👉రాహుల్ నాలుక కోస్తే రూ.11 లక్షలిస్తా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు .. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు పెద్ద ద్రోహం చేశారని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అభిప్రాయడపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ రెగ్యులర్‌గా ప్రవాస భారతీయులతో పలు సమావేశాలు నిర్వహించారు. పలు డిబేట్లలోనూ పాల్గొన్నారు.
చాలా వరకు కేంద్ర ప్రభుత్వం, మోడీ మీద ఆయన విమర్శలు సంధించారు. అదే సందర్భంలో ఓ డిబేట్‌లో పాల్గొన్న ఆయన రిజర్వేషన్లపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. రాహుల్‌గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు పెద్ద ద్రోహం చేశారని ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ అభిప్రాయడపడ్డారు. మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని.. కానీ రాహుల్ గాంధీ వారి పోరాటానికి అన్యాయం జరిగేలా వ్యాఖ్యలు చేశారని అన్నారు. రిజర్వేషన్ ప్రయోజనాలను అంతం చేయడమే లక్ష్యం అన్నట్లు రాహుల్ మాట్లాడారని ఆరోపించారు. దేశాన్ని 400 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని అన్నారు. దాంతో ఆగకుండా.. రిజర్వేషన్లపై మాట్లాడిన రాహుల్‌గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారని, ఆయన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారని అర్థమైంది. అందుకే.. రాహుల్ గాంధీ నాలుకను కోసే ఎవరికైనా ఈ రివార్డు ఇస్తా అని ప్రకటించారు. దీంతో ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు పెను దుమారం రేగింది.
👉బ్రిటీష్ నాటి రూల్స్ బద్దలుకొట్టారు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..*
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు కనపడవ్. పోడియంలు కానరావ్.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తరతరాలుగా సాగుతున్న రాచరికపు రూల్స్‌ను బ్రేక్ చేస్తూ… ఫ్రెండ్లీ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం.
కోర్టుల్లో న్యాయమూర్తి తరహాలో కూర్చునే సబ్ రిజిస్ట్రార్ సీటింగ్ పద్దతిని మార్చనుంది. అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోలాగే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు కూడా సింపుల్‌గానే ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంతకాలం పాటించిన విధానం ప్రజలను అవమానించేలా ఉందంటూ… అన్ని ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు, పోడియంలను తొలగించాలని నిర్ణయించింది. ప్రజలకు సేవ చేయాలే తప్పా… వారి పనుల్లో నిర్లక్షంగా వ్యవహరించొద్దని అధికారులకు స్పష్టం చేసింది. అంతేకాదు పనులు ఆలస్యమైతే… ప్రజలకు మంచినీళ్లు, టీ,కాఫీ లాంటివి అందించాలంటూ ఏపీ ప్రభుత్వం కొత్త పద్దతిని తీసుకొస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలతో విజయవాడ గుణదలలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోడియంను తొలగించారు రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. మరో రెండ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల రూపురేఖలు మారిపోనున్నాయని తెలిపారు. పాత పద్దతులు ప్రజలను ఇబ్బందిపెట్టేలా ఉన్నాయని వివరించారు.ప్రజలకు మర్యాదపూర్వకంగా పనులు చేసి పెట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిరైనా ఉందని సిసోడియా చెప్పారు. మొత్తంగా… ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
👉అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది*
*కృష్ణానది వల్ల రాజధానికి ఎలాంటి ఇబ్బంది లేదు*
*వైసీపీ చేసిన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు*
*రాజధానిలో కాలువలు,రిజర్వాయర్ల నిర్మాణంతో నీటి నిల్వ*గతంలో నిర్మించిన ఐకానిక్ భవనాలు,క్వార్టర్లు కు ఎలాంటి ఇబ్బంది లేదని ఐఐటి నిపుణులు నివేదిక*
*CRDA ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ..*గత ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో అమరావతి మునిగిపోతుందని విష ప్రచారం చేసిందని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు..అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉందని,ఎలాంటి ఇబ్బందీ లేదన్న మంత్రి…భవిష్యత్తులో కూడా ఎలాంటి దుష్ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.విజయవాడలోని CRDA ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
*అమరావతికి ముంపు లేకుండా రిజర్వాయర్లు,కాల్వల నిర్మాణం*అమరావతి రాజధానికి పనికిరాదని గత ప్రభుత్వం ప్రచారం చేయడంతో పాటు ప్రపంచబ్యాంకు కు కూడా నిధులు ఇవ్వొద్దని లేఖలు …కృష్ణా నదికి రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందీ కలగలేదన్నారు..అమరావతి డిజైన్ సమయంలోనే వరద ఇబ్బందులు లేకుండా కాల్వలు,రిజర్వాయర్లు ప్రతిపాదనలు చేశాము.కొండవీటి వాగు,పాల వాగు ల ప్రవాహంతో పాటు గ్రావిటీ కెనాల్స్ డిజైవ్ చేశామని మంత్రి చెప్పారు..వచ్చే వర్షాకాలం నాటికి ఈ మూడు కెనాల్స్ ను పూర్తి చేసేలా త్వరలోనే టెండర్లు పిలుస్తాం.అనంతవరం నుంచి ఉండవల్లి వరకూ 23.6 కిమీలతో కొండవీటి వాగు,దొండపాడు నుంచి కృషాయపాలెం వరకూ 16.7 కి.మీ మేర పాల వాగు,వైకుంఠపురం గ్రావిటీ కెనల ను 8 కిమీ మేర అభివృద్ధి చేస్తామన్నారు..మొత్తం 48.3 కి.మీ మేర ఈ మూడు కాలువలు అభివృద్ధి చేస్తాం.వాగులు కొన్ని చోట్ల ఉండాల్సిన దానికంటే కూచించుకుపోయిందన్నారు. గత వండేళ్లలో కృష్ణా నదికి వచ్చిన వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకుని మూడు కాల్వలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు.వీటితో పాటు 6 రిజర్వాయర్లు నిర్మాణం కూడా చేపడుతున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు..సీడ్ కేపిటల్ లోపల నీరు కొండ వద్ద 0.4 టీఎంసీలు,కృష్ణాయపాలెం వద్ద 0.1టీఎంసీ లు,శాఖమూరు వద్ద 0.01టీఎంసీలు సామర్థ్యంతో రిజర్వాయర్లు,సీడ్ కేపిటల్ వెలుపల లాం వద్ద 0.3 టీఎంసీ లు,పెద పరిమి వద్ద 0.2 టిఎంసి ల,వైకుంఠపురం వద్ద 0.3 టిఎంసి ల సామర్థ్యం తో మొత్తం 6 రిజర్వాయర్లు నిర్మాణం చేపడుతున్నాం…ఎంత వర్షం వచ్చినా సరే కాలువలు,రిజర్వాయర్లు సరిపోతాయన్నారు..ఒకవేళ ఇవి నిండిపోయినా సరే కృష్ణా నదిలోకి పంపింగ్ చేసేందుకు కూడా ప్రతిపాదనలు ఉన్నట్లు మంత్రి చెప్పారు..12,350 క్యూసెక్కుల కెపాసిటీ తో ఉండవల్లి వద్ద,4000 క్యూసెక్కుల కెపాసిటీ తో బకింగ్ హాం కెనాల్ లోకి,5650 క్యూసెక్కుల కెపాసిటీ తో వైకుంఠపురం వద్ద లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తామని చెప్పారు..అన్నీ పూర్తయితే ఎంత వర్షం పడినా ఒక్క చుక్క కూడా నీరు నిల్వ ఉండదు..భవిష్యత్తులో కృష్ణా నడికి మరింత భారీ వరద వచ్చినప్పటికీ రాజధాని అమరావతికి ఎలాంటి డోకా ఉండదని స్పష్టం చేశారు.
👉వ్యాన్ టైర్ల దగ్గర ఆడుకుంటున్న కొడుకు.. చూసుకోకుండా కొడుకుపైకి వ్యాన్ ఎక్కించిన తండ్రి..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఘటన..
డీసీఎం వ్యాన్ టైర్ల వద్ద ఆడుకుంటున్న కొడుకుని గమనించని తండ్రి, వ్యాన్ ను ముందుకు తీయడంతో టైర్ల కింద నలిగి బాలుడు దుర్మరణం…
👉రిజిస్ట్రేషన్ రూల్స్ ప్రకారం గా తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే సెక్షన్ 81 ప్రకారం గా వారిని 7 ఏళ్ల జైలు* శిక్ష కు గురవుతారు. తప్పు చేసిన అధికారులతో పాటు… ఎవరైతే అధికారులతో ఈ పని చేయించారో వారు కూడా ఈ శిక్షనే వేస్తారు. రండి చేయి చేయి కలపండి కేంద్ర రాష్ట్ర విజిలెన్స్ అధికారులకు గూగుల్ సెర్చ్ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు టెస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ మెయిల్స్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కేంద్ర రాష్ట్ర అధికారుల పూర్తి వివరాలు వెబ్సైట్లో ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చు ఈ అవినీతి లంచగొండి వ్యభిచారులను అవినీతి స్థానిక నాయకులను కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల అధికారులకు మెయిల్ ద్వారా తెలియజేసి పట్టించండి.ఆదాయ పన్ను శాఖ వారికి,ED, it, CB, CiD, విజిలెన్సకి ఆన్లైన్లో ఫిర్యాదులు చేయవచ్చు ఇకనైనా మేధావులు ప్రజలు మౌనం వీడండి మేధావులారా భావితరాల భవిష్యత్తు కోసం రేపటి కోసం ప్రజాధనం ప్రకృతి సంపదను ప్రజల ఆస్తులను కాపాడండి
👉వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘రిటైర్డ్ ఎస్పి షేక్షావలి’ సుడిగాలి పర్యటన..
విజయవాడ వరదబాధితులు సహాయం చేయాలనే మంచి మనసుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ఒకే ఒక్క పిలుపు ఇవ్వడంతో ఉప్పెనల సహాయం చేసేందుకు వివిధరకాలుగా దాతలు ముందుకు వస్తున్నారు.
అందులో భాగంగా సోమవారం వరదప్రాంతాల్లో భవాని నగర్, రామరాజు నగర్ , ఊర్మిళా నగర్ , ప్రాంతాల్లో నిత్యావసరాల సరుకులకు కొంత నగదు, మరియు శారీస్, *రిటైర్డ్ ఎస్పీ షేక్షావలి* 200 కుటుంబాల వరద బాధితులకు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఎలాంటి కష్టాన్నైనా , ఆటుపోట్లను , తట్టుకొని మన రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతారని అన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజలే దేవుళ్ళుగా భావిస్తాడని ఎవరు భయపడాల్సిన పనిలేదని,
వరద బాధితులకు రిటైర్డ్ ఎస్పీ షేక్షావలి మనో ధైర్యాన్ని కల్పించారు.ఇలాంటివి ఎన్ని విపత్తులు వచ్చినాఎదుర్కొంటారని వరద బాధితుల సహాయార్థం స్వచ్చందంగా ముందుకు వచ్చిన నాయకుడు,మునుముందు ఇలాంటి సహోపేతకమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్న మేమందరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి మద్దతుగా నిలబడుతూ ఏ సమయంలోనైనా సహాయపడేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపారు.
👉కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్*
ప్రకాశం జిల్లా కొమరోలు నూతన ఎస్సైగా వెంకటేశ్వర నాయక్ ను నియమిస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో విఆర్ లో ఉన్న వెంకటేశ్వర నాయక్ ను కొమరోలు పోలీస్ స్టేషన్ కు జిల్లా ఎస్పీ బదిలీ చేశారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్సై మధుసూదన్ రావును కనిగిరి నియోజకవర్గం అయినా వెలిగండ్లకు బదిలీ అయ్యారు. అతి త్వరలో ఎస్ఐ వెంకటేశ్వర నాయక్ కొమరోలు ఎస్సైగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
👉మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపిన అన్నా వెంకట రాంబాబు..
*వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమనవ్యకర్త అన్నా రాంబాబు ముస్లిం సోదరులకు మీలాద్ ఉన్ – నబి శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ మీలాద్ ఉన్ నబీ (ప్రవక్త పుట్టినరోజు) పర్వదినం వేడుకలను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్నారు.ప్రవక్త సూచించిన సన్మార్గం ఆచరణీయమని కొనియాడారు.అల్లా కృపతో సర్వమానవళి సుఖసంతోషాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు*…
👉గణేశ్ ఉత్సవాల్లో “అన్నా”..*మార్కాపురం పట్టణంలో బొగ్గరవారి వీధి గణేశ మండపంలో కొనసాగుతున్న ఉత్సవాల్లో మాజీ ఎమ్యెల్యే,**YSRCP సమన్వయ కర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు. *మండపంలో గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అన్న ప్రసాద వితరణకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు,బొగ్గరపు వారి వీధి యూత్, నాయకులు పాల్గొన్నారు.
👉నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అన్నా..
*మార్కాపురం టౌన్ 18వ బ్లాక్ నందు సయ్యద్ గపూర్ గారి నూతన గృహ ప్రవేశానికి హాజరు అయిన మాజి శాసనసభ్యులు,మార్కాపురం వైసీపీ సమనవ్యకర్త అన్నా రాంబాబు *గణేశ్ ఉత్సవాల్లో “అన్నా”..*
*మార్కాపురం పట్టణంలో హరిజనవాడలోని గణేశ మండపం కమిటీ ఆధ్వర్యంలో సాగిన నిమజ్జనం (శోభాయాత్ర) ఉత్సవంలో మాజీ ఎమ్యెల్యే,*YSRCP సమన్వయ కర్త అన్నా రాంబాబు పాల్గొన్నారు.*ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికి ఆహ్వానించారు.*
*మండపంలో గణేశునికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం*
*నిమజ్జన (శోభాయాత్ర)కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు,హరిజనవాడ యూత్,నాయకులు పాల్గొన్నారు.
👉గణేశుని లడ్డూ రూ. 2,08,000 లక్షలకు కైవసం..
ప్రకాశం జిల్లా మార్కాపురంలో గ్రామంలోని మెయిన్ బజార్ విఘ్నేష్ స్వామి దేవాలయం వినాయక నిమజ్జనం సందర్భంగా సోమవారం గణేష్ లడ్డూ, విగ్రహ కమిటీ వేలంపాటను నిర్వహించారు. మార్కాపురం గ్రామానికి చెందిన దోర్నాల శ్రీ రంగా వైద్యశాల డాక్టర్ లావణ్య కాశీ రావు దంపతులు లడ్డూ ప్రసాదాన్ని రూ 2,08,000 లక్షలకు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా వారిని విగ్రహ కమిటీ సభ్యులు శాలువా,పూలమాలతో సత్కరించారు.
👉 జాదూగర్ జానీ మాస్టర్..సంచలన విషయాలు బయటపెట్టిన, బాధితురాలు..▪️పరారీలో జానీ మాస్టర్…హైదరాబాద్..
▪️ షూటింగ్ సమయంలో వ్యాన్‌లోకి వచ్చి బలవంతం చేశాడు.▪️లైంగికంగా నన్ను ఎంతో వేధించాడు … ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడు -బాధితురాలు.▪️రేప్ కేసు నమోదుకావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.▪️సోమవారం ఉదయం చెన్నె వెళ్లిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ▪️బాధితురాలిని తన ఇంట్లోనే 3 గంటలపాటు విచారించి అనంతరం భరోసా కేంద్రానికి తరలించారు.
👉జర్నలిస్ట్ ల భద్రతా,సంక్షేమమే ప్రధాన లక్ష్యం గా జె డి ఆర్ ఎఫ్..మేడా శ్రీనివాస్ జె డి ఆర్ ఎఫ్..
ప్రజాకాంక్ష సారథ్యంలో జరిగిన జరలిస్ట్స్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం (జె డి ఆర్ ఎఫ్ ) సమావేశంలో హక్కులు, నైతిక విలువలు కోసం దిశా నిర్దేశం చేస్తున్న జె డి ఆర్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్..స్వచ్ఛమైన జర్నలిజం కార్పొరేట్ కాలుష్యం కొరల్లో చిక్కుకున్న నేటి రోజుల్లో జర్నలిజం బ్రతికి వుంది అని నిరూపిస్తున్నజె డి ఆర్ ఎఫ్ సేవలు సమాజానికి ఎంతో అవసరం అని ఆ దిశగా ప్రజల విశ్వాసం పొందాలని ఆయన సూచించారు.జర్నలిస్టుల పై జరిగే దాడులు , దౌర్జన్యాలను చట్ట బద్దంగా ఎదుర్కోవటంలో మన విలేఖరులు సమయస్ఫూర్తిని ప్రదర్శించాలని , జర్నలిస్టులపై అక్రమంగా బనాయించే అక్రమ కేసులకు భయపడకుండా సామాజిక భాద్యతలను దైర్యంగా నిర్వహించటంలో ఎన్నడు వెనుకంజ వేయకూడదని , జర్నలిస్తులపై జరిపే అధికారిక వేధింపులనుండి రక్షించాటానికి జె డి ఆర్ ఎఫ్ నిరంతరం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.జర్నలిస్టులులకు పూర్తి స్థాయి ఆరోగ్య భద్రత,వ్యక్తిగత భద్రత కల్పించటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని,త్వరలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక కార్యాచరణ సిద్ధం చేస్తామని,అక్రమాలను వెలికి తీయటంలో జె డి ఆర్ ఎఫ్ సభ్యులు ఎవ్వరికి భయపదాల్సిన అవసరం లేదని , ప్రతి భాధిత జర్నలస్టుకు
జె డి ఆర్ ఎఫ్ అండగా నిలుస్తుందని,నేరాలకు దూరంగా వుండాలని , నేరాలను బాహ్య ప్రపంచానికి తెలియచేయటంలో జర్నలిస్ట్ ప్రధాన భూమిక పోషించాలని , అధికార దుర్వినియోగంతో జర్నలిస్తులను వేధింపులకు గురించేయాలనుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని జె డి ఆర్ ఎఫ్ ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ హెచ్చిరించారు.
ఈ సభకు జె డి ఆర్ ఎఫ్ అధ్యక్షులు పూలతోట కృష్ణ అధ్యక్షత వహించారు.సమావేశంలో సీనియర్ న్యాయవాది జె డి ఆర్ ఎఫ్ న్యాయ సలహా దారులు తోరాటి వసంతరావు ఏపీ ఉద్యోగ సంఘాల జె ఏ సి చైర్మన్ కేతా శ్రీనివాసరావు వివిధ జిల్లాల జె డి ఆర్ ఎఫ్ ప్రతినిధులు , ప్రజాకాంక్ష స్టాఫ్ రిపోర్టర్లు , మండల రిపోర్టర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై జర్నలిస్తుల సమస్యలపై ప్రసంగించారు ..
👉*కర్ణాటక*బాలిక సాహసం..మంగళూరులో ఒక మహిళ రోడ్డు దాటుతూ వచ్చే ఆటోను గమనించకపోవడంతో ఆటో డ్రైవర్ ఆమెను తప్పించబోయి అద్భుతప్పి ఆమె మీదే బోర్ల పడ్డది ఆటో. అప్పుడే అదే రోడ్డు పై నుండి స్కూల్ నుండి వస్తున్న ఒక పాప సడెన్ గా చూసి వెంటనే ఆటోను ఒక్కసారిగా ఎత్తేసింది.ఆ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డు అవడంతో అది చూసిన సిటీ కమిషనర్ తన ఆఫీసుకు రప్పించుకొని ఆ అమ్మాయి సాహసాన్ని మెచ్చుకొని సన్మానం చేశాడు.
రాహుల్ నాలుక కోస్తే రూ.11 లక్షలిస్తా..శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..అమరావతి పూర్తిగా సేఫ్ జోన్ లో ఉంది-మంత్రి పొంగూరు..వరద బాధితుల సహాయ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పి షేక్షావలి..తప్పుగా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేస్తే ఏడేళ్ల జైలు శిక్ష..సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రెడ్‌కార్పెట్లు కనపడవ్..జర్నలిస్ట్ ల భద్రతా,సంక్షేమమే ప్రధాన లక్ష్యం గా జె డి ఆర్ ఎఫ్.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే అన్నా..గణేశుని లడ్డూ రూ.2,08,000 లక్షలకు కైవసం
Recent Posts