కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

👉మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలు.. అగ్నివీర్‌ పథకంలో మార్పులు!*👉న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 : విమర్శలు, వివాదాలకు దారితీసిన ‘అగ్నివీర్‌ పథకం’పై మోదీ సర్కార్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది.అర్హతలు, పారితోషకాలతోపాటు, మరికొంతమంది అగ్నివీర్లను సర్వీస్‌లో కొనసాగించేలామార్పులు ఉండబోతున్నాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. పథకం మరింత మెరుగుకు అవసరమైన సవరణలు చేస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ’25శాతం మందికి ఫుల్‌టైమ్‌ సర్వీస్‌ ఇవ్వటం.. క్షేత్రస్థాయిలో ఉన్న డిమా ండ్‌కు సరిపోదు. నాలుగేండ్ల శిక్షణ తర్వాత అగ్నివీర్లలో 50శాతం మందిని ఫుల్‌టైమ్‌ సర్వీస్‌కు ఎంపికచేయాలని సైన్యం సిఫారసు చేసింది’ అని రక్షణ శాఖ తెలిపింది. వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత సైన్యం తన సిఫారసులను అందజేసినట్టు తెలిసింది.

👉తీవ్రంగా నష్టపోయాం… పెద్దమనసుతో సాయం అందించి ఆదుకోండి..*చరిత్రలో కనీవినీ ఎరుగని వరద వచ్చింది… అప్రమత్తతతో ప్రాణ నష్టాన్ని నివారించ గలిగాం*..*కేంద్రమంత్రి చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ విన్నపం*అమరావతి: చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో కృష్ణానదికి వరద రావడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కృష్ణానది వరద నష్టం వివరాలను మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి నివేదిస్తూ… తీవ్రంగా నష్టపోయిన తమ ప్రజలు తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు పెద్దమనసుతో సాయం అందించాలని కోరారు. వరద సమయంలో ముఖ్యమంత్రి అప్రమత్తతతో వ్యవహరించి ప్రాణనష్టాన్ని నివారించ గలిగారని తెలిపారు. వరద ముంపుతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ గురువారం మధ్యాహ్నం స్వాగతం పలికారు. తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్‌మెంట్ ఏరియాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఏరియల్ సర్వే అనంతరం ముఖ్యమంత్రి నివాసంలోని హెలీప్యాడ్ వద్ద లాండ్ అయి, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించారు. గేట్ల మరమ్మత్తుల పనుల వివరాలను లోకేష్ కేంద్ర మంత్రికి తెలియజేసారు. తర్వాత జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర మంత్రి చౌహాన్, మంత్రి లోకేష్ తో కలిసి ఎన్డీఆర్ఎఫ్ బోటుపై తిరుగుతూ పరిశీలించారు. భారీవరద కారణంగా బుడమేరుకు పడిన గండ్లు పూడ్చేందుకు రేయింబవళ్ళు శ్రమిస్తున్నామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చౌహాన్ స్పందిస్తూ… వరద కారణంగా జరిగిన నష్టాన్ని త్వరితగతిన భర్తీ చేసేందుకు సాయం అందిస్తామని చెప్పారు. వరద బాధిత ప్రజలను సాదారణ స్థితికి తెచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి చౌహాన్ పర్యటనలో లోకేష్ తో పాటు మరో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ పురంధరేశ్వరి, ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన అనంతరం విజయవాడ కలెక్టరేట్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్నారు. దెబ్బతిన్న ప్రాంతాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ లో వరద నష్టం వివరాలను కేంద్ర మంత్రి చౌహాన్ కు ముఖ్యమంత్రి వివరించారు. తర్వాత వరదనష్టంపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి చౌహాన్ సమీక్షించారు. జరిగిన నష్టాన్ని కేంద్రమంత్రికి వివరించిన అధికారులు… నష్టంపై నివేదికలు అందజేశారు.

👉50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు ముఖ్యమంత్రికి చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని*

గత కొన్ని రోజులుగా విజయవాడ ప్రాంతంలో వరదలతో అతలాకుతలమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తన వంతుగా *ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయల చెక్కును విజయవాడలో* ముఖ్యమంత్రికి అందజేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు

👉ఆప్యాయంగా పలకరించి.. భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్*

తన కుటుంబ కష్టాలు చెప్పుకొనేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం విజయవాడ వచ్చిన ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి…పంచాయతీరాజ్ కమిషనరేట్‌ వద్ద కూర్చున్న కృష్ణవేణిని పకలరించి.. సిబ్బంది వాహనంలో ఎక్కించుకొని తన కార్యాలయానికి తీసుకెళ్లిన పవన్ కల్యాణ్..ఆమెకు భోజనం పెట్టించిన తర్వాత ఆమె సమస్యలు తెలుసుకున్న డిప్యూటీ సీఎం.పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి.. కృష్ణవేణి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు.

👉బుడమేరు మూడో గండి పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ..గండి పూడ్చేందుకు 40 మంది ఆర్మీ బృందం యత్నం….ఇప్పటికే రెండు గండ్లు పూడ్చిన అధికారులుమూడో గండి పూడుస్తున్న ఆర్మీ ఇంజినీర్ల బృందంపనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు…యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి-నిమ్మల

👉అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.*

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ కు జెడ్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నామని స్టేట్ లెవెల్ భద్రత రివ్యూ కమిటీ సభ్యుడు, ఐపీఎస్ ఆఫీసర్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హైకోర్టుకు తెలిపారు. ప్రస్తుతం 58 మంది ఆయనకు భద్రత కల్పిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం-2023 ప్రకారం అదనపు భద్రతకు జగన్ అనర్హుడని ఆయన పేర్కొన్నారు. కాగా తనకు భద్రత కుదింపుపై జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది.

👉పోలీసులు లంచం ఇవ్వజూపారు!*కోల్‌కతా హత్యాచార ఘటనపై వైద్యురాలి తల్లిదండ్రుల ఆరోపణ కోల్‌కతా, సెప్టెంబర్‌ 5: కోల్‌కతా హత్యాచార ఘటనలో వైద్యురాలి తల్లిదండ్రులు తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఇందుకోసం తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు. వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ బుధవారం రాత్రి కోల్‌కతా ఆర్‌జీ కర్‌ దవాఖాన వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో జనం క్యాండిల్స్‌తో వైద్యురాలి మృతికి నివాళి అర్పించారు. మరోవైపు, ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం జరిగిన మర్నాడే అప్పటి ప్రిన్సిపాల్‌ సందీప్‌ ఘోష్‌ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు బయటపడింది. ఆగస్టు 9న డాక్టర్‌పై దారుణం జరగగా, ఆగస్టు 10న ఘోష్‌ పీడబ్ల్యూడీకి ఓ లేఖ రాశారు. అన్ని డిపార్ట్‌మెంట్లలోని ఆన్‌ డ్యూటీ డాక్టర్ల గదుల్లో మరమ్మతులు, ఆధునికీకరణ, పునర్నిర్మాణ పనులను చేయాలని కోరారు.

👉కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన*..ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ నెల కరెంటు బిల్లల వసూలుపై ఊరటనిచ్చే విషయం చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలుని వాయిదా వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.వరదల్లో పాడైపోయిన వాటి మరమ్మత్తులకు రేట్లను ప్రభుత్వమే ఖరారు చేయాలని అన్నారు.ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు రేట్లు డిమాండ్‌ చేసి ప్రజలను దోచుకోకుండా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాల రిపేర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల రిపేర్లు, గ్యాస్‌ స్టవ్‌ల రిపేర్లు.. ఇలా ఏ రిపేర్‌కు అయినా ఒక రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుందనీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి సేవలు అందించేవారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

👉బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..రెగ్యులర్ వీసీ నియామకం, హాస్టల్ గదుల్లో, మెస్సుల్లో, విద్యాబోధనలో ఎదుర్కొంటున్న సమస్యలపై 2 వేల మంది విద్యార్థుల భారీ ర్యాలీ..ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేదంటే శాంతి యుతంగా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని…

👉 జనసేనలోకి వైసీపీ నేతలు..ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్ పర్సన్ దంపతులు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏలూరు జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి గంట ప్రసాద్ రాజీనామా చేయగా తాజాగా వారు జనసేన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో మరింత అభివృద్ధి చేయాలని ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.

👉తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురవటం.. ఈ కారణంగా వరద పోటెత్తటం తెలిసిందే. భారీ వర్షాలతో పాటు.. ఎగువ నుంచి వస్తున్న వరద పోటుతో పలు పట్టణాలు తీవ్ర అవస్థలకు గురి కావటం తెలిసిందే. తెలంగాణలో నల్గొండ.. ఖమ్మం జిల్లాలు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ నగరంతో పాటు..గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.తెలంగాణలో పలు చోట్ల ఇళ్లు కూలిపోవటం.. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరటం.. బాధితులకు తీవ్ర నష్టం జరగటం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటనష్టానికి గురైంది. పంటలు పెద్ద ఎత్తున నీట మునిగాయి. తమకు సాయం అందించాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణలో వరద నష్టం వివరాల్ని కేంద్రానికి ఇప్పటివరకు రాష్ట్రం నుంచి వెళ్లని విషయం వెలుగు చూసింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర సర్కారు పని తీరుపై కేంద్రం అసంత్రప్తిని వ్యక్తం చేసింది.దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కేంద్ర హోంశాఖ ఒక లేఖ రాసింది. తెలంగాణ వరద నష్టం వివరాల్ని కేంద్రానికి పంపని వైనాన్ని ప్రశ్నించింది.రాష్ట్రంలో వరద నష్టం వివరాల్ని నిర్ణీత ఫార్మాట్ లో తక్షణమే పంపాలని హోంశాఖ కోరింది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ.1345 కోట్ల ఎస్ డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయని.. వాటి ఖర్చుకు సంబంధించిన వివరాల్ని వెల్లడించాలని కోరింది. అంతేకాదు.. వరదల వేళ సాయం కోసం ఇప్పటికే 12 ఎన్ డీఆర్ఎఫ్ దళాలు.. రెండు హెలికాఫ్టర్లు పంపించినట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఎస్ డీఆర్ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని.. జూన్ లో రూ.208 కోట్ల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. వరద నష్టం వివరాల్ని ఎప్పటికప్పుడు రోజువారీగా పంపాలని లేఖలో కోరారు. ఓవైపు కేంద్రం నుంచి సాయం రావట్లేదని ప్రశ్నించే ముందు.. దానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం తరఫున కసరత్తు మీద ముఖ్యమంత్రి రేవంత్ ఒక కన్నేసి ఉంచాలన్న మాట వినిపిస్తోంది.

👉కేసీఆర్, స్మితా సబర్వాల్‌కు కోర్టు సమన్లు: ఎందుకంటే?*తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది.అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం వల్ల ప్రజా ధనానికి భారీ నష్టం వాటిల్లిందని భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్‌ను విచారించిన కోర్టు గతంలోనే మాజీ సీఎం కేసీఆర్, మరో ఏడుగురికి నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్నవారిలో మాజీ మంత్రి హరీశ్ రావు తరపున లలిత రెడ్డి, సుకన్య, అడ్వకేట్లు మెమో అప్పిరియన్స్ అయ్యారు. మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్అండ్ టీ ఎండీ సురేశ్ కుమార్ తరపున సుప్రీంకోర్టు అడ్వకేట్ అవదాని, శ్రావణ్ రావు మెమో అప్పిరియన్స్ అయ్యారు.ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్లు హరి రామ్, శ్రీధర్ తరపున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి మెమో అప్పిరియన్స్ అయ్యారు. అయితే, ఈరోజు మాత్రం మాజీ కేసీఆర్, ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరుకాకపోవడంతో అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇది ఇలావుండగా, ‘కేసీఆర్ కనబడుట లేదు’ అంటూ హైదరాబాద్ నగరంలో బుధవారం పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడు అంటూ సదరు పోస్టర్లలో పేర్కొన్నారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు.తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత రెండు మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతోపాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది.అయినప్పటికీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ వరద బాధితులను పరామర్శించేందుకు బయటకు రాకపోవడంపై ఇప్పటికే అధికార పక్షం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కనబడుట లేదు అంటూ పోస్టుర్లు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. కేసీఆర్ ప్రజల్లోకి రాకపోయినప్పటికీ.. హరీశ్ రావుతోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు.

👉 భారీ వర్షాలు, వరదలతో ఏపీలో 33 మంది మృతి..అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 25 మంది మృతి..గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడులో ఒకరు మృతి..వరదలతో 1,69,370 ఎకరాల్లో పంట నష్టం.. 18,424 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం..60 వేల కోళ్లు, 275 పశువులు మృతి..వరదలతో దెబ్బతిన్న 22 సబ్‌స్టేషన్లు..3,973 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న రహదారులువరదలతో 78 చెరువులు, కాలువలకు గండ్లు…పునరావాస కేంద్రాల్లో 45,369 మంది వరద బాధితులు

👉బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన* నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లో సరైన వసతులు కల్పించాలని నినాదాలు చేపట్టారు. క్యాంపస్‌ నుంచి అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్ వరకు 2 వేల మంది విద్యార్థుల భారీ ర్యాలీ చేశారు.రెగ్యులర్ వీసీ కావాలంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. 17 డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని లేకపోతే ఆందోళనను తీవ్ర తరం చేస్తాం TSAS సంఘం నేతలు స్పష్టం చేశారు.

👉ఫైర్ ఇంజిన్లు.. లారీలు.. ట్రాక్టర్లు.. వాటర్ ట్యాంకర్లు.. జేసీబీలు..చంద్రబాబు పర్యవేక్షణలో యద్ద ప్రాతిపదికన జరుగుతున్న వరద సహాయక చర్యలు…

👉 నిత్యావసరాతో కూడిన 6 వస్తువుల పంపిణీపైనా సమీక్ష చేసిన సిఎం…ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి సరఫరాకు సిద్దం చేసిన అధికారులు… పంపిణీ ప్రారంభం. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలన్న సిఎం. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్ లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలనుంచి తీసుకురావాలన్న సిఎం. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్న సిఎం. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలన్న సిఎం

👉 రైల్వే ఉద్యోగానికి వినేశ్ ఫోగట్ రాజీనామా..!!

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ రైల్వేలో ఉద్యోగానికి శుక్రవారం రాజీనామా చేశారు. ఇప్పటి వరకు ఆమె రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా ఉద్యోగం చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఆమె ఈ ఉద్యోగం పొందారు. కాసేపటిలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో రెజ్లర్ బజరంగ్ పునియా సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు..

7k network
Recent Posts

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.

*డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు…ఎవరూ నమ్మవద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు*…*అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..*హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య (మెదక్ జిల్లా కొల్చారం) ..* దళారుల మాటలు నమ్మకండి.. జిల్లా ఎస్పీ పి జగదీష్ .. *నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం… *మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి…*పేలిపోయిన విమానం,70 మంది మృతి.. *మహిళ అనుమానాస్పద మృతి (గుంటూరు జిల్లా నంబూరు) .. *మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు .. *ఏపీ రాజ‌కీయం.. నాడు – నేడు : ఎవ‌రి లాభం వారిదే ..! ..*శ్రీ గంధం తరలిస్తున్న దొంగలు ముఠా అరెస్ట్ (చిత్తూరు)

11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు… తోలు తీసి కూర్చోబెడతాం: పవన్ కల్యాణ్*..*DCM మన్యం పర్యటనలో నకిలీ IPS హల్‌చల్…! *కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది డిజిపి ద్వారకా తిరుమల రావు …..హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోసం ఈ నెల 30న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..”వామపక్షాల పిలుపు (తిరుపతి)…*పెండింగ్ లో ఉన్న 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటన్నే పూర్తి చేసి ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలి (మహబూబాబాద్ సిపిఎం డిమాండు)..*మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా…*పాల్వంచకు చెందిన పాస్టర్‌ అఘాయిత్యం*

రైతు సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వండి.. *రాష్ట్రపతిని కోరిన సంయుక్త కిసాన్‌ మోర్చా .. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు …*మూడు మిస్సింగ్ కేసులును ఛేదించిన విశాఖ నగర పోలీసులు… *వరుస దొంగతనాలు చేసే దొంగల ముఠా అరెస్ట్ ..* హత్య కేసును ఛేదించిన ప.గో జిల్లా పోలీసులు ..*విజయవాడలో పలువురు సిఐల స్థాన మార్పిడి.. *ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లితండ్రులు…* హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించిన పోలీసులు .. *2.83 లక్షల నగదు చోరీ.. EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా: యువతికి బెదిరింపులు ..(తిరుపతి) …*దొంగల ముఠా అరెస్టు ..(సత్యవేడు) ..

మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’ !!! ..సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమ్మారెడ్డి.. *చనిపోయిందని బన్నీకి చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ.. *రూ.15 లక్షలు మద్యం పట్టివేత • డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం… *లా కాలేజీలో ర్యాగింగ్ భూతం (నెల్లూరు) .. మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం … తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని …