అర్జున్ రెడ్డి సినిమాతో కొత్తగా సినిమా ఎలా తీసి హిట్టు కొడతారో అని తెలుగు ప్రేక్షకులకు అగ్రెసివ్ మరియు వాయిలెంట్ హీరోయిజం పరిచయం చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మూవీ డైరెక్టర్స్ వేరు, నేను వేరు బాలీవుడ్ స్టార్స్‌నే తన కథతో మెప్పించి ఒక తండ్రి కొడుకు మధ్య ఉండే ప్రేమను చూపిస్తూ బాలీవుడ్ అగ్ర కథనాయకుడు రణ్‌బీర్ కపూర్ హీరోగా, సౌత్ ఇండియన్ సెన్సేషనల్ హీరోయిన్ రష్మిక మందన హీరోయిన్‌గా యానిమల్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అర్జున్ రెడ్డి సినిమా తీసి 6 సంవత్సరాలు అవుతున్న ఆ సినిమా డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు. సందీప్ రెడ్డి వంగ చిత్రికరించిన యానిమల్ చిత్రం ప్రస్తుతం వచ్చిన చిత్రలతో పోలిస్తే రన్ టైం 3 గంటల 21 నిముషాలు చాలా ఎక్కువ. 3 గంటల పాటు సినీ ప్రేక్షకుడిని ఎటు కదలనీయకుండా ఆసక్తిగా చూస్తూ ఉండిపోయే చిత్రాన్ని చిత్రికరించారు అని తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IRCTC Ooty Tour: హైదరాబాద్ టు ఊటీ… ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ
యానిమల్ సినిమాని చూసిన ప్రతి ఒక్కరు నేతి తరంలో ఇలాంటి విభిన్న పాత్రాలతో కూడిన చిత్రాన్ని చూడలేదు అని, నటినటులు చాలా గొప్పగా సినిమాలో నటించారు. తన తండ్రి కోసం ఎంతకైనా తెగించే కొడుకు, తన తండ్రి కోసం ఏం చేస్తాడు అనే నేపథ్యంలో సందీప్ రెడ్డి వంగ చిత్రికరించిన సినిమ తీరు ప్రేక్షకుల మతి పోగొడుతుంది. అర్జున్ రెడ్డి సినిమా చూసి సందీప్ రెడ్డి వంగకు అభిమానులు అయిన ప్రతి ఒక్కరు అనిమల్ సినిమాతో ఫాలోయర్స్ మారిపోతారు అని ప్రేక్షకులు చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..