ప్రకాశం జిల్లా కొమరోలు మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ రఫీ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కొమరోలు మండలం గోపాలుని పల్లి వద్ద కుక్క అడ్డం రావడంతో ద్విచక్ర వాహనం పై నుండి కిందపడి తీవ్ర గాయాల పాలయ్యాడు.రఫీకి తలలో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రఫీ నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రఫీ కుటుంబం చాలా పేద కుటుంబం కావడంతో దాతలు ఎవరైనా సహాయం చేయాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎవరన్నా దాతలు సహాయం చేయాలనుకుంటే ఫోన్ పే, గూగుల్ పే 9010876099 నెంబర్ కు దాతలు తోచిన సహాయం చేసి రఫీ ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు.
Recent Posts