ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు..ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లుసీజ్..జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కర్నూలు క్రీడాకారులు..రేపు గిద్దలూరు రానున్న పవన్ కళ్యాణ్.. ఏర్పాట్లు పరిశీలించిన ముత్తుముల..గిద్దలూరు టిడిపిలో చేరికలు

👉 ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు! అవును…లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.దేశంలో సుమారు పాతిక సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం)ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.అయితే… ఎన్నికలు జరుగుతున్న ప్రతిసారీ..వాటి పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.అనేకసార్లు పరీక్షించిన తర్వాతే వాటిని ఉపయోగంలోకి తెచ్చినప్పటికీ సందేహాలు ముగియడంలేదు.ఈనేపథ్యంలో తాజాగా మమతా బెనర్జీ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు! అవును…లోక్‌ సభ ఎన్నికల తొలి రెండు దశల పోలింగ్‌ శాతంపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని తెలిపారు.పశ్చిమ బెంగాల్‌ లో మే 1న జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన సందర్భంగా మమత ఈ వ్యాఖ్యలు చేశారు.ఇందులో భాగంగా…తొలి రెండు దశల పోలింగ్‌ ముగిసినపుడు ఒక పోలింగ్ సంఖ్యను ప్రకటించిన అధికారులు..ఆ తర్వాత ముందు ప్రకటించిన సంఖ్యకంటే ఏకంగా 5.75 శాతం పోలింగ్‌ పెరిగిందని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ప్రకటించడమేంటని మమతా బెనర్జీ ప్రశ్నించారు.ఇదే సమయంలో…బెంగాల్‌ లో బీజేపీకి ప్రతికూలంగా ఉన్న చోట్లలోనే పోలింగ్‌ శాతం పెరిగిందని తెలిపారు.ఈ విధంగా పోలింగ్‌ శాతం ఒక్కసారిగా గణనీయంగా పెరగడంతో ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వస్తున్నాయని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇదే క్రమంలో…ఎన్నికల్లో గెలవడానికి భారతీయ జనతాపార్టీ ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు.దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాగా…భారత్ లో పలుసందర్భాల్లో ఈవీఎం లపై సందేహాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే… యూరప్‌,ఉత్తర అమెరికాలోని దేశాలు మాత్రం ఈవీఎంలకు దూరంగా ఉంటున్నాయి.👉ఇదే సమయంలో…ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, అమెరికా తదితర దేశాలు పారదర్శకత లోపించిందని చెబుతూ ఈవీఎంలను నిషేధించడం గమనార్హం.

👉 క్రీడలతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: కరస్పాండెంట్ పరమేష్..జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన క్రీడా కారులకు దుస్తులు పంపిణి..కర్నూల్..

యూత్ అండ్ స్పోర్ట్స్డె అండ్వ డెలప్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 4 నుండి 6 వ తేది వరకు గోవాలో జరుగనున్న జాతీయస్థాయి బాక్సింగ్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ చెట్టు ఎంపికైన విద్యార్థులకు వేదాన్సీ స్కూల్ కరస్పాండెంట్ పరమేష్ క్రీడా దుస్తులను విద్యార్థులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పథకాలతో రావాలని రాష్ట్రాన్ని పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ బూరెల కేశవ్ పాల్గొన్నారు

👉వైసీపీ షాకిచ్చిన వాలంటీర్లు..ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన తిమ్మాపురం గ్రామానికి చెందిన 5 మంది వాలంటీర్లు..గిద్దలూరు మండలంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన 5 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు.అనంతరం స్థానిక సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య ఆధ్వర్యంలో గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో చేరిన వాలంటీర్లు మర్రి మల్లికార్జున మీనిగే మనోహర్ గద్దల రంగస్వామి సప్పరపు వెంకటరమణ బాసికం వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

👉ముత్తుముల సమక్షంలో టిడిపిలో చేరిన మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్..గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీయే తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య ఆధ్వర్యంలో మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ కండవాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మే 13న జరిగే ఎన్నికల్లో అశోక్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామని స్థానికంగా ఉండే అశోక్ రెడ్డిని గెలిపించుకుంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు.కార్యక్రమంలో వైసిపిని వీడి టీడీపీలో చేరిన బలుస శ్రీనివాసులు,బలుసా రమణ,శ్రీనివాసులు చిలక రామయ్య,చిలక శ్రీనివాసులు,తదితరులు పాల్గొన్నారు.👉జనసేన అధినేత బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా హెలీప్యాడ్ ను పరిశీలించిన ముత్తుముల..గిద్దలూరు పట్టణంలో శుక్రవారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉండటంతో, ఒంగోలు రోడ్డులో HP పెట్రోల్ బంకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ఏర్పాట్లను గిద్దలూరు ఎన్డీయే కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాయుమార్గం ద్వారా గిద్దలూరు చేరుకొని అక్కడి నుండి జయరాం లాడ్జి వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని, రేపు జరిగే బహిరంగ సభలో నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల నుండి టీడీపీ, జనసేన,బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

👉ఇంటింటి ప్రచారంలో ముత్తుముల తనయుడు*బెస్తవారిపేట మండలం పందిళ్ళ పల్లె, పందిళ్ళపల్లె మోక్షగుండం sc కాలనీలు గ్రామంలో గిద్దలూరు ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి తనయుడు ముత్తుముల దివ్యేష్ రెడ్డి గురువారం సాయంత్రం ఇంటింటికి తిరిగి టీడీపీ, జనసేన,బీజేపీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో గిద్దలూరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముత్తుముల అశోక్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసరెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.👉టీడీపీలోకి చేరిన 18 కుటుంబాలు..ప్రకాశంజిల్లా.. గిద్దలూరు నియోజకవర్గం కంభం పట్టణంలోని అంకాలమ్మ తిప్ప మీద గల 18 యానాది కుటుంబాలు గురువారం తుపాకుల అంజి,కావేటి లక్ష్మణ్ ఆధ్వర్యంలో మండల టీడీపీ అధ్యక్షులు తోట శ్రీను సమక్షంలో టీడీపీలోకి చేరారు.

👉ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్‌ చేసిన పోలీసులు..తూర్పు గోదావరి జిల్లా..జిల్లాలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు.

గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు.ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు గుర్తించారు.దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సర్కిల్‌ సీఐ బాల సురేష్‌ బాబు తెలిపారు…

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!