ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా..కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీం కోర్టు..వివేకా కుమార్తె రిక్వెస్ట్ – సరేనన్న చంద్రబాబు..సిఎం సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు 5 లక్షల విరాళం..విశాఖలో దారుణ హత్య కలకలం..కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల..

👉 ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా
రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు అందించిన అరవింద్ కేజ్రీవాల్.వారం రోజుల్లో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఆతిశీ.అప్పటివరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్న అరవింద్ కేజ్రీవాల్…
👉 సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
దేశవ్యాప్తంగా బుల్డోజర్ యాక్షన్‍పై సుప్రీంకోర్టు స్టే.
అక్టోబర్ 1 వరకు కూల్చివేతలు చేపట్టవద్దన్న సుప్రీం కోర్టు.
ప్రభుత్వ ఆస్తులు ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు.
రైల్వే లైన్లు, ఫుట్‍పాత్‍లు, రోడ్లు, చెరువులను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవచ్చు.: సుప్రీం కోర్టు..
👉ఏడు కొండ‌ల వాడితో పెట్టుకోవ‌ద్దు… జ‌గ‌న్ కు లోకేష్ వార్నింగ్..!!! ఫేకు వార్త‌ల జ‌గ‌న్ అంటూ వైఎస్ జ‌గ‌న్ చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌పై విమ‌ర్శించే మంత్రి నారా లోకేష్… ఈసారి జ‌గ‌న్ ను తీవ్ర స్థాయిలో హెచ్చ‌రించారు. నువ్వు మార‌వు… నీ ఫేకు మూక‌లు మార‌వు… ఫేక్ జ‌గ‌న్, ఫేక్ చేసి చేసీ 151 స్థానాల నుండి 11కు ప‌డిపోయావు. మంత్రి సంధ్యారాణి ఇంట్లో త‌న మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల‌ను తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ట్లు ఫేక్ ప్ర‌చారం చేస్తావు. శ్రీ‌వారితో పెట్టుకోవ‌ద్దు.
ఏడు కొండ‌ల‌పై నీ విష రాజ‌కీయాలు వాడొద్దు. ఇదే తీరు కొన‌సాగితే నీకు ఒక్క సీటు కూడా రాకుండా పోతావ్ అంటూ లోకేష్ హిత‌వు ప‌లికారు. మంత్రి సంధ్యారాణి త‌న బంధువుల‌తో పాటు కొంద‌రు మీడియా వారిని తీసుకొని తిరుమ‌ల వెళ్లార‌ని, అక్క‌డ ఓ అతిధి గృహంలో ఇలా డ్యాన్సులు చేస్తున్నారంటూ వైసీపీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసింది. తిరుమ‌ల పవిత్ర‌త‌ను కాపాడుతాం అని చెప్పే ప్ర‌భుత్వం ఏం చేస్తోంది అంటూ విమ‌ర్శించింది. అయితే, అది త‌ప్పుడు వీడియో అని… ఇంట్లో మ‌న‌వ‌రాలి బ‌ర్త్ డే వేడుక‌ల వీడియోల‌ను, తిరుమ‌ల‌లో జ‌రిగిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని మంత్రి వివ‌రించారు.
👉వివేకా కుమార్తె రిక్వెస్ట్ – సరేనన్న చంద్రబాబు..!*
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకా నందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డిని గత వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది.

వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
*ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీనిపై ఇవాళ సునీతారెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు.*
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ చురుగ్గా దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రభుత్వ పెద్దలు దీన్ని పక్కదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.ఇదే క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డితో సీబీఐ ఎస్పీ రాంసింగ్ తో పాటు సునీతారెడ్డి దంపతులపై కేసు పెట్టించారు. దీనిపై వీరు కోర్టుల్లో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. అయినా పోలీసులు నమోదు చేసిన కేసు కావడంతో దీన్ని తిరిగి ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్ధితి.దీంతో *ఇవాళ వివేకా కుమార్తె సునీతారెడ్డి తన భర్త రాజశేఖర్ రెడ్డితో కలిసి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు.* వివేకా హత్య, అనంతర పరిస్ధితులు, దర్యాప్తు, తమపై పోలీసులు పెట్టిన కేసు గురించి ఆయనకు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు తనకు అన్ని వివరాలూ తెలుసన్నారు. *పోలీసులు సునీతారెడ్డి దంపతులుపై పెట్టిన కేసు వివరాలు తెప్పించుకుని ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపారు. దీంతో సునీతారెడ్డికి ఊరట దక్కినట్లయింది
👉ఈరోజు విజయవాడ లోని రాష్ట్ర సచివాలయంలో విజయవాడ వరద బాధితులకు సహయార్థం *ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి 10 లక్షల రూపాయిలు CMRF చెక్కు ను* అందజేసిన *పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి (బిటెక్ రవి)* గారు తన సొంత నిధులు ఆరు లక్షలు ఇయ్యడం జరిగింది మరియు నాలుగు లక్షల రూపాయిలు పులివెందుల నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు ప్రజలు అందించడం జరిగింది.
👉నిపాతో మృతి చెందిన వ్యక్తి.. గతంలో కాలు చికిత్స కోసం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు నిపాతో మృతి చెందిన వ్యక్తి.. గతంలో కాలు చికిత్స కోసం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు: కేరళలో నిపా వైరస్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. దీనికి ముందు అతని కాలికి గాయం కావడంతో చికిత్స కోసం బెంగళూరు నుంచి మలప్పురంలోని తన ఇంటికి వచ్చాడని పలు కథనాలు తెలిపాయి. ఈ సమయంలో మెనింజైటిస్ లక్షణాలు కనిపించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. “అతని కాలు మీద గాయం ఉంది. దాని కోసం చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను జ్వరం, వాంతులు సమస్యను ఎదుర్కొన్నాడు” అని పంచాయతీ సభ్యుడు ఒకరు చెప్పారు.
👉అంతా ఆయనే చేశారు..*ముంబై నటి కేసులో కీలక మలుపు.. ఇంటెలిజెన్స్ డీజీ సూత్రధారి!ముంబై నటి జెత్వానీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంటెలిజెన్స్డీ జీ పీఎస్ఆర్ ఆంజనేయులు చెబితేనే ఇదంతా చేశామని డీసీపీ విశాల్ గున్నీచెప్పారు.విశాఖకు బదిలీ చేసినా కేసు పూర్తి చేస్తేనే రిలీవ్ ఆర్డర్ ఇస్తానని డీజీ ఒత్తిడి
చేసినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
👉బస్సు కింద పడి యువకుడు మృతి..
ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు టైరు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లికి చెందిన తాటి శ్రీరామ్ (19) ద్విచక్రవాహనంపై సోమవారం చెరుకుపల్లి నుంచి సత్తుపల్లికి వస్తుండగా, కిష్టారం వై-జంక్షన్ సమీపాన ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనం రహదారిపై ఉన్న గుంతలో పడడంతో అదుపుతప్పింది. ఆ యువకుడు ప్రమాదవశాత్తు బస్సును ఢీకొని వెనుక టైరు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
👉సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ కాల్ చేసి.. పౌరులను భయపెట్టి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు*
సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ కాల్ చేసి.. పౌరులను భయపెట్టి దోచుకుంటున్న సైబర్‌ నేరగాళ్లు.
తాజాగా సైబర్‌ నేరగాళ్లు ‘మీరు ఏం చూస్తున్నారో మాకు తెలుసు’ అని తాము సైబర్‌క్రైమ్‌ పోలీసులమంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మీరు చిన్నారుల అశ్లీల వీడియోలు చూస్తున్నారని.. తమ పరిశోధన విభాగం నిఘాలో మీ ఐపీ అడ్రస్‌లో వీడియోలను వీక్షిస్తున్నట్లు గుర్తించాం, అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేస్తామంటూ పౌరులను భయపెట్టి అందినంత సొమ్ము వసూలు చేస్తున్నారు. పోలీసులు ఈవిధంగా బెదిరించరని ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌క్రైమ్‌ పోలీసులు సూచిస్తున్నారు.
👉 పల్నాడు జిల్లా..
మాచర్ల మండలం నాగార్జునసాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.4,54,000 లక్షల విలువచేసే గోవా మద్యం పట్టివేత..
గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1236 మద్యం ఫుల్ బాటిళ్లు, 72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్న పోలీసులు
👉ముఖ్యమంత్రి సహాయ నిధికి సీనియర్ జర్నలిస్టు అంకబాబు 5 లక్షల విరాళం..
*సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం అందించిన సీనియర్ జర్నలిస్టు అంకబాబు..
*అమరావతి..*సీనియర్ జర్నలిస్టు అంకబాబు కామెంట్స్…*
సామాజిక బాధ్యతగా సీఎం సహాయ నిధికి విరాళం అందించాను..ఇది ఓ జర్నలిస్టుగా నాబాధ్యత..
విపత్తు సమయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదు ..విపత్తు సమయంలో ఏడుపదుల వయస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించిన చొరవ, సమయస్ఫూర్తి అద్భుతం..కలెక్టరేట్ లో 9 రోజులపాటు బస్సులోనే ఉంటూ అధికారులను చంద్రబాబు పరుగులు పెట్టించారు..
వరదలో చిక్కుకుపోయిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆపన్నహస్తం అందించారు..వరద బాధితులకు ఆహారం, నీరు, పాలు అందించారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పాలన దక్షత వరద బాధితులను విపత్తు నుండి గట్టెక్కించింది.నేను 40 ఏళ్లుగా విజయవాడలో జర్నలిస్టుగా పని చేశానుఎపుడు ఇలాంటి విపత్తు చూడలేదు..దేశంలో ఏ నాయకుడు బాబు గారి మాదిరిగా విపత్తుల సమయం లో ఇలా స్పందించిన దాఖలాలు లేవు..విపత్తు చూసి నేను చలించిపోయాను.నా కుమార్తె లక్ష్మి, కుమారుడు రంజిత్ లు అమెరికా లో ఉద్యోగాల్లో ఉన్నారు.. వాళ్ల ప్రోత్సాహంతోనే ఐదు లక్షల విరాళం ఇచ్చాను..
👉సత్తెనపల్లి డిఎస్పీ గా విధుల్లో చేరిన హనుమంతరావు
*పల్నాడు జిల్లా..సత్తెనపల్లి డిఎస్పీ గా *మెదరమెట్ల హనుమంతరావు* మంగళవారం విధుల్లో చేరారు.
1991 ఎస్ఐ బ్యాచ్ కి చెందిన ఈయన సత్తెనపల్లి, గుంటూరు కొత్తపేట, పెద్దకాకాని, నరసరావుపేట, పిడుగురాళ్ల స్టేషన్లలో ఎస్ఐ గా పని చేశారు.
*సీఐ* గా గుంటూరు లాలాపేట, అమరావతి పిడుగురాళ్ల, నెల్లూరు జిల్లా గూడూరులో పని చేశారు.
మూడేళ్ల క్రితం *డిఎస్పీగా* పదోన్నతి పొందిన ఈయన బదిలీపై ఇక్కడికొచ్చారు.
👉 వైసీపీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి దౌర్జన్యం ఏడు సెంట్ల స్థలం కబ్జా..బుక్కరాయసముద్రం మండలం చేదుల్ల గ్రామంలో పొదుపు మహిళ సంఘాల కు కేటాయించిన ఏడు సెంట్ల భూమిని ఆక్రమణ ..రెవెన్యూ అధికారులు సర్వే కి వెళ్తే తన అనుచరులతో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య కు చేసుకుంటాం అంటూ బెదిరింపులు..
ఇందుకు వత్తాసుగా బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ టిడిపి నాయకులు ఆరోపణ..
అందులో వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన వైసీపీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి..గ్రామ కంఠం స్థలం దర్జాగా ఆక్రమణ ..
ఐదు సెంట్ల స్థలంలో ఫినిషింగ్ వేసి రుబాబు..
రెవెన్యూ అధికారులు స్థలం కు సంభందించిన పత్రాలు చూపించని సర్పంచ్..స్థలం తమదే అంటూ ఆక్రోశం చెందుతున్న సర్పంచ్..అధికారులు పత్రాలు అడగడంతో తెల్ల మొహం వేసిన శ్రీనివాస్ రెడ్డి..స్పందనలో కలెక్టర్ కి పలు మార్లు ఆర్జీలు ఇచ్చిన గ్రామస్థులు
👉 డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శివ నారాయణస్వామి
డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శివ నారాయణస్వామి
కదిరి డీఎస్పీగా శివ నారాయణ స్వామి సోమవారం సాయంత్రం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు డీఎస్పీ శివ నారాయణ స్వామికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ. అసాంఘిక కార్యకలాపాలుపై ఉక్కు పాదం మోపి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు.
👉ఆటో బోల్తా ఒకరు మృతి, పలువురికి గాయాలు*.
పల్నాడు జిల్లా వినుకొండనియోజకవర్గం
నూజండ్ల మండలం పమిడిపాడు నుండి వినుకొండ వస్తున్న ఆటో తెల్లబాడు సమిపంలో బోల్తా పడి ఒక వ్యక్తి మృతి చెందాడు… పలువురు గాయపడ్డారు, మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 👉 దారుణ హత్య.. మృతుడి శరీరంపై 18 కత్తిపోట్లు..
విశాఖలో దారుణ హత్య కలకలం రేపుతోంది. సినిమా తరహాలో వ్యక్తిని వెంటాడి వేటాడి కత్తితో నరికి చంపారు. పక్కా ప్లాన్ ప్రకారం గణేష్ ఊరేగింపులో దుండగులు హత్య చేశారు. మృతుడు భరణిక రాము (35)గా పోలీసులు గుర్తించారు. మృతుడిని 18 సార్లు కత్తితో పొడిచినట్లు వెల్లడించారు. పాత కక్షలు, అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి*
ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీలో స్వచ్ఛతాహిసేవా కార్యక్రమం కమిషనర్ వెంకట దాస్ ఆధ్వర్యంలో గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి, ప్రధాన వీధులను శుభ్రపరుస్తూ ప్రతిజ్ఞకార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పరిసరాలను వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతిజ్ఞ చేయించారు.
👉కంభం పట్టణంలో మోడీ జన్మదిన వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల*
*భారత దేశాన్ని పటిష్టం చేసిన ఘనత నరేంద్ర మోడీ దేనని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా కంభం పట్టణంలోని చౌక్ సెంటర్ లో బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి బిజేపి నాయకులకు టిడిపి జనసేన నాయకులకు తినిపించారు. అనంతరం కంభం పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ బిజెపి నాయకులు, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.*డివిజన్ ఇంచార్జ్ అసలం బేగ్
👉విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గోన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల* సృష్టికర్తగా, ఆహార ప్రదాతగా, దేవశిల్పిగా పూజలందుకునే విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు పట్టణంలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మరియు మండల రెవిన్యూ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్బంగా విశ్వకర్మ భగవాన్ చిత్ర పటానికి పూజలు నిర్వహించారు. సకల కళలకు, రకరకాల వృత్తులకు ఆద్యుడు, నాగరికతకు మూలపురుషుడు అయిన విశ్వకర్మ జయంతి సందర్భంగా సకల వృత్తి కళాకారులకు విశ్వకర్మ భగవానుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలకు శుభం కలగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో విశ్వకర్మ కమిటీ సభ్యులు,పట్టణ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గోన్నారు..
👉రోడ్డు లేక కర్రకు మృతదేహాన్ని కట్టి 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు..
విజయనగరం జిల్లా గంట్యాడ (మ) కొండపర్తికి చెందిన రాజారావు అనే గిరిజనుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.అతని మృతదేహం తరలించడానికి బోటు లేక, రోడ్డు లేక గిరిజనుల అవస్థలు పడుతూ.. ఒక కర్రకు రాజారావు మృతదేహాన్ని కట్టుకొని 7 కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొని వెళ్లారు…

7k network
Recent Posts

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.

*డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు…ఎవరూ నమ్మవద్దు: ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు*…*అభిషేకం టికెట్ల పేరుతో టోకరా..*హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య (మెదక్ జిల్లా కొల్చారం) ..* దళారుల మాటలు నమ్మకండి.. జిల్లా ఎస్పీ పి జగదీష్ .. *నల్లగొండ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం… *మాతా శిశుకేంద్రంలో వైద్యం వికటించి బాలింత మృతి…*పేలిపోయిన విమానం,70 మంది మృతి.. *మహిళ అనుమానాస్పద మృతి (గుంటూరు జిల్లా నంబూరు) .. *మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు .. *ఏపీ రాజ‌కీయం.. నాడు – నేడు : ఎవ‌రి లాభం వారిదే ..! ..*శ్రీ గంధం తరలిస్తున్న దొంగలు ముఠా అరెస్ట్ (చిత్తూరు)

11 సీట్లు వచ్చినా అహంకారం తగ్గలేదు… తోలు తీసి కూర్చోబెడతాం: పవన్ కల్యాణ్*..*DCM మన్యం పర్యటనలో నకిలీ IPS హల్‌చల్…! *కొడాలి నాని రాజ‌కీయ స‌న్యాసం..ఏపీలో ఈ ఏడాది సైబర్ క్రైమ్ రేట్ పెరిగింది డిజిపి ద్వారకా తిరుమల రావు …..హోంమంత్రి అమిత్ షా రాజీనామా కోసం ఈ నెల 30న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి..”వామపక్షాల పిలుపు (తిరుపతి)…*పెండింగ్ లో ఉన్న 150 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటన్నే పూర్తి చేసి ఇండ్లు లేని పేదలకు ఇవ్వాలి (మహబూబాబాద్ సిపిఎం డిమాండు)..*మహబూబాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగుల ధర్నా…*పాల్వంచకు చెందిన పాస్టర్‌ అఘాయిత్యం*

రైతు సమస్యలపై చర్చించేందుకు సమయమివ్వండి.. *రాష్ట్రపతిని కోరిన సంయుక్త కిసాన్‌ మోర్చా .. కొనసాగుతున్న రైతుల ఆందోళనలు …*మూడు మిస్సింగ్ కేసులును ఛేదించిన విశాఖ నగర పోలీసులు… *వరుస దొంగతనాలు చేసే దొంగల ముఠా అరెస్ట్ ..* హత్య కేసును ఛేదించిన ప.గో జిల్లా పోలీసులు ..*విజయవాడలో పలువురు సిఐల స్థాన మార్పిడి.. *ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తల్లితండ్రులు…* హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించిన పోలీసులు .. *2.83 లక్షల నగదు చోరీ.. EMI కడతావా లేదంటే నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా: యువతికి బెదిరింపులు ..(తిరుపతి) …*దొంగల ముఠా అరెస్టు ..(సత్యవేడు) ..

మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’ !!! ..సైలెంట్‌గా సినిమా చూసి వస్తే ఈ ఘటన జరిగి ఉండేది కాదు.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తమ్మారెడ్డి.. *చనిపోయిందని బన్నీకి చెప్పినా సినిమా చూశాకే వెళ్తానన్నాడు: ఏసీపీ.. *రూ.15 లక్షలు మద్యం పట్టివేత • డ్యూటీ ఫ్రీ మద్యం ముసుగులో లిక్కర్ వ్యాపారం… *లా కాలేజీలో ర్యాగింగ్ భూతం (నెల్లూరు) .. మచిలీపట్నంలో దొంగ నోట్ల కలకలం … తండ్రి తీసుకున్న డబ్బులకు పోలీసులు తనను వేధిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని …