నరసారావుపేట లోక్ సభ స్థానం వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్..!

నెల్లూరుకు చెందిన అనిల్ కుమార్‌ యాదవ్‌ను
వైఎస్‌ఆర్‌ సీపీ అధిష్టానం
నరసరావుపేట లోక్ సభ స్థానానికి ఎందుకు పంపింది..?!

చాలా మంది మెదళ్లను..
తొలుస్తున్న ప్రశ్న ఇది.

సీఎం వైఎస్‌ జగన్‌కు
అనిల్ కుమార్‌ యాదవ్ అత్యంత విశ్వాసపాత్రుడు

అనిల్ కుమార్‌ యాదవ్‌కు
స్టేట్‌ వైడ్ ఫేమ్ ఉంది
మంచి స్పీకర్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు.

చంద్రబాబు మీద, పవన్‌ మీద..
లోకేష్‌పై దూకుడుగా విమర్శలు చేయడం..
చెప్పాలి అనుకున్నది సూటిగా చెప్పడం
అనిల్ కుమార్‌ యాదవ్‌ అలవాటు.

సీఎం జగన్ మొదటి కేబినెట్‌లో
నీటి పారుదల శాఖ మంత్రిగా అనిల్ పని చేసి
తానేంటో నిరూపించుకున్నారు,
మంచి పేరు తెచ్చుకున్నారు.

ఇప్పటికే సామాజిక సాధికార బస్సు యాత్రలో..
పలు నియోజకవర్గాల్లో పాల్గొన్న అనిల్ యాదవ్..
తన ప్రసంగాలతో ప్రతిపక్షంపై
పిడుగుల్లాంటి విమర్శలు చేశారు.

నెల్లూరు జిల్లాకు నరసరావు పేట
నియోజకవర్గానికి మంచి సంబంధం ఉంది

1999లో నెల్లూరు జిల్లాకు చెందిన
నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి
నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి
టీడీపీ అభ్యర్ధి లాల్ జాన్ భాషపై
13,882 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

2004లో నెల్లూరు జిల్లాకు చెందిన
మేకపాటి రాజమోహన్ రెడ్డి ..
నరసారావు పేట ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి మద్ది లక్ష్మయ్యపై
86,255 ఓట్ల మెజార్టీతో గెలిచారు.

20 ఏళ్ల తరువాత మళ్లీ నెల్లూరుకు చెందిన
అనిల్ కుమార్‌ యాదవ్‌కు ..
నరసరావు పేట లోక్ సభ స్థానంలో పోటీ చేయడానికి
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం అవకాశం కల్పించింది.

👉బీసీ ఓటు బ్యాంక్‌..
వైఎస్ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకును
దృష్టిలో పెట్టుకునే
వైఎస్ఆర్‌ సీపీ అధిష్టానం
అనిల్ ను నరసరావు పేట నుంచి రంగంలోకి
దించిందని అనుకోవాలి.

2019లో కూడా నరసారావు పేట లోక్ సభ
స్థానాన్ని వైఎస్ఆర్‌ సీపీనే గెల్చుకుంది.

వైఎస్ఆర్‌ సీపీ నుంచి శ్రీకృష్ణ దేవరాయలు పోటీ చేసి..
టీడీపీ అభ్యర్ధి రాయపాటి సాంబశివ రావుపై
1,53,978 ఓట్లతో గెలిచారు.

కానీ
మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో
నరసారావుపేట లోక్ సభ స్థానం బీసీలకు
ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అధిష్టానం భావించింది.
అందులో భాగంగానే
బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన
అనిల్‌ను బరిలోకి దించింది.

శ్రీకృష్ణదేవరాయలు గుంటూరు లోక్ సభ స్థానానికి
మారితే బాగుండేది.
ఆయన కూడా
వైఎస్ఆర్ సీపీ తరపున ఈజీగా గెలిచేవారు.

కానీ తొందరపాటుతో
వైఎస్ఆర్ సీపీకి రాజీనామా చేశారని పలువురు భావిస్తున్నారు .
టీడీపీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఎంపీగా
పోటీ చేస్తారు అనడంలో సందేహం లేదు.

నరసారావుపేట లోక్ సభ స్థానంలో
బలమైన రెడ్డి సామాజికవర్గ ఓటు బ్యాంక్‌
బీసీల ఓటు బ్యాంక్ వైఎస్ఆర్‌ సీపీ అభ్యర్ధి
అనిల్‌కు అండగా ఉంటుంది
అనడంలో సందేహం లేదు.

వైఎస్ఆర్ సీపీ స్థాపించాక
అప్పటి నుంచి నరసరావు పేట ఎంపీ స్థానం
ఆ పార్టీకి కంచుకోటగా ఉంది.

గతంలో యాదవ సామాజిక వర్గ ఓట్లు
టీడీపీకి పడేవి.
ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ రంగ ప్రవేశంతో
యాదవుల ఓట్లు వైఎస్ఆర్ సీపీకి పడతాయని
అనడంలో సందేహం లేదని వైకాపా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి .

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో
పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట..
సత్తెనపల్లి, వినుకొండ, గురజాల,
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
మొదటి నుంచి నరసరావు పేట లోక్ సభ
నియోజకవర్గంలో రెడ్డి వర్సెస్ కమ్మ సామాజిక వర్గ..
ఫైట్‌గా ఉండేది.
ఇప్పుడు బీసీ మరియు రెడ్డి వర్సెస్‌ కమ్మ సామాజికవర్గ ఫైట్‌కు
నరసరావుపేట లోక్ సభ స్థానం వేదిక కానుంది.
సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో
ఎక్కువ లబ్ధి పొందింది బీసీ వర్గాల వారే.
గతంలో బీసీల ఓట్లు టీడీపీకి పడేవని
ఈ ఎన్నికల్లో బీసీల మెజార్టీ ఓట్లు
వైఎస్ఆర్‌ సీపీ వైపు వచ్చే అవకాశముంది.
నరసరావుపేట లోక్ సభ స్థానంలో
అనిల్ కుమార్ యాదవ్
మంచి మెజార్టీతో గెలుస్తారనడంలో
ఏమాత్రం సందేహం లేదని వైకాపా వర్గాలు భావిస్తున్నాయి.

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..