కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను..దమ్ముంటే కమిటీని పంపు..ఫామ్ హౌస్‌లోనే పడుకో కేసీఆర్.. వైన్ షాప్ పెట్టిస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..హోం మంత్రి అనితను కలిసిన సునీత..పోరంకిలో దొంగకు దేహశుద్ధి..యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం..శ్రీలంక స్ఫూర్తి తో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలి-సిపిఎం..ప్రేమికుడే బ్రోకర్ ..స్నేహితులకు ప్రియురాలి అప్పగింత.

👉కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను-
సీఎం రేవంత్ రెడ్డి..?
వరంగల్ జిల్లా:- తెలంగాణలో పదేళ్లు అధికా రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభిం చడం జరిగిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. కెసిఆర్ చేసిన అప్పులకు వేలకోట్లలో వడ్డీ కష్టమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని,కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తి ఇవ్వనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.**కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదని, ఊచలు లెక్కపెట్ట వలసిం దేనని,సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని భూములు అమ్ముకుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.
తెలంగాణలో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణను మద్యంలో, మత్తులో ముంచి ప్రజలకు వివేకం లేకుండా చేయాలనుకు న్నారు. మద్యం ఏరులై పారించి తెలంగాణలో ఆడపడుచులకు అన్యాయం చేయాలను కున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మహిళలు అభివృద్ధి చెందడం కెసిఆర్ కు ఇష్టం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల అభివృద్ధికి బాటలు వేసి వారిని పురుషాధిక్య ప్రపంచం నుండి స్వేచ్ఛను కల్పిస్తున్నామని చెప్పారు.
వరంగల్ అభివృద్ధికి ప్రణాళికు రచించి, పర్యవేక్షించాల్సిన బాధ్యతలు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించామన్నారు. ఆ బాధ్యతలను ఆయన నెత్తినేసుకుని పూర్తి చేసేపనిలో ఉన్నారని మంత్రి పొంగులేటిని అభినందించారు…
👉దమ్ముంటే కమిటీని పంపు’.. మోదీకి రేవంత్రెడ్డి సవాల్*
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్రలోని పుణెలో మీడియాతో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీపై దమ్ముంటే కేంద్రం తరపున ఓ కమిటీ వేసి తెలంగాణకు పంపించాలని ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలకు సవాల్ విసిరారు.రాష్ట్రానికి వచ్చేందుకు మీ దగ్గర డబ్బులు లేకపోతే చెప్పాలని.. తానే ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానని తెలిపారు.
👉ఫామ్ హౌస్‌లోనే పడుకో కేసీఆర్.. వైన్ షాప్ పెట్టిస్తా..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మళ్లీ మెులకెత్తనివ్వనని రేవంత్ అన్నారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో మళ్లీ మెులకెత్తనివ్వనని రేవంత్ అన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెడతామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రాకుండా కేటీఆర్, హరీశ్ రావులను పంపుతున్నారని ధ్వజమెత్తారు. దమ్ముంటే అసెంబ్లీకి కేసీఆర్ రావాలని సవాల్ చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”ఆనాడు ఓడిస్తా అని చెప్పా.. ఓడించా. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గుండు సున్నా తెపిస్తా అని సవాల్ చేశా.. తెప్పించా. బీఆర్ఎస్ పార్టీని మళ్లీ మెులకెత్తనివ్వనని వరంగల్ గడ్డపై నుంచి చెప్తున్నా.. కాసుకో కేసీఆర్. హాయిగా నువ్వు ఫామ్ హౌస్‌లో పడుకో. అవసరమైతే అక్కడే వైన్ షాప్ ఏర్పాటు చేయిస్తా. తెలంగాణలో కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారు. ఫుల్, ఆఫ్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ప్రజలను మత్తుకు బానిసలుగా చేసి అధికారం చెలాయించారు. బీఆర్ఎస్ అధికారం దిగిపోతే కేసీఆర్, కుటుంబ సభ్యుల ఉద్యోగాల ఊడాయి తప్ప.. తెలంగాణకు ఏం కాలేదు. మీ ఉద్యోగాలు పోయాయి కాబట్టి రైతులకు రుణమాఫీ జరుగుతోంది. అభివృద్ధిపై చర్చకు బిర్లా-రంగాలు సిద్ధమా..?. రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సింది పోయి విమర్శిస్తున్నారు.వరి వేస్తే ఉరేనని కేసీఆర్ అన్నారు. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అసెంబ్లీకి వచ్చి చెప్పాలి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తా. కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలి. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకూ ప్రజల కోసం పనిచేస్తా” అని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు కాస్త తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
👉 తెలంగాణ ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన సమయం ఇదే..వరంగల్: తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..
తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు. మీరు భుజాల మీద మోయబట్టే మేమంతా ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అందుకే ఆడబిడ్డల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై ఉంది. 2014 నుంచి 2019 వరకూ బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళా మంత్రిగా లేరని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ మహిళలు ఇచ్చిన తీర్పుతో మెుదటి మంత్రివర్గంలోనే కొండా సురేఖ, సీతక్కకు మంత్రులుగా అవకాశం కల్పించామని సీఎం చెప్పుకొచ్చారు..
ఈ ఓరుగల్లు ఆడబిడ్డలకే మంత్రివర్గంలో ప్రముఖస్థానం ఇచ్చి నేటి సభా నిర్వహణ కార్యక్రమాన్ని సైతం వారి చేతుల్లోనే పెట్టామని రేవంత్ తెలిపారు. ఇదే కాకుండా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కడియం కావ్యను పార్లమెంట్‌కు పంపించామని ఆయన చెప్పారు. ఆమె తెలంగాణ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతోందని అన్నారు. పాలకుర్తిలో ఓ రాక్షసుడు రాజ్యమేలుతుంటే యశస్విని రెడ్డి అనే సోదరి ఆ రాక్షసుడిని ఎన్నికల్లో ఓడించి పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆడబిడ్డనే అని ఆయన తెలిపారు. అనేక మంది మహిళా అధికారులు పలు జిల్లాలకు కలెక్టర్లుగా ఉన్నారని వెల్లడించారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్‌గా కూడా ఓ మహిళలే ఉందని సీఎం చెప్పుకొచ్చారు. వారి రుణం ఇంకా తీర్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రజాపాలన విజయోత్సవ సభలో రేవంత్ రెడ్డి చెప్పారు..
👉 ఏపీ అసెంబ్లీకి వచ్చిన వైఎస్ సునీత..
హోం మంత్రి అనితను కలిసిన సునీత..
తన తండ్రి హత్య కేసు గురించి చర్చించిన వైనం
జైలు అధికారులకు దస్తగిరి రాసిన లేఖపై ప్రభుత్వం స్పందించాలని విన్నపం..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి… జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.
అనంతరం సీఎంఓ అధికారులను కూడా ఆమె కలిశారు. తన తండ్రి హత్య కేసులో పురోగతిపై వారితో చర్చించారు. కేసు పురోగతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె కోరినట్టు తెలుస్తోంది.
👉సిరిసిల్ల జిల్లా సిఐటీయూ బీడీ కార్మిక నాయకుడు,
మొరా అజయ్, బిఎల్ టీయూ, యూనియన్ లొ చేరిక…
సిరిసిల్ల జిల్లా లో గత 15,సంవత్సరాల నుండి కార్మిక నాయకుడు గా పోరాటం చేస్తు సిఐటీయూ జిల్లా నాయకులు, బీడీ కార్మిక నాయకులు, మొరా అజమ్ ఈ రోజు కామారెడ్డి బిఎల్ టీయూ, ఆపీసు లో బిఎల్ టీయూ, రాష్ట్ర నాయకులు, ముద్రకొల ఆంజనేయులు. నాగారపు యెల్లయ్య, ఆద్వర్యంలో, బిఎల్ టీయూ, లో చేరడం జరిగింది, అజమ్ కి బిఎల్ టీయూ, కండువతో బిఎల్ టీయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్, సిద్దిరాములు బిఎల్ టీయూ కండువా వేసి చేర్చుకోవడం జరిగింది,
సిరిసిల్ల పట్టణానికి చెందిన మొరా అజయ్ కార్మికల కోసం నిరంతర పోరాట ఉద్యమలు చేయడానికి బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్- బిఎల్ టీయూ యూనియన్స్- బిఎల్ టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ‌సిద్ది రాములు ఈరోజు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
సిరిసిల్ల పట్టణానికి చెందిన మొరా అజయ్ గత పది సంవత్సరాలు గా కార్మిక ఉద్యమంలోనూ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలోనూ పనిచేసిన అనుభవం కలిగిన అజయ్ బహుజన లెఫ్ట్ పార్టీ (బహుజన కమ్యూనిస్టు)BLP అనుబంధ బహుజన వామపక్ష కార్మిక సంఘాల సమాఖ్య జెండా కిందకు బీడీ,పవర్లమ్. (హైండ్లుమ్,) ఇతర అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత శక్తి మార్చి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తారనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లొ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగారపు ఎల్లయ్య. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముద్రకొల ఆంజనేయులు రాష్ట్ర నాయకురాలు గంగామణి తదితరులు పాల్గొన్నారు..
👉 వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలి… JC ప్రభాకర్ రెడ్డి..
ఈరోజు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి గారు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వచ్చే సంవత్సరం సంక్రాంతి కల్లా తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా ప్రభుత్వ ఆసుపత్రి అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగినది
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు, నర్సులు, మున్సిపల్ కౌన్సిలర్స్ పాల్గొనడం జరిగింది
👉పోరంకిలో దొంగకు దేహశుద్ధి..
విజయవాడ,, పోరంకిలో మంగళవారం ఉదయం దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. స్థానికుల వివరాల మేరకు.. పెనమలూరుకు చెందిన వృద్ధురాలని పీక నొక్కి ఆమె మెడలో ఉన్న బంగారం చోరీ చేసి పారిపోతుండగా స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
👉 నాయుడుపేట: యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం.. నాయుడుపేట శ్రీకాళహస్తి బైపాస్ వద్ద యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో సోమవారం అర్ధరాత్రి దుండగుడు చోరీకి యత్నించాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ ధరించి ఏటీఎంను గునపంతో పగులగొట్టే ప్రయత్నం చేశాడు.అలారం మోగడంతో పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
👉 విజయవాడ చోరీ కేసులో ఇరువురు నిందితులు అరెస్టు
ఎన్టీఆర్ జిల్లా,, విజయవాడలో చైన్ స్నాచింగ్ కేసులో ఇరువురు నిందితులను అరెస్ట్ చేసినట్లు క్రైమ్ ఏడిసిపి రాజారావు తెలిపారు. భవానిపురంలో ఈనెల 12వ తారీఖున ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో నుంచి 25 గ్రా. బంగారం తెంచుకొని పారిపోయారని తెలిపారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టగా సెడగం కుమార్, యాలంగి కృష్ణబాబు అనే నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఏడిసిపి తెలిపారు.
👉స్మశానంలో అఘోరి హ‌ల్‌చ‌ల్‌*
*వ‌రంగ‌ల్‌లోని బెస్తం చెరువు స్మ‌శాన వాటిక‌లో పూజ‌లు..
*శ‌రీరానికి బూడిద పూసుకుని, ఆరిపోయిన చితిపై ప‌డుకున్న అఘోరి..*భ‌య‌భ్రాంతుల‌కు గురైన స్థానికులు.. స్మ‌శానానికి భారీగా చేరుకున్న ప్ర‌జ‌లు..* స్మశానాలలో ఉండే అఘోరాలు అఘోరీలు పట్టణాలలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వెనక ఏ పార్టీ ప్రయోజనాలు దాగి ఉన్నాయని కూడా ప్రజలు చెవులు కోరుకుంటున్నారు.
👉శ్రీలంక స్ఫూర్తి తో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలి..
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.వి.కొండారెడ్డి.
కొత్తపట్నం మండల 6వ మహసభ ఈరోజు కొత్తపట్నం లో జరిగింది,
ఈ సందర్భంగా జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త శ్రీలంక ను స్ఫూర్తి గా తీసుకొని కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు. దేశంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు నిర్వహించాలని తెలియ జేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల లోపే ప్రజలపై 18 వేల కోట్ల విద్యుత్ బారన్ని మోపారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు, ఎన్నికల హామీలు అమలుకై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతర పోరాటాలు చేయాలని తెలియజేశారు. రాబో యే రోజుల్లో కార్మిక ,కర్షక పోరాటాలు పెద్ద ఎత్తున సాగించాలని అన్నారు. రైతులు పండిస్తున్న పళ్ళు, కూరగాయలు, పూలు, ఆకుకూరలు, ఉప్పు, పచ్చి మిర్చి, గోంగూర, వేరుశనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరపై కృషి చేస్తామని తెలియజేశారు. గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇళ్ల స్థలాలు, భూ ఆన్లైన్లు వాటిపై పోరాడ తామని తెలిపారు.
ఈ మహాసభ ప్రారంభానికి ముందుగా పార్టీ జెండాను బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించారు.
ఈ మహాసభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంకణాల రమాదేవి, పి.కల్పన తదితరులు పాల్గొన్నారు..
👉ప్రేమికుడే బ్రోకర్ …స్నేహితులకు ప్రియురాలి అప్పగింత..విశాఖ త్రీ ఈడియట్స్ గ్యాంగ్ రేప్..
ప్రియుడే నయవంచకుడిగా మారాడు. ప్రియురాలి పై తన స్నేహితులతో అత్యాచారం జరిపించాడు. ఈ గ్యాంగ్ రేప్ తో ఆమె అవమానభారంతో కృంగిపోయింది. ఆమెతో ఏకాంతంగా ఉన్న వీడియోలను చూపించి, బెదిరించి మళ్ళీ తమ కోర్కెను తీర్చాలని వేధించటంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని అసలు విషయం అడుగగా ఆమె జరిగిందంతా చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించి తమ కుమార్తెకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.
ఇక వివరాల్లోకి వెళ్తే..
విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందిన లా విద్యార్థిని తన సహ విద్యార్థితో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరూ శరీకంగా ఒకటయ్యారు. ఆ తర్వాత దాబాగార్డెన్స్ వద్దకు ఆమెను రప్పించాడు. తన ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి ఆమెతో శారీరకంగా కలిసాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ప్రియుడి స్నేహితులు ముగ్గురు ఆమెను బలవంతం చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.దీంతో ఆమె అవమాన భారంతో కృంగిపోయింది. ప్రియుడే దగ్గరుండి తన స్నేహితులతో మూకుమ్మడి అత్యాచారం చేయించడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తన ప్రియుడుని నిలదీసి అడిగింది. కానీ అతను ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని స్నేహితులు తమ వద్దకు రావాలని ఆమెను బెదిరించటం ప్రారంభించారు. ఆమెతో కలిసినప్పుడు తీసిన వీడియో లను బయట పెడతామని ఆమెను బెదిరించారు. ఈ వేధింపులకు తాళలేక ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన తండ్రి ఆమె ప్రయత్నాన్ని నిలువరించి అసలు విషయం అడగడంతో ఆమె జరిగిందంతా చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగింది టూ టౌన్ లిమిట్స్ లో కావడంతో ఆ పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు టూ టౌన్ సీఐ కి, ఏసీపీ కి పిర్యాదు చేసారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి విచారణ చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరం గా గాలింపు చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు లా స్టూడెంట్స్ కాగా, మరో నిందితుడు వరుణ్ మోటర్స్ లో క్యాషియర్ గా పని చేస్తున్నాడు

7k network
Recent Posts

*నిరవధిక దీక్ష చేస్తున్న రైతు నేత దల్లేవాలా ఆరోగ్యం కాపాడాలి.. *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిప్పులు చెరిగిన షర్మిల…*కన్నబిడ్డనే కాటేయబోయిన కన్న తండ్రి.. *రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడపండి.. ఆర్టీవో అమర నాయక్* .. *పునర్నిర్మాణం చేసిన సుందరయ్య భవనాన్ని సిపిఎం పోలేట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు ..👉 నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య ..!!!..*ఘనంగా సుభాష్ చంద్రబోస్ జయంతి*..*ఈ పంటకు సూపర్ చెక్..👉లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మొదలైన కార్చిచ్చు.. వేల ఎకరాల్లో ఎగసిపడుతున్న మంటలు.. *మార్కాపురం డివిజన్లో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు

👉హన్మకొండ నగరం నడి బొడ్డున వ్యక్తి దారుణ హత్య!!!*ఎపిలో మెడిసిన్ ఫ్రం ద స్కై సేవలను ప్రారంభించండి! ; మంత్రి లోకేష్ * ..*27 మంది మావోయిస్టులు హతం.. మృతుల్లో అలిపిరి దాడి సూత్రధారి* ..*సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలకు ఆదేశాలు .. రాహుల్ గాంధీ పై విచిత్రమైన కేసు నమోదు.👉 18 వేల మంది అక్రమ వలసదారులను భారత్‌కు తిరిగి పంపనున్న అమెరికా !

* అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుంది..👉 ఆన్ లైన్ పేకాటలో జిల్లా రెవెన్యూ అధికారి మలోల బిజీ బిజీ (అనంతపురం ) .. *రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ గా మధుసూదన్ రెడ్డి 👉నరసరావుపేటలో ఆన్లైన్ బెట్టింగ్ లకు యువకుడు బలి*.. *రాష్ట్ర డీఐజీ ద్వారక తిరుమలరావుకు ఘన స్వాగతం.. నేనిప్పుడు మారిపోయాను : ఆర్జివి ..

*యూజీసీ జారీ చేసిన కొత్త నిబంధనల్ని తక్షణమే రద్దు చేయాలి సీఎం స్టాలిన్ ..*జూరాల ప్రాజెక్ట్‌ నుంచి వాటర్‌ లీక్‌ !..చంద్రబాబూ డప్పు చాలూ, వక్కటి అయినా వచ్చిందా మేధావుల సూటి ప్రశ్న? .. 👉రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసినోళ్లకు రూ.5 లక్షలా? .. పరవాడ ఫార్మాసిటీలో ఎగసి పడుతున్న మంటలు* .. *తిరుపతి నూతన ఎస్పీగా హర్షవర్ధన్ రాజు*.. పూజలు చేస్తే లంకె బిందెలు లభిస్తాయంటూ రూ.28 లక్షలు వసూలు చేసి పరారైన దొంగ బాబా..

👉టీడీపీలో ఉండ‌లేం: త‌మ్ముళ్ల ఆవేద‌న.. సజ్జల ఆస్తులను కక్కించడానికి వీడెవడండి? – పవన్‌పై అంబటి విమర్శలు..లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ముస్తఫా ఇక లేరు*.. 👉 కోడి పందాల్లో లేడీ బౌన్సర్స్.. 👉*ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు* .. తెలంగాణలో క్రిప్టో కరెన్సీ స్కాం ..

*నారా వారిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సిఎం చంద్రబాబు**పోలీసులకు బకాయిల చెల్లింపు పై హర్షం* …*సజ్జలపై పవన్ దండయాత్ర ! .. *న్యాయ పోరాటానికి దిగిన మెగా కోడలు ..*తిరుమలలో మరో అపశృతి *శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ A R దామోదర్**మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ఆవిష్కరణ* ..*క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్సై రవీంద్రారెడ్డి* ..