చంద్రబాబు నిజాయితీపరుడని జగన్మోహన్ రెడ్డే రుజువుచేశాడు..


 • *– 53రోజులు చంద్రబాబును అక్రమంగా జైల్లో నిర్బంధించారు*
  *– స్కిల్ కేసులో ఒక్క ఆధారం కూడా కోర్టుకు జగన్ సర్కార్ చూపలేకపోయింది*
  *– పార్టీకోసం, నాయకుడికోసం ప్రాణాలొదిలిన కార్యకర్తలను ఆదుకోవడం నా కర్తవ్యం*..నిజం గెలవాలి   కార్యక్రమంలో నారా భువనేశ్వరి..
  ఆంధ్ర మిర్రర్ చిలకలూరిపేట..
  తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం ఆధారాల్లేని ఓ కేసులో కుట్రపూరితంగా ఇరికించి 53రోజులు అక్రమంగా జైల్లో నిర్బంధించిందని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం, యడ్లపాడు గ్రామంలో నిజం గెలవాలి పర్యటన సందర్భంగా ఆమె మాట్లాడుతూ…
  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబుగారిపై అక్రమ కేసు పెట్టిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమేనని,
  యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చంద్రబాబు పెద్దపెద్ద కంపెనీలను తీసుకొచ్చారన్నారు .
  యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వడాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పుబట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు .
  స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో అవినీతి జరిగిందని, ప్రజాధనాన్ని చంద్రబాబు లూటీ చేశారని ఎలాంటి ఆధారాల్లేకుండా కేవలం ఆరోపణలతోనే చంద్రబాబుగారిపై అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టారని ఆరోపించారు.
  చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో జగన్ సర్కార్ ఒక్క ఆధారాన్ని కూడా కోర్టుకు ఇవ్వలేకపోయింది…అంటే చంద్రబాబు నిజాయితీపరులని జగన్మోహన్ రెడ్డే ఒప్పుకున్నాడని అన్నారు .
  చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక, మనస్తాపానికి గురై పార్టీ బిడ్డలు మృతిచెందారని,
  వారి కుటుంబాలను పరామర్శించడం, వారిని ఓదార్చడం తన కర్తవ్యం అన్నారు.
  తన కర్తవ్యాన్ని మర్చిపోకుండా నేడు పార్టీ బిడ్డల కుటుంబాలను కలిసి, పరామర్శిస్తున్నానని అన్నారు.
7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..