దీపావళి అంటేనే వెలుగుల పండుగ. జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించే పండుగ. ఈ పండుగ వేళ అందరి ముఖాల్లో నవ్వులు మతాబుల్లా వెలుగుతాయి. అణగారిన వర్గాలు, పేదల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు మంచి మనసులు ఎప్పుడూ ముందుంటాయి. పర్యావరణానికి తోడుగా నిలుస్తూ.. పండుగ వేళ ఆనందపు వెలుగులు నింపేందుకు ఎంతోమంది కృషి చేస్తుంటారు. అలాంటి వారి గురించి ప్రత్యేక కథనాలు లోకల్18 అందిస్తోంది.
కుల, మత బేధాలు లేకుండా భారతదేశ ప్రజలందరూ కలిసి చేసుకునే ఒక అపూర్వ పండుగ ఇది. దీపావళి పండుగను కుటుంబ సమేతంగా పెద్దవాళ్లు మరియు పిల్లలు అందరు కలిసి జారుపుకుంటారు. అలాంటి సంతషమైన పండుగ, వెలుగులను పంచే పండుగ దీపావళి పండుగ.
వెంకటేశ్వర స్వామి మహిమట.. 45 ఏళ్ల కిందట ఏం జరిగిందో తెలుసా?
అలాంటి దీపావళి పండుగను అందరు జరుపుకున్నట్టు కొంతమంది జరుపుకోలేరు. ఎందుకు అని అనిపించినా వారు తల్లితండ్రులని కోల్పోయి ఆనాధలుగా ఉన్నవాళ్లు, వాళ్ళందరి కోసం హెల్పింగ్ హ్యాండ్ ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం దీపావళి రోజున అనాధ ఆశ్రమంలో ఉన్న పిల్లల్ని కలిసి వారి సొంత కుటుంబం సభ్యులుగా చేరతీసి వారితో దీపావళి పండుగను జరుపుకుంటారు. అలానే ఈ సంవత్సరం కూడా హెల్పింగ్ హాండ్స్ ట్రస్ట్ వారు అనాధ పిల్లలతో కలిసి దీపావళి పండుగను విజయవాడ నవోదయ అనాధ ఆశ్రమం పిల్లలతో కలిసి దీపావళి పండుగ జరుపుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..