మోదీ పారిశ్రామికవేత్తలకు దేశ సంపద కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి..ఏపీకి మోడీ..ఎన్నో ఆటంకాలు..వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరికి బంపర్ ఆఫర్.. విస్తృత ప్రచారంలో మాగుంట,ఉగ్ర,ముత్తుముల,కుందూరు..

👉తాజాగా ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి పత్రికా విలేకరులతో ముచ్చటించారు.అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం…ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాల గురించి గట్టిగా మాట్లాడారు.రేవంత్ రెడ్డి తాజా పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…ప్రధాని మోడీ దేశ సంపదను గుజరాత్ లోని పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారు.పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు లోన్లు మాఫీ చేశారు.

రైతులకు రుణమాఫీ చేయలేదు,యువతకు లోన్లు ఇవ్వలేదు,విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వలేదు. వారు దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశ సంపదను దేశంలోని పేదలకు పంచడానికి కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇస్తున్నాం.దేశ సంపదను పెంచి,దేశంలోని ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ,మైనారిటీ మరియు మహిళలకు సమానంగా పంచుతామని,దేశంలోని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు.

👉ఏపీకి మోడీ…ఎన్నో ఆటంకాలు…! అది కాస్తా డేట్ మారి మే లోకి వెళ్ళింది. మే 3, 4 తేదీలు ఇదే కన్ ఫర్మ్ చేసుకోమన్నారు. తీరా చూస్తే ఇపుడు ఆ డేట్స్ మళ్లీ మారి 7, 8 తేదీలకు వెళ్ళింది.ఏపీకి మోడీ రావాలి.ప్రచారం చేయాలి. టీడీపీ కూటమికి జోష్ కలిగించాలని ఆవైపు అంతా అనుకుంటున్నారు. వైసీపీకి మోడీ మార్క్ పంచులు సెటైర్లు పడితే అంతా బ్యాలెన్స్ అవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారు.అయితే అంతకంతకు మోడీ ఏపీ టూర్ అలా వాయిదాల మీద వాయిదాలు పోతోంది. మొదట ఏప్రిల్ చివరి వారంలో మోడీ ఎన్నికల ప్రచారం ఏపీలో ఉంటుందన్నారు.అది కాస్తా డేట్ మారి మే లోకి వెళ్ళింది.మే 3, 4 తేదీలు ఇదే కన్ ఫర్మ్ చేసుకోమన్నారు. తీరా చూస్తే ఇపుడు ఆ డేట్స్ మళ్లీ మారి 7, 8 తేదీలకు వెళ్ళింది.అవి కూడా మారితే కనుక ఏపీలో మోడీ ఎన్నికల ప్రచారం ఉండే చాన్సే లేదు అంటున్నారు. ఎందుకంటే మే 11 తో ఎన్నికల ప్రచారానికి పెద్ద ఫుల్ స్టాప్ పడిపోతుంది.మరి మోడీ ఎందుకు ఏపీకి రావడం లేదు ఆయన పర్యటనకు ఎందుకు అవాంతరాలు వస్తున్నాయి అన్నది కూడా చర్చ సాగుతోంది.దేశమంతా తిరిగే మోడీకి ఏపీకి వచ్చే తీరిక లేదా అంటే అన్నీ ఉన్నాయి.మోడీ సార్ అనుకుంటే ఒకేరోజు నాలుగైదు రాష్ట్రాలలో కూడా తిరిగేయగలరు.అలా చాలా సార్లు చేశారు కూడా. కానీ ఏపీకి వచ్చేందుకు ఏమైనా మొహమాటాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. రాజకీయంగా చూస్తే ఉత్తర భారతం బీజేపీకి కొంత ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటోందని రెండు విడతలుగా జరిగిన పోలింగ్ శాతం సంకేతాలు ఇస్తోంది.దాంతో మిగిలిన విడతల సంగతి ఏమిటి అన్న కంగారు బీజేపీ పెద్దలలో మొదలైందని అంటున్నారు. ఇక చూస్తే బీజేపీ సొంతంగా 370,ఎన్డీయేకు నాలుగు వందలు అని బిగ్ నంబర్ తో భారీ టాస్క్ తో ఎన్నికల గోదాలోకి దిగింది. చూడబోతే ఎన్డీయేకు మెజారిటీకి ఇబ్బంది అవుతుందా అన్న చర్చ నడుస్తోంది.అదే జరిగితే నమ్మదగిన మిత్రులు ఎవరు ఎన్డీయే లోపలా బయటా అన్నది కూడా బీజేపీ పెద్దలను తీవ్రంగా ఆలోచింపచేస్తోంది అంటున్నారు. ఈ రకమైన తర్జన భర్జనల మధ్యనే మోడీ సహా బీజేపీ పెద్దలు ఏపీ వైపు చాలా జాగ్రత్తగా చూస్తున్నారు అని అంటున్నారు.ఏపీకి వెళ్ళి జగన్ మీద తీవ్రంగా విమర్శలు చేస్తే ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటులో సీట్లు తగ్గితే సంగతేంటి అన్నది కూడా ఆలోచనగా ఉంది అంటున్నారు.అందుకే తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మోడీకి ఇష్టం లేదు టీడీపీతో పొత్తు అని ఒక సంచలన కామెంట్ చేశారు.దాంట్లో ఎంతవరకూ నిజముందో తెలిదు కానీ కేంద్రంలో ఎవరికీ మెజారిటీ రాకపోతే ఏపీలో రాజకీయం మాత్రం ఆసక్తికరంగా మారడం తధ్యమని అంటున్నారు. అందుకే మోడీ వంటి వారు కూడా ఏపీ విషయంలో ఆచీ తూచీ వ్యవహరిస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి.

👉ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి మొన్నటి వరకు వైఎస్ వివేకా హత్య కేసు వ్యవహారంపై

కడప లో రాజకీయ విమర్శలు హీటెక్కేవి.అయితే కడప కోర్టు ఆదేశాలతో ఆ విషయంపై విమర్శలు ఆగినా.. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వ్యవహారం మాత్రం ఇంకా సంచలనంగానే ఉంది.అయితే ఇప్పుడు ఆయన జైభీం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి గా బరిలో దిగుతున్నారు.సి ఎం జగన్ పోటీ చేసిన స్థానం నుంచే బరిలో దిగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకొంది. ఐదేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో నిందితుడు..నేడు ఏకంగా పోలీస్ భద్రత నడుమ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడంతో ఇప్పుడు ఆయన గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తనను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నించిందని..తాను బరిలో నుంచి తప్పుకుంటే రూ.5 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేసిందని చెప్పుకొచ్చారు.👉పులివెందుల సభలో సీఎం జగన్ ఇష్టానుసారంగా మాట్లాడారని.. వివేకాను ఎవరు చంపారో. ఎందుకు చంపించారో జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు. 👉ప్రలోభాలు,బెదిరింపులను లెక్క చేయకుండా జగన్ ను ధీటుగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.నేను హత్య చేశాను.కానీ ధర్మం కోసం కట్టుబడ్డాను ఇది దస్తగిరి అనుసరిస్తున్న వ్యవహార శైలి.హత్య చేసింది డబ్బుల కోసం.కానీ వివేకా హత్య జరిగిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులను ఎర్ర గంగిరెడ్డి ఇవ్వలేదు.అప్పటి నుంచి ఆ డబ్బులను సంపాదించుకునేందుకు రాజకీయాలను వాడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.ఇది పక్కన పెడితే..ఇంతకీ దస్తగిరి కి వైసీపీ నాయకులు రూ.5 కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తారు. అసలు కడపలో జగన్ ను ఎదుర్కొని గెలిచే సత్తా దస్తగిరికి ఉందా.మొత్తానికి నా రేటు ఇది అని చెప్పకనే చెబుతున్నారా అనేది అర్థం కావడం లేదు..

👉 ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన ఒందుట్ల గ్రామానికి 30కుటుంబాలు..గిద్దలూరు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో బెస్తవారిపేట మండలం, ఒందుట్ల గ్రామానికి చెందిన 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు….👉సైకిల్ గుర్తు పై ఓటు వేయాలని కోరుతూ సంజీవరాయునిపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం*ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం సంజీవరాయని పేట గ్రామంలో శనివారం సాయంత్రం గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల, మరియు మాగుంట రాఘవ రెడ్డి  సతీమణి మాగుంట చందనారెడ్డి గ్రామంలో ఇంటింటికి తిరిగి టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న ముత్తుముల అశోక్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డికి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి మరియు జడ్పిటిసి సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.👉గిద్దలూరు పట్టణంలోని రాచర్ల గేటు బస్టాండ్ లో బస్సులోని ప్రయాణికులతో మాట్లాడి ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని,రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్న తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న మాగుంట శ్రీనివాస రెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్ధించిన గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి..👉 యర్రగొండపాలెం నియోజకవర్గం మల్లపాలెం లో శనివారం మాగుంట చారిటబుల్ ట్రస్ట్ మరియు సింగర్ కంపెనీ ఆధ్వర్యంలో మాగుంట అభిమానులు నడుపుతున్న ఉచిత కుట్టు మెషిన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించిన మాగుంట రాఘవ రెడ్డి గారి సతీమణి  చందన, ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న మహిళలతో కొద్ది సేపు ముచ్చటించారు.కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొన్నారు.👉 సింగరాయకొండ మండలం ఈద్గామిట్ట, పూల తోట, చంద్రబాబు నాయుడు నగర్, మాగుంట సుబ్బారామరెడ్డి కాలనీ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి  మరదలు మాగుంట సహన రెడ్డి, మేనకోడలు ప్రణతిరెడ్డి,రజిత రెడ్డి ,టీడీపీ జనరల్ సెక్రటరీ చీమకుర్తి కృష్ణా, టీడీపీ జనరల్ సెక్రటరీ సుదర్శి చంటి, SC సెల్ జనరల్ సెక్రటరీ రామా రావు,  శ్రీను,సుబ్రహ్మణ్యం తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 కనిగిరి లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో కనిగిరి శాసనసభ అభ్యర్థి డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి  సమక్షంలో కనిగిరి టౌన్, రూరల్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల సమీక్ష సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. కార్యక్రమం లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి  తనయలు మాగుంట నిఖిల్ రెడ్డి, కోలా ప్రభాకర్ మరియు పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు భారీసంఖ్య లో హాజరయ్యారు.

👉 ఒంగోలు లోని NTR పార్క్, చెన్నకేశవ స్వామి లేఔట్ లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి  మాగుంట శ్రీనివాసులు రెడ్డి సతీమణి గీతా లత,మరదలు మాగుంట సహన రెడ్డి,ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి దామచర్ల నాగ సత్య లత పాల్గొన్నారు.కార్యక్రమంలో తాతా ప్రసాద్ఆళ్ల శ్రీనివాస రెడ్డి,మేడికొండ మోహన్ ,మల్లికార్జున్ , రాంబాబు పాల్గొన్నారు.

👉 గిద్దలూరు నియోజకవర్గం గిద్దలూరు మండలం దంతారపల్లి లో 134, 135 వ వార్డ్ లో తెలుగు దేశం ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సతీమణి పుష్పలీల మరియు , జడ్పీటీసీ బుడత మధుసూదన్, సర్పంచ్ బుడత ఓబులమ్మ , మాజీ సర్పంచ్ ప్రసాద్ మరియు తెలుగుదేశం, జనసేన, బిజెపి మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు……….. 👉ముత్తుముల గెలుపు కోసం సోదరుడు ప్రచారం…కంభం పట్టణ స్థానిక జుమ్మా మసీద్ సెంటర్ చిన్న మసీద్ పరిసరాల్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులురెడ్డికి సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అశోక్ రెడ్డి తమ్ముడు జగన్నాథ్ రెడ్డి కోరారు.

👉పిటికాయగుళ్ళ గ్రామం వైసీపీలోకి చేరిన 50 కుటుంబాలు..  గిద్దలూరు నియోజకవర్గం,బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ళ గ్రామానికి చెందిన 50 కుటుంబాలు,బేస్తవారిపేట మండల “”టీడీపి”” మాజీ మండల పార్టీ అధ్యక్షుడు,పిటికాయగుళ్ళ మాజీ సర్పంచ్ నర్రా పెద్ద సింగర రెడ్డి ఆధ్వర్యంలో టీడీపి ని వీడి వైస్సార్సీపీ లోకి చేరారు.శనివారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి సోదరుడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు.ఈ సందర్భంగా వారందరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కేపి.కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కార్యక్రమంలో పిటికాయగుళ్ళ సర్పంచ్ నర్రా వెంకటరమణా రెడ్డి,బేస్తవారిపేట ఎంపీపీ ఓసురా రెడ్డి, జెడ్పీటీసీ బండ్లమూడి వెంకట రాజయ్య గారు,ఎంపీటీసీ మల్లెల శేఖర్ రెడ్డి,చెగిరెడ్డి కోటిరెడ్డి పాల్గొన్నారు..

👉గిద్దలూరు నగర పంచాయతీ 18వ వార్డు సొసైటీ కాలనిలో అంబవరం.శ్రీకాంత్ రెడ్డి,గోవింద్ యాదవ్,సూరేపల్లి.కన్న, కొత్తకోట.తిరుపాలు ఆద్వర్యంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ సీపీ లోకి చేరడం జరిగింది..వారికి గౌరవ ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డి బావ మరిది డాక్టర్ అశోక్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాగరంగా ఆహ్వానించారు.

👉తురిమెళ్లలో ఎన్నికల ప్రచారం..కంభం మండలం తురిమెళ్ల లో ఆదివారం గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి తమ్ముడు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కోమలత ఇంటింటికి తిరిగి వైసీపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు*…మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాగార్జున రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు….   ……👉ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో ఆదివారం ఉదయం గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి, సతీమణి కల్పన రెడ్డి, సోదరిలు పద్మ, అరుణ ఇంటింటికి తిరిగి వైసీపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.మే 13న జరిగే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న నాగార్జున రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!