మోదీ ఆర్ఆర్ టాక్స్ కు ప్రియాంక “ఏ ఏ”టాక్స్ కౌంటర్..బాబు ఐదేళ్ల పాల‌న‌లో ప‌న్నుల భారం త‌క్కువే..ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను..మంచిని గెలిపించండి. వైకాపా అభ్యర్థి అన్నా.. ప్రచార చివరిభాగంలో మాగుంట,కుందూరు కుటుంబాలు .

👉 ఆర్ ఆర్’ ట్యాక్స్ కు ‘ఎఎ’ట్యాక్స్ కౌంటర్..

👉దేశం మీద ఎఎ ట్యాక్స్ విధించినట్లుగా ప్రియాంక ఫైర్ అయ్యారు. దేశ ప్రజల మీద మోడీ ఎఎ (అదానీ – అంబానీ) ట్యాక్స్ విధించారన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ ప్రత్యర్థులు చేపట్టిన ప్రచారానికి కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా కళ్లు తెరిచింది. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం మొదలు స్థానిక నాయకుల వరకు ఆర్ఆర్ ట్యాక్స్ అంటూ రాహుల్.. రేవంత్ పై విరుచుకుపడటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిందన్న ప్రచారానికి తెర తీశారు. ఆర్ఆర్ ట్యాక్స్ రాగాన్ని విపక్ష బీఆర్ఎస్ సైతం అందుకుంది. అయితే..దీనికి అంతే తీవ్రంగా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న మాట బలంగా వినిపించింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ కు జరిగే నష్టానికి ఆర్ఆర్ ట్యాక్స్ ప్రచారం కారణమన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్.. ప్రచారానికి మిగిలి ఉన్న చివరి రోజున దిద్దుబాటు చర్యలకు తెర తీయటం గమనార్హం.ఆర్ఆర్ ట్యాక్స్ కు కౌంటర్ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కీలక నేత అయిన ప్రియాంక తీసుకున్నారు. ప్రచారానికి ఉన్న ఆఖరి రోజున హాజరైన కార్యక్రమంలో తన కౌంటర్ ను వినిపించారు.👉దేశానికి నియంతలా వ్యవహరించే.. అబద్ధాలు చెప్పే మోడీ కావాలో.. బలమైన ప్రజాస్వామ్యం..రాజ్యాంగం.. రిజర్వేషన్ల కోసం పోరాడే రాహుల్ కావాలో ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మోడీ మీద విరుచుకుపడ్డారు. దేశం మీద ఎఎ ట్యాక్స్ విధించినట్లుగా ప్రియాంక ఫైర్ అయ్యారు. దేశ ప్రజల మీద మోడీ ఎఎ (అదానీ – అంబానీ) ట్యాక్స్ విధించారన్నారు. పేదల ధనాన్ని బిలియనీర్లకు దోచిపెట్టినట్లుగా మండిపడిన ఆమె..దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిందన్నారు. “70 కోట్ల మంది నిరుద్యోగులుగా ఉన్నా 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రైతుల రుణాలు మాఫీ చేయలేదు. నోట్ల రద్దు.. జీఎస్టీ అమలు.. ధరల పెరుగుదల.. నిరుద్యోగం..విద్వేషాన్ని పేదలకు బహుమతిగా ఇచ్చారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రాణాలైనాఇస్తారు కానీ రాజ్యాంగాన్ని మార్చనీయబోరు. రాజ్యాంగాన్ని మోడీ రాయలేదు.దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు” అంటూ మోడీపై మండిపడ్డారు….

👉 ఆ వ్యాఖ్యలతో  నవ్వుల పాలవుతున్న మోడీ..ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వెళ్లినా.. అక్కడ కుటుంబ పాలన, అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు అంశాలతోనే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లి ప్రత్యర్థులను ఇరుకున పెడుతుంటారు. 2014లో మోదీ అధికారంలోకి రావడానికి దోహదం చేసిన అంశాలు కూడా ఇవే. నాటి యూపీఏ ప్రభుత్వం 2 జీ స్పెక్ట్రం, బొగ్గు కుంభకోనం, ఒలంపిక్స్ ఇలా పలు రకాల ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చారు.👉నల్లధనం వెనక్కి తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తా అని ప్రకటించడంతో ప్రజలంతా నమ్మి ఓటేశారు. ఆ నల్లధనం రాలేదు. అవినీతి ఆరోపణలు కేసులు ముందుకు సాగలేదు. అయినా ఇప్పటికే ఇవే అంశాలు పట్టుకొని మోదీ రాజకీయం చేస్తారు. అయితే రాష్ట్రాలు, తన మిత్రుల బట్టి ప్రాధాన్య అంశాలు మారుతూ ఉంటాయి.👉వారసత్వ పాలన గురించి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో మోదీ మాట్లాడారు. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతోనే బీజేపీ పొత్తు పెట్టుకుంది కాబట్టి. ఇదే సమయంలో అవినీతి కేసుల గురించి కూడా తమతో ఉంటే ఒకలా లేకుంటే మరోలా విమర్శిస్తుంటారు. 2019కి ముందు పోలవరం చంద్రబాబుకి ఏటీఎంలా మారిందని..అలాగే లోకేశ్ ని సీఎం చేసేందుకు తపిస్తున్నారు అంటూ విమర్శించారు. ఇప్పుడు ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేడీఎస్ అవినీతి పార్టీ, కుటుంబ పార్టీ అని విమర్శించిన మోదీ..ఇప్పుడు వారిని తమతో కలుపుకొన్నారు. మహారాష్ట్రలో అజిత్ పవార్ రూ.70వేల కోట్ల కుంభకోణం చేశారని ఆరోపించారు.ఇప్పుడు ఎన్డీయేలో చేరగానే ఆయనకు క్లీన్ చిట్ లభించింది. అశోక్ చవాన్ పరిస్థితి కూడా అంతే. నితీశ్ కుమార్ బీజేపీతో ఉంటే అపర దేశ భక్తుడు.లేకపోతే నితీశ్ గెలిస్తే పాకిస్థాన్లో సంబురాలు చేసుకుంటారు అని మాట్లాడుతుంటారు. ఇంకా సువేందు అధికారి, జ్యోతి రాధిస్య సింధియా ఇలా చాలా మంది తమ పార్టీలోకి వస్తే అవినీతి పరులు కాదు. లేకపోతే దేశద్రోహులు. వారసత్వ రాజకీయ నాయకులు. ఈ ఘటనలు చూసి నరేంద్ర మోదీ అవినీతిపై ఆరోపణలు చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు.

👉బాబు vs జగన్.. బాబు ఐదేళ్ల పాల‌న‌లో ప‌న్నుల భారం త‌క్కువే..సంక్షేమంతో ప‌న్నులు పెంచిన జ‌గ‌న్ స‌ర్కార్‌..నిధుల కొర‌త‌తో ప‌న్నుల బాదుడు బాదేసిన జ‌గ‌న్‌..ఆంధ్ర మిర్రర్..ప్ర‌భుత్వాలు న‌డ‌వాలంటే డ‌బ్బులు కావాలి. ఇది ఎక్క‌డి నుంచి వ‌స్తుంది? నిజానికి ప్ర‌భుత్వాలు.. మ‌నీ మేకింగ్ యూనిట్లు కావు.అంటే.. ప్ర‌భుత్వాలు డ‌బ్బులు సృష్టించ‌లేవు.ప్ర‌జ‌లుక‌ట్టే ప‌న్నుల‌పైనే ఆధార ప‌డి మ‌నుగ‌డ సాగిస్తాయి. వీటి నుంచే ఉద్యోగుల‌కు జీతాలు ఇస్తాయి. వీటి నుంచే సంక్షేమానికి ఖ‌ర్చు పెడ‌తాయి. ఇత‌ర ఖ‌ర్చులు కూడా.. ప‌న్నులు, ఇత‌ర చార్జీల నుంచి వ‌సూలు చేసే సొమ్ముతోనే సాగిస్తా యి. ఇది కేంద్రానికైనా.. రాష్ట్రానికైనా ఒక్క‌టే థియ‌రీ.

అయితే.. ఏపీలో చంద్ర‌బాబు 2014-19 మ‌ధ్య ప‌న్నులు పెద్ద‌గా పెంచింది లేద‌ని అంటారు.కానీ,వాస్త‌వం ఏంటంటే..ఇత‌ర చార్జీల‌ను పెంచ‌క‌పోయినా..ఆస్తిప‌న్నులు మాత్రం మూడు రెట్లు పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు రూ.100 ఉండే గుడిసెల ప‌న్ను.. రూ.500ల‌కు చేరింది. నీట కుళాయిల ప‌న్నులు కూడా ఇదే త‌ర‌హాలో పెంచారు. అయితే.. కీల‌క‌మైన విద్యుత్ చార్జీల జోలికి మాత్రం చంద్ర‌బాబు వెళ్ల‌క‌పోవ‌డం గొప్ప విష‌యంగానే చెప్పాలి. ఇదే స‌మ‌యంలో కేంద్రం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వ‌చ్చినా.. ఆయ‌న చెత్త‌ప‌న్ను జోలికి పోకుండా.. మేనేజ్ చేసుకున్నారు.అంతేకాదు.. ఆర్టీసీ బ‌స్సు చార్జీల‌ను కూడా పెంచ‌లేదు. అయితే.. పెట్రోల్‌పై మాత్రం రోడ్ సెస్సు రూపంలో రూ.1 ప‌న్ను తెచ్చింది మాత్రం టీడీపీ స‌ర్కారే. ఫ‌లితంగా ప‌న్నుల భారం లేని ప్ర‌భుత్వంగా అంతో ఇంతో చంద్ర‌బాబుకు పేరుంది. ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. సంక్షేమానికి 80 శాతం పీట వేయ‌డం..ఇచ్చే ప‌థ‌కాలు కూడా.. రూ. వేల‌ల్లో ఉండ‌డంతో ఆయ‌న‌కు నిధుల కొర‌త పెరిగిపోయింది. ఇదే స‌మ‌యంలో ఉద్యోగుల జీతాలు ఒక‌సారి పెంచ‌డంతోనూ..ఆయ‌న ఇబ్బందులు ప‌డ్డారు.దీంతో ప‌న్నులు పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని వైసీపీ స‌మ‌ర్థించుకుంటుంది. పెట్రోలు, డీజిల్‌పై ప‌న్నులు పెంచిన మాట వాస్త‌వం. ఇక‌, విద్యుత్ విష‌యంలో ఏకంగా ఆరు సార్లు పెంచారు. అయితే.. ఇవ‌న్నీ..చంద్ర‌బాబు హ‌యాంలో పెంచాల్సిన‌వ‌ని.. ఆయ‌న పెంచ‌కుండా ఉన్నందునే తాము పెంచాల్సి వ‌చ్చింద‌ని వైసీపీ స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఇక‌, చెత్త‌ప‌న్నును వేయ‌డం ద్వారా.. వైసీపీ మ‌రో దూకుడు చ‌ర్య ఉంద‌ని!!

👉 కొండపి నియోజకవర్గం పొన్నలూరు లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి,కొండపి శాసనసభ అభ్యర్థి డా.డోల బాల వీరాంజనేయ స్వామి మరియు పలువురు టీడీపీ జనసేన,బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు.

👉ఒంగోలు పట్టణం లో గాంధీ రోడ్డు లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్డు షో లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు,ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, ప్రకాశం జిల్లా బీజేపీ ఇంచార్జి యోగయ్య యాదవ్,మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు నిఖిల్ రెడ్డి,అయినాబత్తిన ఘనశ్యామ్,తాతా ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి మరియు పలువురు టీడీపీ,జనసేన,బీజేపీ డివిజన్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

👉మంచిని గెలిపించక పోతే మేము మా కుటుంబం ఏమై పోవాలి*సంచలన వ్యాఖ్యలు చేసిన మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు*

మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు చివరి ప్రసంగంలో విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా..*ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేస్తున్న..ఎలాంటి అవినీతికి పాల్పడను*అవతలి వ్యకి గెలిపించకపోతే చనిపోతాను అంటున్నాడు.పదవి మీద కాంక్ష ఎందుకు..మార్కాపురంకు మెడికల్ కాలేజి ఇచ్చింది మన జగన్నన్నే*అన్నా రాంబాబు 2024 వ సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా చివరి ప్రసంగం*..మంచిని గెలిపించండి…మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అన్నా రాంబాబు అన్నారు.శనివారం సాయంత్రం మార్కాపురం పట్టణంలోని జగదీశ్వరి ధియేటర్ ఏరియాలో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో చివరి ప్రసంగంలో మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా మాట్లాడుతూ మంచిని గెలిపించక పోతే మేము మా కుటుంబం ఏమై పోవాలన్నారు. గత 15 సంవత్సరాల నుండి ఆస్తుల అమ్ముకొని రాజకీయం చేస్తున్నానన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడనన్నారు. అవతలి వ్యకి గెలిపించకపోతే చనిపోతాను అంటున్నాడు. పదవి మీద కాంక్ష ఎందుకన్నారు.ఎవ్వరి ఆస్తులు కబ్జా చేయడానికి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ఈ ఎన్నికలు దౌర్జనానికి, కబ్జాదారులకు,భూ ఆక్రమణదారులకు మంచికి నిలబడే వ్యక్తికి జరుగుతున్న ఎన్నికలన్నారు. హిందూవులు ఒక అయ్యప్పస్వామి దీక్ష ఏ విధంగా చేస్తారో… ముస్లింలు పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్షలు ఎలా చేస్తారో… క్రిష్టియన్స్ గుడ్ ఫ్రైడే, క్రిస్మస్,ఈస్టర్ పర్వదినాలను ఎంత పవిత్రంగా దీక్షలు ఎలా చేస్తారో అలాగే నేను కూడా గత 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో కఠోర దీక్షలతో, ఒక నిబద్దతతో రాజకీయాలు చేశానన్నారు. ఆస్తులు కొల్లగొట్టే వాళ్ళు కావాలా…మీ ఆస్తులు పరిరక్షించే నాయకుడు కావాలా..మీరే నిర్ణయం తీసుకోవాలన్నారు. రౌడీయిజం చేసే నాయకులు కావాలా… ప్రశాంతంగా ఉండే మార్కాపురం కావాలా.. ప్రజలు ఆలోచించి ముందుకు వెళ్లాలన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మార్కాపురం పార్లమెంట్ గా ఏర్పడుతుందన్నారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పార్లమెంట్ ను జిల్లా గా మార్పులు చేస్తారన్నారు. అప్పుడు మన మార్కాపురం నూతన జిల్లాగా ఏర్పడుతుందన్నారు. గతంలో 2000 సంవత్సరంలో ఏలాంటి రాజకీయాల్లో లేని రోజు మా తల్లిదండ్రుల పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి ఫ్రీ అంబులెన్స్ లు,చదువు ఉండి ఆర్ధిక పరిపుష్టి లేని పిల్లలకు చదువుకు సాయం చేయడం.మార్కాపురం నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో కొన్ని లక్షలు వెచ్చించి నీటి ట్యాంకర్ లు ఏర్పాటు చేశానన్నారు.మరచిపోకండి మార్కాపురం నియోజకవర్గ ప్రజలరా…గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే పదవిని అడ్డం పెట్టుకొని ఒక్క రూపాయ కూడా అవినీతి చేయలేదు… రాబోయే రోజుల్లో కూడా చేయబోనన్నారు.. ఎమ్మెల్యే పదవి వల్ల నేను పొందింది ఒక్క తిరుమల దర్శనం తప్ప ఎలాంటి లాభపేక్ష లేదని గర్వంగా చెబుతున్నానన్నారు. ఆస్తుల అమ్ముకొని రాజకీయం చేస్తున్నాను ఎలాంటి అవినీతి కి పాల్పడను అన్నారు.. వెలుగొండ ప్రాజెక్ట్ ప్రారంభించింది,పూర్తి చేసి జాతికి అంకితం చేసింది వైఎస్సార్ కుటుంబమే అన్నారు.మార్కాపురంకు మెడికల్ కాలేజి ఇచ్చింది మన జగనన్న మాత్రమే అన్నారు.కావున మార్కాపురం నియోజకవర్గ ప్రజలు అలోచించి నిర్ణయం తీసుకొని మంచికి పట్టం కట్టి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

👉ఫ్యాను గుర్తుపై ఓటు వేసి,కుందురు,చెవిరెడ్డిలను గెలిపించండి..నియోజకవర్గ అభివృద్ధి చెయ్యడమే కుందురు నాగార్జున రెడ్డి లక్ష్యం…బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కోమలతా రెడ్డి..గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జున రెడ్డి గెలుపే లక్ష్యంగా వారి తమ్ముడు కుందురు కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి కుందురు కోమలతా రెడ్డి శనివారం ఉదయం బేస్తవారిపేట మండలం పందిళ్ళ పల్లి గ్రామంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ పథకాల అంశాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు.ఎల్లప్పుడు గిద్దలూరు ప్రజల సంక్షేమం,కార్యకర్తల బాగోగులు చూసే తత్వం,నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా నాగార్జున రెడ్డి పనిచేస్తరన్నారు*…నియోజకవర్గ అభివృద్ధి కోసం తపన పడే నాగార్జున రెడ్డి గారికి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మద్దతుగా నిలవాలన్నారు*….రేపు జరిగే ఎన్నికల్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న కుందురు నాగార్జునరెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు*…

7k network
Recent Posts

అగ్ర కులాలకు నిమ్న కులాల వారు కనిపించరు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు..ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులను నేరుగా కాలేజీలకే.. ప్రతి మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల-మంత్రి నారా లోకేష్.. మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కళాశాల పనులు నిలిపివేశారా.. వైసిపి కో-ఆర్డినేటర్ “కారుమూరి”నిసత్కరించిన “అన్నా”.. పొలంబడి ( కంభం)సీఎం, డిప్యూటీ సీఎం లపై అవినీతి ఆరోపణలు చేసిన వ్యక్తి అరెస్ట్

వైసీపీ ప్రభుత్వానికి, మీకు ఏంటి తేడా?:.కూటమి ప్రభుత్వంపై షర్మిల ఫైర్..త్వరలో సోషల్ మీడియా పోలీస్ స్టేషన్ లు హోం మినిస్టర్ అనిత..మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది…మంత్రి ఫరూక్..వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ను వెంటనే సీజ్ చేయాలి..బాపట్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా అధికారులంతా కృషి చేయాలి..జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమిం అన్సరియా.. పేకాట శిబిరం పై దాడి (కంభం)

బోర్డర్ ఎంట్రీ పేరుతో దోచుకున్నదనం ఎక్కడికి పోయింది..వక్ఫ్ చట్ట సవరణపై లేఖ రాసిన ప్రతిపక్ష ఎంపిలు.. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ నిర్లక్ష్యంతో రోగి మృతి?..ఎల్ఐసి ఏజెంట్ల నిరసన..అగ్రికల్చర్ డిప్లమో జిల్లా వి ఏ ఏల సంఘం అధ్యక్షునిగా బత్తుల వెంకటసుబ్బయ్య..పోలీసుల అదుపులో వైకాపా మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డి..క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..హోం మంత్రి అనితకు అనంతపురం నగరంలో ఘన స్వాగతం..తీవ్ర మానసిక వేదన కలుగుతోంది: విజయమ్మ..

జమిలి’ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి ‘టివికె’ పార్టీ డిమాండ్‌..సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ కూడా దొరికిపోయాడు ..ఇలా చేస్తే నేనే హోంమంత్రిని అవుతా: డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్..కష్టాల్లో ఉన్నవారి కన్నీరు తుడుస్తున్న మంత్రి నారా లోకేష్..విద్యుత్ షాక్ ఘటనపై సీఎం విచారం.. ప్రకాశం జిల్లా సమీక్షా మండలి (DRC) సమావేశం..కార్మికులను విధులకు తీసుకునే వరకు పోరాటం ఆగదు..ప్రకాశం జిల్లా మార్కాపురం..

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్..చంద్రబాబు పొగిడితే జగన్‌కు ఆస్కార్ అవార్డే ?..వక్ఫ్ సవరణ బిల్లును వైసీపి వ్యతిరేకిస్తోంది-విజయసాయిరెడ్డి..అనంత” రిజిస్ట్రేషన్ శాఖలో అడ్డగోలు వ్యవహారాలు!…భూపాలపల్లిలో డాక్టర్ల నిర్లక్ష్యం.. శిశువు మృతి..మదనపల్లెలో ప్రైవేట్ బస్సుల దందా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల..

ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. గంజాయి మత్తులో 8వ తరగతి బాలికపై ఐదుగురు అత్యాచారం..నిందితుల్లో ముగ్గురు మైనర్లు.. పోక్సో కేసు నమోదు చేసినఏపీలో ముగ్గురు చిన్నారులు మిస్సింగ్!.. మాజీ మంత్రి కాకాని …శ్రీనగర్ ఎన్‌కౌంటర్ లో లష్కరే కమాండర్ హతం!..మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వాసిరెడ్డి ఫిర్యాదు