👉 మోడీ బలప్రదర్శన దేని కోసం ?
ఆయన ప్రపంచంలోనే అగ్ర శ్రేణి నేతగా ఉన్నారు. ఆ విధంగా బీజేపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది కూడా ఆయన ప్రపంచంలోనే అగ్ర శ్రేణి నేతగా ఉన్నారు.ఆ విధంగా బీజేపీ ప్రచారం చేసుకుంటూ వస్తోంది కూడా.దేశంలో మోడీకి సరిసాటి నేతలు ఎవరూ లేరని కూడా చెబుతూ వస్తుంది. ఒక్క మోడీ చాలు అని బీజేపీ చాలా గొప్పగా మాట్లాడుతుంది. అటువంటి మోడీ చుట్టూ మిగిలిన నాయకులు ఉండాలా. అది అవసరమా అన్న చర్చ వస్తోంది.మోడీ వారణాసిలో తన నామినేషన్ పత్రాలను మంగళవారం దాఖలు చేశారు.ఈ కార్యక్రమం చాలా ఆర్భాటంగా సాగింది. ఎన్డీయే మిత్ర పక్షాల నేతలను అందరినీ పిలిచి మరీ ఘనంగా నిర్వహించారు.భారీ పోలింగ్ లెక్కలు ఏమి చెప్పబోతున్నాయి? మోడీకి మిత్ర పక్షాల నేతలు అంతా అభినందనలు శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమం కూడా ఒకటి జరిగింది.అసలు ఇదంతా ఇపుడు ఎందుకు అన్నదే అందరిలోనూ కలుగుతున్న సందేహం. ఆరేడు నెలల క్రితం ఢిల్లీలో జరిగిన ఎన్డీయే సమావేశం నాటికి టీడీపీ అందులో లేదు.జనసేనకే ఆహ్వానం దక్కింది. అలా పవన్ వెళ్ళి వచ్చారు. మార్చి నెలలో టీడీపీ రీ ఎంట్రీ ఇచ్చింది.ఇపుడు వారణాసిలో జరిగిన ఎన్డీయే మీట్ కి బాబుకు ఇన్విటేషన్ పంపించారు.చంద్రబాబు వెళ్ళి మోడీని అభినందించడమే కాకుండా మూడవసారి దేశానికి ప్రధాని అవుతారు అని కూడా జోస్యం చెప్పారు. ఎన్డీయే మిత్ర పార్టీలను చూస్తే ఒక్క టీడీపీ తప్ప మిగిలినవి అన్నీ కూడా చిన్న పార్టీలుగానే ఉన్నాయి. చాలా పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం అయి పోటీ చేస్తున్నాయి. టీడీపీ తరువాత నితీష్ కుమార్ పార్టీ మరో పెద్ద పార్టీ. ఇక మహారాష్ట్రలో ఉన్న శివసేన ఎన్సీపీ చీలిక పార్టీల బలాలు ఈ ఎన్నికల్లో తేలాల్సి ఉంది. బీజేపీకి కూడా మిత్రుల బలం తెలుసో ఏమో కానీ బీజేపీకి సొంతంగా 370 సీట్లు ఎన్డీయేకు 400 సీట్లు అని టార్గెట్ పెట్టుకుంది. అంటే మిత్రులకు కేవలం ముప్పయి సీట్లు మాత్రమే వస్తాయని లెక్క వేసుకుందా అన్నది ఇక్కడ చర్చగా ఉంది. ఇండియా కూటమిలో డబుల్ డిజిట్ నంబర్ ఎంపీలు కలిగిన పార్టీలు బోలెడు ఉన్నాయి. అంతే కాదు రాష్ట్రాలను ఏలే పార్టీలు కూడా ఉన్నాయి. కానీ ఎన్డీయేలో టీడీపీ తప్ప ఆ స్థాయి పార్టీలు పెద్దగా లేవు అనే అంటున్నారు. అయినా సగానికి పైగా పోలింగ్ జరిగిన తరువాత ఎన్డీయే మిత్రులతో మీట్ ఎందుకు అన్నది కనుక ఆలోచిస్తే మోడీ కోసం ఈ బల ప్రదర్శన జరిగింది అని అంటున్నారు. ఉత్తరాదిన బీజేపీ ప్రతిష్ట బాగా తగ్గిందని సర్వేలు కూడా చెబుతున్నాయి. ఇక విశ్లేషకుల మాట అయితే బీజేపీ ఈసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని. ఈ నేపధ్యం నుంచి చూసినపుడు మోడీకి ఎంతో మంది మిత్రులు ఉన్నారని, దేశంలో అన్ని పార్టీలూ బీజేపీ జెండా కింద మోడీ నాయకత్వంలోనూ పని చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పుకోవడానికే ఈ సమావేశం పెట్టారు అని అంటున్నారు.లేకపోతే ఇంత హడావుడిగా అందరికీ వారణాసికి పిలవాల్సిన పరిస్థితి లేదని అంటున్నారు. ఇక గత రెండు పర్యాయాలూ బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది. మిత్రులను కూడా పెద్దగా ఖాతరు చేసిన దాఖలాలు లేవు అని విమర్శలు వినిపించాయి. వారికి నామమాత్రం శాఖలతో సహాయ మంత్రి పదవులు కొందరికి మంత్రి పదవులు ఇచ్చినా తగిన అవకాశాలు లేకుండా చేశారు అని ప్రచారం అయితే సాగింది. ఈసారి బీజేపీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 273కి సరిపడా మెజారిటీ రాకపోతే మాత్రం మిత్రుల అండదండలు అవసరం.అందుకే ఇప్పటి నుంచి వారిని మంచి చేసుకుంటూ వారితోనే మేమూ అని అన్నట్లుగా చెప్పుకోవడానికి కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు అని అంటున్నారు. ఈసారి బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే రాజకీయంగా జాతీయ స్థాయిలో కీలక పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. అవి ఎటు నుంచి ఎటు మలుపు తిరిగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.ఏది ఏమైనా బీజేపీ హ్యాట్రిక్ కలలను నెరవేర్చేందుకు ఉత్తరాది సిద్ధంగా ఉందా అన్నదే అసలైన పాయింట్ అంటున్నారు.
👉 యువత ఏ పార్టీ వైపో ??? రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల్లో కనిపించారు. ఓటేశారు. అయితే.. వీరు ఎటువైపు సానుకూలం అనేది ఆసక్తికర విషయం. నగరాలు, పట్టణాల్లో జరిగిన పోలింగ్‌లో యువత ప్రధాన ఆకర్షణగా మారారు. వీరిలో 10 లక్షల మంది వరకు కొత్త ఓటర్లు ఉన్నారు. అంటే.. ఈ ఎన్నికల్లోనే వారికి తొలిసారి ఓటు హక్కు లభించింది. దీంతో వీరు ఎటువైపు మొగ్గు చూపుతారు ? అనేది కీలకం.
మెజారిటీగా చూసుకుంటే యువత ఓటు బ్యాంకు ఎక్కువగా విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడ, కర్నూలు, గుంటూరు నగరాల్లో ఉంది. ఇక్కడ చదువుకున్న వారే ఎక్కువగా ఓటేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే యువతులు ఎక్కువగా కనిపించారు. వీరిలో ఎక్కువ మంది మొగ్గు అభివృద్ధి, ఐటీ కంపెనీల వైపు కనిపించింది. అదేవిధంగా కొత్తగా ఉద్యోగాలు.. ప్రభుత్వ పరంగా ఉపాధి వంటి అంశాలు వీరిని ఎక్కువగా ప్రభావితం చేశాయనేది వాస్తవం.
ఈ రకంగా చూసుకుంటే.. కొత్తగా ఓటు హక్కు పొందిన వారిలో ఉద్యోగ, ఉపాధి రంగాలు, పరిశ్రమలు, అభివృద్దివైపు మొగ్గు చూపించారు. ఇదేసమయంలో మరికొందరు పార్టీలపై కంటే. పార్టీ లనాయకులపై అభిమానంతో పోటెత్తారు. ఉదాహరణకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో మెజారిటీ యువత పోలింగ్ బూత్‌లకు తరలి వచ్చింది. ఇక, ఉద్యోగ, ఉపాధి వంటివి కోరుకున్నవారు..టీడీపీ వైపు.. ముఖ్యంగా చంద్రబాబు వైపు మొగ్గు చూపించారనడంలో సందేహం లేదు. యూత్ లో మెజార్టీ తమకు ఉద్యోగం , ఉపాధి లేదన్న ఆవేదన తో ఉన్న విషయం స్పష్టంగా కనిపించింది.
అదేవిధంగా .. అమరావతిరాజధానిని కోరుకున్న యువత కూడా వీరిలో ఉన్నారు.అలాగని పూర్తిగా టీడీపీకి, జనసేనకు గుడ్డిగా ఓట్లేశారని కూడా చెప్పలేం. ఉదాహరణకు వంద మంది యువత తొలిసారి ఓటేస్తే.. వీరిలో 20 శాతం మంది జగన్‌పై ఉన్న అభిమానంతో ఫ్యాన్‌కు ఓటేశారనేది అంచనా ఉంది. మిగిలిన వారిలో ఎక్కువగా టీడీపీ.. మిగిలిన వారు జనసేన వైపు మొగ్గు చూపించారు. అయితే.. ఎలా చూసుకున్నా..యువత ఓట్లు మాత్రం కూటమికి అనుకూలంగానే పడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
👉 ఏపీలో ఎవరు గెలిచినా.. అవతలివారికి జైలే..!!! కేసులే?…
అత్యంత హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. అత్యంత హోరాహోరీగా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఒకరు వై నాట్ 175 అంటే.. మరొకరు తమ కూటమిదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకరు విధ్వంస పాలన అంటే మరొకరు విష కూటమి అని నిందించారు. ఇక వీరిలో ప్రజల తీర్పు ఎవరి పక్షాన ఉన్నదో జూన్ 4న తేలనుంది. ఓటరు తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఫలితాన్ని కాలానికి వదిలేసి అందరం ఓపికగా నిరీక్షించడమే చేయాల్సింది.ఒకవేళ ఏపీలో మళ్లీ వైసీపీనే గెలిచిందని అనుకుందాం.. ఏం జరగబోతుంది..? కొత్తగా చెప్పాల్సినది ఏమీ లేదు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం 50 రోజులు జైల్లో ఉంచింది. చంద్రబాబుపై 22, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పై 23.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై 24 కేసులు పెట్టింది జగన్ సర్కారు. చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టినవే ఎనిమిది కేసులు ఉన్నాయి. అంగళ్లులో చంద్రబాబుపై దాడి చేయటమే కాకుండా తిరిగి ఆయనపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. అనంతపురం, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖపట్నం, నంద్యాల జిల్లాల్లోని వివిధ స్టేషన్లలో బాబుపై కేసులు నమోదవడం గమనార్హం. కొవిడ్ సెకండ్ వేవ్ లో 440కే వేరియంట్ గురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని కూడా చంద్రబాబుపై కేసు పెట్టడం గమనార్హం. వ్యాక్సిన్లు అందుబాటులో లేవని వ్యాఖ్యానించినందుకూ విజయవాడ సూర్యారావుపేట ఠాణాలో కేసు నమోదు చేశారు. ఉచిత ఇసుక పాలసీపై సీఎంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఖజానాకు గండిపడిందని, ప్రివిలేజ్ ఫీజు, డిస్టలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులిస్తూ తీసుకున్న నిర్ణయంలో లోపాలున్నాయని.. సీఆర్‌డీఏ, రాజధాని, ఇన్నర్ రింగురోడ్డు మాస్టర్ ప్లాన్ నిర్ణయాల్లో కొందరికి అనుచిత లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. వాటితో పాటు నైపుణ్యాభివృద్ధి, ఏపీ ఫైబర్‌నెట్, ఎసైన్డ్ భూములు, అధికార దుర్వినియోగంవంటి అంశాలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే అరెస్టు చేశారు. జగన్ గనుక మళ్లీ గెలిస్తే.. చంద్రబాబును ఇంకా కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేయడం ఖాయమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మరి బాబు గెలిస్తేనో..? ఏపీలో టీడీపీ కూటమి గనుక విజయం సాధిస్తే అది వైఎస్ జగన్ పట్ల ఎలా వ్యవహరిస్తుందనేది చాలా కీలకంగా మారింది. జగన్ ప్రభుత్వ కక్షసాధింపు పట్ల ఇప్పటికే టీడీపీ శ్రేణులు కసికసిగా ఉన్నాయి. జగన్ హయాంలోని మంత్రులు చంద్రబాబును వ్యక్తిగతంగా అత్యంత పరుష పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటివారున్నారు. వంశీ అయితే, మరీ దారుణమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇక జగన్ సర్కారు విధాన నిర్ణయాల్లో తప్పిదాలను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వెలికి తీసే వీలుంది. మరీ ముఖ్యంగా ఇసుక, మద్యం విధానంలో లోపాలను వెదికే చాన్సుంది. మరోవైపు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ఇప్పటికే టీడీపీ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో వైసీపీ నేతలు అనేక ఆక్రమణలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తోంది. రాజధానిగా ప్రకటించాక అనేక దందాలు చేశారని ధ్వజమెత్తుతోంది. ఇంకా చెప్పుకొంటూ పోతే చాలా ఆరోపణలు చేసింది. వీటిలో ఏదో ఒక తీవ్రమైన దానిపై జగన్ ను నేరుగా ఇరికించే చాన్సుందనేది విశ్లేషకుల మాట. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసులున్న జగన్ కు ఇకమీదట రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కేసులు కూడా నమోదు కానున్నాయి. కొసమెరుపు: 1996-2004 మధ్యన ఉమ్మడి ఏపీలో సీఎంగా ఉన్న చంద్రబాబుపై అప్పటి ప్రతిపక్ష, కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే చంద్రబాబును జైల్లో వేస్తాం అనేంతగా ఉండేవి ఆ ఆరోపణలు. కానీ, వైఎస్ మొదటి టర్మ్ లో అత్యంత బలంగా ఉన్నప్పటికీ చంద్రబాబును ఏమీ చేయలేదు.బహుశా ఒక్క కేసు కూడా నమోదు చేసినట్లు లేదు. కానీ, వైఎస్ కుమారుడు జగన్ మాత్రం 20పైగా కేసులు పెట్టారు. జైలుకూ పంపారు.
👉 NDA – కూటమి నాయకులకు – కార్యకర్తలకు – జిల్లా ఓటరు మహాశయులకు
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి . కృతఙ్ఞతలు తెలిపారు.
2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి – బీజెపి – జనసేన పార్టీల కూటమి గెలుపుకోసం నాకు తోడుగా వుండి, అన్ని విధాలుగా సహకరించి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలలో ప్రచార కార్యక్రమాలలో మండుటెండలను లెక్కచేయక పాల్గొని విశేష కృషి చేసినందుకు కూటమి శాసనసభ అభ్యర్థులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు పేరు పేరున నా కృతజ్ఞతలు.
ప్రజల కష్టాలను రూపుమాపడానికి నిరంతరం శ్రమించిన మీరు ప్రజల ఆశీర్వాదంతో అఖండ విజయాన్ని కైవసం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ప్రచార పర్వంలో ప్రతి గ్రామంలో ఘన స్వాగతం పలికి, అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ప్రజా సేవకోసం మొదలైన మాగుంట కుటుంబ రాజకీయ పర్వం, తరాలు మారిన ప్రకాశం జిల్లా ప్రజల సేవకే అంకితమై, ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని తెలియజేస్తున్నాను.
అలాగే, 13-05-2024 తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావీయక, ఎంతో సంనయంతో మీరు మరియు ప్రజలందరూ సహకరించి, ప్రశాంతంగా పోలింగు జరుగుటకు తోడ్పడినందుకు మీకు అభినందనలు తెలుపుచున్నాను.
అలాగే, మీరందరు పోలింగులో పాల్గొని, విధి నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ సిబ్బందికి మరియు పార్టీల నాయకులకు సహకరించి, పోలింగు సమయం దాటిన తదుపరి కూడా ఎంతో ఓపికతో గంటల తరబడి క్యూలలలో వుండి ఓటింగులో పాల్గోన్నందుకు కృతఙ్ఞతలు తెలియజేసారు .
👉ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన టిప్పర్‌క్షణాల్లో కమ్మేసిన అగ్నికీలలు..పర్చూరు (మార్టూరు), ఓటు వేసేందుకు తమ స్వగ్రామానికి వచ్చారు..బంధుమిత్రులతో రెండు మూడు రోజులు సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలనే ఆత్రుత తో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. అంతలోనే మృత్యువు.. టిప్పరు రూపంలో దూసుకొచ్చి.. బస్సు డ్రైవరుతో సహా నాలుగు నిండు ప్రాణాలను బలిగొంది. కళ్లు తెరిచేలోపే.. అగ్నికీలలకు ఆహుతైన విషాదమిది. గాఢ నిద్రలో ఉన్న పదుల సంఖ్యలో ప్రయాణికులను తీవ్ర గాయాలపాలుజేసింది. క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటిన వేళ స్థానికులు అప్రమత్తమై.. 108, పోలీసులకు సమాచారం చేరవేశారు.స్థానికులు, క్షతగాత్రుల వివరాల మేరకు… బాపట్ల జిల్లా చినగంజాం నుంచి పర్చూరు, చిలకలూరిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు మంగళవారం రాత్రి అరవింద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. వీరిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెం వారు ఎక్కువగా ఉన్నారు. వీరంతా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన వారే. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చిలకలూరిపేట మండలం అన్నంబట్లవారిపాలెం – పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా శరవేగంగా కంకరతో వచ్చిన టిప్పర్.. బస్సును ఢీ కొట్టింది. క్షణాల్లో టిప్పర్‌కు మంటలు రేగి.. ఆపై వేగం తీవ్రత దృష్ట్యా బస్సుకు మంటలు వ్యాపించాయి.తేరుకునేలోపే తెల్లారిన బతుకులు..ప్రమాద తీవ్రతకు క్షణాల్లో ట్రావెల్స్ బస్సు చోదకుడు.. మరో నలుగురు ఆహుతి అయ్యారు. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల శోకాలతో ఆ ప్రాంతంలో విషాదం మిన్నంటింది. స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని 108, పోలీసులకు చేరవేయడంతో హుటాహుటిన వారు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా.. చిలకలూరిపేట, యద్దనపూడి, చీరాల, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాద స్థలికి రప్పించారు. బస్సులో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసి.. 108 వాహనాల్లో 20 మంది క్షతగాత్రులను చిలకలూరిపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.చిలకలూరిపేట నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలు ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైపాస్ వర్క్ జరుగుతుండటం.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోవడం.. టిప్పర్ వేగంగా దూసుకురావడం.. టిప్పర్ చోదకుడు వేగాన్ని నియంత్రించ లేకపోవడం ప్రమాదానికి కారణమైనట్లు పల్నాడు జిల్లా…గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ మండలం బ్రహ్మణపల్లి గ్రామంలోవైయస్సార్సీపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ మాబు కారు ధ్వంసం చేసి కాల్చివేసిన టిడిపి శ్రేణులు..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
*పెద్దారవీడు మండలం కుంట వద్ద రోడ్డు ప్రమాదం…*
*కారులో ప్రయానిస్తున్న యర్రగొండపాలెం తహసీల్దార్,సర్వేయర్ దిలీప్, సిబ్బందికి స్వల్పగాయాలు. మార్కాపురం తరలించారు.