రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!

  1. రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ… దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం

అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.
కలిసి రావడం మొదలవ్వాలి కానీ… రావడం మొదలుపెడితే రియల్ ఎస్టేట్ ఇచ్చినంతగా మరో వ్యాపారం ఇవ్వదని అంటుంటారు ఆ రంగంలో ఎదిగినవారు! “బిజినెస్ మేన్” సినిమాలో మహేష్ బాబు ముంబై గురించి చెప్పినట్లు.. ఇవ్వడం మొదలుపెడితే ఇస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ గా పేరొందిన ఓ మహిళ ఏకంగా ఒక బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. అవును… ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. దీంతో ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. అప్పులు తీసుకోవడం తిరిగి వాటిని చెల్లించకపోవడం ఈమె నిత్యకృత్యాల్లో ఒకటి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా!! వివరాళ్లోకి వెళ్తే… వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ కంపెనీ “వాన్‌ తిన్హ్‌ పాట్‌” ఛైర్‌ పర్సన్‌ గా ఒక మహిళ మాగ్నెట్ ట్రూంగ్ మై లాన్‌ ఉన్నారు! ఈమెకు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎస్.సీ.బీ.)లో సుమారు 90 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆమె ఈ బ్యాంకులోనే మోసాలకు పాల్పడ్డారు. ఇందులో భాగంగా ఫేక్ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ఆలోచనకు చెల్లుచీటీ ఇచ్చేశారు! దీంతో… ఏకంగా ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆమెతో పాటు ఆ బ్యాంక్ లో ఖాతాదారులైన సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. వాస్తవానికి 2018 నుంచే ఆమె ఈ దందా మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా… 2018 నుంచి 2022 మధ్య మై లాన్‌.. ఇలా సుమారు 916 ఫేక్ లోన్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని, ఫలితంగా బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీలో 304 ట్రిలియన్‌ డాంగ్‌.. అంటే 12.5 బిలియన్ డాలర్లు.. ఇక మన రూపాయిల్లో చూసుకుంటే ఏకంగా లక్షకోట్లు దాటి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సుమారు 4.4 బిలియన్‌ డాలర్ల (రూ.36.5 కోట్లు) నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అదే ఏడాది అక్టోబరు నెలలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి సదరు బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులను విత్‌ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే… అసలు సొమ్ము సంగతి అటుంచితే కనీసం దాచుకున్న సొమ్ముపై వడ్డీ అయినా ఇవ్వండి అంటూ విన్నవించుకుంటున్నారు.. అదికూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌ తో పాటు 85 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7k network
Recent Posts

విజయవాడలో మళ్లీ టెన్షన్.. మళ్లీ పెరిగిన వరద..హైడ్రా చట్టబద్ధతకు ఆర్డినెన్స్..విజయవాడ వరదలపై రాజకీయం సరే -వైసీపీ పార్టీ సాయమెంత ?..వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్‌, రానా.. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం.. నిమజ్జనం ఏర్పాట్లు పరిశీలించిన సిఐ రామకోటయ్య.. పేద విద్యార్థికి అమ్మ ఫౌండేషన్ ఆర్థిక సాయం

కరెంటు బిల్లులపై ఏపీ సీఎం చంద్రబాబు ఊరటనిచ్చే ప్రకటన..50 లక్షలు సీఎమ్ రిలీఫ్ ఫండ్ కు చెక్ అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని..తీవ్రంగా నష్టపోయాం…పెద్దమనసుతో ఆదుకోండి-మంత్రి నారా లోకేష్..బాసర ట్రిపుల్ ఐటీలో 2000 మంది విద్యార్థుల ఆందోళన..భోజనం పెట్టి మరీ సమస్యలు విన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..జగన్ పర్యటనకు హైకోర్టు బ్రేక్..తెలంగాణ సీఎస్ మీద మోడీ సర్కార్ సీరియస్?..తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌.అదనపు భద్రతకు జగన్ అనర్హుడు: నచికేత్.

సీఎం చంద్రబాబుకి తప్పిన పెను ప్రమాదం..వెలుగులోకి ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు.. క్రమశిక్షణ చర్య…apuwj ఆధ్వర్యంలో వరద బాధితులకు విరాళం..22న హలోమాల చలో ఒంగోలు..శుభ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల, మాజీ ఎమ్మెల్యే పద అన్నా..కంభంలో ఘనంగా టీచర్స్ డే.. పలువురికి ఘన సన్మానం.

ఏపీలో నేడు కేంద్ర బృందం పర్యటన..జగన్ ఐదు నిముషాల షో..ముఖ్యమంత్రి చంద్రబాబు విసుర్లు..బుడమేరుపై ఫలిస్తున్న మంత్రి లోకేష్ కృషి..ఆ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పెన్షన్ రద్దు..బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు..వరద బాధితులకు కంభం వాసుల వితరణ..

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..పనిచేయని మంత్రులనూ పీకి పారేస్తా😯విజయ సాయి కబ్జా కూల్చివేత….బిడ్డలున్నారు కదా? షర్మిల సంచలన కామెంట్స్..తండ్రిని పట్టించుకోని కొడుకు గిఫ్ట్ డీడ్ రద్దు..పారాలింపిక్స్‌లో తెలంగాణ యువతికి కాంస్యం..నేడు కడప ఉరుసు మహోత్సవం ..వరంగల్ లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం..