పదునైన ఈడీ చక్రం బీజేపీ మీద దూసుకెళ్లదేం…???

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు .

ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దశాబ్దం క్రితం దీని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ మాటకు వస్తే సీబీఐ గురించి కూడా తెలియదు. జగన్ కేసుల పుణ్యమాని సీబీఐ ఈడీ అంటే ఏంటో అందరికీ తెలిసాయి. బహుశా అప్పటి నుంచే రాజకీయ ప్రత్యర్ధుల మీద ఈడీ సీబీఐ వాడకం కూడా బాగా పెరిగింది అని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ రెండూ కేంద్ర దర్యాప్తు సంస్థలు. ఎవరు కేంద్రంలో పాలిస్తూంటే వారి ప్రత్యర్ధుల పాపాలు పండినట్లే. కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంటే గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్న అమిత్ షా సీబీఐ ద్వారా అరెస్ట్ అయి జైలు పాలు అయ్యారు. అదే అమిత్ షా కేంద్రంలో హోం మంత్రి కాగానే నాటి హోం మంత్రి చిదంబరం అచ్చంగా 105 రోజుల పాటు జైలులో మగ్గాల్సి వచ్చింది. ఇక ఈడీ చక్రం పదునుగా ఉంటుంది. అది దూసుకుని వస్తే ఇంతే సంగతులు. ఈడీ దాడులు అంటూ తరచూ వార్తలు వస్తున్నాయి. ఈడీ సీఎంలను వదలడంలేదు. ఇటీవలే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఈడీ బాధితుడిగా మారి అరెస్ట్ అయి తన సీఎం పదవిని కోల్పోయారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి ఈడీ పిలుపులు పదే పదే వస్తున్నాయి. ఈడీ కేవలం విపక్షాల మీదనే పనిచేస్తోందని, దాన్ని అలాగే ప్రయోగిస్తున్నారు అని ప్రతిపక్షాలు పార్లమెంట్ లోపలా బయటా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి పార్లమెంట్ లోనే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ జవాబు పవర్ ఫుల్ గా ఇచ్చేశారు. అవినీతిని అంతం చేసేవరకు విశ్రమించేదిలేదు అని ప్రధాని అన్నారు. గొట్టిపాటి బుజ్జి’ మెజార్టీ మీదే లెక్క‌లు..! అంతే కాదు, కాంగ్రెస్‌ హయాంలో దర్యాప్తు సంస్థలను రాజకీయ అవసరాల కోసం వాడుకున్నారు అని ఆరోపించారు. దేశంలో అవినీతి నేతలకు విపక్షాలు సపోర్ట్‌ చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చెశారు. ఇక మరో పోలిక కూడా చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఈడీ కేవలం 5 వేల కోట్ల రూపాయలే సీజ్‌ చేసిందని ఇక తమ హయాంలో లక్ష కోట్ల రూపాయల అక్రమ నగదు సీజ్‌ చేశామని ప్రధాని చెప్పుకున్నారు. అంతే కాదు విచారణ జరపడం దర్యాప్తు సంస్థల పని. వాటిపై విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఇలా ఈడీ పనితీరు మీద మోడీ సభలో గొప్పగా చెప్పారు అని అంటున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగా అక్రమ నగదు లక్షల కోట్లలో ఈడీ సీజ్ చేయడం మంచి పరిణామమే. కానీ ఈడీ చక్రం ఎపుడూ విపక్షాల వైపే దూసుకుని వెళ్తోంది అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంది. బీజేపీ నేతలలో అంతా మంచివారే ఉండరు కదా. రాజకీయం అన్న తరువాత నూరు శాతం పునీతులు ఉండే చాన్స్ లేదు కదా అని అంటున్నారు. అలా చూసుకుంటే బీజేపీ నేతల మీద ఈడీ దాడులు ఎందుకు లేవు అని అంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చాలా మంది గతంలో ఒక పార్టీలో ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఓడాక బీజేపీ పంచన చేరారు. వారి మీద ఈడీ కేసులే లేవు. మరి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తోంది. ఇది సగటు జనాల సందేహాలు. మరి వీటిని కూడా బీజేపీ పెద్దలు తీర్చాలి కదా. ఏది ఏమైనా ఈడీ సీబీఐ వంటి సంస్థలకు స్వంత్రంత్ర ప్రతిపత్తిని కల్పిస్తేనే తప్ప పూర్తి న్యాయం జరగదు అన్న వాదనలు ఉన్నాయి.

 

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..