అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు – ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ….అధికారులకు ముచ్చమటలు పట్టిస్తున్న చంద్రబాబు..ప్యాలెస్ లో కూర్చుని తప్పుడు ట్వీట్లు పెట్టడానికి సిగ్గులేదా జగన్-ఎమ్మెల్యే ముత్తుముల ఆగ్రహం.. జిల్లా సమస్యలపై నారా లోకేష్ తో చర్చించిన ఎంపీ మాగుంట..ఘనంగా కార్గిల్ విజయ్ దివస్..

👉 అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దడ లేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దడ లేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్ అధికారుల్లో ఉంది. 2014 లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు అసలు పొంతనే లేదు. పూర్తిగా వయొలెంట్ గా మారిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 1995 నాటి ముఖ్యమంత్రిని నేడు చూస్తారంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. బీకేర్‌ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు అంటుండటంతో వణికిపోతున్నారు.నాడు సీఎంగా…చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు ఆయన దూకుడుగా వెళ్లారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులను నిద్ర పోనివ్వ లేదు. దీంతో పాటు సస్పెన్షన్లు కూడా నాడు ఎక్కువ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన నాడు చెబుతూ వైద్యం, విద్య వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టేవారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే గుండెపోటుకు గురైన అధికారులు కూడా అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆయన కొంత దూకుడు తగ్గించారు. 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టడంతో కొంత అధికారులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు.నిధులు లేవంటూ…కానీ నాటి చంద్రబాబు నాయుడును అధికారులు గుర్తుకు తెచ్చుకుని మరీ భయపడిపోతున్నారు. అయితే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. నేడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్. తేడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం కొంత అధికారులు క్లారిటీ ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. నాడు నిధులు పుష్కలంగా ఉండేవి. చెప్పిన పనులు వెంటనే చేసేవారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసేవారు. కానీ ఇప్పుడు నిధులు లేవు. దీంతో డబ్బులు లేకుండా ఏం చేయాలని అధికారులు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. అయినా ఆయనను నేరుగా ప్రశ్నించలేక మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడును చెప్పుకుంటున్నారు.సమస్యలను ..చంద్రబాబు పాత ముఖ్యమంత్రిగా మారితే తప్పులేదు. కానీ అదే సమయంలో అధికారులు పనులు చేయలేకపోవడానికి గల కారణాలను కూడా ఆయన కనుక్కొని ఫైర్ అయితే బాగుంటుందని అంటున్నారు. నిన్న నెల్లూరు జిల్లాకు వెళ్లిన చంద్రబాబు అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల పన్ను సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు కనీసం సమస్యలను అడ్రెస్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పేముందని, అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే అధికారుల్లో దడ మొదలయింది.

👉 అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మరో మలుపు – ఫోర్జరీ కోణం గుర్తించిన ఏసీబీ*….మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ కుటుంబం కబ్జా చేసి విక్రయించిన అగ్రి గోల్డ్ భూముల వ్యవహారంలో ఫోర్జరీ కోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ (ACB) గుర్తించింది. జోగి రమేష్ కుటుంబానికి భూమిని విక్రయించినట్లుగా చెబుతున్న వ్యక్తి తాను అమ్మలేదని అది నకిలీ డాక్యుమెంటుగా అనిశాకు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఫోర్జరీ కేసు కూడా నమోదు కానుంది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు సమీపంలోని అంబాపురం గ్రామంలో రూ.10 కోట్ల విలువైన అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి విక్రయించిన ఉదంతంపై అనిశా దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.జోగి రమేష్ బాబాయ్ జోగి వెంక టేశ్వరరావు, తనయుడు రాజీవ్ల పేర్లపై కొనుగోలు చేసినట్లు చెబుతున్న 2 వేల 160 గజాల స్థలాన్ని తిరిగి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబానికి విక్రయించారు. సర్వే నంబరు 88లో కొనుగోలు చేసిన ఈ భూమిని రెవెన్యూ అధికారుల సహకారంతో సర్వే నంబరు 87లో ఉన్నట్లుగా లేఖ పొంది, స్వీయ సవరణ ద్వారా సబ్రిజిస్ట్రార్ సహకారంతో రెండోసారి రిజిస్ట్రేషన్ చేయించుకొని, తిరిగి వాటిని విక్రయించారు. వాస్తవానికి సర్వే నంబరు 88లో నాలుగు ఎకరాలు బొమ్మా వెంకటచలమారెడ్డి పేరుపై ఉండేది.దీనిలో ఎకరం పోలవరపు మురళీమోహన్కు, ఎకరం అద్దెపల్లి కిరణ్ కుమార్కు, రెండు ఎకరాలు రామిశెట్టి రాంబాబుకు 2001లో విక్రయించారు. పోలవరపు మురళీమోహన్ 2 వేల 301 చదరపు గజాల స్థలాన్ని 2003, 2004 సంవత్సరాల్లో 11 మందికి విక్రయించారు. ఈ ప్లాట్లన్నీ సర్వే నంబరు 88లో ఉన్నాయి. అదే పోలవరపు మురళీమోహన్ జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్లకు విక్రయించినట్లు 2022లో రిజిస్ట్రేషన్లు అయ్యాయి.ఈ క్రమంలో దర్యాప్తు సంస్థ పోలవరపు మురళీమోహనన్ను కూడా నిందితుడిగా చేర్చింది. ఆయన తన వాంగ్మూలంలో తాను జోగి కుటుంబానికి విక్రయించలేదని, ఆ డాక్యుమెంట్లు తనవి కావని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లలో మురళీమోహన్ ఆధార్ నంబరు చివరి అంకెలు 6251గా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఆయన ఆధార్ నంబరు 5420గా ఉంది. 6251 నంబరు కర్రి రత్నం పేరుతో ఉంది. గ్రామ సర్వేయర్ దేదీప్యను ప్రశ్నించగా, అసలు తాను సర్వే చేయలేదని అధికారులకు ఆమె వివరణ ఇచ్చారు. సర్వే చేసే సమయంలో సంబంధిత భూమి సరిహద్దుల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేయాలి. కానీ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఫోర్జరీ చేశారు. వీటన్నింటిపై అనిశా దర్యాప్తు చేస్తోంది.

👉ప్యాలెస్ లో కూర్చుని తప్పుడు ట్వీట్లు పెట్టడానికి సిగ్గులేదా జగన్?..

👉వెలుగొండ ప్రాజెక్టు గురించి నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది..
జగన్ కు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి కౌంటర్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో జలవనరుల శాఖ అత్యంత నిర్లక్ష్యానికి, విధ్వంసానికి గురైంది జగన్ హయాంలోనే అని, ఈ విషయం దాస్తే దాగదని గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుపై ట్విట్టర్ లో జగన్ చేసిన ట్వీట్ కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వెలుగొండ ప్రాజెక్టు గురించి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఫేక్ రాజకీయంతో లబ్ధి పొందాలనుకునే జగన్ దుర్మార్గపు ఆలోచనలను ప్రజలు విశ్వసించరన్నారు. గత ఐదేళ్లలో మిగిలిన 10 నుండి 20 శాతం పనులు పూర్తిచేసి వెలిగొండ ద్వారా నీళ్లివ్వలేకపోయిన నువ్వు నేడు బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చుని ట్వీట్లు చేయడానికి సిగ్గనిపించడం లేదా అని నిలదీశారు. సలహాదారులకు, సాక్షి పత్రికకు, సర్వే రాళ్లపై బొమ్మలకు చేసిన ఖర్చు ఎంతో…సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసింది ఎంతో దమ్ముంటే ప్రకటించాలని సవాల్ విసిరారు. సాగునీటి రంగానికి, రాష్ట్ర రైతాంగానికి జగన్ ఐదేళ్ల పాపపు పాలన ఒక శాపంగా మారిందన్నారు. ఈ సంగతి ఫేక్.. రాజకీయం చేసే, అంతరాత్మే లేని జగన్ కు తప్ప రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ తెలుసన్నారు. తప్పుడు ప్రచారంతో ఎల్లకాలం రాజకీయం సాగదని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
👉కంభం తహసిల్దార్ ఏ కిరణ్ ను సన్మానించిన తెలుగు యువత నాయకులు అస్లాం బేగ్ మిత్ర బృందం……….

👉 సుబేదార్ మేజర్ సయ్యద్ మహబూబ్ బాషాకు సన్మానం.. కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం సందర్భంగా 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న సిపాయిలను గిద్దలూరులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కంభం కు చెందిన సుబేదార్ మేజర్ సయ్యద్ మహబూబ్ బాషాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సైనిక్ అసోసియేషన్(తాసా ) జి ఓ సి మేజర్ జనరల్ రాకేష్ ఘనంగా సన్మానించారు.  మంగళవారం  ప్రకాశం జిల్లా గిద్దలూరు లొని విట్ట సుబ్బారత్నం కళ్యాణమండపంలో  కార్గిల్ లో పాల్గొన్న వారికీ మరియు వీర మహిళ్లలకు  సన్మానం చేశారు.వారి యొక్క సమస్యలు విని పరిష్కరించారు.కార్యక్రమంలో రాష్ట్రీయ సైనిక్ బోర్డు డైర్క్టర్ బ్రిగేడియర్ వెంకట రెడ్డి ప్రకాశం జిల్లా సైనిక్ బోర్డు అధ్యక్షురాలు రజినీ కుమారి, గిద్దలూరు మాజీ సైనికుల సంఘం ప్రెసిడెంట్ హనరీ కెప్టెన్ సట్టి ఓబులేసు, మాజీ సైనికులు పాల్గొన్నారు.

👉సీబీఐ ఆఫీస్లోకి హత్యాచార నిందితుడి ఫ్రెండ్ పరుగులు..కోల్కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడిని CBI స్పెషల్ బ్రాంచ్ విచారిస్తోంది. సంజయ్ నేరంలో అతడికేమైనా భాగస్వామ్య ముందా? అనే కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ ఆఫీస్కు చేరుకునే సమయంలో కేసు గురించి మీడియా అతడిని ప్రశ్నించింది. మాట్లాడేందుకు నిరాకరించిన అతడు ఆఫీస్లోకి పరుగులు పెట్టాడు. భద్రతా సిబ్బందిని నెట్టుకుంటూ లోపలికి వెళ్లిన వీడియో వైరలవుతోంది

👉 అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రిలో మళ్ళీ మొదలైన ఉద్రిక్తత టిడిపి వైసిపి కార్యకర్తల నడుమ పరిస్థితి ఉద్రిక్తం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల పహారాలో కార్యకర్తల ఇల్లు పాచికంగా దెబ్బతిన్న వాహనాలు ఈ అల్లర్లు ఇప్పుడే ఆగేలా లేవు ఎప్పుడు ఏం జరుగుతుందో ఉద్రిక్తతల నడుము తాడపత్రి టౌన్ ప్రజలు.

👉 అమరావతి: వల్లభనేని వంశీ మధ్యంతర ముందస్తు బెయిల్‌ పొడిగింపు.ఈనెల 28 వరకు ముందస్తు బెయిల్‌ పొడిగించిన ఏపీ హైకోర్ట్‌. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్‌ విచారణ. తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్ట్‌.

👉🏽కడప జిల్లా ఎస్.పి వి.హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు కడప నగరంలో ఉన్న 13 కళాశాల విద్యార్థినుల ప్రైవేట్, వర్కింగ్ విమెన్స్ హాస్టల్స్ ను సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్న మహిళా ఎస్.ఐలు, మహిళా పోలీసు సిబ్బంది*కడప నగరంలోని కళాశాల విద్యార్థినుల ప్రైవేట్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లను మంగళవారం సాయంత్రం మహిళా ఎస్.ఐలు జ్యోతి, లక్ష్మి, శాంతమ్మ, హైమావతి,నస్రీన్, మహిళా పోలీసు సిబ్బంది సందర్శించారు.* సుదూర ప్రాంతాల నుండి వచ్చి ఉన్నత విద్య, ఉద్యోగ నిమిత్తం ఉంటున్న మహిళలు, విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో, లేదా ఉద్యోగం చేస్తున్న కార్యాలయంలో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, అన్ని వేళలా అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

👉 ఏపీలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు.. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సంక్షేమంపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి సమీక్ష నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరాలను అధికారులు మంత్రికి తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించారు.

👉ఉండవల్లి లోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ ని కలసి జిల్లా సమస్యలు మరియు పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి చర్చించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి .ఈ సందర్భంగా ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీకీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయవలసినదిగా కోరినారు.

.   👉70 మద్యం సీసాలు పట్టివేత*నెల్లూరు…కందుకూరు మండలంలోని చెమిడిదిపాడు అడ్డరోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 70 మద్యం సీసాలను గుడ్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుడ్లూరుకు చెందిన అనిల్.. తెట్టు నుంచి మద్యం సీసాలు తెస్తున్నట్లు సమాచారం రావడంతో తనిఖీలు చేసి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

👉రోడ్డు ప్ర‌మాదం కేసులోని నిందితుడు అరెస్ట్‌*..

మంగ‌ళ‌గిరిలో 2018లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కేసులోని నిందితుడ్ని బ్ర‌హ్మ‌య్య అరెస్ట్‌ చేసిన‌ట్లు మంగ‌ళగిరి రూర‌ల్ ఎస్ఐ సిహెచ్ వెంక‌ట్ తెలిపారు. బ్రహ్మయ్య కడపకు చెందిన వ్యక్తి 2018 వ సంవత్సరంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో రోడ్ యాక్సిడెంట్లోకేసులో ముద్దాయిగా ఉన్నాడు. అప్పటినుండి ముద్దాయి ఇంతవరకూ కోర్టుకు వాయిదాల నిమిత్తం హాజరు కాకపోవడం తో కోర్టు వారు ముద్దాయిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో మంగ‌ళ‌వారం కడప వెళ్ళి సదరు ముద్దాయిని అరెస్టు చేసి కోర్టు నందు హాజరు పరచగా కోర్టు వారు బ్రహ్మయ్యకు 15 రోజుల రిమాండ్ ఇవ్వడం జ‌రిగింద‌ని రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ వెల్ల‌డించారు.

👉వాగు దాటే ప్రయత్నంలో కొట్టుకుపోయిన ట్రాక్టర్* భారీ వర్షాలకు అనంతపురం జిల్లా సెట్టూరు మండలం లక్ష్మంపల్లి వద్ద గౌరమ్మ వంకలో ఇసుక కోసం వెళ్లిన ట్రాక్టర్ మునక.. వరద ఉదృతి పెరిగి కొట్టుకుపోయిన ట్రాక్టర్. 👉ప్రకాశంజిల్లా కంభం మండలం పెద్దనల్లకాల్వ గ్రామం పొలంలో చోరీ..   ప్రకాశంజిల్లా కంభం మండలం పెద్దనల్లకాల్వ గ్రామంలోని కృష్ణ మందిరం సమీపంలో దుగ్గెపోగు సుగుణమ్మ పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ దిమ్మె మీద ఉన్న కరెంట్ ట్రాన్స్ఫర్మార్ ను పగుల గొట్టి అందులో ఉన్న రాగి తీగను మరియు ఇతర సామాగ్రిని దొంగిలించారు. దొంగతనానికి తాడు ,కర్ర, రించీలు వాడినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు పోలీసు శాఖ వారి విచారణలో తెలియాల్సి ఉంది.

👉 ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారవీడు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు,ప్రభుత్వ అధికారులు. మండలంలోని పలు సమస్యలపై సమీక్షించిన శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం