పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా?..మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్!..మహిళలకు గుడ్ న్యూస్..యాభై వేలు పొందండిలా!.ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు..నవధాన్యాల సాగుపై అవగాహన..దోర్నాల.

పదేళ్ళ పాలనలో మోడీ ఫెయిల్ నా లేక పాస్ నా ?

రెండు దఫాలు పూర్తి మెజారిటీతో బీజేపీని ప్రజలు గెలిపించారు. దేశంలో కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పాలించిన రికార్డుని ఈ విధంగా మోడీ సొంతం చేసుకున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ 2014 మే నెల మధ్యలో అధికారం చేపట్టారు. సరిగ్గా పదేళ్ళు పూర్తి అయింది ఆయన పీఎం కుర్చీలో కూర్చుని. రెండు దఫాలు పూర్తి మెజారిటీతో బీజేపీని ప్రజలు గెలిపించారు. దేశంలో కాంగ్రెసేతర ప్రధానులలో అత్యధిక కాలం పాలించిన రికార్డుని ఈ విధంగా మోడీ సొంతం చేసుకున్నారు. ఇక పదేళ్ళలో మోడీ పాలన ఎలా సాగింది. ఆయనకు ప్లస్ ఏమిటి మైనస్ ఏమిటి, మోడీ తన మార్క్ పాలన చూపించి ప్రజల మెప్పు పొందారా లేక ఆదరణ తగ్గించుకున్నారా ఇత్యాది ప్రశ్నలు సహజంగానే వస్తాయి. మోడీ పాలనలో ఫెయిల్ అయ్యారా అయితే ఏఏ అంశాలలో అన్న చర్చ కూడా నడుస్తోంది. లేదు ఆయన పాస్ అయ్యారు అనుకుంటే ఏ విషయాల్లో అన్నది కూడా చూడాల్సి ఉంది.

ఎందుకంటే ఇది కీలకమైన సమయం. ఒక దశాబ్దం కాలం అంటే చిన్న విషయం అయితే కాదు, దేశం ప్రగతి గతిని నిర్ణయించడానికి అవసరం అయిన కాలంగానే దీనిని అంతా చూస్తారు. ఇక మోడీ విషయంలో కూడా ఈ తరహా విశ్లేషణలు అయితే వస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే రాజకీయాల్లో ఏ నేత కూడా తాను ఫెయిల్ అని అసలు ఒప్పుకోరు. పాస్ అయ్యామనే చెబుతారు.ఇక ఒకసారి అధికారంలోకి వచ్చి అయిదేళ్ళు పాలిచ్నిన మీదట ప్రజలు దీవించి మరోసారి అధికారం ఇస్తే ఆయన పాస్ అయినట్లే.అదే సమయంలో మోడీ రెండు సార్లు అధికారం అందుకున్నారు. ఇపుడు మూడోసారి అధికారం కోరుకుంటున్నారు. అయితే మూడవసారి అధికారంలోకి రావాలని మోడీ చేస్తున్న ప్రయత్నం మాత్రం జనాదరణకు కాసింత దూరంగానే ఉంది అని అంటున్నారు. మోడీ విన్నపాలకు జనాల నుంచి సరిగ్గా స్పందన రావడం లేదు అని అంటున్నారు.👉ఇక మోడీని మూడవసారి గెలిపించాలీ అంటే ప్రజలకు ఆయన పదేళ్ల కాలంలో ఏమి చేశారు అన్నది కూడా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్లలో మోడీ దేశానికి చేసింది చూస్తే నిఖార్సుగా ఉన్నది అయోధ్యలో రామమందిరం నిర్మాణం. అలాగే 370 అర్టికల్ రద్దు, సీఏఏ, ట్రిపుల్ తలాఖ్ తప్పించి ఏమీ చెప్పుకోవడానికి లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. నిజానికి ఒక దేశాన్ని పదేళ్ల పాటు పాలించిన తరువాత ప్రధాని తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉంటాయి. కానీ మోడీ ప్రసంగాలు చూస్తే ఎక్కువగా ఇవే అంశాలు కనిపిస్తున్నాయన్నది ఒక విశ్లేషణగా ఉంది.జగన్ కాన్ఫిడెన్స్ ఇక మరో ముఖ్య విషయం కూడా మోడీ ప్రసంగాల్లో ఉంది. దేశంలో ఎనభై కోట్ల మందికి రేషన్ ఇస్తున్నామని ఆయన అంటున్నారు. అంటే దేశంలో ఇంకా పేదరికం అలాగే ఉంది కదా అన్న చర్చ కూడా నడుస్తోంది. ప్రపంచంలో భారత్ స్థానం ముందంజలో ఉంది అని బీజేపీ పెద్దలు చెబుతూ ఉంటారు.అంతే కాదు అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తోందని,అయిదవ ఆర్ధిక వ్యవస్థగా మారిపోతోందని కూడా బీజేపీ పెద్దలు ఊదరగొడుతూ వచ్చారు.అలాంటి దేశంలో ఇంకా ఎనభై కోట్ల మంది పేదలు ఉన్నారు అంటే తలసరి ఆదాయం పెరగలేదు కదా అన్నది నిష్టూరంగా వినిపిస్తున్న నిజం. ఇదే విషయాన్ని ఆర్ధిక నిపుణులు కూడా ఎత్తి చూపిస్తున్నారు.ఇక దేశాన్ని నిరుద్యోగ భూతం పట్టి పీడిస్తోంది. అలాగే ద్రవ్యోల్బణం రేటు తార స్థాయిలో ఉంది. గ్యారంటీలు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు అన్న చర్చ కూడా ఉంది. ఇక గత పదేళ్లలో చూస్తే దక్షిణాదిన వస్తున్న ఆదాయనని ఉత్తర భారతానికి దోచి పెడుతున్నారు అన్నది అతి పెద్ద ఫిర్యాదు గా ఉంది. పన్నులు మేము కడితే తిరిగి రావాల్సిన వాట రాకపోగా దేశంలో బీజేపీ ఏలికలు తమ రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు నచ్చిన రాష్ట్రాలకు ప్రధానంగా ఉత్తరాదికి ఎక్కువగా నిధులు ఇస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో స్టాలిన్ అయినా తెలంగాణాలో రేవంత్ అయినా కర్నాటకలో సిద్ధరామయ్య అయినా కేరళ సీఎం అయినా ఇదే తీరున బీజేపీని నిలదీస్తున్నారు.అయినా వారి నుంచి సరైన సమాధానం అయితే రావడం లేదు. 👉 ఇక 2014లో గుజరాత్ మోడల్ అని తెగ ప్రచారం చేసుకున్న బీజేపీ పెద్దలు ఈసారి మాత్రం ఆ ఊసే తలవడం లేదు.గుజరాత్ మోడల్ అన్నది వారికి ఎందుకో అంతగా కలిసి రాదేమో అన్న డౌట్లు ఉన్నాయా అన్నది కూడా అంతా మాట్లాడుకుంటున్న విషయంగా ఉంది. అలాగే అభివృద్ధి అజెండాను ముందు పెట్టి ఓట్లు అడగడం లేదు. మేము పదేళ్లలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని చూపించామని కాబట్టి మరోసారి ఎన్నుకోవాలని కూడా అనడం లేదు.ఇక బీజేపీ పెద్దల ప్రసంగాలు చూస్తే ఎపుడూ కూడా నవాబులు, సుల్తానులు,టిప్పు సుల్తానులు, ముస్లిమ్స్ ఇదే గోలతో సాగుతోంది అని కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇదే విషయం మీద మేధావులు సైతం బీజేపీని కార్నర్ చేస్తున్నారు.ఇక పోలిటికల్ గా చూస్తే రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఎక్కువ అయ్యాయని అంటున్నారు.👉ఈడీ సీబీఐలతో దాడులు చేయించడం తమ ప్రత్యర్ధులను అరెస్ట్ చేయడం అన్నది బీజేపీ జమానాలో ఎక్కువ అయిందని అంటున్నారు. ఎవరైనా తమ కూటమి వైపు వస్తే ఓకే. వారి మీద కేసులు ఉండవు,కానీ ప్రత్యర్ధులుగా ఉంటే మాత్రం వెతికి వెంటాడి కేసులు పెట్టే తీరుని కూడా సగటు జనాలు గమనిస్తున్నారు.మొత్తం మీద చూస్తే నెహ్రూ జమానా నుంచి చూస్తే ప్రతీ ప్రధాని ఏలుబడిలో ఎంతో కొంత డెవలప్మెంట్ అయితే దేశం చూసింది మోడీ పదేళ్ల పాలనలో బీజేపీ తమ సొంత అజెండాని పూర్తి చేస్తున్నారు తప్ప కోట్లాది ప్రజలకు ఏమి చేశారన్న అతి పెద్ద ప్రశ్న అయితే అందరిలో ఉంది.ఈ ప్రశ్నకు బీజేపీ సంతృప్తికరమైన జవాబు ఇచ్చే తీరుని బట్టే ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అన్నది ఆధారపడి ఉంటుంది.

👉మనవడి లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ రియాక్షన్.

హాసన్ ఎం పీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారం ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ వీడియోల వ్యవహారం ప్రధానంగా కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక్కో సంచలన విషయం తెరపైకి వస్తుంది. ఈ విషయంలో సిట్ తనపని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం చెబుతుంది. ఈ సమయంలో జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. అవును…తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ వీడియోల వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్న నేపథ్యంలో… దేవెగౌడ మొట్ట మొదటిసారిగా స్పందించారు. ఇందులో భాగంగా… ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోకూడదని అన్నారు. ఈ వ్యవహారంలో చాలా మందికి ప్రమేయం ఉందని, వారెవరినీ వదిలిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడిన దేవెగౌడ… “ప్రజ్వల్ ప్రస్తుతం దేశంలో లేడు.. అయితే, చట్టప్రకారం చర్యలు ఉండాలని ఇప్పటికే హెచ్‌.డీ కుమారస్వామి చెప్పాడు.. ఇందులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తుల పేర్లు చెప్పను కానీ.. వారిపై కూడా చర్యలు ఉండాలి” అని హెచ్‌.డీ దేవెగౌడ అన్నారు. ఇదే సమయంలో… “ప్రజ్వల్‌ తో తనకు ఎలాంటి కాంటాక్ట్ లేదని కుమారస్వామి చెప్పారు” అని గుర్తు చేశారు! మరోపక్క..కిడ్నాప్‌ కేసుకు సంబంధించి ప్రజ్వల్ తండ్రి హెచ్‌.డీ రేవణ్ణకు ఇటీవల బెయిల్ వచ్చింది.తన కుమారుడిపై ఉన్న లైంగిక దౌర్జన్యం ఆరోపణలకు సంబంధించి బాధిత మహిళను కిడ్నాప్ చేసిన కేసులో మే 4న ఆయనను సిట్ అధికారులు అరెస్టు చేశారు.అరెస్టు సమయంలో ఆయన అధికారులకు సహకరించలేదని వారు తెలిపారు. ఇందులో భాగంగా… రేవణ్ణను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు రాగా… ఆ సమయంలో తన తండ్రి, మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో ఉన్న ఆయన.. సాయంత్రం 5:17 గంటల నుంచి 6:50 గంటల వరకు సరైన సమయం కాదని ఇంట్లో తలుపు వేసుకుని కూర్చున్నారు.అయితే… సాయంత్రం 6:50 తర్వాత ఆయనే తలుపు తీసి, సిట్ అధికారుల ముందు లొంగిపోయారు!

👉 మహిళలకు గుడ్ న్యూస్.. యాభై వేలు పొందండిలా!ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహిక మహిళల కోసం 1 ఏప్రిల్ 2000న అన్నపూర్ణ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ పథకం ద్వారా రూ.50,000 లోన్ అందిస్తున్నారు. వీటిని ఉపయోగించి వంట పరికరాలు, ఫ్రిజ్, గ్యాస్ కనెక్షన్, డైనింగ్ టేబుల్స్ కొనుగోలు చేయవచ్చు.ఈ రుణాల యొక్క వడ్డీ రేట్లు మార్కెట్‌ను బట్టి మారుతూ ఉంటాయి. రుణం మొత్తాన్ని మూడేళ్లలోగా చెల్లించాలి.SBI బ్రాంచ్‌ని సంప్రదించడం ద్వారా మహిళలు ఈ లోన్ పొందవచ్చు.

👉 పల్నాడు కలెక్టర్ గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు. అనంతపురం, చిత్తూరు, పల్నాడు ఎస్పీలను ఈరోజు సాయంత్రం ప్రకటించే అవకాశం.
👉పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌ నియామకం*
*తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌ నియామకం*
*అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీ శాలి నియామకం*
👉ఏపీలో అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం – 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు.*
ఐపీఎస్ వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు.సిట్ సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి(శ్రీకాకుళం), సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు(ఒంగోలు), ఏసీబీ డీఎస్పీ మనోహరాచారి(తిరుపతి), వి.భూషణం(గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్), వెంకటరావు(విశాఖ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్), రామకృష్ణ(ఏసీబీ ఇన్‌స్పెక్టర్), జి.ఎల్.శ్రీనివాస్(ఏసీబీ ఇన్‌స్పెక్టర్), మోయిన్(ఒంగోలు పీటీసీ), ప్రభాకర్(అనంతపురం ఏసీబీ), శివప్రసాద్(ఏసీబీ ఇన్‌స్పెక్టర్) – రేపటిలోగా ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్.

👉 నవధాన్యాల సాగురైతన్నకు బాగు ప్రకాశం జిల్లా ప్రకృతి విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని ఆదేశాల మేరకు
దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ యువ రైతు అమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వినూత్నంగా నవధాన్యాల సాగు చేస్తున్నారు.30 రకాల విత్తనాలను 12కేజీలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి, ఘనజీవామృతం, గట్టుమన్ను, బూడిదతో విత్తన గుళికలు తయారుచేసి పొలంలో వెదజల్లారు. నవధాన్యాలు సాగు చేయడం వల్ల భూమి సారవంతమవుతుంది భూమిలోని తేమశాతం ఆరిపోకుండా ఉంటుంది .భూమిలో మనకు ఎన్నో రకాల మేలు చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెంది వర్షం నీరు వృధాగా వెళ్ళిపోకుండా నవధాన్యాల సాగు ద్వారా భూమిలోకి ఇంకుతుందని నవధాన్యాలు వేసిన 45 రోజుల తర్వాత భూమిలో కలియదున్ని ప్రధాన పంట వేసుకుంటే మంచి దిగుబడులు వస్తాయని తెలిపారు. ఇప్పుడు వర్షం లేటుగా పడిన ప్రధాన పంట దెబ్బతినకుండా తట్టుకుంటుందని పెట్టుబడి తగ్గుతుందని నవధాన్యాల సాగు చేయడం వల్ల రసాయనాలకు పెట్టే ఖర్చులో 90% పెట్టుబడి తగ్గుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రైతులు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.
*👉ముందస్తు జాగ్రత్త*..రాష్ట్రంలో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు ఈసీ ఆదేశం.ఎన్నికల కోడ్ ప్రకారం కంటైనర్లు, సీసాలో పెట్రోల్, డీజిల్ పోయోద్దన్న ఈసీ.ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు వాహనాల్లో మాత్రమే ఇంధనం నింపాలని ఆదేశం.పౌరసరఫరాల శాఖ ద్వారా పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఈసీ నోటీసులు.నిబంధనలు ఉల్లంఘిస్తే పెట్రోల్ బంకుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక.

7k network
Recent Posts

“ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో సీఎం రేవంత్..”జగన్ ను కొలంబియన్ డ్రగ్ లార్డ్ తో పోల్చిన బాబు..”రెడ్ బుక్ తెరవకముందే గగ్గోలు పెడుతున్న జగన్- లోకేష్..”తిరుపతిలో కిలాడి దంపతుల అరెస్ట్..”బెంగళూరులో యువతిపై దాడి..

అసెంబ్లీలో వైకాపా పై ధ్వజమెత్తిన సీఎం చంద్రబాబు.. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నకిలీ విలేఖరులు..పోలీస్ స్టేషన్లో రెచ్చిపోయిన నకిలీ విలేఖరి.. వివేకా హత్య కేసులో దస్తగిరి పేరు తొలగింపు.. పొదిలి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..రాష్ట్ర తరగతులను జయప్రదం చేయండి..పీ డీ ఎస్ యూ..

కొత్త ప‌థ‌కాల‌కే రేవంత్ జై!..అమరావతిలో ల్యాండ్ పూలింగ్ షురూ..మోడీ మాయతో ఏపీకి అన్యాయం.. • ప్రజలు మోసపోతున్న మాట్లాడలేని జగన్ ..సమస్యలపై మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లిన మార్కాపురం ఎమ్మెల్యే కందుల..ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన పొదిలి సీఐ.. వైకాపా కార్యకర్తను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అన్నా.. ప్రకాశం జిల్లా కలెక్టర్ పర్యటన.. రషీద్ హత్య కేసులో నిందితుల అరెస్టు..

ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన చంద్రబాబు..అసెంబ్లీ హైలెట్స్..లిక్క‌ర్ పాల‌సీపై విచార‌ణ‌..జ‌గ‌న్‌ను అరెస్టు చేస్తారా?..ఉద్యోగులకు త్వరలోనే పెండింగ్ డీఏలు: భట్టి..బడ్జెట్లో మైనార్టీలపై వివక్షత పై అవాజ్ కమిటీ ఆగ్రహం..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ సెంటర్..ప్రకాశంలో తూనికలు కొలతల శాఖ దాడులు.

కుర్చీని కాపాడుకొనే బడ్జెట్- కాంగ్రెస్,సీపీఎం..నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం-సీఎం స్టాలిన్ మద్దతు..ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన- మాగుంట..జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత డీఎస్సీ కోచింగ్..కరకట్టలో రైతుల ఆందోళన..డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి విక్రయాలు