ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

👉ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్… వీడియో వైర‌ల్!

భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ జనాభాకు తగిన స్థాయిలో ఉండరనే చర్చ బలంగా వినిపిస్తుంటుంది. భారతదేశంలో ట్యాక్స్ పేయర్స్ జనాభాకు తగిన స్థాయిలో ఉండరనే చర్చ బలంగా వినిపిస్తుంటుంది.ట్యాక్స్ పే చేసే విషయంలో భారతీయులు పూర్తిగా దాటవేత ధోరణి, నిర్లక్ష్యం వహిస్తుంటారనే కామెంట్లూ అక్కడక్కడా వినిపిస్తుంటాయి. అదే కారణమో ఏమో కానీ…”ఒకే దేశం – ఒకే పన్ను” అంటూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ జీఎస్టీ ని తీసుకొచ్చింది. దానికి 101వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ చట్టం 2016గా ప్రవేశపెట్టారు. జీఎస్టీ కౌన్సిల్, దాని ఛైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తు సేవల పన్నును పరిపాలిస్తారు. అయితే ఈ విధానంపై రకరాకాల విమర్శలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగా ఇది సామాన్యుల పాలిట గుదిబండగా మారిందనే కామెంట్లు బలంగా వినిపించేవి.ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.ఈ ఇంట్రాక్షన్ లో భాగంగా..ఆ వ్యక్తి వేసిన ప్రశ్నలు వింటే.. నిజమేననిపిస్తోంది. ఈ సందర్భంగా…ట్యాక్సులు కట్టేది, రిస్క్ చేసిది తాను అని చెబుతూ..ఏ పెట్టుబడీ పెట్టని కేంద్రాన్ని స్లీపింగ్ పార్ట్నర్ గా అభివర్ణించడం వైరల్ గా మారింది.ఇందులో భాగంగా… స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాలపై భారీ పన్నులు విధిస్తూ కేంద్రం దండిగా అర్జిస్తోంది కానీ…ఇన్వెస్టర్లు మాత్రం లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా పన్నులు మాత్రం చెల్లిస్తున్నారని సదరు వ్యక్తి తెలిపారు.ఈ విషయంలో కేంద్రం ఒకరకంగా స్లీపింగ్ పార్ట్నర్ లా వ్యవహరిస్తోందని ఆవేదన వెళ్లగక్కుతూ చురకలంటించాడు. ఇదే సమయంలో ముంబైలో ఇళ్లు కొనాలంటే సామాన్యుడికి పడుతున్న “పన్ను”పోటులపైనా స్పందించాడు.ఎక్కడైనా ఇల్లు కొనుకోవాలనుకుంటే నగదు లావాదేవీలు సాధ్యపడటం లేదు. తమ దగ్గరనున్న వైట్ మనీ అన్ని ట్యాక్స్ లకు వెళ్ళగా, ఏదైనా కొనాలన్న పన్నుల మీద పన్నులు విధిస్తున్నారని, జీఎస్టీ వలన తీవ్రంగా నష్టపోతున్నామన్నారు.దీంతో అక్కడునన్వారంతా చప్పట్లు కొడుతూ, అతడు సంధించిన ప్రశ్నలపట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంత సీరియస్ విషయానికి సమాధానంగా స్పందించిన నిర్మలా సీతారామన్… “స్లీపింగ్ పార్ట్నర్లు సమాధానం ఏమి చెబుతారు?”అంటూ రిప్లై ఇచ్చారు.దీంతో అక్కడున్న వారంతా ఆమె సమాధానం విని విస్తుపోగా…ఆన్ లైన్ లో మాత్రం నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అదో తెలివైన సమాధానం అని నిర్మలా సీతారామన్ భావిస్తున్నారేమో.. జనం మాత్రం చేతకానితనంగా భావిస్తున్నారంటూ ఫైరవుతున్నారు!!

👉ఐ ప్యాక్ బృందంతో భేటీ సందర్భంగా సిఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఎన్నికల ఫలితాలపై తొలిసారిగా స్పందించిన సీఎం జగన్.జూన్ 4 ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోంది..మరోసారి అధికారంలోకి వస్తున్నాం..22 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం..2019 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు రానున్నాయి..ప్రశాంత్ కిషోర్ ఊహించిన దానికంటే వైసిపి కి ఎక్కువ సీట్లు..ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తాం.*ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిది..రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం..పేరు పేరున ఐ ప్యాక్ టీం సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న సిఎం జగన్*

👉తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భధ్రత పెంచిన కేంద్రం…

గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారులు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబునాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు. ఆమేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది spg బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు.ఒక పక్క యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించగా, చంద్రబాబుకు రక్షణ పెంచటము ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లలో చర్చనీయాంశమయినది.

👉పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు ఇళ్లలో తనిఖీలు..మాచవరం: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో బాంబుల కలకలం రేగింది. వైకాపా నేతల ఇళ్లలో నాటు బాంబులు, పెట్రోల్‌ బాంబులను పోలీసులు గుర్తించారు..ఇటీవల జరిగిన ఎన్నికలు సంబంధించిన గొడవలపై విచారణకు పోలీసులు గ్రామానికి వెళ్లారు. వైకాపా, తెదేపా నేతలను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో వైకాపా నేతల ఇళ్లలో బాంబులను గుర్తించారు..

*మాచర్లలో పోలీసుల కవాతు*మరోవైపు జిల్లాలోని మాచర్ల ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. పట్టణానికి చెందిన ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. 144 సెక్షన్‌ కారణంగా షాపులు తెరుచుకోలేదు. మాచర్ల పట్టణంలో పోలీసులు బారికేడ్లు పెట్టి తనిఖీలు చేస్తున్నారు..

👉పల్నాడు జిల్లా ..దాచేపల్లి.. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించిన  జిల్లా ఎస్పీ బిందు మాధవ్..

గురజాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో హింస చెలరేగుతుండడంతో రెండు రోజులుగా గ్రామాల్లో కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని ఈ కాటన్ సెర్చ్ నిర్వహించే సమయంలో పిన్నెల్లి గ్రామంలో 50 పెట్రోల్ బాంబులు నాటు బాంబులు వేట కొడవళ్ళు గొడ్డళ్లు లాంటి మారణా యుధాలు స్వాధీనం చేసుకొని ముగ్గురునీ అరెస్ట్ చేశామని పెట్రోల్ బాంబులు తయారు చేసే ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నామని తెలిపారు విచారణ చేపట్టిన అనంతరం నిందితులను కోర్టులో హాజరు పరిచి తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పల్నాడు జిల్లాలో ఎవరైనా హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ బిందు మాధవ్..

👉బస్సు లారీ ఢీ..తప్పిన ప్రాణాపాయం..నెల్లూరు జిల్లా…బుచ్చిరెడ్డి పాలెం ..తప్పిన ప్రాణాపాయం* బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని రాఘవ రెడ్డి కాలనీ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.పామూరు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును నెల్లూరు వైపు నుండి ఆత్మకూరు వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 80 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పదిమందికి స్వల్ప గాయాలు అయ్యాయి.గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..

👉చిత్తూరు జిల్లా కుప్పం..కుప్పం పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి కింద రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభయమైన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి శరీర భాగాలు వేరువేరుగా పడి ఉంది. కాగా వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా?? లేక ఎవరైనా హతమార్చి రైలు పట్టాల పై పడేసారా అనే వివరాలు రైల్వే పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు రైల్వే పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

7k network
Recent Posts

మోడీకి సరైన ప్రశ్న సంధించిన ప్రియాంకా!!!..బిగ్ స్టేట్ లో బీజేపీకి షాక్ !?..సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: డి.ఎస్.పి బాల సుందర రావు..ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషమం..

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

48గంటల్లోపు ఓటింగ్ శాతాల డేటాను ఇసి వెబ్సైట్లో ఎందుకు ఉంచలేదు-సుప్రీంకోర్టు ఆగ్రహం..ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్యాయత్నం..టూరిస్టు బస్సులో మంటలు ఎనిమిది మంది మృతి..పల్నాడు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గా శ్యాం ప్రసాద్..వజ్రాల వేట మొదలు..ఘర్షణలకు పాల్పడితే చర్యలు కంభం సీఐ..పెట్రేగిపోతున్న మట్టి మాఫియా .

మోడీ : అయోధ్య రామా వర్సెస్ రేషన్ బియ్యం !..రైల్వే పోలీసులకు అభినందనలు తెలిపిన పొదిలి వ్యాపారి..కిమ్స్ లో అరుదైన చికిత్స..వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలిక మృతి..ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..అక్రమ అపార్ట్మెంట్లపై ఉక్కు పాదం.

ట్యాక్సుల‌పై నిర్మల‌మ్మకు డైరెక్ట్ బిగ్ పంచ్..అధికారం లోకి రాబోతున్నాం -“జగన్”..”బాబు”కు భద్రత పెంచిన కేంద్రం..పల్నాడు జిల్లాలో వైసీపీ నేతల ఇళ్లలో సోదాలు..మాచర్లలో పోలీసుల కవాతు..

ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!