👉తన గొయ్యి తానే తవ్వుకుంటున్న పవన్???.పవన్ కళ్యాణ్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పోటీగా వైసీపీ అభ్యర్థి వంగా గీత నిలబడ్డారు. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారని
ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఇంకా ఎన్నికల తేదీకి 20 రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు.అయితే ఆయన సమావేశాల్లో మాట్లాడుతున్న మాటలు సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులకే నచ్చడం లేదని చర్చ జరుగుతోంది.ఇటీవల ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ దాడి గురించే పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడుతున్నారు. చిన్న గులకరాయి తగిలితే ఏమవుతుంది అన్నట్లు ఆయన ఇన్సెన్సిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.అంతేకాదు ఇది ఒక డ్రామా అని, పులి మేక కథను మళ్లీ మళ్లీ చెప్తే సానుభూతి ఎలా లభిస్తుంది అని మాట్లాడుతున్నారు.తోటి రాజకీయ నాయకుడికి కన్ను పోయే పని అయింది.అది చిన్న దెబ్బ ఏం కాదు చాలా పెద్ద దెబ్బె.ఆరాయి కూడా గులకరాయి కాదు, పెద్ద రాయి! దెబ్బ తగిలి జగన్ ముఖమంతా కమిలిపోయింది. అది చూసిన ఎవరికైనా సానుభూతి కలుగుతుంది కానీ పవన్ మాత్రం ఆ ఘటన గురించి జోకులు చేస్తూ నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.👉గెలిస్తే ఏపీ ప్రజల కోసం తన పార్టీ ఏం చేస్తుందనే విషయాన్ని ఆయన ఎక్కడా చెప్పకపోవడం విస్మయం కలిగిస్తోంది. గెలిపిస్తే ప్రజల కోసం ఫలానా పనిచేస్తానని చెప్తే ఓటు చెయ్యకూడదు అని అనుకునే వారు కూడా వేసే అవకాశం ఉంది కానీ ఒకరిని ఇష్ట రాజ్యాంగా తిడితే చాలు తనకి ఓట్లు పడతాయని భావించడం సబబు కాదని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు. పిఠాపురంలో ప్రజలు ఇలాంటి మాటల ధోరణిని అసలు మెచ్చరని కూడా అంటున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అనే ముద్ర పడిపోయింది.పార్టీలు మారుతూ జగన్ కి తాను మొగుడు అవుతానంటూ చాలా దిగజారి ఆయన మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు.ఒకవేళ ఇలాంటి మాటలతో ఆయన ఓడిపోతే పొలిటికల్ కెరీర్ కి చెక్ పడిపోతుంది………..👉 మూడు నాలుగు రోజులు ఎన్నికల ప్రచారం చేపట్టినంతనే అనారోగ్యానికి గురవుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్..తాజాగా మరోసారి జ్వరం బారిన పడ్డారు.ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా పార్టీ స్పందించింది. తరచూ అనారోగ్యానికి గురయ్యే పవన్ ను ఇబ్బంది పెడుతున్న అసలు ఆరోగ్య సమస్య ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తరచూ అనారోగ్యానికి ఎందుకు గురవుతున్నారు? అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలతో పాటు.. ఇలా అయితే రానున్న మూడు వారాల ప్రచారం మాటేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ తరచూ జ్వరంతో బాధ పడుతున్నారు. మధ్యలో ప్రచారానికి బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ కు వెళ్లటం తెలిసిందే.కాస్తంత కోలుకున్న తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టినా.. ఆయన అస్వస్థతకు గురి కావటం జనసైనికుల్లో ఆందోళనకు గురి చేస్తోంది.తాజాగా పవన్ ఇబ్బంది పడుతున్న జ్వరానికి కారణాలు వెల్లడయ్యాయి. పవన్ కల్యాణ్ ఊపిరితిత్తుల్లో నెమ్ము చేరిందని.. దీంతో ప్రతి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో బాధ పడుతున్న విషయాన్ని వెల్లడించారు. ఇన్ ఫ్లుయెంజా కారణంగా శ్వాస తీసుకోవటానికి పవన్ ఇబ్బంది పడుతున్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.అయినప్పటికీ.. అంతటి అస్వస్థతతో ఉండి కూడా విజయభేరీ యాత్రను కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తరచూ జ్వరం బారిన పడుతున్న పవన్.. తన ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ ప్రచారానికి వచ్చిన సందర్భంలో భారీ క్రేన్ తో మెగా పూలదండల్ని ఏర్పాటు చేయొద్దన్న సూచనను పవన్ చేస్తున్నారు. అంతేకాదు.. పవన్ తో ఫోటోలు..సెల్ఫీలు..షేక్ హ్యాండ్ల కోసం కొన్నాళ్లు ఒత్తిడి చేయొద్దని.. పూలు చల్లే క్రమంలో కూడా పవన్ ముఖానికి తగిలేలా పూలు చల్లొద్దంటూ సూచనలు చేస్తున్నారు. పవన్ ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నేపథ్యంలో పవన్ అభిమానులు.. వీర మహిళలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేశారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ ఆరోగ్యం పెద్ద సమస్యగా మారిందన్న మాట వినిపిస్తోంది. అందుకే మరిన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. మరి.. ఈ సూచనల్ని జనసైనికులు పట్టించుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.మరేం జరుగుతుందో చూడాలి.
👉బీఫారం అందజేసిన టిడిపి అధినేత చంద్రబాబు.. ఉండవల్లి లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కి మరియు అసెంబ్లీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్ కి,డోల బాల వీరాంజనేయ స్వామికి, కందుల నారాయణ రెడ్డికి,డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి ,ముత్తుముల అశోక్ రెడ్డి,డా.గొట్టిపాటి లక్ష్మీ ,గూడూరు ఏరిక్షన్ బాబులకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బి. ఫారం అందజేశారు. ఈసందర్భంగా అభ్యర్థులు శుభాకాంక్షలు తెలిపారు.
👉 మార్కాపురం అసెంబ్లీ బరిలో స్వతంత్ర అభ్యర్థిగా గాలి వెంకటరామిరెడ్డి – ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ.. పొదిలి.. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రజాసంఘాల నాయకుడు, సిపిఎం సీనియర్ మాజీ నాయకులు గాలి వెంకటరామిరెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన పొదిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా వెనకబడిన మార్కాపురం ప్రాంత అభివృద్ధిలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతూ కార్మికులు వలస పోతున్నారని అన్నారు.మార్కాపురం పొదిలి ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తాను మేనిఫెస్టో విడుదల చేసినట్లు తెలిపారు. మార్కాపురం పొదిలి మండల కేంద్రాల్లో అమ్మ మొబైల్ క్యాంటీన్ల ద్వారా పేదల దాహార్తి తీర్చేందుకు విచ్చేస్తానన్నారు.నియోజవర్గంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాలైన గొట్టిపాడియ, అక్కచెరువు బాధితులకు ఆర్ఆర్ ప్యాకేజీ త్వరగా అన్నది కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో అర్హులైన రెండు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించడం,ఇలా నిర్మాణానికి ఒక్కొక్కరికి ఐదు లక్షలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలో అన్ని గ్రామాలకు వెలుగొండ ప్రాజెక్టు సాగు త్రాగునీరు ప్రతి ఇంటికి కుళాయి వసతి కల్పిస్తామన్నారు.పొదిలి పట్టణ దాహర్తి తీర్చేందుకు పెద్ద చెరువుకు సాగ జలాల మళ్లింపుకు నిధుల మంజూరు కృషి చేసి పనులను వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. పొదిలి కేంద్రంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వంద పడకల వైద్యశాల ఏర్పాటు ఆవశ్యకత ఉందన్నారు.విరిగిపడిన పశ్చిమ ప్రాంతం మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుతో పాటు పొదిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.మార్కాపురం పట్టణంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి మాన్యం భూముల్లో ఇల్లు వేసుకున్న పదివేల కుటుంబాల వారికి ఇళ్ల పట్టాలి ఇస్తామన్నారు.పొదిలి పట్టణాన్ని విస్తరించి ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు డివైడర్ ఏర్పాటు చేసి మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ కల్పిస్తామన్నారు. మార్కాపురంలో పూలు, పండ్లు, కూరగాయల తోపుడు బండ్లకు,బీడీ బంకులకు మున్సిపాలిటీ పన్ను రద్దు చేయిస్తామన్నారు.అదేవిధంగా పొదిలి కేంద్రంగా నియోజకవర్గం, కొనకనమిట్ల మండలాన్ని విడగొట్టి గొట్లగట్టు కేంద్రంగా మండలం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మార్కాపురం మీదుగా శ్రీశైలం ఒంగోలు రైల్వే లైన్ కు పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట షేక్ మస్తాన్ వలి, బి.రామారెడ్డి, పఠాన్ నాయబ్ రసూల్,డేవిడ్ లు ఉన్నారు.
👉టీడీపీ అబద్ధపు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు..జగనన్న మళ్ళీ సి.యం అయితేనే సంక్షేమ పథకాలు..*అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కుందూరు నాగార్జున రెడ్డి సతీమణి కల్పన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అర్ధవీడు మండలం పాపినేనిపల్లె గ్రామంలో ఇంటింటికి తిరిగి గత ఐదు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.ప్రజలకు ఏ సమస్య వచ్చిన స్థానికంగా అందుబాటులో ఉంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించటమే కుందూరు నాగార్జున రెడ్డి ధ్యేయమన్నారు*
జగనన్న మళ్ళీ సి.యం అయితేనే సంక్షేమ పథకాలు వస్తాయి, టీడీపీ అబద్ధపు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో ప్రజలు లేరున్నారు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలంతా మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోటీ చేయుచున్న కుందూరు నాగార్జునరెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో అర్ధవీడు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.👉గిద్దలూరు నియోజకవర్గ గిద్దలూరు మండలం కొమ్మునూరు పంచాయతీ నల్లగట్ల గ్రామానికి చెందిన 10 కుటుంబాలు వైయస్సార్ సీపీ లో చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఉడుముల శ్రీనివాసరెడ్డి కుమారుడు ఉడుముల అశోక్ రెడ్డి…👉 ముండ్లపాడు పంచాయతీ బురుజుపల్లి తండా వాసులు టీడీపీ నుండి వైయస్సార్ సీపీ లోకి చేరిక 14వ వార్డు ఉడుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరిక పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఉడుముల అశోక్ రెడ్డి.👉గిద్దలూరు నియోజకవర్గం పాపినేనిపల్లి గ్రామంలో మార్కాపురం శాసన సభ్యులు గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి కల్పనా ఆధ్వర్యంలో టిడిపి నుండి వైసీపీ లోనికి 40 కుటుంబాలు చేరిక వైయస్సార్ సీపీలోకి కండువా గప్పి ఆహ్వానించిన కల్పనారెడ్డి. కార్యక్రమంలో నాయకులు,కార్యకర్తలు నాయకులు.👉 ముండ్లపాడు పంచాయతీ బురుజు పల్లె తండా వాసులు టీడీపీ నుండి వైయస్సార్ సీపీ లోకి చేరిక 14వ వార్డు ఉడుముల అశోక్ రెడ్డి మరియు కుoదురు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో 50 కుటుంబాలు చేరిక.
👉చింతాయగారిపాలెం లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం లో పాల్గొన్న ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవ రెడ్డి సతీమణి చందన ,మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరదలు శశికళ ,ఒంగోలు శాసనసభ అభ్యర్థి దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్య లత వారి కుమార్తె అనిషా లక్ష్మి మరియు మరియు పలువురు తెలుగుదేశం,జనసేన,బీజేపీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.