంగా రాటుదేలిన వాడిని అన్నారు ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో ఉంటాని ఊహించే తాను వచ్చాను అని అన్నారు.తాను రాజ్యాంగం సంపూర్ణంగా నమ్మాను అని అన్నారు.తాను రాజకీయంగా గట్టిపడ్డాను అని అన్నారు. తన పదేళ్ల పోరాటం తరువాత జనసేన బలంగా ఈ రోజు ఉనంది అన్నారు. తన మీద వైసీపీ నేతలు చేసే కామెంట్స్ మీద ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను బయటకు వస్తే తన సొంత సామాజిక వర్గం తో తనను తిట్టిస్తున్నారు అని ఆయన అన్నారు. మేమూ మేమూ కాపులను అని ఎవరైనా తనని తిట్టడానికి వచ్చినా లేక అలాంటి కుల సంబంధం కలిపినా వారి సంగతి తేల్చేందుకు తాను సిద్ధం అని పవన్ అన్నారు. తన గురించి జగన్ సభలలో ఎక్కువగా మాట్లాడుతున్నారని వాటిని ఇకనైనా ఆపేయడం బెటర్ అని పవన్ అన్నారు. తన దగ్గర ఎవరైనా చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదని పవన్ ఫైర్ అయ్యారు. జగన్ హైదరాబాద్ లోని శివశివానీ స్కూల్ లో టెన్త్ ఇంటర్ పరీక్షా పత్రాలు లీక్ చేస్తున్నపుడే తాను చేగువేరా గురించి చదువుతున్నానని ఆలాగే, నోవమ్ చోమ్ స్కీ వంటి పెద్దవాళ్ల గురించి చదువుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు. తన మీద విమర్శలు చేస్తే అనవసరంగా పడేవాడిని కాను అని ఆయన అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలు మెచ్చుకుంటే చిరంజీవి మీకు మంచిగా కనిపించారా ఇపుడు కూటమికి మద్దతుగా నిలిస్తే చెడ్డ అయిపోయరా అని నిలదీశారు.సింహం సింగిల్ అని పదే పదే అంటున్నారు కానీ తోడేళ్ళు, నక్కలు హైనాల సమూహం అంతా వైసీపీలోనే ఉంది అని పవన్ దెప్పిపొడిచారు. ఏపీకి వైసీపీ తీరని అన్యాయం చేయడమే కాదు, అవినీతి అక్రమాలకు పాల్పడుతోందని అందుకే ఈ ప్రభుత్వం ఉండకూడదని తాను కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడి కూటమి ఏర్పాటుకు కృషి చేసాను అని పవన్ అన్నారు. పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం జగన్ మీద

గాజు గ్లాసు : బీజేపీ ఆటలో భాగమేనా ?! ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కూటమికి ఆశనిపాతం అనే చెప్పాలి. లోక్ సభ, శాసనసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీకి, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి ఊహించని పరిణామం ఎదురయింది. ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్న 21 శాసనసభ, 2 లోక్ సభ స్థానాల్లో జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తామని, మిగిలిన 154 శాసనసభ, 23 లోక్ సభ స్థానాల్లో కోరుకున్న స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు కేటాయిస్తామని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది.! ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం కూటమికి ఆశనిపాతం అనే చెప్పాలి. పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో టీడీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు గాజు గ్లాసు, సైకిల్, కమలం పువ్వు గుర్తులను చూపిస్తూ ఓట్లేయాలని అభ్యర్థిస్తున్నారు. అటు లోక్ సభ, ఇటు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఏ ఈవీఎంలో ఓటర్లు ఏ గుర్తుకు ఓటు వేస్తారో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమీషన్ తాజా నిర్ణయం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందా అని భావిస్తున్నారు. కేంద్రంలో బీజేపీకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీ బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయి. ఇక్కడ ఎవరు అధికారంలోకి వచ్చినా మద్దతు తమకే ఉంటుందన్న ధీమా బీజేపీకి ఉంది. అందుకే రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగానే బీజేపీ అధిష్టానం వ్యవహరిస్తుందని, గాజుగ్లాసు కేటాయింపులో ఎన్నికల కమీషన్ నిర్ణయం అందులో భాగమేనని భావిస్తున్నారు. ఎన్నికల కమీషన్ తో పాటు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలన్నీ బీజేపీ కనుసన్నలలోనే పనిచేస్తున్నాయని, బీజేపీ నేతలను వదిలి విపక్ష నేతలపై దాడి చేస్తున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆయా శాఖల నిర్ణయాలు అదేవిధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమీషన్ నిర్ణయంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉందన్న వాదనకు బలం చేకూరుతుంది.

👉👉జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పై వైసీపీ నేత పోతిన మహేష్ గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పైగా పార్టీ పెట్టిన పదేళ్లలో ఆయన ఆస్తులు ఏ స్థాయిలో పేరిగాయో చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కూడా! ఈ సమయంలో తాజాగా మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అల్లూ అర్జున్, దిల్ రాజుల పేర్లు ప్రస్థావించడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి!… తనకు టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర నిరసన తెలిపిన పోతిన మహేష్.. ఇటీవల వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాన్ పై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా… “ప్రభాస్ గురించి, జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతారు.. మహేష్ బాబు, చరణ్ ల గురించి చెబుతారు.. కానీ, మీ కుటుంబలోని ఒక వ్యక్తి అయిన అల్లు అర్జున్ గురించి ఏనాడైనా నాలుగు మాటలు పొగిడారా పవన్ కల్యాణ్ గారూ” అంటూ మొదలుపెట్టారు మహేష్!ఈ సందర్భంగా.. “ఇండస్ట్రీలో తామే బ్రాండ్ బ్రాండ్ అంటారు కదా.. మరి ఏనాడైనా అల్లూ అర్జున్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పారా? అల్లూ అర్జున్ ఒక బ్రాండ్.. తెలుసుగా ఆ బ్రాండ్ పేరు.. “డబుల్ ఏ”! ఆయన తన దగ్గర గొడుగు పట్టుకున్న చాలా మందిని ప్రొడ్యూసర్లుగా చేశాడు.. డైరెక్టర్లుగా చేశాడు.. చాలా మందికి సొంత ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు.. బందువులకు, స్నేహితులకు, తనను నమ్ముకున్నవారికి సొంత ఇల్లు కొనిచ్చారు.. ఆయన ఒక బ్రాండ్” అని తెలిపారు

👉 ఒంగోలులో వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి. ఈ సారీ గెలిస్తే ఒంగోలులో మూడు ప్రాధాన్యతలు లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తానని హామీ. ఇటీవల ఇళ్ల పట్టాలి ఇచ్చిన పేదలందరికీ ఇల్లు కట్టిస్తానని, నగరంలో రోజు తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటానని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు తెచ్చి పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.


👉అట్టహాసంగా అన్నరాంబాబు నామినేషన్…*

ప్రకాశంజిల్లా మార్కాపురం నియోజకవర్గ వైసిపి అసెంబ్లి‌ అభ్యర్థిగా అన్న వెంకట రాంబాబు నామినేషన్ వేశారు._మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా వద్ద నామినేషన్ దాఖలు చేశారు._ఈసందర్భంగా నియోజకవర్గ నుంచి పార్టి శ్రేణులు,కార్యకర్తలు భారిగా తరలి వచ్చారు..అన్న రాంబాబు నామినేషన్ సందర్బంగా మార్కాపురం లో పండుగ వాతావరణం నెలకొంది.కార్యక్రమంలో మాజి ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ షంషేర్ అలీ బేగ్ తదితరులు పాల్గొన్నారు._

👉 నామినేషన్ ప్రక్రియలో భాగంగా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బందోబస్తు పర్యవేక్షిస్తున్న సీఐ .

ఆవుల వెంకటేశ్వర్లు..
👉 కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం, కనిగిరి ఆర్వో ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డా. ఉగ్ర నరసింహారెడ్డి, ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేసారు.
👉 నామినేషన్ దాఖలు చేసిన కందుల.
ఎన్డీఏ కూటమి మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి సోమవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.కార్యక్రమంలో జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ మండల టిడిపి అధ్యక్షులు డాక్టర్ ఎస్ కే మౌలాలి పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన 20 కుటుంబాలు*…గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో రాచర్ల మండలం, చోళ్ళవీడు పంచాయతీలోని అక్కపల్లె గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసీపీని వీడి టిడిపిలో చేరిన కొసనాల సుబ్బయ్య, పసుపులేటి కాశయ్య, కొత్తకోట నాగిశెట్టి,యరదేశీ దేవానంద్,కుప్పాల రంగస్వామి,కుప్పాల జయరామయ్య,కుప్పాల జయరమేష్ చందు,గుమ్మ పులిరాజు,పందరబోయిన రంగనాయకులు, కత్తెరగండ్ల రఘురామిరెడ్డి,గలిజేరుగుల్ల కృష్ణయ్య,గోళ్ళ దయానంద్, గోతం మౌళి, తాళ్ల లింగయ్య తదితరులు పాల్గోన్నారు.*

👉ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన రంగాపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు

గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షుడు బండ్లమూడి ఆంజనేయులు ఆధ్వర్యంలో రంగాపురం గ్రామానికి 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో అశోక్ రెడ్డి గెలుపు కృషి చేస్తామన్నారు.*కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన గంగుల పెద్ద కార్తీక్, గంగుల ఎల్లయ్య,కిల్లె పిచ్చయ్య,సోమానాయక్, దేశావత్ చిన్న కాశీనాయక్, గంగుల చిన్న కార్తీక్,గంగుల పెద్దిరాజు,గంగుల చిన్నరాజులు,గంగుల బాలచంద్రుడు గంగుల తిరుపతయ్య,గంగుల పిచ్చయ్య,గంగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు…👉ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన బెస్తవారిపేటకు చెందిన 20 కుటుంబాలు*..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బి. పేట పట్టణ అధ్యక్షుడు దూదేకుల సైదులు ఆధ్వర్యంలో బెస్తవారిపేటలోని 14వ వార్డుకు చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి టిడిపి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన దార్ల బాబు,గుళ్ళ నాగరాజు,నూలి వెంకటేశ్వర్లు,గుళ్ళ దేవదాసు,బండి రంగయ్య, నూలి రంగస్వామి, కొండలు, వరదరాజుతదితరులు పాల్గొన్నారు.

👉భవిష్యత్ పై భరోసాతోనే వైసీపీలోకి చేరికలు..

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో కంభం మండలం చిన్న కంభం పంచాయతీ పరిధిలోని దేవనగరం ఎస్సీ పాలెంకు చెందిన సుమారు 40 కుటుంబాలు టీడీపీని వీడి వైసీపీ తీర్థం*….కంభం మండలం చిన్న కంభం పంచాయతీ పరిధిలోని దేవనగరం ఎస్సీ పాలెంకు చెందిన సుమారు 40 కుటుంబాలు గిద్దలూరు వైసీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి సమక్షంలో టీడీపీని వీడి వైసీపీ తీర్థం పూచ్చుకున్నాయి*….పార్టీలో చేరిన వారికీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో కంభం మండల వైస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు..👉 గిద్దలూరు మండలం జయరాంపురం గ్రామం నుండి 60 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ సీపీ లోకి చేరడం జరిగింది.వారికి గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

👉ఆటోని కారు ఢీ .. ఏడు గురికి గాయాలు…ప్రకాశం జిల్లా బెస్తవారిపేట..అనంతపురం అమరావతి,జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం…

మోక్షగుండం టోల్గేట్ సమీపంలో ఎదురెదురుగా కారు ఆటో ఢీకొని ఏడుగురికి గాయాలు గాయపడిన వారిని స్థానికుల సమాచారంతో 108 వాహనంలో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. గాయపడిన వారందరూ మార్కాపురం విద్యానగర్ కి చెందినవారుగా సమాచారం. వీళ్ళందరూ గిద్దలూరు మండలం తంబళ్లపల్లి కి ఓ వివాహనికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!