నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయం-cm రేవంత్..దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా?.. సెప్టెంబర్ 16న ‘నేషనల్ లోక్ అదాలత్.. పలు శుభ కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా.. దివ్య హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ

👉గుజరాత్ కు చెందిన నరేంద్ర మోదీ – అమిత్ షా,అదానీ – అంబానీ…దేశం పాలిట దుష్ట చతుష్టయంగా తయారయ్యారు. మోదీ అండతోనే సెబీ కుంభకోణం పై ఛైర్మన్ మాధుబి బచ్ రాజీనామా చేయలేదు. స్కాం పై కేంద్రం జేపీసీ వేయలేదు. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం. దీనిపై రాహుల్ గాంధీ పోరాటానికి కోట్లాది కార్యకర్తలం అండగా ఉంటాం దేశ ఆస్తులను కాపాడే బాధ్యత తీసుకుంటాం.

సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైనా …మలినమైనా…మాకు అభ్యంతరం లేదు.సెబీ స్కాం పై బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలి.  కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

👉ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 14 వ తేదీన జరుగబోయే నేషనల్ లోక్ అదాలత్ లో భా గంగా గిద్దలూరు కోర్ట్ ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ జరుగునని,కావున కక్షిదారులందరూ ఈ అవకాశమును సద్వినియోగం చేసుకొని గిద్దలూరు కోర్టులో పెండింగ్ లో ఉన్న అన్ని రకముల సివిల్ కేసులు, భరణం కేసులు, గృహహింస కేసులు,చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, బ్యాంకుల ప్రీ లిటిగేషన్ కేసులు, టెలిఫోన్ ప్రీలిటిగేషన్ కేసులు,మరియు కోర్టుల వరకు వెళ్లని ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవలసినదిగా గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికారసంస్థ చైర్మన్ ఏ. ఓంకార్ పత్రికా ప్రకటనలో తెలియజేశారు.లోక్ అదాలత్ అవార్డుపై అప్పీలు ఉండదని, మరియు సివిల్ కేసుల్లో కోర్టులకు కట్టిన ఫీజు రెవిన్యూశాఖ ద్వారా వాపసు చేయబడుతుందని తెలియజేశారు.

👉దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ఆర్గనైజేషన్ గిద్దలూరు ఆధ్వర్యంలో   కొమరోలు మండలం. బాదినేనిపల్లె గ్రామానికి చెందిన కీ. శే.కామురి. రామిరెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా గిద్దలూరు. లోని.సంజీవని వృద్ధాశ్రమం గురుకుల స్వచ్ఛంద సేవ సంస్థ వారికి .నిత్యవసర వస్తువులు అందించడం జరిగింది  ఈ కార్యక్రమంలో లోక్కు శరత్ బాబు సునీల్ కుమార్ నాయుడు పాల్గొన్నారుసహాయం అందించిన కుటుంబానికి సంజీవని వృద్ధాశ్రమం చైర్మన్ రాజశేఖర్ కృతజ్ఞతలు తెలియజేశారు

👉బత్తుల వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్నా రాంబాబు ..*మార్కాపురం టౌన్ సౌజన్య ఫంక్షన్ హాల్ నందు బత్తుల పుల్లారెడ్డి,భూదేవి గార్ల కుమారుడు వివాహానికి హాజరుఅయి నూతన వధూవరులు అయిన రాజశేఖరరెడ్డి,నాగ సౌమ్య లను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమన్వయ కర్త అన్నా వెంకట రాంబాబు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు*

👉కీసరి వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు ,మాజి ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి .. ఒంగోలు టౌన్ లోని శ్రీనివాస కాలనీ నందు కొండారెడ్డి,వీర నరాయణమ్మ గార్ల కుమార్తె వివాహానికి హాజరుఅయి నూతన వధువును సాయి సౌజన్యను ఆశీర్వదించిన మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా వెంకట రాంబాబు మరియు ఉడుముల శ్రీనివాస రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు*

👉దళపతి విజయ్.. మరో విజయ్ కాంతా? ‘వి’ జయలలితనా? కమల్ హాసనా?…తమిళనాట మరో కొత్త పార్టీ ప్రస్థానం మొదలైంది. ఇప్పటికే పార్టీ ఖరారైనప్పటికీ.. దళపతి విజయ్ గురువారం నుంచి పూర్తిస్థాయి రంగంలోకి దిగారు ..అసలే తమిళ రాజకీయాలు సినిమా రంగంతో గట్టిగా ముడిపడి ఉంటాయి. ప్రస్తుత అధికార పార్టీ డీఎంకేకు చెందిన కరుణానిధి సినీ రచయిత అనే సంగతి తెలిసిందే. ఆయన మనవడు, సీఎం స్టాలిన్ కుమారుడు అయిన ఉదయనిధి తమిళ సినిమాల్లో హీరోగా చేసి ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇక డీఎంకేకు చిరకాల ప్రత్యర్థి అన్నాడీఎంకేను స్థాపించింది తమిళుల సినీ దేవుడు ఎంజీఆర్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సినీ నటి జయలలిత చేతుల్లోకి వెళ్లడం, ఆమె పలుసార్లు సీఎం కావడం అందరికీ అనుభవమే.

*కమల్ రజనీ నుంచి శరత్ కుమార్ వరకు..సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ దశాబ్దాల పాటు ఊరించి రాజకీయాల్లోకి వచ్చినట్లే వచ్చి విరమించుకున్నారు. విశ్వ నటుడు కమల్ హాస్ మక్కల్ నీది మయ్యం అంటూ తిప్పలు పడుతూ వస్తున్నారు. నటుడు, ఒకప్పుడు హీరోగానూ చేసిన శరత్ కుమార్ కూడా భార్య రాధికతో కలిసి పార్టీ పెట్టి దానిని విలీనం చేశారు. ఎటుచూసినా తమిళనాడు రాజకీయాలు సినీ రంగంతో ముడిపడి ఉన్నాయి.

*విజయం లేకున్నా విజయకాంత్..తమిళనాడు నల్ల ఎంజీఆర్ గా పేరుగాంచిన దివంగత విజయకాంత్ 20 ఏళ్ల కిందటనే ఎండీఎంకే పేరిట పార్టీ పెట్టారు. దానిని నిలపుకొంటూ వచ్చారు. గత ఏడాది ఆయన చనిపోయినా పార్టీ బాధ్యతలను భార్య చూస్తున్నారు. విజయకాంత్ ఊహించినంతగా విజయవంతం కాలేదు. కానీ, ఓ దశలో అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎండీఎంకే నిలిచింది. ఆ తర్వాత ఒడిదొడుకులు ఎదురైనా ఎండీఎంకే మాత్రం అలానే నిలిచింది. అయితే, విజయకాంత్ సీఎం పదవికి దగ్గరగా మాత్రం రాలేదు.

*శూన్యాన్ని భర్తీ చేస్తారా?..జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో గ్యాప్ వచ్చింది. దానిని భర్తీ చేసేవారే లేరు. జయ పార్టీ అన్నాడీఎంకే.. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చీలిపోయింది. ఇప్పుడు విజయ్ పార్టీ.. తమిళ రాజకీయాల్లో ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి? ఎందుకంటే తమిళనాడు వరుసగా రెండుసార్లు ఒకే పార్టీకి అధికారం దక్కిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు డీఎంకే, వచ్చేసారి అన్నాడీఎంకే అన్నట్లు ఉంటుంది పరిస్థితి. అయితే, విజయ్ పార్టీ.. అన్నాడీఎంకే స్థానాన్ని ఆక్రమిస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను సవాల్ చేస్తుందా? అభిమానుల అండాదండ పుష్కలంగా ఉన్న విజయ్.. ‘విజయకాంత్’ గా మిగిలిపోతారా? లేక వి‘జయలలిత’ అవుతారా? అనేది చూడాలి.

*ఆకట్టుకునేలా జెండా..విజయ్ తాజాగా ఆవిష్కరించిన పార్టీ జెండా.. కాస్త ఆలోచింపేజేదిలాగే ఉంది. ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్న ఈ జెండాపై మధ్యలో వాగాయి పువ్వుకు అటూఇటు ఏనుగులు ఉన్నాయి. తమిళ సంప్రదాయంలో వాగాయిని విజయానికి గుర్తుగా అభివర్ణిస్తారు. విజయ్ పార్టీ జెండాతో పాటు గీతాన్ని కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. తద్వారా తండ్రితో విభేదాలు లేవని చాటారు. ఇక కులం, మతం, లింగం, ప్రాంతం వివక్షను తొలగిస్తామని విజయ్ ప్రకటించారు.

7k network
Recent Posts

రాహుల్ ని అర్థం చేసుకోవడం కష్టం.. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి కన్నుమూత…పొగిడారా ?..పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి: కూనంనేని..ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న కేసు… నిందితులకు 14 రోజుల రిమాండ్..చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మీ తీరుపై ప్రభుత్వం సీరియస్..ఘాట్ రోడ్లలో వాహనాలు నిషేధం..జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్..ఉప్పల్లో నకిలీ వైద్యుడు అరెస్ట్.

ప్రధాని మోదీతో భేటీ అయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్..ఆపరేషన్‌ బుడమేరు’ అమలుకు పటిష్ట చట్టం : ముఖ్యమంత్రి చంద్రబాబు..ముగ్గురు ఎస్ఐలపై ఎస్పీ వేటు.. కోల్కత్తా ఘటనపై సుప్రీంకోర్టు విచారణ..ప్రకాశం బ్యారేజ్‌ను పడవలు ఢీకొన్న ఘటనలో దర్యాప్తు ముమ్మరం..ఇద్దరు నిందితుల అరెస్టు..జగన్ వికృత రాజకీయానికి తెలుగుజాతి ఎంతో నరకాన్ని చవిచూసింది :ఎమ్మెల్యే జూలకంటి.. హైదరాబాద్ సీపీ గా సివి ఆనంద్..నందమూరి సుహాసినికి టీడీపీ అధ్యక్ష పదవి*.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తాం -సీఎం చంద్రబాబుజిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాలి -రాష్ట్ర వ్య‌వ‌శాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు..ఇబ్రహీంపట్నం లో విష జ్వరాల పంజా..పార్టీ మారిన MLAలపై చర్యలు తీసుకోవాలన్న పిటిషన్లపై రేపు తీర్పు..సీఎం సహాయ నిధికి రూ.11 కోట్ల విరాళం అందించిన ఏపీ పోలీస్ అధికారుల సంఘం..హైడ్రా సామాన్యుడి ప్రశ్నలు.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం..హోంమంత్రి అనిత..రాయలసీమలో రెడ్ బుక్ కలకలం..ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం..మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా..తనకు సంబంధమే లేదంటున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని.. రేపు గ్రీవెన్స్ రద్దు..నిమజ్జనాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన:ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్..చేయూత ,మిత్రమండలి ఫ్రెండ్స్ అఫ్ నీడీ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు సాయం అందజేత.. పొదిలి నుండి విజయవాడకు 5వేల ఆహార ప్యాకెట్లు…

భగ్గుమన్న మణిపూర్..ఐదుగురు మృతి..ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర?!!..ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ..మళ్లీ వరద వచ్చే ఛాన్స్.. అధికారులు సిద్ధంగా ఉండాలి..సీఎం..హైఅలెర్ట్‌లో ఖమ్మం జిల్లా..APCC నూతన కమిటీలకు ఆమోదం..నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల..భార్య వాణికి షాకిచ్చిన దువ్వాడ.. కొత్త తరహా సైబర్ క్రైమ్.

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం