కోవీషీల్డ్ గ్రహీతల వెన్నులో వణుకు!!!.. పతంజలి ఉత్పత్తుల పై బ్యాన్.. ప్రకాశం జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా..మాగుంట, ముత్తుముల,కుందూరుల సమక్షంలో చేరికలు..

👉పతంజలి అడ్వర్టైజ్ మెంట్ల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది…ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, పతంజలి సంస్థకు చెందిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశామని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈమేరకు దేశ అత్యున్నత కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు వెల్లడించింది. సదరు ఉత్పత్తుల తయారీపై బ్యాన్ విధిస్తూ దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కు ఈ నెల 15న ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వ లైసెన్సింగ్ అథారిటీ కోర్టుకు తెలిపింది. దీంతోపాటు బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, దివ్య ఫార్మసీ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ లపై హరిద్వార్ చీఫ్ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్ కు క్రిమినల్ కంప్లైంట్ చేసినట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.👉తయారీ బ్యాన్ విధించిన ఉత్పత్తులు ఇవే..దృష్టి ఐ డ్రాప్, స్వసరి గోల్డ్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్ ట్రా పవర్, లివమ్రిత్ అడ్వాన్స్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్.

👉కోవీషీల్డ్ గ్రహీతల వెన్నులో వణుకు… టెన్షన్ పుట్టించిన ఆస్ట్రాజెనికా!..

కోవిడ్ మహమ్మారి కలిగించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ప్రపంచం మొత్తం వాపోతున్న పరిస్థితి.. కోవిడ్ మహమ్మారి కలిగించిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయని ప్రపంచం మొత్తం వాపోతున్న పరిస్థితి! ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ అల్లకళ్లోలం చేసేసింది. అయితే…దానికి వ్యాక్సిన్ ని కనుగొనడంతో…ఉన్నంతలో డ్యామేజ్ కంట్రోల్ అయ్యింది. ఈ సమయంలో… భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేశారు. ఇందులో భాగంగా… కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. ఇదే క్రమంలో… అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వీటిని ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకు అందించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సుమారు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ తీసుకున్నారు.ఈ క్రమంలో తాజాగా కోవీషీల్డ్ నుంచి భయంకరమైన వాస్తవం ఒకటి అధికారికంగా బయటపడింది. అవును… తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆస్ట్రాజెనికా కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి ప్లేట్ లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది. దీంతో ఆ వ్యాక్సిన్ తీసుకున్న వారి వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు. అయితే ఈ సైడ్ ఎఫెక్టు విరివిగా కాకుండా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని తెలిపిన కంపెనీ…సరసరిన ఎంతమందిపై ఈ దుష్ప్రభావం చూపుతందనే లెక్కల్ని మాత్రం వెల్లడించలేదు. మరోపక్క కొవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్ కు చెందిన సుమారు 51 మంది కోర్టులో కేసులు వేశారు. వీరిలో మొదట కేసు వేసిన జెమీ స్కాట్… ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తనకు శాశ్వత మెదడు వాపు వ్యాధి వచ్చినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో స్పందించిన ఆస్ట్రాజెనికా సంస్థ… పై విధంగా స్పందించింది. తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని తెలిపింది. దీంతో..ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి వెన్నులో వణుకు పుడుతుందని అంటున్నారు!

👉ఆశీర్వదించి గెలిపించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది..ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే 👉 వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం..👉మార్కాపురంను జిల్లా కేంద్రంగా చేస్తాం..రైల్వే గేట్ సమస్యను పరిష్కారం చేస్తాం..టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాగుంట శ్రీనివాసరెడ్డి..గిద్దలూరు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం అర్ధవీడు, కంభం, బేస్తవారిపేట మండలాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం మంగళవారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో రాచర్ల, కొమరోలు,గిద్దలూరు మండలం మరియు గిద్దలూరు పట్టణ తెలుగుదేశం,బిజేపి,జనసేన నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని, అధికారంలోకి వచ్చిన వెంటనే పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి త్రాగునీరు సాగునీరు అందిస్తామని, పశ్చిమ ప్రకాశం అభివృద్ధి చెందాలంటే మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గతంలో తెలుగుదేశం ప్రజా సంఘాలు,వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పటికీని పశ్చిమ ప్రకాశం వాసుల గోడును జగన్ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. రేపు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మార్కాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించి నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా గిద్దలూరు పట్టణంలో ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే గేట్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు. సగిలేరు వాగు మరమ్మత్తులను కూడా చేపడతామన్నారు. గిద్దలూరు నియోజకవర్గంలో నాడు టీడీపీ హయాంలో అశోక్ రెడ్డి కృషితో జరిగిన అభివృద్ధి తప్ప,ఈ ఐదేళ్ల వైసిపి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లాలో మాగుంట కుటుంబానికి ప్రజలకు ఎంతో అన్యోన్య బంధం ఉందని, ప్రజలకు సేవ చేయడమే మాగుంట కుటుంబం యొక్క లక్ష్యం అన్నారు.మే 13న జరిగే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. తాము గెలిచిన మొదటి రోజు నుండే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు,గిద్దలూరు, రాచర్ల,కొమరోలు మండలాల అధ్యక్షులు, టీడీపీ,బిజెపి,జనసేన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉 యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు మండలం తెలుగు దేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోడలు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన రెడ్డి, యర్రగొండపాలెం శాసనసభ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు కుమార్తె డా.గూడూరి చెల్సియా, కుమారుడు గూడూరి అజిత్, మండల కన్వీనర్ పయ్యావోలు ప్రసాద్, రెంటపల్లి సుబ్బారెడ్డి, అనిల్, భాస్కర, కాకర్ల కోటయ్య, శనగ నారాయణరెడ్డి, లక్ష్మణ్, సర్పంచ్ ఓబులు, జనసేన నాయకులు ఆర్మీ బుజ్జి మరియు కార్యక్రమం లో తెలుగుదేశం,జనసేన,బిజెపి మండల నాయకులు, మహిళా కార్యకర్తలు,నాయకులు ,పాల్గొన్నారు.

👉 సింగరాయకొండ లో తెలుగుదేశం పార్టీ డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి మరదలు సహన రెడ్డి,చెల్లెలు సుధ, మేనకోడలు ప్రణతిరెడ్డి,రజిత రెడ్డి పాల్గొన్నారు కార్యక్రమం లో చిగురుపాటి శేషగిరి రావు, బసవయ్య ,సన్నేబోయిన మల్లికార్జున అంబటి శ్రీను, సన్నేబోయిన వెంకటేశ్వర్లు, చొప్పర శ్రీహరి, శ్రీనివాసులు,శివ కుమారి, నాగార్జున బాబు రావు, నాగేశ్వర రావు, కట్ట శ్రీనివాసులు,సుధీర్ బాబు, సుభాషిణి మరియు తదితర నాయకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు

👉 గిద్దలూరు నియోజకవర్గం లో గిద్దలూరు విట్టాసుబ్బ రత్నం కల్యాణ మండపం లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి,గిద్దలూరు శాసనసభ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి, జనసేన నియోజకవర్గం ఇంచార్జి బెల్లంకొండ సాయి బాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి కుప్పా రంగసాయి మరియు తదితర టీడీపీ,జనసేన,బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

👉కంభం టౌన్ కాపు నాయకులు నలబుల పెద్ద శేషారావు అనుచర వర్గం 20 కుటుంబాలు కేపి.కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరడం జరిగినది..

👉కంభం టౌన్ అర్బన్ కాలనీ యువకులు..అర్బన్ కాలనీకి చెందిన యువకులు 15 కుటుంబాలు టీడీపినీ వీడి గిద్దలూరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

👉మాగుంట ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన 50 మంది యువకులు..గిద్దలూరు పట్టణంలో ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 7వ వార్డుకు చెందిన 50 మంది యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

👉టిడిపికి మద్దతు తెలిపిన కంభం జనసేన .. జనసేన నాయకులు మంగళవారం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ముత్తుముల అశోక్ రెడ్డి లను మంగళవారం మర్యాదపూర్వకంగా కలసి తమ మద్దతును తెలియజేశారు. కంభం మండల జనసేన నాయకులు కాకర్ల నరేంద్ర ఆధ్వర్యంలో రాచర్ల మాజీ జెడ్పిటిసికుప్ప రంగసాయితోపాటు జనసేన నాయకులు అంగం శివకృష్ణ. జలపాటి మోహన్. కర్ణ శివ. తదితరులు పాల్గొన్నారు

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!