👉 నరేంద్ర మోడీ… ‘భారత బైడెన్’: రాహుల్ రచ్చ మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో రోజుకొక వివాదాస్పద అంశం తెరమీదికివస్తోంది కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రాజకీయ రచ్చకు తెరదీశారు. మహారాష్ట్రలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచా రంలో రోజుకొక వివాదాస్పద అంశం తెరమీదికివస్తోంది. దీనిలో ఎవరూ తక్కువ కాదు. ఎవరూ తక్కువ తినలేదు. అటు బీజేపీ కూటమి, ఇటు కాంగ్రెస్ కూటములు రెండూ కూడా హోరా హోరీ తలపడుతున్న నేపథ్యంలో రాజకీయ రచ్చ రూపాంతరం చెందు తూ వివాదాలను మరింత పెంచి పోషిస్తుండడం గమనార్హం. రెండురోజుల కిందట… హిందువులు ఐక్యంగా లేకపోతే.. విభజన జరుగుతుందంటూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పటికీ చల్లారలేదు.
సీఎం యోగిపై సొంత పార్టీ బీజేపీ నేతలే విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలే తెరమీదికి వస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే.. ముస్లింలను తరిమేస్తారంటూ.. ఆ పార్టీ నాయకులు యాగీ చేస్తున్నారు. ఇక, ఎంఐఎం పార్టీపై బీజేపీ అనుకూల వ్యక్తులు నిప్పులు చెరుగు తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలా.. అటు ఇటు రెండు పక్షాలు కూడా.. చలికాలంలో మహారాష్ట్ర ఎన్నికల క్రతువును నిప్పుల కొలిమిలా మార్చేశాయి. రాజకీయ సెగలు పుట్టిస్తున్నాయి. Also Read – ఆర్జీవీ ‘వ్యూహం’: నిన్న పోలీసులకు మెసేజ్.. నేడు హైకోర్టులో పిటిషన్! ఇక, ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు నరేంద్ర మోడీని ఉద్దేశించి `భారత బైడెన్` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాఅధ్యక్షుడుగా ఉన్న జో బైడెన్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పోలుస్తూ.. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఇప్పటి వరకు బైడెన్‌తో ఎవరూ ఎవరినీ పోల్చలేదు. కానీ, తొలిసారి రాహుల్ గాంధీ మాత్రం మోడీని బైడెన్‌తో పోల్చడం వివాదానికి దారితీస్తోంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్.. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు జరిగిన చర్చల సందర్భంగా విమర్శలు ఎదుర్కొన్నారు.
బైడెన్ మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి కారణం.. ఆయన పలు సందర్భా ల్లో వ్యవహరించిన తీరు, చేసిన కామెంట్లే. ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్ అని.. అమెరికా ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయని ఇలా అనేక వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా తన ప్రసంగం సమయం అయిపోయిన తర్వాత.. కూడా మైకు వదలకుండా.. స్టేజీపైనే ఉండిపోయారు. దీంతో బైడెన్ మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారన్న కామెంట్లు కురిశాయి. ఇక, ఇప్పుడు వీటిని మోడీకి అన్వయించిన రాహుల్ గాంధీ.. భారత బైడెన్ మోడీయేనని వ్యాఖ్యానించారు. ఈయన కూడా మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని తెలిపారు.గతంలో తాను చెప్పిన విషయాలే ఇప్పుడు మోడీ ప్రస్తావిస్తున్నారని.. వ్యాఖ్యానించారు. కుల గణన, రిజర్వేషన్ల అంశాలపై గతంలో తాను చెప్పిన విషయాలు ఏవీ మోడీకి గుర్తులేవని.. అందుకే వాటిని కొత్తవాటిగా కలరింగ్ ఇస్తూ.. మళ్లీ ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. “రిజర్వేషన్లు ఉండాలని నేను అన్నాను. కానీ, మోడీ మాత్రం నన్ను రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటున్నాడు. నేను కుల గణనకు అనుకూలంగా ఉన్నాను. కానీ, రేపు మోడీ దీనికి కూడా నేను వ్యతిరేకం అని చెప్పే అవకాశం ఉంది. మోడీ.. భారత్ బైడెన్‌లా వ్యవహరిస్తున్నారు“ అని రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
👉 తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబే కారణం: పవన్ కల్యాణ్..
వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసిందని ఆగ్రహం..
వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్న పవన్ కల్యాణ్..
మంచి నీటి సమస్యను తీర్చే బాధ్యత తనదేనని హామీ..
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి ఏపీ సీఎం చంద్రబాబే కారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… గత వైసీపీ ప్రభుత్వం ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసి ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏపీని అన్ని రంగాల్లో వెనక్కి తీసుకెళ్లిందని ఆరోపించారు.
కానీ భవిష్యత్తు పట్ల చంద్రబాబు ఓ నమ్మకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందరిలోనూ నమ్మకాన్ని తెచ్చిన సీఎంకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. వైసీపీ దోపిడీ, అరాచకాలను చూసే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పూర్తిగా సంతృప్తి చెందామన్నారు. రాష్ట్రం సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తోందని పూర్తిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత నాదే..
రాష్ట్రంలో మంచినీటి సమస్యను తీర్చే బాధ్యత తనదేనని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. రక్షిత మంచి నీరు ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. జలజీవన్ మిషన్‌పై ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు. కలుషిత నీరు అనే మాట వినపడకుండా చేస్తామని, కిడ్నీ సమస్యలు తగ్గిస్తామన్నారు.
👉 ప్రజాసంక్షేమం పట్టించుకోకుండా ప్రజలపై భారాలు వేసే మతతత్వ పార్టీని అంతం చేయటమే కమ్యూనిస్టు లక్ష్యం.
సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హానీఫ్.
ప్రకాశం జిల్లా..పామూరు.
మతతత్వ బిజెపి పార్టీని ఇంటికి సాగనంపటమే కమ్యూనిస్టు లక్ష్యమని సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హానీఫ్ కార్యకర్తకు పిలుపునిచ్చారు. మండ్ల వెంకటేశ్వర్లు నగర్ పేరుతో సిపిఎం ఆరవ మహాసభ పట్టణంలోని అమ్మ ఫంక్షన్ హాల్ లో షేక్ ఖాదర్ భాషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి రాష్ట్రం ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలపై అధిక భారాలు మోపాయన్నారు. జాతీయ ఉపాధి పథకంలో కూలీలకు శ్రమకు తగ్గ ఆదాయం రావటం లేదని అన్నారు. బిజెపి ప్రభుత్వంలో ప్రభుత్వాస్తులు ప్రైవేటు వ్యక్తులకు ధారథత్వం చేస్తుందని ఆరోపించారు. చేతివృత్తులు కనుమరుగైపోతున్నాయన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పేరుతో 18 వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు పోరాటాలు చేయుటకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభకు ముందుగా సిపిఎం సీనియర్ నాయకులు ఎస్కే మీరావాలి జెండా ఆవిష్కరణ నిర్వహించారు. జాతీయ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి సయ్యద్ హానీఫ్ పూలమాలవేసి నివాళులర్పించారు. మండల వెంకటేశ్వర్లు చిత్రపటానికి సిపిఎం సీనియర్ నాయకులు ఎం విఠల్రావు పూలదండ వేసి నివాళులర్పించారు. వారితోపాటు నాయకులందరూ పూలు వేసి నివ్వాలనిపించారు.
👉ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్ లక్ష 50 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఒంగోలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు .. ప్రకాశం జిల్లా
ఒంగోల్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసులో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్, కేఎస్ శ్రీనివాస ప్రసాద్ పనిచేస్తున్నరు ఫిర్యాది సిహెచ్ శ్రీధర్ ట్రేడ్ కంపెనీకి నోటీసు ఇచ్చి దానిపై ఫిర్యాదికి పెన్నాలిటీ వేసినందున ఆ పెనాల్టీ లేకుండా చేయుటకు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ లక్ష యాభై వేలు రూపాయలు లంచం డిమాండ్ చేసి సదరు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఎసిబి డిఎస్పి రెడ్ హ్యాండుగా పట్టుకొని అతని వద్ద నుండి లక్ష యాభై వేలు రూపాయలు లంచం డబ్బులు రికవరీ చేసినారు.ఏసీబీ డీఎస్పీ పి రామచంద్ర రావు,ఇన్స్పెక్టర్ శేషు,ఎస్ఐ లు జే.బీ.ఎన్ ప్రసాద్,షేక్.మస్తాన్ షరీఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
👉 పొదిలి నగర పంచాయితీలో డ్రేనేజీ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే డ్రైనేజీ,పుట్ పాత్ లను నిర్మించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం పొదిలి నగర పంచాయితీలో తొలగించిన మురుగునీటి ఆక్రమణల స్థానంలో డ్రైనేజి,పుట్ పాత్ ల సమస్యపై సిపియం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.ఈ ధర్నాకు పి.బాలనర్సయ్య అధ్యక్షత వహించారు.ధర్నాలో రమేష్ మాట్లాడుతూ పొదిలి నగర పంచాయితీగా మారిన 4సంవత్సరాలు పూర్తయినా నేటికి కనీస మౌళిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పొదిలిలోని ప్రధాన వీధులన్ని చిన్నపాటి వర్షానికి డ్రైనేజీ లేక చెరువులను తలపింపజేస్తున్నాయి. పెరుగుతున్న అవసరాలు కనుగుణంగా డ్రేనేజీని ఆధునీకరించాల్సిన అధికారులు కాలువలపై ఆక్రమణలు తొలగించి పునర్నిర్మాణం చేయకపోవడంతో వ్యాపారులు,వీధి వ్యాపారులు ఉపాధి దెబ్బతింటుంద న్నారు.ప్రజలకు మౌళిక వసతులు కల్పించాల్సిన బాధ్యత నుండి తప్పుకుంటూ టిడిపి కూటమి ప్రభుత్వం పిపిపి విధానాన్ని అమలు చేస్తూ డ్రైనేజీని మీరే నిర్మించుకోవాలని భారం ప్రజలపై మోపటం దుర్మార్గమన్నారు. కాలువలు లేక మురుగునీరు రోడ్లపైకి చేరి దుర్గంధం వెదజల్లడంతోపాటు రోడ్ మార్జిన్ బురధతో పాదాచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే డ్రేనేజీ,పుట్ పాత్ లను నిర్మించాలని డిమాండ్ చేశారు. వీధి వ్యాపారులందరికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఉపాధి భద్రతకు ప్రత్యామ్నాయాన్ని చూపించాలన్నారు. జిల్లా భౌగోళిక కేంద్రమైన పొదిలిలో మార్కాపురం అడ్డ రోడ్డు నుండి కాటూరివారిపాలెం వరకు రోడ్ మధ్యలో డివైడర్స్ ఏర్పాటుచేసి ప్రమాదాలను నివారించాలన్నారు. విధ్యుత్ స్థంబాలు రోడ్ మార్జిన్ కి మార్చి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించాలన్నారు.పొదిలి పెద్ద బస్టాండ్,చిన్న బస్టాండ్, కొత్తూరు సెంటరులో సులభ్ కాంప్లెక్స్ లు నిర్మించాలన్నారు. పెద్దబస్టాండ్ లో బస్ షెల్టర్ ను ఏర్పాటుచేయాలన్నారు. పై సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం అధికారులు తగిన చర్యలు తీసుకోకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ పి.శ్రీనివాసులకు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.ఈ ధర్నాలో సిపిఎం పొదిలి మండలం నాయకులు పి.చార్లెస్,జి.నరసింహారావు, యన్.వెంకటేశ్వరెడ్డి, యం.సుబ్బారావులు పాల్గొన్నారు.
👉 ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి.. 40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత.
👉 ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయం పై గత కొంతకాలంగా అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో గత నెలలో జిల్లా ట్రజరి అధికారి తనిఖీలు నిర్వహించారు. పెడింగ్ లో ఉన్న బిల్లు వేంటనే క్లియర్ చేయాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడి చేయడం 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
👉5.9 కేజీల బరువున్న 50 బంగారం కడ్డీలను మోసుకెళ్తున్న సివిల్ ఇంజినీర్‌ను అరెస్ట్ సివిల్ ఇంజినీర్ ..
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో ఘటన
5.9 కేజీల బరువున్న 50 బంగారు కడ్డీల స్వాధీనం
ఈజీ మనీ కోసమే స్మగ్లింగ్ చేస్తున్నట్టు ఒప్పుకోలు
రూ. 4.36 కోట్ల విలువైన 6 కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దొరికిపోయాడో సివిల్ ఇంజినీర్. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ నిన్న నిందితుడిని అదుపులోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో అప్రమత్తమైన టెంటుల్‌బెరియా బోర్డర్ ఔట్‌పోస్ట్ (5వ బెటాలియన్) పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24వ పరగణాల జిల్లా, అంచల్‌పాద గ్రామంలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో రూ. 4.36 కోట్ల విలువైన 5.9 కేజీల బరువున్న 50 బంగారం కడ్డీలను మోసుకెళ్తున్న సివిల్ ఇంజినీర్‌ను అరెస్ట్ చేశారు. ఈ గ్రామం టెంటుల్‌బెరియా బోర్డర్ ఔట్‌పోస్టుకు 2,700 మీటర్ల దూరంలో ఉంది.
బీఎస్ఎఫ్ సిబ్బందిని చూసి నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో భయపడిన స్మగ్లర్ పారిపోయే ప్రయత్నాన్ని విరమించుకోవడంతో అరెస్ట్ చేశారు. తేలికగా, వేగంగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతోనే స్మగ్లింగ్‌కు పాల్పడినట్టు నిందితుడు అంగీకరించాడు. తనకు అందిన స్మగ్లింగ్ వస్తువులను గంటా, రెండు గంటలపాటు ఇంట్లో ఉంచి, ఆ తర్వాత వాటిని సంబంధిత వ్యక్తులకు అందిస్తానని పేర్కొన్నాడు. ఇలా చేసినందుకు ఒక్కో డెలివరీకి రూ. 500 నుంచి రూ. 1000 ఇస్తారని తెలిపాడు.
👉 ఏపీలో విద్యార్థులకు శుభవార్త*
దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9,11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును మరోసారి పెంచారు.నవంబర్ 26వ తేదీ వరకు విద్యార్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చని
సూచించారు. జెండర్, కేటగిరీ, ఏరియా(రూరల్/ అర్బన్), డిజెబిలిటీ, పరీక్ష మాధ్యమం ఫీల్డ్స్ దరఖాస్తుల సవరణ అవకాశం నవంబర్ 26 తర్వాత రెండు రోజులు తెరిచి ఉంటుంది. ఫిబ్రవరి 8న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు.
నరేంద్ర మోడీ.. ‘భారత బైడెన్’: రాహుల్ రచ్చ .. మతతత్వ పార్టీనీ అంతం చేయటమే లక్ష్యం..సిపిఎం..”తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి చంద్రబాబే కారణం: పవన్ కల్యాణ్… ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్.. “పొదిలి నగర పంచాయితీలో డ్రేనేజీ భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే డ్రైనేజీ,పుట్ పాత్ లను నిర్మించాలి -సిపిఎం..40 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ట్రెజరీ అధికారి మమత..
Recent Posts