ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి వైసీపీ నాయకులు 38వ డివిజన్ కు చెందిన కొట్టె వెంకటేశ్వర్లు మరియు 29వ డివిజన్ కు చెందిన పోతoశెట్టి దుర్గా ప్రసాద్ గారితో పాటు సుమారుగా 100 కుటుంబాలు ఆ పార్టీని వీడి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీ లోకి రావడం జరిగినది.చేరిన వారికి జనార్దన్ తెలుగుదేశం పార్టీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు, చేరిన వారు మాట్లాడుతూ మా మద్దత్తు జనార్దన్ కే అని 2024లో ఒంగోలు ఎమ్మెల్యే గా మావంతు గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు అభివృద్ధి కోసం మీరంతా పార్టీలోకి రావడం చాలా సంతోషకరం అని వారికి తెలిపారు.ఈ కార్యక్రమం లో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
ఒంగోలు :దామచర్ల జనార్దన్ గారి సమక్షంలో వైసీపీ ముఖ్యనాయకులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిక..
Recent Posts