గతంలో సినిమా హీరోలు, నటీమణులకు మాత్రమే అభిమానులు ఉండేవారు. వాళ్ల పుట్టిన రోజు వచ్చిందంటే వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రక్తదానం, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ రాజకీయ నేతలపై చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో టీడీపీ (TDP)యువనేతగా, ఆపార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ (Nara Lokesh)41వ పుట్టిన రోజు (Birth Day)సందర్భంగా విజయవాడ(Vijayawada), విశాఖ పట్టణా(Visakapatnam)ల్లో అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ కృష్ణానదిలో నారా లోకేష్ 100 కటౌట్ ను ఏర్పాటు చేయడమే కాకుండా కలర్స్ స్మోక్ బాంబులతో నీళ్లలో పేల్చి నాయకుడి పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడో అమరావతి రైతు. అటు విశాఖలో కూడా సముద్రం మీద లోకేష్ భారీ చిత్రపటాన్ని ప్రదర్శించాడు ప్రణవ్ గోపాల్ అనే మరో అభిమాని. ఇప్పుడు ఈ రెండు వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
గుండె నిండా అభిమానం..
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర కూడా చేపట్టారు. టీడీపీ యువ నాయకత్వంలో జోష్ నింపుతున్న లోకేష్ పుట్టిన రోజు ఈరోజు. జనవరి 23న లోకేష్ బర్త్ డే సందర్భంగా టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి చెందిన తాడికొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు పులి చిన్న లోకేష్ రూపంలో 100 అడుగుల భారీ కటౌట్ ను విజయవాడ నడిబొడ్డున్న ఉన్న కృష్ణ నదిలో స్మోక్ బాంబ్స్ మధ్యలో ప్రదర్శించాడు. కనక దుర్గమ్మ ఆశీస్సులతో నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈకార్యక్రమంలో మరికొందరు టీడీపీ యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
సముద్రంలో సాహసం..
నారా లోకేష్ పట్ల యువతలో, టీడీపీ యువనాయకత్వంలో అభిమానం పెరుగుతోంది. అందుకే తమ నాయకుడి బర్త్ డే రోజును కనీ ,విని ఎరుగని రీతిలో వినూత్నంగా జరుపుకుంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అటు విశాఖలో టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ కూడా లోకేష్ కి డిఫరెంట్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. విశాఖ సముద్ర గర్భంలోనూ, సముద్రం మీద నారా లోకేష్ భారీ చిత్రపటాన్ని స్వయంగా ప్రదర్శించారు. సముద్రం మీద సాహసోపేతంగా నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రణవ్ గోపాల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సేవా, సహాయక కార్యక్రమాలు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 41వ ఏట అడుగుపెట్టారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, శ్రేణులు రోగులకు పండ్లు పంచిపెడుతున్నారు. పలుచోట్ల సేవ, సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా్రు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..