👉 *27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి*
ఛత్తీస్‌గఢ్ – ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 27కు చేరింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్ చలపతి(60) మరణించారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. ఇతను ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడిలో కీలక సూత్రధారి. ఈయనది చిత్తూరు జిల్లా తవణంపల్లె (M) మత్యంపైపల్లె. ఈ ఎదురుకాల్పుల్లో ఒక కోబ్రా జవాన్ గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హెలికాప్టర్లో ఆయనను రాయ్పుర్కు తరలించారు.
👉 సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు .. అధికార, నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు .. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు..
ట్యాబ్ ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు
..అగ్ని మొబైల్ యాప్ ను జేబు సంస్థలకు కట్టబెట్టారని ఆరోపణలు .. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ..
డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఆదేశాలు .. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం .. సంజయ్ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు వెల్లడించిన ప్రభుత్వం ..
రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని సంజయ్ కు హెచ్చరిక జారీ ..వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్ ను సస్పెండ్ చేసిన ప్రభుత్వం..
👉 18 వేల మంది అక్రమ వలసదారులను భారత్‌కు తిరిగి పంపనున్న అమెరికా:
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారత పౌరులందరినీ గుర్తించి, వారిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభత్వం సిద్ధమవుతోందని బ్లూమ్ బెర్గ్ నివేదించింది. ఇందుకోసం అమెరికా నూతన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమైనట్లు తెలిపింది. భారత్, అమెరికా సంయుక్తంగా సుమారు 18,000 మంది అక్రమ వలసదారులను ఇండియాకు తిరిగి పంపడానికి గుర్తించాయని నివేదిక పేర్కొంది.
👉*ఎపిలో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించండి!*
*డబ్యుఇఎఫ్ హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ తో మంత్రి లోకేష్ భేటీ*
దావోస్: వరల్డ్ ఎకనమిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషన్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ కాంగ్రెస్ సెంటర్ లో భేటీ అయ్యారు. విజనరీ లీడర్, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూపొందించిన స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధునాతన సాంకేతికతతో అనుసంధానించి గ్లోబల్ స్టాండర్ట్స్ తో అందరికీ ఆరోగ్యం, పోషకాహారం, సంరక్షణ కల్పించాలన్నది మా లక్ష్యం. హెల్త్ కేర్ డెలివరీలో ప్రపంచ ప్రమాణాలను సాధించడం, అన్ని ఎఐ – ఎనేబుల్ మెడికల్ హబ్ లను ఏర్పాటు చేయడం, యూనివర్సల్ వాల్యూ బేస్డ్ హెల్త్ కేర్ అందించడం, పౌరులందరికీ డిజిటల్ హెల్త్ ఫ్రొఫైల్ రూపొదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రపంచంలో బెస్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ గా ఎపిని నిలిపేందుకు స్తూల లక్ష్యాలతో బెంచి మార్కులను నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్ ను హెల్త్ కేర్ టెక్నాలజీ హబ్ గా మార్చేందుకు డబ్లుఈఎఫ్ తరపున సహకారం అందించండి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ కు సహకరించండి. ప్రపంచస్థాయి ఆరోగ్య ప్రమాణాలకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు చేపట్టేందుకు మద్దతునివ్వండి. క్యాన్సర్, డయాబిటిక్ రెటినోపతి వంటి వ్యాధల నిర్థారణ కోసం రోగనిర్ధారణ అల్గారిథమ్ లలో ఎఐ వినియోగానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్ లో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. శ్యామ్ బిషన్ మాట్లాడుతూ… భారత్ లో మెడిసిన్ ఫ్రం ద స్కై కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఆరోగ్య సంరకణ రంగంలో ఎఐ, ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను వినియోగించాలని యోచిస్తున్నాం, ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.
👉హన్మకొండ నగరం నడి బొడ్డున వ్యక్తి దారుణ హత్య!!!*
*పట్టపగలే నగరంలో దారుణం చోటుచేసుకుంది,వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం పోయేలా చేసింది, వేటాడి మరి అతి కిరాతకంగా హత్య చేశాడు*
*హన్మకొండ జిల్లానగరం నడిబొడ్డులో పట్టపగలు ఈ దారుణం జరిగింది. ఒళ్లుగగుర్పొడిచే విధంగా పట్టపగలే ఆటో డ్రైవర్ ను దారుణంగా హత్య చేశారు*
*మృతుడు మణికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌కు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే సుబేదార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు*
*ఎంతో రద్దీ ఉండే హైదరాబాద్ – వరంగల్ ప్రధాన హైవే వద్ద ఆదాల జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్ రాజ్‌కుమార్‌ను ప్రత్యర్ధి దారుణంగా చంపేశాడు*
*రాజకుమార్ అనే అటు డ్రైవర్,ఆటోలో కూర్చొని ఉన్న సమయంలో ఏనుగు వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నాడు. వెంటనే తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు*
*ఆటోడ్రైవర్ కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు వ్యక్తి.. ఆపకుండా పదేపదే పొడిచాడు. రాజ్‌కుమార్ కిందపడిన ప్పటికీ వదలకుండా చివరకు గొంతులో కూడా కత్తితో పొడిచాడు.
* ఆటోడ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు.
👉*తెలుగు సినీ నిర్మాతలపై రెండవ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు…..*నిర్మాతలకు ఫైనాన్స్ చేసిన ఫైనాన్సర్లను సైతం విచారిస్తున్న ఐటీ అధికారుల
భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించిన నిర్మాతల ఇళ్ళు కార్యాలయాలపై కొనసాగుతున్న సోదాలు
55 బృందాలుగా ఎనిమిది చోట్ల సోదాలు చేస్తున్న ఐటీ అధికారులు.. జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో కొనసాగుతున్న సోదాలు..
దిల్ రాజు కు చెందిన SVC బ్యానర్ తో పాటు తో పాటు ,మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో కొనసాగుతున్న సోదాలు..దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో కొనసాగుతున్న సోదాలు..
మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం .. నవీన్ ఎర్నెని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు,కార్యాలయాల్లో జరుగుతున్న సోదాలు..సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఆరతీస్తున్న IT..
ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలిస్తున్న ఐటీ అధికారులు
👉 తన పాల క్యాన్ కింద పడిపోయిందని.. అందులో ఉన్న పాలు అన్నీ నేలపాలు అయిపోయాయని.. అందుకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ కారణమని.. ఆయన వల్లే తనకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బీహార్ కు చెందిన ముకేశ్ కుమార్ చౌదరి అనే పాల వ్యాపారి. ఈ విషయం ఇంట్రస్టింగ్ గా మారింది!
అవును… ఓ విచిత్రమైన సంఘటన తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా… తన క్యాన్ నిండా ఉన్న పాలు అన్నీ నేలపాలు అవడానికి రాహుల్ గాంధీ కారణమని ఆరోపిస్తూ ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. సుమారు ఐదు లీటర్ల పాలు కింద పడిపోవడంతో సుమారు రూ.250 నష్టం వచ్చిందని తెలిపాడు. ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. దేశంలోని ప్రతీ వ్యవస్థపైనా బీజేపీ, ఆరెస్సెస్స్ లు పెత్తనం చెలాయిస్తున్నాయని.. వాటిపై తాము పోరాడుతున్నామని రాహుల్ చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత తాను షాక్ అయ్యాయని బాధిత ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. ఈ ప్రకటనతో తాను ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యాయని.. ఫలితంగా ఐదు లీటర్ల పాల బకెట్ పై పట్టు కోల్పోయాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సమస్తిపూర్ నివాసి తన పిటిషన్ లో దేశద్రోహానికి సంబంధించిన 152 సహా పలు బీ.ఎన్.ఎస్. సెక్షన్ల కింద రాహుల్ గాంధీని విచారించాలని కోరారు.
అయితే… గౌహతీలోని పాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో రాహుల్ గాంధీపై ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసిన కొద్ది రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం. కాగా… జనవరి 15న ఢిల్లీలోని కోట్లా రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. దేశంలోని ప్రతీ సంస్థనూ బీజేపీ, ఆరెస్సెస్స్ లు స్వాధీనం చేసుకున్నాయని.. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ, ఆరెస్సెస్స్ లతో పాటు భారత రాజ్యంతో పోరాటం చేస్తుందని అన్నారు. ఇలా “భారత రాజ్యంతో పోరాటం” అనే వ్యాఖ్యపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై బీజేపీ మండిపడింది.
అయితే… దేశంలోని వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్య చేశారంటూ కాంగ్రెస్ సమర్ధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై అస్సోం రాజధాని గౌహతీలో కేసు నమోదైంది. ఆ వ్యాఖ్యల వల్లే తాను షాక్ కి గురై పాల క్యాన్ పై పట్టు కోల్పోయానని.. అందువల్ల తన పాలన్నీ నేలపాలు అయ్యాయని.. తనకు రూ.250 నష్టం వచ్చిందని తాజాగా ఫిర్యాదు చేశాడు బీహార్ వాసి.