ఆ నాలుగు నగరాలు కలిపి మెగా సిటీ!..మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ఓట‌మి ఖాయం..విజయవాడ స్వర హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి మృతి.. అందుకే ప్ర‌ధాని పారిపోయారు-సీఎం రేవంత్..సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు( పొదిలి).. 👉 విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు..కానరాని పరిశుభ్రత (కంభం)..బాలల భవితకు బాసటగా గ్రామ సభలు..అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ‘ఉచిత గ్యాస్’:మంత్రి నాదెండ్ల..

👉 మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ఓట‌మి ఖాయం.. అందుకే ప్ర‌ధాని పారిపోయారు’ మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌పార్టీ నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ కూట‌మి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూట‌మి ప‌ట్ల మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు చాలా విశ్వాసంతో ఉన్నార‌ని తెలిపారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి ఇక్క‌డ బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి కూట‌మి అధికారంలోకి వ‌చ్చింద‌న్నారు. ఇప్పుడు మ‌హాయుతిని మ‌ట్టుబెట్టేందుకు మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు రెడీగా ఉన్నార‌ని రేవంత్ చెప్పారు. ఈ విష‌యం తెలుసు కాబ‌ట్టే.. బీజేపీ ఓట‌మి ఖాయ‌మ‌ని నిర్ణ‌యించుకున్నారు కాబ‌ట్టే.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ విదేశాల‌కు పారిపోయార‌ని (విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లడంతో ) రేవంత్ నిప్పులు చెరిగారు. బీజేపీ స‌హా ప్ర‌ధాని మోదీ మ‌హారాష్ట్ర‌లో ఓట‌మిని ముందుగానే అంగీక‌రించార‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.
ఆసాంతం హిందీలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి ప్ర‌ధాని స‌హా బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మూడే ళ్ల మ‌హాయుతి పాల‌న‌లో మ‌హారాష్ట్ర‌లో ఒక్క అభివృద్ధి ప‌ని కూడా జ‌ర‌గ‌లేద‌న్నారు. చెప్పుకొనేందుకు ఏమీ లేక‌.. కాంగ్రెస్ కూట‌మి మ‌హావికాస్ అఘాడీపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. విభ‌జిత రాజ కీయాల ద్వారా ల‌బ్ధి పొందాల‌ని చూసే మోడీ ఆయ‌న ప‌రివారానికి ప్ర‌జ‌లు బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌ని తెలిపారు. మ‌హావికాస్ అఘాడీ ప్ర‌భుత్వం ఏర్పాటు అవుతుంద‌న్నారు. కానీ, 288 అసెంబ్లీ స్థానాలున్న మ‌హారాష్ట్ర శాస‌న స‌భ‌కు.. ఈ నెల 20న ఒకే విడ‌త‌లో ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌చారం ముగియ‌నుంది. బీజేపీ నేతృత్వంలోని మ‌హాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ కూట‌ములు ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా త‌ల‌ప‌డుతున్నాయి. ఇరు ప‌క్షాలు వారి వారి ముఖ్య‌మంత్రుల‌ను అగ్ర నాయ‌కుల‌ను రంగంలోకి దింపి ప్ర‌చారం సాగిస్తున్నాయి.
👉 సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఆ నాలుగు నగరాలు కలిపి మెగా సిటీ!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న టీడీపీ కూటమి సర్కారు..
ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. అమరావతి నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.15000 కోట్లు సాయం సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
రాజధాని నిర్మాణ పనులలో వేగం పెంచింది. త్వరలోనే రాజధాని నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలవనున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్నం అమరావతి నిర్మాణంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నాలుగు ప్రధాన నగరాలను కలిపి మెగా సిటీగా తీర్చిదిద్దాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతిని కలిపి మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తోంది.వచ్చే పాతికేళ్లలో ఈ నగరాలను అనుసంధానం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే రియల్ ఎస్టేట్ కీలకమని సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుకున్నట్లు మెగా సిటీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇప్పటికే గుంటూరు, విజయవాడ మధ్య భూములకు భారీగా డిమాండ్ ఉంది. ఈ ప్రాంతంలో భూముల రేట్లు చుక్కలను అంటుతున్నాయి. వీటికి మంగళగిరి, అమరావతిని కూడా అనుసంధానిస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మెగా సిటీ నిర్మాణం దిశగా అడుగులు వేస్తే మరిన్ని ప్రాజెక్టులు ఏపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు, అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అనుసంధానం కూడా మరింత ఈజీ కానుంది. అలాగే అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు వెళ్లే ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ రానుంది.
మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణం కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 360 కి.మీ.ట్రంక్‌ రోడ్లు నిర్మించనున్నారు. అమరావతికి వరద ముప్పు లేకుండా ఉండేలా రిజర్వాయర్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. మరోవైపు రాజధాని నిర్మాణంలోని సింగపూర్‌ను మళ్లీ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది.
👉 విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు.. కానరాని పరిశుభ్రత..
కంభం మరియు కందులాపురం హజరత్ గూడెం పంచాయతీల పరిధిలో తీవ్రంగా ప్రబలి పోతున్నాయి ఇంటికి ఒకరు ఇద్దరు తప్పనిసరిగా జ్వరాలకు గురవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కంభం ప్రభుత్వ వైద్యశాలలో వచ్చే రోగులలో నూటికి 70 మంది జ్వరాల బారిన పడిన వారే ఉన్నారట ఉన్నారని సమాచారం. అంటే పరిస్థితి ఎంత విషమంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక స్తోమత కలిగిన వారు ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించి వైద్యం చేయించుకుంటూ ఉండగా లేనివారు మాత్రం ప్రభుత్వ వైద్యశాలలకు వెళ్లి చికిత్సలు పొందుతున్నారు.ఈ రెండు పట్టణాలలో మురుగు మీరు పారే సౌకర్యం లేకపోవడంతో ప్రజల నివాస గృహాల నుండి వచ్చే వ్యర్ధాలను వ్యక్తపు నీతిని కంభం చెరువు సప్లై ఛానల్ లోనే వదిలేస్తుంటారు. కంభం చెరువు సప్లై ఛానల్ స్థానిక కాపవీధి సంగా వీధి కందులాపురం పంచాయతీలోని పలు వీధుల గుండా ఏర్పాటు చేయబడి ఉంది. ఈ పట్టణం పరిధిలోని కాల్వలలో పేరుకుపోయిన చెత్తాచెదారాలు ఏళ్ల తరబడిగా తొలగించక పోవడంతో ఈగలు,దోమలు విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ అంటే జ్వరాలకు గురవుతున్నారు.
👉 పంట కాల్వలలో ప్రజలు వేస్తున్న చెత్తాచెదారాలను తొలగించే పని మాత్రం తమది కాదని గ్రామపంచాయతీ అధికారులు చేతులు దులిపేసుకుంటూ ఉంటారు నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం తమ శాఖ కు చెందిన వంటకాలు వలలో ప్రజలు వేసే చెత్తాచెదారాలు తాము ఎలా తొలగిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు వాపోతుంటారు అయినప్పటికీ ఐదు ఆరు ఏళ్లకు ఒకసారి మాత్రం నీరు పారెందుకు తూతూ మంత్రంగా చెత్తాచెదారాలు తొలగించి పంట కాలువల గట్లపై వేసి చేతులు దులిపేసుకుంటుంటారు. ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలకు వస్తుండడంతో సుమారు 5 ఏళ్ల కిందట ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అప్పట్లో రెవెన్యూ మండల అభివృద్ధి శాఖ అధికారులు వంటకాలువలను పరిశీలించి చెత్తాచెదారాలు తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ కొన్నిచోట్లలో మాత్రమే చెత్తాచెదారాలు తొలగించి చేతులు దులిపేసు కున్నారు. కంభం చెరువు సప్లై ఛానల్ లు కంభం,హజరత్ గూడెం,కందులాపురం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి.ఈ మూడు పంచాయతీల వారు వీధులలోని డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను మాత్రమే తొలగిస్తున్నారు కానీ పంట కాలువలలో ప్రజలు వేస్తున్న చెత్తాచెదారాలు పెద్ద ఎత్తున పేరుకుపోయినా, వాటిని తొలగించడం పై పంచాయతీ అధికారులు, కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రత్యేక చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పంట కాలువలలో చెత్తను తొలగించకపోవడంపై ప్రజలు సర్వత్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ఈ పంట కాలువలలో చెత్త వేయకుండా అయినా
చర్యలు తీసుకోవాలనిప్రజలు కోరుతున్నారు.

👉టైఫాయిడ్ టెస్టింగ్ కిట్లు ఐపోయి నెల దాటిన నేటికీ టెస్టింగ్ కిట్లు రాలేదని సమాచారం.. దీంతో మెసేజ్ చూడాలని పరీక్ష చేయించుకునేందుకు పేదల సైతం ప్రైవేటు వైద్యశాలలను ల్యాబ్లను ఆశ్రయించవలసి వస్తుంది..
👉 బంగారు బాల్యం మండలస్థాయి పోటీల్లో ఆల్ఫా విద్యార్థులు…
నిర్వహించిన మండలస్థాయి బంగారు బాల్యం కార్యక్రమామంలో వివిధ విభాగాలలో పాల్గొని మూడింటిలో ద్వితీయ బహుమతులు సాధించిన విధార్థులను అభినందించిన మండల విద్యాశాఖాఆధికారులు.చదువుతో పాటు కర్రీక్యూలర్ కార్యక్రమాలలో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్న యాజమానాన్యాన్ని అభినందించారు. నినాదాలు విభాగంలో ఆల్ఫా గ్రేస్, లోగో క్రియేషన్ విభాగంలో నిషాంత్ మరియు డిబేట్ విభాగంలో షబనమ్ గెలుపొందారు. వీరిని హెడ్ మాస్టర్ ఏడుకొండలు, అడ్మినిస్ట్రేటివ్ నజీర్ మరియు ఉపాధ్యాయులు అభినందించారు.
👉సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు.. ప్రకాశం జిల్లా..దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తో పాటు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన ఆర్టీసీ డిఎం సుందర్ రావు..*పొదిలి మార్కాపురం రోడ్డులో సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి పది వాహనాలపై కేసు నమోదు చేసిన దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్…సరైన పత్రాలు లేని వాహనాలకు 70 వేల రూపాయలు జరిమానా విధించిన దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవికుమార్..నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం సుందరరావు ఆయనతోపాటు పాల్గొన్నారు.
👉 *బాలల భవితకు బాసటగా గ్రామ సభలు* ..మండలంలోని హజరత్ గూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మహబూబ్ పీరా అధ్యక్షతన సోమవారం బాలల గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ ప్రత్యేక అధికారి మరియు ఎంఈఓ బి.మాల్యాద్రి మాట్లాడుతూ, బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా బాలలకోసం ప్రత్యేక గ్రామ సభను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దేశ భవితకు బాలల పురోగతే ప్రధానమని, బాల బాలికలు వారిమధ్య అంతరాలను అసమానతలను అధిగమించి అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. సర్పంచ్ మహబూబ్ పీరా మాట్లాడుతూ 2007 సంవత్సరం నుండి జన్మించిన పిల్లలు వారి జనన ధ్రువీకరణ పత్రాల కోసం సచివాలయంలో సంప్రదించాలని, విద్యార్థులు వారి హక్కులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.అనంతరం విద్యార్థులతో బంగారు బాల్యం ప్రతిజ్ఞను చేయించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరి,ఉపాధ్యాయుడు ఓ రవిబాబు, సిఆర్పీలు,ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
👉అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ‘ఉచిత గ్యాస్’:మంత్రి నాదెండ్ల*
ఏపీలో బడ్జెట్లో దీపం-2 పథకానికి పూర్తిస్థాయిలో నిధులు ఎందుకు కేటాయించ లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స ప్రశ్నించారు. దీనికి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ‘రాష్ట్రంలో 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తాం.ఇప్పటికే 30
లక్షల మందికి డెలివరీ చేశాం. ఈ కార్యక్రమం పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. దీనికి పూర్తి నిధులు
కేటాయించాం’ అని చెప్పారు.
👉ఏపీలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం*
ఏపీలో ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళిక అమలు చేస్తుంది. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది.ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకూ
రాష్ట్రంలో రూ.314 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వ బకాయిలను
రైతులకు చంద్రబాబు ప్రభుత్వమే చెల్లించిందని మంత్రులు వెల్లడించారు.
👉ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఐఏఎస్ హరిచందన నియామకం
ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ముందడుగు
దక్షిణ భాగం విషయంలో ప్రాజెక్టు కన్సల్టెంట్
నియామకానికీ అనుమతి
కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి అధికారం ఇస్తూ జీవో
తెలంగాణ ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఐఏఎస్ అధికారిణి హరిచందనను నియమించింది. తద్వారా ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం విషయంలో ప్రాజెక్టు కన్సల్టెంట్ నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు చేపట్టేందుకు ఆర్ అండ్ బీకి అధికారం ఇస్తూ జీవో జారీ చేసింది. మరోవైపు, వరంగల్ భూగర్భ డ్రైనేజీ పథకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద రూ.4,170 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నారు.
👉 విజయవాడ స్వర హాస్పిటల్ లో డాక్టర్ అన్వేష్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కానూరు ఎస్బిఐ కాలనీలో నివాసం ఉంటున్న పొన్నెకంటి సారిక తన భర్త రమేష్ స్వర హాస్పిటల్ లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కిడ్నీ మార్పిడి శాస్త్ర చికిత్స వికటించి ప్రాణాలు కోల్పోయాడని, వారికి రక్షణ కల్పించాలని వేడుకొన్నారు. ఈ విషయమై 5టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

7k network
Recent Posts

కాంగ్రెస్‌- సోరోస్‌ అంశంలో తనని అవమానించేలా బీజేపీ ఎంపీలు సభలో చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి -లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ .. రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదాఏపీలో ఇక వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు: లోకేశ్…”రాజ్యసభ చైర్మెన్‌పై అవిశ్వాసం.. జగదీప్‌ ధన్కర్‌ ఏకపక్ష వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్షాల నిర్ణయం – ఉభయసభలు వాయిదా..”పురుగుల మందు తాగుతూ మహిళ సెల్ఫీ”…జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు…నార్పలలో వీర జవాన్ వరికుంట్ల సుబ్బయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చిన జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి తిమ్మప్ప..

చైనా.. ఉక్రెయిన్.. ఇజ్రాయెల్ యుద్ధాలలో నలిగిపోతున్న భారతీయులు.. విశాఖలో మహిళపై లైంగిక దాడి.. సీఎం ఆదేశాలతో సెంట్రల్ జైలుకు నిందితుడు.. ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పునరావాస ప్యాకేజీని కొట్టేశారట! … మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం?.. వినయ్‌ వైఖరి వల్లే తమ కుటుంబంలో వివాదాలు: మంచు మనోజ్.. మోహన్ బాబు హేయమైన చర్యపై ఖండన.. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ .. తహశీల్దార్ పై సస్పెన్షన్ వేటు (కడప)… రేపు, ఎల్లుండి కలెక్టర్ల సదస్సు… పలు కార్యక్రమాలలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల.. కొనసాగుతున్న ఇజ్రాయెల్‌- హమాస్‌ ల మధ్య యుద్ధం..జవాన్ మృతి పట్ల మంత్రి డోలా తీవ్ర దిగ్బ్రాంతి

పార్లమెంట్ వద్ద విపక్ష ఎంపీల విన్నూత నిరసన*…డబ్బు కోసం,ఆస్తి కోసం పోరాటం చేయటం లేదు- మంచు మనోజ్..పోలీసుల అదుపులో పవన్ ను బెదిరించిన వ్యక్తి… ఎవరీ మల్లికార్జునరావు?…వందలాది ఎకరాల ప్రభుత్వ అసైన్మెంట్ భూముల కొనుగోలుపై స్పందించిన హైకోర్టు…ధాన్యం కొనుగోలులో వ్యాపారులు దగా చేస్తే చట్ట ప్రకారం చర్యలు…డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ…మత స్వేచ్ఛ ప్రాథమిక హక్కు: డాక్టర్ కూచిపూడి.

నాగబాబుకు మంత్రి పదవి.. సీఎం చంద్రబాబు ప్రకటన…’పుష్ప’ని ఫుల్ గా వాడేస్తోన్న ఆప్ – బీజేపీ!…డిప్యూటీ సీఎం పేషీకి బెదిరింపు కాల్స్ పై డీజీపీకి ఫోన్‌ చేసి మాట్లాడిన హోంమంత్రి అనిత.. …కోటి లో పోలీసుల ఓవరాక్షన్, మహిళలపై అసభ్య ప్రవర్తన, తట్టుకోలేక చెంప చెల్లుమనిపించిన మహిళ..మీడియా సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన జగన్….,

సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సూర్యాపేట జిల్లా హోం గార్డ్స్ ఆఫీసర్స్..విశాఖ పోర్టులో 483 మెట్రిక్ టన్నుల రేష‌న్ బియ్యం సీజ్‌……జర్నలిస్టులపై మోహన్ బాబు బౌన్సర్ల దాడి….. అల్లూరి జిల్లాలో విషాదం.. విద్యుదాఘాతంతో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, కందుల ఎమ్మెల్యే ముత్తుముల..

రైతుల ఆందోళనలో హర్యానా “పోలీసుల డ్రామా..!! నోయిడా జైలులో రైతుల నిరాహార దీక్ష(డిల్లీ)…VEE RUN FOR TIRUPATI…రెండు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం.. దర్యాప్తు సంస్థల అధికారులమంటూ బెదిరింపు* 15 లక్షలు దోచేసిన సైబర్‌ నేరగాళ్లు… జాతీయ రహదారిపై లారీ క్లీనర్ సజీవ దహనం…. ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది?