రాహుల్ గాంధీ ఇంక పాదయాత్రతో లాభం లేదు…!!!

కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు కాంగ్రెస్ అగ్ర నేత, ఆ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్ధిగా రేసులో ఉన్న రాహుల్ గాంధీ పాదయాత్ర చేసుకుంటూ పోతున్నారు. అయితే ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ ఆయన పాదయాత్ర చేయడం వల్ల ఏమైనా లాభం ఉందా అన్న చర్చ వస్తోంది. నిజానికి పాదయాత్రలైనా మరేమైనా ఎన్నికలకు మూడు నెలల ముందు పూర్తి చేసుకోవాలి.

ఆ మీదట ఎన్నికల వ్యూహాలు రచిస్తూ వార్ రూం లో ఫుల్ బిజీగా ఉండాలి. కానీ రాహుల్ 2022 సెప్టెంబర్ 7 నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టారు. అది నాలుగు వేల కిలోమీటర్ల ద్వారా సాగింది. బాగా రెస్పాన్స్ వచింది. దాని వల్ల కర్నాటక తెలంగాణాలో పార్టీ గెలిచింది. అయితే రాజస్థాన్ లో అధికారం పోయింది మధ్యప్రదేశ్ దక్కించుకోలేకపోయింది. అయితే ఆ తరువాత దాదాపు సంవత్సరం గ్యాప్ ఇచ్చిన రాహుల్ గాంధీ ఈ ఈ ఏడాది జనవరి రెండవ వారం నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రెండవ విడత యాత్ర చేపట్టారు. ఈ యాత్ర మార్చి నెలాఖరుకు పూర్తి అవుతుంది. అయితే అప్పటికే ఎన్నికలు ఏకంగా ముంచుకునే వస్తాయి. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ యాత్ర చేసినా ప్రయోజనం ఏమి ఉంటుందని అంటున్నారు. అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు అలవాటు పడ్డారని అంటున్నారు. కానీ ఇది ఈ టైం లో రాంగ్ డెసిషన్ అని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి అగ్ర నేతలు రాష్ట్రాల వారీగా కీలక ప్రాంతాలను చూసి భారీ బహిరంగ సభలు పెట్టుకోవాలి. అదే విధంగా ఎక్కడికక్కడ యువతతో భేటీ కావడం వారిని పార్టీ వైపుగా ఆకర్షించడం చేయాల్సి ఉంది అంటున్నారు. ఇపుడు వ్యూహాలు అవసరం అని అంటున్నారు. పాదయాత్రలకు ఇది అసలు టైం కానే కాదు అని అంటున్నారు. ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ చేసుకోవాలి. ఎవరేమిటి అన్నది అంచనాలకు రావాలి. తమ బలాలు ఏమిటి ఎదుటి వారి బలహీనతలు ఏమిటి అన్నది కూడా మధింపు చేసుకోవాలి. సరైన ప్రణాళిక ప్రకారం సాగాలి. ఇండియా కూటమి చూస్తే రోజు రోజుకీ చిక్కిపోతోంది. రాహుల్ పాదయాత్రలో ఉంటే మరో వైపు నితీష్ కుమార్ ఎన్డీయే కూటమిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆప్ సొంతంగా ఎంపీలను ప్రకటించేస్తోంది. మమతా బెనర్జీ గుర్రు మీద ఉన్నారు. ఈ నేపధ్యంలో ఇండియా కూటమిని పటిష్టం చేసుకుంటూ ఎన్డీయే కూటమితో ఢీ కొట్టాల్సి ఉంటుంది. కానీ రాహుల్ గాంధీ మాత్రం అలా తనకు అలవాటు అయిన పాదయాత్రను చేసుకుంటూ పోతున్నారు. ఎన్నికలకు అసలు టైం లేదు. కచ్చితంగా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ టైం లో దేశంలోని 543 ఎంపీ సీట్లలో పరిస్థితి ఏమిటి అన్నది కూడా అంచనా వేసుకోవాలి. ప్రతీ ఎంపీ నియోజకవర్గంలో ఏ కులం బలం ఎంత అలాగే రాష్ట్రాల వారీగా అంశాలు తీసుకోవాలి. అక్కడ ఉన్న సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు కూడా బేరీజు వేసుకోవాలి. ఒక విధంగా చూస్తే ప్రతీ రోజూ యుద్ధమే చేయాలి. కానీ ఈ కీలకమైన టైం లో రాహుల్ గాంధీ మాత్రం కాళ్ళకు పని చెబుతున్నారు. పాదయాత్ర ఏమి లాభం చేకూరుస్తుందో కాంగ్రెస్ పెద్దలకే తెలియాలి. రాజకీయాలలో ఎపుడూ వ్యూహాలే గెలిపిస్తాయి. దానికి తోడు ప్రజాభిమానం ఉండాలి. కానీ కేవలం యాత్రలు చేసినంత మాత్రాన గెలుపు సాధ్యం అవుతుంది అనుకుంటే మాత్రం అది ఇబ్బంది అవుతుందని అంటున్నారు. మరి మార్చి దాకా పాదయాత్రే అంటూ ముందుకు పోతున్న రాహుల్ గాంధీకు ఎవరు చెబుతారో తెలియదు కానీ ఆయన పాదాలు ముందుకు కదులుతూంటే కాంగ్రెస్ కి సరైన దిశా నిర్దేశం లేక వెనకబడిపోతోంది. 2024 ఎన్నికల యుద్ధంలో బీజేపీ ముందుకు పోతోంది. ఇదీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో రాజకీయ ముఖ చిత్రం. మరి కాంగ్రెస్ కానీ రాహుల్ కానీ తమ యాక్షన్ ప్లాన్ మార్చుకుని ఎన్నికలకు రెడీ అవుతారా అంటే చూడాల్సిందే???

7k network
Recent Posts

పదేళ్లలో పెరిగిన ఈడీ దూకుడు..సీఎం జగన్ సమక్షంలో చేరికలు..నామినేషన్ వేసిన మాగుంట..రేపే కుందూరు నామినేషన్..రాజీనామా చేస్తే 15 వేలు!!!..బస్సులో అమ్మాయి అసభ్య ప్రవర్తన..సోదరుడి కోసం సోదరి ప్రచారం

టిడిపిని వాలంటీర్లే ఓడిస్తార?..పవన్ సీట్లు అమ్ముతున్నారని..పిఠాపురంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు..సీతారాముల కళ్యాణంలో మాగుంట,ముత్తుముల దంపతులు..గిద్దలూరు వైకాపా టీడీపీలలో చేరికలు

సీఎం జగన్ సమక్షంలో హేమాహేమీల చేరికలు..ఓర్వలేకనే దాడులు..1400 కిలోల బంగారం స్వాధీనం..విస్తృత ప్రచారంలో మాగుంట తనయుడు..కంభంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డిఆత్మీయ సమ్మేళనం.. త్రిబుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్య..

ఇజ్రాయిల్ పై ఇరాన్ క్షిపణి దాడులు..సీఎం జగన్ పై జరిగిన దాడిని ఖండించిన షర్మిల..పవన్ కళ్యాణ్ పై నాన్ బైయిలబుల్ కేసు!!! సల్మాన్ ఖాన్ఇంటి వద్ద కాల్పులు..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట..ఎమ్మెల్యే అన్నా సతీమణి,కోడలు ప్రచారం..