టీడీపీ జనసేన : సీట్ల విషయంలో క్లారిటీ వచ్చినట్లేనా…???
తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా ? తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుల పంచాయతీ ఆదివారం పూట శుభం కార్డు పడిందా లేక ఇంకా మరిన్ని భేటీలు వేయాలా అంటే మూడు గంటల పాటు జరిగిన చర్చలో అన్ని అంశాలూ ప్రస్తావనకు వచ్చాయని అంటున్నారు. రెండు పార్టీలూ ఆశిస్తున్న సీట్లు ఆశావహుల డిమాండ్లు వంటివి ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చి ఉండవచ్చు అని అంటున్నారు. ఇక పొత్తు మూలంగా రెండు పార్టీలలోనూ ఆశావహులు పెద్ద సంఖ్యలో త్యాగరాజులు కావాల్సిందే అన్నది కూడా కీలక పాయింట్. వీరికి ఏదో విధంగా నచ్చచెప్పి రెండు పార్టీల విజయం కోసం కృషి చేయాలన్నది కూడా చర్చించారని అంటున్నారు. అదే విధంగా కూటమి విజయమే ముఖ్యమని ఎవరు ఎన్ని సీట్లు అన్నది కాకుండా వైసీపీ ప్రభుత్వం గద్దె దిగాలన్నది ప్రధాన లక్ష్యం కావాలని కూడా భావించినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నారని అంటున్నారు. ఆయన ఏపీలో కొత్త రాజకీయం రావాలని కొత్త ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జనసేన అండతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఏపీలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయని అంటున్నారు. ఇక ఇప్పటికే అరకు, మండపేట సీట్లను టీడీపీ ప్రకటించింది, అలాగే జనసేన కూడా రాజోలు, రాజానగరం సీట్లను ప్రకటించింది. అలా ఇద్దరూ సమానంగానే ఉన్నారు. అయితే అసలు కధ ఇపుడే ఉంది. ఎన్ని సీట్లు జనసేనకు టీడీపీ ఇస్తుందని. దానికి కూడా బయట జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ 140 కి తగ్గకుండా పోటీ చేస్తూ ఆ మిగిలినవే ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.
ఇక జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం ఓటు షేర్ ని సాధించింది. టీడీపీ విషయానికి వస్తే దాదాపుగా నలభై శాతం ఓట్ల షేర్ ని సాధించింది. ఈ రెండు పార్టీలు గత ఓట్ల షేర్ నిష్పత్తిలో సీట్ల పంపిణీ చేసుకంటే 6:1 అన్నట్లుగా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా టీడీపీకి 145 సీట్ల దాకా వస్తాయని అంటున్నారు. జనసేనకు 30 సీట్లు దక్కుతాయని అంటున్నారు. అయితే జనసేన ఓటు షేర్ ఈ ఎన్నికల నాటికి పది శాతం నుంచి ఇంకా పెరిగింది కాబట్టి ఆ లెక్క తీసుకోవాలని మరో వాదన ఉంది. అదే టైం లో టీడీపీ ఓటు బ్యాంక్ కూడా 42 శాతం దాకా పెరిగింది అని అంటున్నారు. మరి ఈ లెక్క చూసుకుంటే 4:1 అన్నట్లుగా కొత్త నిష్పత్తి వస్తుంది. అలా చూసుకుంటే కనుక జనసేనకు 40 దాకా సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ 135 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఫైర్ ఇదే సరైనది అని ఇలా చేస్తేనె గ్రౌండ్ లెవెల్ లో ఓట్ల బదిలీ అన్నది సాధ్యపడుతుంది అని అంటున్నారు. అయితే పాతిక తో మొదలెట్టి ముప్పయి సీట్లు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ చూస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా జనసేనకు ముప్పయి సీట్లు ఇవ్వడం అన్నది కూడా టీడీపీ పరంగా చూస్తే అది పెద్ద పొత్తు గానే చూడాలి. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు పవన్ సీట్ల పంపిణీ పొత్తుల విషయంలో పూర్తి అవగాహనతో ఉన్నారని అంటున్నారు. అందుకే సుదీర్ఘంగా మూడుగంటల పాటు ఈ రెండు పార్టీల అధినేతలు చర్చించారు. అని తెలుస్తోంది. దానికి సంబంధించే ముందుగా పార్టీ ఆశావహులకు నచ్చ చెప్పిన మీదటనే జాబితాను విడుదల చేస్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఈ రెండు బలమైన పార్టీల వెనక ఉన్న రెండు బలమైన సామాజిక వర్గాల వారికి కూడా నచ్చ చెప్పుకోవాల్సి ఉంది. మొత్తానికి ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది అన్నది ప్రకటించడానికి మరో ముహూర్తం ఉందని అంటున్నారు.