సీఎం జగన్ పై సునీత ఘాటు వ్యాఖ్యలు.. జనసేన ప్రచారానికి మెగా ఫ్యామిలీ దూరం?.. మాగుంట విస్తృత ప్రచారం..అనుమతి లేకుండా క్లాస్లు నడుపుతున్న”శ్రీ చైతన్య..టిడిపిలో చేరిన రజాక్ భాష

👉సీఎం వైఎస్ జగన్ గురువారం కడపలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈసమయంలో పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతక ముందు స్థానికంగా జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో వివేకా హత్యోదంతాన్ని ప్రస్థావించారు.అవినాష్ తప్పుచేయలేదని తాను నమ్ముతున్నట్లు వెల్లడించారు! 👉వైఎస్సార్ శత్రువులతో జత కట్టిన కుటుంబ సభ్యులు ఆయనకు వారసులు ఎలా అవుతారంటూ ఫైర్ అయ్యారు.ఇదే సమయంలో…చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి,ఈ జిల్లా ప్రజలకు తెలుసని చెప్పిన జగన్… వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు? తెలీదా..వివేకాకు రెండో భార్య, సంతానం ఉన్నది నిజం కాదా? ఎవరు ఫోన్‌ చేస్తే..నాడు అవినాష్‌ అక్కడికి వెళ్లారు? అంటూ కీలక విషయాలు లేవనెత్తారు!👉వైఎస్‌ అవినాష్‌ ఏ తప్పు చేయలేదని..తాను అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్‌ ఇచ్చానని..అవినాష్‌ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు..అవినాష్‌ ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి అంటూ సూచించారు జగన్. దీంతో…ఈ వ్యాఖ్యలపై వివేకా కుమార్తె సునీత స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 

👉ఇవాళ జగన్‌ చేసిన వ్యాఖ్యల్లో వివేకాపై ఆయనకున్న ద్వేషం కనిపిస్తోందని మొదలుపెట్టిన ఆమె…ఏం పాపం చేశారని ఆయనపై మీకు ఇంత ద్వేషం?..మీకోసం త్యాగం చేసినందుకే ఆయనపై కోపమా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఇదే సమయంలో..జగన్‌ కు న్యాయవ్యవస్థ,సీబీఐపై నమ్మకం లేదని చెప్పిన సునీత…ఆయనకు ఏ వ్యవస్థపై నమ్మకం ఉందో చెప్పాలని కోరారు..👉అవినాష్‌ రెడ్డి చిన్న పిల్లోడని జగన్ చెబుతున్నారని చెప్పిన సునీత…ఎంపీ పదవులు పిల్లలకు ఇస్తారా? అని ప్రశ్నించారు.ఇదే క్రమంలో… సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లను జగన్‌ ప్రోత్సహిస్తున్నారని..సీబీఐ నిందితులు అని చెప్పిన వాళ్లకు ఓట్లు వేయవద్దని.. తప్పు చేసి ఉంటే తనకైనా, తనభర్తకైనా శిక్ష పడాల్సిందే అని ఆమె వెల్లడించారు…👉ఈ సందర్భంగా జగన్ నుదిటికి అయిన గాయంపై సునీత స్పందించారు…సీఎం జగన్‌ కు బ్యాండేజ్‌ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్‌ అవుతుందని.. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదని..జగన్‌ త్వరగా బ్యాండేజ్‌ తీయాలని ఒక డాక్టర్‌ గా సలహా ఇస్తున్నానని సునీత తెలిపారు.గాలి తగిలితేనే గాయం త్వరగా మానుతుందని చెప్పుకొచ్చారు.

👉 జనసేన ప్రచారానికి మెగా ఫ్యామిలీ దూరమా?

ఆంధ్ర లో ఎన్నికల వేళ రాజకీయాలు అత్యంత రసవత్తరంగా మారుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో ఎటు చూసినా రాజకీయ పార్టీల ప్రచార రధాలు,వాటిలో పాటలు,డప్పుల మోత,పార్టీల జెండాల రెపరెపలు..ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా రాజకీయాల గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్ల టాపిక్ తెరపైకి వచ్చింది. తదనుగుణంగా మెగా హీరోల ప్రస్థావనపై ఇప్పుడు చర్చ మొదలైంది! అవును…ఏపీలో ఎన్నికలు ఇప్పుడు అత్యంత పీక్స్ కి చేరుకుంటున్నాయి.ప్రధానంగా జనసేన,పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి ఈ ఎన్నికలు చాలా కీలకమని..ఇంకా గట్టిగా మాట్లాడితే… పవన్ పొలిటికల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేవని అంటున్నారు.పవన్ కల్యాణ్ కూడా అంతే సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిగానే ముందుకు కదులుతున్నారు.ఈ నేపథ్యంలో పవన్ తన అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా…ఇతర జనసేన నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాల్సిన నైతిక బాధ్యతను కలిగి ఉన్నారనేది తెలిసిన విషయమే! ఈ నేపథ్యంలో పిఠాపురంలో ఆయన తరుపున ప్రచారానికి మెగా ఫ్యామిలీ హీరోలు యాక్టివ్ గా, అవైలబుల్ గా ఉంటారని చాలామంది భావించారు కూడా. అయితే ఆ దృశ్యం ఎక్కడా కనిపించడం లేదు.మరోపక్క.. జబర్ధస్త్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాం ప్రసాద్, నటుడు ఫృథ్వీ రాజ్, జానీ మాస్టర్ లు మాత్రం ప్రచారం చేస్తున్నారు.ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వీరి ప్రచారం మాత్రమే సరిపోదని పలువురు అభిప్రాయపడుతున్నారు.మరోపక్క జనసేన కీలక నేత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ తో చాలామంది హీరోలే ఉన్నారు.రాం చారణ్ రాకపోయినా..ఇంకా చాలా మందే ఉన్న పరిస్థితి! మరి వారెందుకు రాలేదు. పిఠాపురంలో చిరంజీవి ప్రచారం ఉంటుందని ప్రచారం జరుగుతున్నా..అది ప్రస్తుతానికి కేవలం ప్రచారం మాత్రమే అని అంటున్నారు.ఈనేపథ్యంలో మిగిలిన హీరోలు రాకపోవడాన్నికి గల కారణాన్ని పలువురు భిన్నంగా విశ్లేషిస్తున్నారు.ఇందులో భాగంగా…వారి వారి సినిమా కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని రాజకీయాలకు కావాలనే దూరంగా ఉంచారని చెబుతున్నారు.మరి జానీ మాస్టర్,ఫృథ్వీ రాజ్,ఆది, గెటప్ శ్రీను,ఆటో రాంప్రసాద్ ల పరిస్థితి? అనే ప్రశ్న ఆటో మెటిక్ గా తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా…పిఠాపురంలో ఆశించిన స్థాయిలో మెగా హీరోల సందడయితే లేదని మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారని తెలుస్తుంది.ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయంట! మరోపక్క మెగా ఫ్యాన్స్ మద్దతుకు సంబంధించి ఆ సంఘ నాయకుడు స్వామి నాయుడు ఇప్పటికే పిలుపునిచ్చారు!!

👉జ‌న‌సేన‌ను కుదిపేస్తున్న ‘ఒక్క ఫొటో’.. ఏం జ‌రిగింది?ఇక‌, దీనికి నాగ‌బాబు.. ”నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో నేను కూడా ఒకడిని…జ‌న‌సేన‌ను కుదిపేస్తున్న ఒక్క “ఫోటో “ఏపీలో కూట‌మి క‌ట్టి..వైసీపీపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజాగా చిక్కుల్లో ప‌డ్డారు.ఆయ‌న మ‌ద్ద‌తు దారులు కూడా.. విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.దీనికి కార‌ణం..పార్టీ ప్ర‌ధాన

కార్య‌ద‌ర్శిగా ఉన్న నాగ‌బాబు..తాజాగా ఓ ఫొటోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు.దీనికి ఆయ‌న కొన్ని కామెంట్లు కూడా జోడించారు.ఇవి.. క‌ల‌కలం రేపుతున్నాయి.కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ జ‌న‌సేన‌పై చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు ఇవి బ‌లాన్నిచ్చేవిగా ఉండ‌డంతో నెటిజ‌న్లు కూడా..అదే రేంజ్‌లో ఫైర‌వుతున్నారు…👉ఏం జ‌రిగింది?…జ‌న‌సేన పార్టీలో నాగ‌బాబు కీల‌కంగా ఉన్న విష‌యం తెలిసిందే.ఈక్ర‌మంలో ఆయ‌న విశాఖ జిల్లా అన‌కాపల్లి పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేయాల‌ని అనుకున్నారు.దీనికి సంబంధించి ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ కూడా చేసుకున్నారు.మండ‌ల స్థాయిలో వారం రోజులు మ‌కాం వేసి మ‌రీ..త‌న గెలుపుపై అంచ‌నాలు స‌రిచూసుకున్నారు.అంతా బాగానే ఉంద‌ని..తాను ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్నాన‌ని నాగ‌బాబు సంకేతాలు ఇచ్చారు.కానీ,కూట‌మి ఎఫెక్ట్‌తో ఈ సీటు బీజేపీ ప‌ట్టుకుపోయింది.త‌ర్వాత‌..వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయాల‌నుకున్నా..కుద‌ర‌లేదు.ఈనేప‌థ్యంలో నాగ‌బాబుపైకి బాగానే క‌నిపించినా..లోలోన మాత్రం వైసీపీ చేసిన విమ‌ర్శ‌లు ఆయ‌న‌ను క‌ల‌చి వేసిన మాట వాస్త‌వం.అయిన‌ప్ప‌టికీ..ఇప్ప‌టి దాకా నాగ‌బాబు బ‌య‌ట‌ప‌డ‌లేదు.కానీ,తాజాగా ఆయ‌న జ‌నసేన కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపాల‌ని అనుకున్నారో.. లేక‌..టికెట్‌లు ద‌క్క‌ని నాయ‌కులను ప‌రోక్షంగా ఓదార్చాల‌ని అనుకున్నార‌నో..ప‌వ‌న్ తో ఉన్న ఫొటోను ఒక‌టి పోస్టు చేశారు.దీనిలో ప‌వ‌న్‌..నాగ‌బాబు కుడి భుజంపై త‌న కుడి చేతిని వేసి ఉంది.అంటే ఏదో ధైర్యం చెబుతున్న‌ట్టుగా అర్ధం చేసుకోవ‌చ్చు.ఇక‌,దీనికి నాగ‌బాబు.. ”నీ ఉద్దేశం ఏదైనా, నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో నేను కూడా ఒకడిని. ఎందుకంటే ఆ నిర్ణయం నా భుజం మీద నీ చేయిలాంటిది. అది బలాన్ని, భరోసాను ఇస్తుందే తప్ప బరువును, బాధను ఇవ్వదు” అని రాశారు. దీనిపై నెటిజ‌న్లు స‌హా.. అసంతృప్త జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.అస‌లు ప్ర‌శ్నించేందుకే పార్టీ పెట్టిన ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించ‌న‌ని చెబుతున్న నాగ‌బాబు..రేపు ప్ర‌జ‌ల కోసం ఏం ప్ర‌శ్నిస్తార‌న‌న్నది దాదాపు వంద‌మందికి పైగా అడిగిన ప్ర‌శ్న‌ల సారాంశం.ఇదే విష‌యాన్న కొన్నాళ్లుగా వైసీపీ కూడా చెబుతోంది.దీంతో తాజాగా చేసి ఫొటో పోస్టు.. పార్టీలో క‌ల‌క‌లం రేపుతోంది. దీనిపై ఎలాంటి వివ‌ర‌ణ ఇస్తారో చూడాలి.

👉మైనారిటీల అభివృద్ధి సంక్షేమం NDA కూటమి తోనే సాధ్యం అని మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు,ఒంగోలు లోని మాగుంట కార్యాలయంలో గతంలో తెలుగుదేశం పరిపాలనలో ముస్లింల సంక్షేమానికి చేపట్టిన కార్యక్రమాల పోస్టర్ ను శుక్రవారం రాత్రి ఆయన ఆవిష్కరించారు.

కార్యక్రమంలో అయినాబత్తిన ఘనశ్యామ్ తాతా ప్రసాద్,బెల్లం సత్యనారాయణ,కండే శ్రీనివాసులు జడ బాలనాగేంద్ర ,వలి,షేక్ నసీర్ మరియు పలువురు ముస్లిం సోదరులు,తెలుగుదేశం, జనసేన,బీజేపీ నాయకులు, అధ్యక్షులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.👉మాగుంట శ్రీనివాసులు రెడ్డి దామచర్ల సత్య ఆధ్వర్యంలో టిడిపి తీర్థం  పుచ్చుకున్న జాగర్లమూడి రామారావు..మర్రిపూడి మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన మాజీ సొసైటీ ప్రెసిడెంట్ ప్రకాశం జిల్లా మాజీ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు జాగర్లమూడి రామారావు ఎట్టకేలకు గురువారం మాగుంట కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఆయనతోపాటు జాగర్లమూడి సుబ్బారావును కూడా పార్టీలోకి ఆహ్వానించారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. కార్యక్రమంలో మాగుంట కార్యాలయం సిబ్బంది జిల్లాలోని సీనియర్ పార్టీ నాయకులు బెల్లం సత్యనారాయణ తదితరులు ఉన్నారు,

👉 రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విలేఖరికి అన్న ఆర్థిక సహాయం…ఈనెల 22వ తేదీన కంబాలపాడు గ్రామం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి తీవ్రంగా గాయాలైన పొదిలి మండలానికి చెందిన సాక్షి రూరల్ రిపోర్టర్ మోర శ్రీనివాసరెడ్డికి మార్కాపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ఆర్టిక సహాయం అందించారు.తలకు చేతులకు తీవ్ర గాయాలైన శ్రీనివాస్ రెడ్డి ఒంగోలను ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.పొదిలి పాత్రికేయ మిత్రుల ద్వారా సమాచారం తెలుసుకున్న అన్నా వెంకట రాంబాబు మానవతా దృక్పథంతో శ్రీనివాస రెడ్డికి వైద్యశాల ఖర్చుల నిమిత్తం 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా పొదిలి మీడియా ప్రతినిధులు మువ్వా వెంకటేశ్వర రెడ్డి,వడ్డే వేణు ఆలూరు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అన్నాకు కృతజ్ఞతలు తెలిపారు.

👉పర్మిషన్ లేకుండా ఇంటర్ క్లాస్ లు నడుపుతున్న “శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఐఐటీ గాయత్రి భవన్.. విజయవాడ నగరంలో పిల్లల జీవితాలతో ఆడుకుంటూన్న చెలరేగిపోతున్న జూనియర్ కళాశాలలు…👉వేసవి సెలవుల్లో కూడా పిల్లలను మార్క్ ల కోసం వేదింపుల కి గురి చేస్తున్నా కార్పొరేట్ జూనియర్ కళాశాలలు …👉పదవ తరగతి ఫలితాలు వచ్ఛి నాలుగు రోజులు కూడా కాలేదు ఇంకా పిల్లలను పీడిస్తున్న కళాశాల యాజమాన్యం…👉ఇంటర్ మొదటి సంవత్సరం క్లాస్ నడపటం యొక్క ఆంతర్యం ఏమిటి…పిల్లల జీవితం మొత్తం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఐఐటీ గాయత్రి యాజమాన్యం వ్యాపారం నడుస్తుంది…ఇంకా సిబియస్ సిలబస్ పదవ తరగతి ఫలితాలు విడుదల కాకముందే వారికి ఇంటర్ సిలబస్ క్లాస్ లు నడపడం ఇది వ్యాపారమే అంటూన్న పిల్లల తల్లిదండ్రులు…ప్రభుత్వ అధికారులు విద్యార్థులకు క్లాస్ లు నడపవద్దని హెచ్చరిక జారీ చేసిన పట్టించుకోకుండా యాజమాన్యం తరగతులు నిర్వహిస్తున్నారు…ఇప్పటికైనా “శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఐఐటీ గాయత్రి యాజమాన్యం”పై కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు…

👉 యరజర్ల గ్రామం లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదలు శశికళ, చెల్లలు సుధా , మేనకోడలు కీర్తి, ప్రణతి , ఒంగోలు శాసనసభ అభ్యర్థి దాంశల జనార్దన్ రావు సతీమణి, నాగసత్యలత, అక్క మాధవి, కుమార్తె అనిషా లక్ష్మీ, మరియు ఆత్మకూరి బ్రహ్మయ్య తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన,బీజేపీ మండల నాయకులు,అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 సింగరాయకొండ మండలం ఈద్గామిట్టలో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదలు మాగుంట సహన రెడ్డి, సోదరి సంధ్య, నాగరెడ్డి శ్రీహరిరెడ్డి మాజీ ఎంపీటీసీ మహబూబ్ బాషా, మండల తెలుగు యువత సానఊళ్ళ, మాజీ సర్పంచ్ సందని బాషా తదితర నాయకులు తెలుగుదేశం,జనసేన,బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 టీడీపీ లో చేరిన మైనారిటీ నాయకులు రజాక్ బాషా..  కంభం జామియా మసీదు కమిటీ కోశాధికారి ముస్లిం మైనార్టీ నాయకులు రజాక్ బాషా శుక్రవారం ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కంభం మాజీ సర్పంచ్ స్టార్ భాష సోదరుడి కుమారుడైన ఆయన మైనారిటీల అభివృద్ధి కోసం ఎంతగానో తోడ్పడుతుంటారు.మాజీ సర్పంచ్ స్టార్ భాష వైకాపాలో చేరారు.కార్యక్రమంలో ఆయనతోపాటు టిడిపి నాయకులు కేతం శ్రీనివాసులు,కాకర్ల ప్రసాద్ జీలాని పాల్గొన్నారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!