వివేకా హత్య కేసు.. సుప్రీంలో కీలక పరిణామం!..రూ.100 కోట్ల స్కామ్.. బలిజ సంఘం నిధులు దుర్వినియోగం చేశాడని చీటింగ్..గంజాయి అక్రమ రవాణా కు అడ్డుకట్ట ఎన్నడు..1వ తరగతికి కూతురు రూ. 4 లక్షల స్కూల్ ఫీజు!!!..తాడిపత్రిలో పలువురు కానిస్టేబుల్ లపై వేటు..బలిజ సంఘం నిధుల దుర్వినియోగం చేశాడని చీటింగ్..తాడిపత్రిలో జూద నిర్వాహకుడు అరెస్ట్..తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ ..

👉వివేకా హత్య కేసు… సుప్రీంలో కీలక పరిణామం! ఇందులో భాగంగా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తీవ్ర సంచలనం సృష్టించిన మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మసనం విచారణ జరిపింది. అవును… వైఎస్ వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించారు. వివేకా హత్య కేసులో ఎనిమిదో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారని.. కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని ఈ సందర్భంగా లూథ్రా పేర్కొన్నారు! ఇదే సమయంలో… ఈ కేసులో అప్రూవర్ గా మారిన శివశంకర్ రెడ్డి కొడుకు చైతన్య రెడ్డి జైలుకు వెళ్లి బెదిరించాడని లూథ్రా.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు! ఇలా ఒక ప్రైవేటు డాక్టర్ గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రహావితం చేయడానికి ప్రయతించారని.. డాక్టర్ చైతన్య జైలు నిబంధనలకు విరుద్ధంగా వెళ్లారని.. ఆయన రెగ్యులర్ గా వైద్య పరీక్షలు నిర్వహించే డాక్టర్ కాదని లూథ్రా కోర్టుకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే అవినాష్ తో పాటు చైతన్య రెడ్డిని ప్రతివాదులుగా చేర్చాలని కోరారు. దీంతో… సునీత తరుపు న్యాయవాది లూథ్రా వాదనలను సమర్థించిన సీజేఐ ధర్మాసనం ఇద్దరినీ ప్రతివాదులుగా చేర్చడానికి అంగీకరించింది! దీంతో.. ఎంపీ అవినాష్ రెడ్డి, చైతన్య రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.ఇదే సమయంలో వివేకా హత్యకేసులో సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్ దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఈ ముగ్గురూ సుప్రీంను ఆశ్రయించగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.
👉 రూ.100 కోట్ల స్కామ్😱😱😱.. ఏపీతో లింకులు.. ఎవరీ చైనా పౌరుడు! ఈ క్రమంలో వాట్సప్ గ్రూపుల ద్వారా నిర్వహించే ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో సైబర్ మోసాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ కేటుగాళ్ల బారిన పడటం తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వాట్సప్ గ్రూపుల ద్వారా నిర్వహించే ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఓ భారీ సైబర్ మోసం వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు రూ.43.5 లక్షల మోసం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఇది రూ.100 కోట్ల వ్యవహారం అని తేలిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో చైనా జాతీయుడిని ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఫాంగ్ చెంజిన్ అనే చైనా జాతీయుడు వాట్సప్ గ్రూపుల ద్వారా ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ నిర్వహిస్తుంటాడట! ఈ సమయంలో ఈ వ్యవహారం పేరు చెప్పి మోసాలకు పాల్పడ్డాడు. ఈ సమయంలో ఇతడి బాధితుల్లో ఒకరైన సురేష్ అచ్యుతన్ అనే వ్యక్తి సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో… తనకు తొలుత ఈ స్టాక్ మార్కెట్ శిక్షణ ఇచ్చారని.. అనంతరం అనేక లావాదేవీలలో డబ్బు పెట్టుబడి పెట్టించారని.. అనంతరం నిందితుల నియంత్రణలో ఉన్న బ్యాంక్ ఖాతాలకు తన నిధులు రూ.43.5 లక్షలు బదిలీ చేయబడ్డాయని పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు.. ఏప్రిల్ లో ఒకసారి రూ.1.25 లక్షలు ట్రాన్స్ ఫర్ అయిన బ్యాంక్ అకౌంట్ దొరికిందంట! Also Read – నా ‘పంతం’.. డబ్బు కోసం కాదు.. టీమ్ ఇండియా స్టార్ అది ఢిల్లీలోని ముండ్కాలో ఉన్న మహాలక్ష్మీ ట్రేడర్స్ పేరిట ఉందని గుర్తించారట పోలీసులు. ఇదే సమయంలో ఈ నేరంతో సంబంధం ఉన్న ఫోన్ నెంబర్ ను కూడా పోలీసులు గుర్తించారు. ఈ క్రమలోనే ఢిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎన్ క్లేవ్ లో నివాసం ఉంటున్న చైనీయుడి వ్యవహారం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. ఇదే సమయంలో.. సైబర్ క్రైం పోర్టల్ లో కనీసం 17 ఫిర్యాదులు నమోదయ్యాయని.. అన్నీ ఒకే బ్యాంక్ అకౌంట్ కు లింక్ చేయబడ్డాయని చెబుతున్నారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల మోసానికి సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో… ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ లలో సైబర్ క్రైం తో పాటు మనీలాండరింగ్ తో కూడిన మరో రెండు కేసులు ఈ ఫాంగ్ చెంజిన్ తో ముడిపడి ఉన్నాయని చెబుతున్నారు.
👉డీప్‌ఫేక్‌ బారిన ఆర్‌బీఐ గవర్నర్‌!
డీప్‌ఫేక్‌ బారిన ఆర్‌బీఐ గవర్నర్‌!
ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ డీప్‌ఫేక్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివిధ పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అది ఫేక్ వీడియో అని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు ఆర్బీఐ అధికారులు సూచిస్తున్నారు.

*వైసీపీ నేత అరాచ‌కం.*
*వైసీపీ ఎంపీపీ వేల్పుల ర‌మేష్ త‌న‌పై డీజిల్ పోసి చంప‌బోయాడని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఎన్టీయార్ జిల్లా కంచిక‌చ‌ర్ల మండ‌లం కీస‌ర‌కు చెందిన రాంబాబు అనే వ్య‌క్తి.*
*గ‌తంలో కొనుగోలు చేసిన పొలం విష‌యం మాట్లాడేందుకు వెళ్ళ‌గా ర‌మేష్ త‌న‌పై డీజిల్ పోసి నిప్పు అంటించేందుకు ప్ర‌య‌త్నించాడ‌న్న రాంబాబు.
*త‌న‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ర‌మేష్ నుంచి త‌న‌ను కాపాడ‌డంతో పాటు త‌న న‌గ‌దును తిరిగి ఇప్పించాల‌ని పోలీసుల‌ను కోరిన రాంబాబు.*
👉తాడిపత్రిలో పలువురు కానిస్టేబుల్ లపై వేటు*
*పట్టణ పోలీస్ స్టేషన్లో ముగ్గురు*
*రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురి పై వేటు*
*అసాంఘిక కార్యకలాపాల నిర్వాహకులతో సత్సబంధాలు ఉండడమే కారణమా??*
*మరి కొంతమంది సిబ్బందిపై జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా*
👉1వ తరగతికి కూతురు రూ. 4 లక్షల స్కూల్ ఫీజుపై IITian చేసిన పోస్ట్ చర్చకు దారితీసింది
నాణ్యమైన విద్యను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని ఎత్తిచూపుతూ ఒక IIT బాంబే పూర్వ విద్యార్థి తన కుమార్తె యొక్క భారీ పాఠశాల ఫీజులను పంచుకోవడం ద్వారా ఆన్‌లైన్ చర్చకు దారితీసింది.
IIT బాంబే పూర్వ విద్యార్థి భారతదేశంలో అధిక విద్య ఖర్చులపై ఆందోళన వ్యక్తం చేశారు
రిషబ్ జైన్ తన కుమార్తె స్కూల్ ఫీజు నిర్మాణాన్ని Xలో పోస్ట్‌లో పంచుకున్నారు
ఇది 1వ తరగతి విద్యార్థికి రూ.4.27 లక్షల వార్షిక రుసుమును చూపింది
బొంబాయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) పూర్వ విద్యార్థి దేశంలో పెరుగుతున్న విద్య వ్యయం గురించి ఆందోళన వ్యక్తం చేశారు, ఇది ఆన్‌లైన్‌లో చర్చకు దారితీసింది.
X లో ఒక పోస్ట్‌లో, జైపూర్‌కు చెందిన రిషబ్ జైన్ అనే వ్యాపారవేత్త, నగరంలోని ఒక ప్రసిద్ధ పాఠశాల యొక్క వివరణాత్మక ఫీజు నిర్మాణాన్ని పంచుకున్నారు. ఫస్ట్-స్టాండర్డ్ విద్యార్థిని చేర్చుకోవడానికి సంవత్సరానికి సుమారు రూ. 4.27 లక్షలు ఖర్చవుతుందని అతను పేర్కొన్నాడు- రూ. 20 లక్షల వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలకు కూడా ఈ సంఖ్య భరించలేనిదిగా అతను భావించాడు.
జైన్ యొక్క వైరల్ పోస్ట్, ఇప్పటివరకు 1.5 మిలియన్ల సార్లు వీక్షించబడింది, నాణ్యమైన విద్యను కోరుకునే మధ్యతరగతి కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని హైలైట్ చేసింది.
“మంచి విద్య అనేది మధ్యతరగతి భరించలేని విలాసవంతమైనది,” అని అతను తన పోస్ట్‌లో పేర్కొన్నాడు, నగరంలోని ఇతర ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి ఫీజు నిర్మాణాలు ఉన్నాయి.
“నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1ని ప్రారంభిస్తుంది మరియు ఇది మా నగరంలో మేము పరిశీలిస్తున్న పాఠశాలల్లో ఒకదాని ఫీజు నిర్మాణం. ఇతర మంచి పాఠశాలలు కూడా ఇదే విధమైన ఫీజులను కలిగి ఉన్నాయని గమనించండి, ”అని అతను చెప్పాడు.
సంఖ్యలను విచ్ఛిన్నం చేస్తూ, అధిక పన్నులు మరియు అవసరమైన జీవన వ్యయాలు అధిక పాఠశాల ఫీజులకు తక్కువ స్థలాన్ని వదిలివేసినట్లు జైన్ వాదించారు.
“20L ఆదాయంతో, మీరు అత్యధికంగా 30% + CESS పన్ను పరిధిలోకి వస్తారు, ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు మరియు ధనవంతుల వలె ఎటువంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందరు” అని అతను చెప్పాడు.
ఆహారం, దుస్తులు, EMIలు మరియు పొదుపులకు మాత్రమే మిగిలి ఉందని అతను పేర్కొన్నాడు. ఒక్కో చిన్నారికి పాఠశాలకు రూ.4 లక్షల చొప్పున కుటుంబాలు ఎలా ఇవ్వగలవని ప్రశ్నించారు.
“మిగిలిన రూ. 10లీలో, మీరు ఆహారం, బట్టలు, అద్దె లేదా EMIలు చెల్లించవచ్చు మరియు ఏదైనా ఆదా చేయవచ్చు లేదా మీ ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజు చెల్లించవచ్చు. నిర్ణయించుకోండి! మీరు దేనిని ఎంచుకుంటారు, ”అతను, “మీరు దేనిని ఎంచుకుంటారు?’
ఈ పోస్ట్ చాలా మంది తల్లిదండ్రులను తాకింది, వారు విద్యా ఖర్చులు విపరీతంగా పెరగడం గురించి ఇలాంటి చిరాకులను పంచుకున్నారు.
“విద్య ఒక వాణిజ్య సంస్థగా మారింది, ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించడానికి పోరాడుతున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలు లాభపడతాయి” అని ఒక వినియోగదారు చెప్పారు.
మరొక వినియోగదారు మాట్లాడు తూ, “ఖచ్చితంగా సరైనది. నేను నోయిడాలో నివసిస్తున్నాను మరియు నన్ను నమ్మండి, విద్య అనేది విద్య కాదు, వ్యాపారం.
అయితే, అందరూ అంగీకరించలేదు. అతను ఉద్దేశపూర్వకంగా “అత్యంత ఖరీదైన పాఠశాల”ని ఎంచుకున్నాడని సూచిస్తూ, జైన్ పరిస్థితిని అతిశయోక్తి చేసారని ఒక వినియోగదారు వాదించారు.
“నువ్వు సంఖ్యలను అతిశయోక్తి చేస్తున్నట్టు అనిపిస్తోంది! అలాగే, ఉద్దేశపూర్వకంగా, మీరు ఈ ట్వీట్ చేయడానికి మీ నగరంలో అత్యంత ఖరీదైన పాఠశాలను ఎంచుకున్నారు! అవును మన దేశంలో నాణ్యమైన విద్య అనేది ఒక జోక్ మరియు విద్య కోసం ప్రభుత్వం వసూలు చేసే సెస్ రాజకీయ నాయకులకు వెళ్తుంది అనే వాస్తవాన్ని విస్మరించడానికి ప్రయత్నించడం లేదు, ”అని వినియోగదారు చెప్పారు.జైన్ తిప్పికొట్టాడు, “నేను అతిశయోక్తి చేస్తున్నానని అనిపించవచ్చు, కానీ పెళ్లి చేసుకుని పెద్ద నగరంలో నివసించండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది.”
మరికొందరు క్రమబద్ధమైన సమస్యలను ఎత్తిచూపారు, భారతదేశంలోని ప్రైవేట్ విద్యావ్యవస్థను విదేశాలలో ప్రభుత్వ-నిధులతో కూడిన విద్యతో పోల్చారు.
*ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్*
👉నిధుల దుర్వినియోగం చేశాడని చీటింగ్* అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని బలిజ సంఘం నిధులు దుర్వినియోగం చేశాడన్న కారణంగా ఆ సంఘం మాజీ గౌరవ అధ్యక్షుడు కల్లూరు శ్రీనివాసులు పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. బలిజ సంఘం సభ్యులు మాసూలు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ సాయి ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
👉తాడిపత్రిలో జూద నిర్వాహకుడు అరెస్ట్*
అనంతపురం జిల్లా తాడిపత్రి లో మట్కా బీటర్ ను అరెస్ట్ చేసినట్లు సీఐ శివగంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. తాడిపత్రి మండల పరిధిలోని అనంతపురం రోడ్డులో నందలపాడు కు చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో రూరల్ ఎస్సై ధరణి బాబు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 30 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
👉తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ నగరం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటికే కోటి జనాభా దాటింది. నగరం వేగంగా విస్తరిస్తుం డటంతో పాటుగా జనాభా పెరుగుదలో గణనీయమైన వృద్ధిని సాధించింది. తెలం గాణకు రెండో రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పట్నుంచో ప్రతిపాదన ఉంది.
రెండో రాజధాని ప్రస్తావన వచ్చినప్పుడల్లా వరంగల్ నగరం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వరంగల్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని ఏర్పాటు చేసేం దుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌కు సంబంధించి ప్రభుత్వ పరంగా రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇందులో కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కుడా 2041 మాస్టర్‌ప్లాన్‌కు ఆమోదం లభించింది. మామునూరు విమానా శ్రయానికి అవసరమైన అదనపు భూ సేకరణకు రూ.205 కోట్లు విడుదల చేస్తూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
బృహత్‌ ప్రణాళికకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌ జీవో జారీ చేశారు. దీనిపై నిన్న జరిగిన వరంగల్ సభ లో సీఎం కూడా ప్రస్థావించారు దీని కోసం మాస్టర్ ప్లాన్ రెడీ చేసారు… వరంగల్, కాజీపేట, హనుమకొండ, అలాగే ఈ మూడింటి సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాలలో కలిపి మొత్తం 1,805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్‌ ప్లాన్‌ పరిధిగా నిర్ణయిం చారు.
ఇందులో భాగంగా భూవిని యోగ జోన్లను గుర్తించారు. దీంతో ‘కుడా’ పరిధిలో భవననిర్మాణాలకు అడ్డం కులు తొలగనున్నాయి. ప్రాంతీయ, బాహ్యవలయ, అంతర్‌ వలయ, అనుసం ధాన రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు వేగవంతం కానున్నాయి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు కు మార్గం సుగమం కానుంది. 2018లోనే మాస్టర్ ప్లాన్ వాస్తవానికి డ్రాఫ్ట్‌ మాస్టర్‌ప్లాన్‌ గుర్తింపునకు తొలుత 2018లోనే నోటిఫికేషన్‌ జారీచేశారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు, కుడా ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్, ఇతర అధికారులు సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రతిపాదనలు రూపొందించి 2020లో ప్రభుత్వ ఆమోదానికి పంపారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి.
వాటిని అధిగమించేందుకు పలు విడతలుగా సమావే శాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. వరంగల్‌లోని మాము నూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టనున్న పనులలో మరో ముందడుగు పడింది. విమానాశ్రయానికి అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేక రణకు రూ.205 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
👉పుష్ప తగ్గేదెలా అన్నట్టు గంజాయి అక్రమ రవాణా…పార్టీ ఉంది పుష్పా…… జైలు కూడు తప్పద్దు….అన్నట్టు పోలీసు అన్నల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..అసలు మ్యాటర్ తెలిస్తే?*
పోలీసులు ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా.. గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రైల్, రోడ్డు, కారు, బైక్ ఇలా ఏ మార్గం వదలకుండా అక్రమార్కులు నిఘా కళ్ళుగప్పి అక్రమ గంజాయి రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు.
అయినా కేటుగాళ్ల స్కెచ్‌లకు ధీటుగానే పోలీసులు స్పందించి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు.
తాజాగా పుష్ప సినీ స్టైల్‌ను తలదన్నేలా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు.సూర్యాపేటలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పట్టణ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా రెండు కార్లు అనుమానాస్పదంగా కనిపించాయి.తనిఖీ చేస్తుండగా కార్లలోని వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు.
అదే సమయంలో కారులో గంజాయి వాసన గమనించారు కానీ పోలీసులకు ఎక్కడా గంజాయి కనపడలేదు.
మొదట నిందితులు గంజాయి సేవించారనుకుని భ్రమ పడిన పోలీసులు.. వదలకుండా గంజాయి వాసనపై లోతుగా తనిఖీ చేశారు.
కారు వెనుక డిక్కీ కింద బంపర్ లోపలి, మధ్య భాగంలో ప్రత్యేక అరలు, సంచులు ఏర్పాటు చేశారు.
ఒరిస్సా నుండి కర్ణాటక, మహారాష్ట్రాలకు కార్ల వెనుక డిక్కీ కింద బంపర్‌కు లోపలి, మధ్య భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలు, సంచుల ద్వారా గంజాయి తరలిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాల గుట్టుని సూర్యాపేట జిల్లా పోలీసులు రట్టు చేశారు.
ఏడుగురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు 27.40 లక్షల విలువగల 110 కేజీల గంజాయి, మూడు కార్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు.
నిందితులు పుష్ప సినిమాను చూసి ప్రేరణతో ఈ స్కెచ్ వేశారని పోలీసులు చెబుతున్నారు.

7k network
Recent Posts

గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు..కేటీఆర్ జైలుకే.. మనసులో మాట బయటపెట్టిన సీఎ రేవంత్.. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్య..కూకట్‌పల్లి లో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం..గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్ అవినీతి!!! -విశాఖ భూములు కేటాయింపులో విల్లా బహుమతి???..ఉప్మా టిఫిన్లో సైతం పురుగులు (నారాయణపేట)..రాయపర్తిలో భారీ దోపిడీ.

న‌రేంద్ర మోడీ.. ‘భార‌త‌ బైడెన్’: రాహుల్ ర‌చ్చ .. మతతత్వ పార్టీనీ అంతం చేయటమే లక్ష్యం..సిపిఎం..”తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబే కారణం: పవన్ కల్యాణ్… ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. “పొదిలి నగర పంచాయితీలో డ్రేనేజీ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే డ్రైనేజీ,పుట్ పాత్ లను నిర్మించాలి -సిపిఎం..40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత..

వివేకా హత్య కేసు.. సుప్రీంలో కీలక పరిణామం!..రూ.100 కోట్ల స్కామ్.. బలిజ సంఘం నిధులు దుర్వినియోగం చేశాడని చీటింగ్..గంజాయి అక్రమ రవాణా కు అడ్డుకట్ట ఎన్నడు..1వ తరగతికి కూతురు రూ. 4 లక్షల స్కూల్ ఫీజు!!!..తాడిపత్రిలో పలువురు కానిస్టేబుల్ లపై వేటు..బలిజ సంఘం నిధుల దుర్వినియోగం చేశాడని చీటింగ్..తాడిపత్రిలో జూద నిర్వాహకుడు అరెస్ట్..తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ ..

కెసిఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను..దమ్ముంటే కమిటీని పంపు..ఫామ్ హౌస్‌లోనే పడుకో కేసీఆర్.. వైన్ షాప్ పెట్టిస్తా.. సీఎం రేవంత్ రెడ్డి..హోం మంత్రి అనితను కలిసిన సునీత..పోరంకిలో దొంగకు దేహశుద్ధి..యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ యత్నం..శ్రీలంక స్ఫూర్తి తో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కార్యకర్తలు కృషి చేయాలి-సిపిఎం..ప్రేమికుడే బ్రోకర్ ..స్నేహితులకు ప్రియురాలి అప్పగింత.

ఆ నాలుగు నగరాలు కలిపి మెగా సిటీ!..మ‌హారాష్ట్ర‌లో బీజేపీ ఓట‌మి ఖాయం..విజయవాడ స్వర హాస్పిటల్ లో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగి మృతి.. అందుకే ప్ర‌ధాని పారిపోయారు-సీఎం రేవంత్..సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు( పొదిలి).. 👉 విజృంభిస్తున్న వైరల్ జ్వరాలు..కానరాని పరిశుభ్రత (కంభం)..బాలల భవితకు బాసటగా గ్రామ సభలు..అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ ‘ఉచిత గ్యాస్’:మంత్రి నాదెండ్ల..

మోదీజీ ఎరుపంటే ఎందుకంత భ‌యం?..మణిపూర్‌లో జరిగినట్టే లగచర్లలో జరుగుతోంది-కేటీఆర్ .. ఆసుపత్రిలో చిందులేసిన వైద్యులు(యూపీ)..లగచర్ల కలెక్టర్‌పై దాడి ఘటనలో డీఎస్పీపై బదిలీ వేటు..పోలీసుల అదుపులో బీఆర్ఎస్ సోషల్ మీడియా డైరెక్టర్..గురుకుల వసతి గృహంలో 25 మంది విద్యార్థులకు అస్వస్థత (నెల్లూరు జిల్లా)..రౌడీ ముకలతో భూ కబ్జా చేస్తున్న – గోడౌన్ యజమాని (తిరుపతి)..పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించిన ఏ పీ ఈ ఆర్ సి చైర్మన్..మ్యాపుల ఆధారంగా డ్రైన్లు శుభ్రపరచండి *విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు..స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ..తోటి విద్యార్థిని హత్య చేసి బావిలో పడేసిన విద్యార్థులు..విద్యార్థునిల జడలు కత్తిరించిన ఉపాధ్యాయులు.. హైదరాబాద్‌లో మైనర్ బాలిక దారుణ హత్య..అపోహలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలు..సమర్థవంతంగా దీపం-2 పథకం అమలు-మంత్రి నాదెండ్ల మనోహర్..