భారతదేశ వివిధ ప్రాంతాలకు సంబంధించిన రక రకాల వేషధారణలో ఎన్టీఆర్ జిల్లా ప్రాంత విద్యార్థులు ఆకర్షణీయమైన రాంప్ వాక్ చేశారు.స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” అనే పేరుతో 12+ విద్యార్థులచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర విద్యార్థులే కాకుండా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పాల్గొన్నారు. ప్రస్తుతం మారుతున్న కాలంలో నాగరికత మరియు సంస్కృతి నేటి సమాజంలోని పిల్లలకు తెలియట్లేదు. అలాగే మన భారతదేశ చరిత్ర ఎంతో గొప్పది. మన దేశంలో ఉన్న భాషలు, సంస్కృతులు, పద్ధతులు మరీ ఏ దేశంలోను ఉండవు.
భారత దేశంలో ఎన్నో ప్రాంతాలు, ప్రాంతానికి ఒక్కో వేషధారణ. అనేక రకాలు అయినా వేషధారణలను చూపిస్తూ వాటి గురించి విశ్లేషిస్తూ ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ ఇంటర్ కళాశాల విద్యార్థులచే విజయవాడ స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో \“షీ\” కార్యక్రమం నిర్వహించారు.
TS Elections: 2014 రిపీట్ కానుందా.. కాంగ్రెస్ లోకి వలసల పర్వం..?
షీ ఆర్గనైజర్ మాట్లాడుతూ..
షీ అనే కార్యక్రమం మహిళలు సోషల్ ప్లాట్ఫారం మీద రాణించాలి అనే ఉద్దేశంతో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక కార్యక్రమం. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళలకు ప్రోత్సాహం నింపటం కోసం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ \“షీ\” రాంప్ వాక్ ఫ్యాషన్ షో కార్యక్రమం 2022 సంవత్సరంలో స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రారంభించారు.
\“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ కార్యక్రమం ద్వారా నేటి తరం పిల్లలకు భారతీయ సంస్కృతికి మరియు వివిధ రకాల వేషధారణ ఎలా ఉంటుంది అని తెలుస్తుంది. అంతే కాకుండా విద్యార్థులలో మోడలింగ్ మీద ఆసక్తి పెరుగుతుందని తెలిపారు.డిసెంబర్ 9న \“షీ\” ఫ్యాషన్ రాంప్ వాక్ షో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ షోకి ఎంతో మంది ప్రముఖులు విచ్చేయనున్నారని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..