ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. “బస్సు ప్రమాదం” ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి!!!

👉ఏం ‘టంగ‌య్యా’ స్వామీ.. మోడీపై విసుర్లు!.. అకస్మాత్తుగా ముస్లింలపై మోడీకి ప్రేమ పుట్టుకు వచ్చేసింది.. ముస్లింలలో పేదరికం ఎక్కువట!.. ఆయన కూడా ముస్లిం స్నేహితులు ఉన్నారట..!!!..ఒక‌రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టి ఆక‌లి తీర్చార‌ట .. సెంటిమెంటు డైలాగులు.

ఒక మాట మాట్లాడితే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాలి. లేదా.. అస‌లు ఆ మాటే మాట్లాడ‌కూడ‌దు.ఒక మాట మాట్లాడితే.. దానికి క‌ట్టుబ‌డి ఉండాలి. లేదా..అస‌లు ఆ మాటే మాట్లాడ‌కూడ‌దు. పైగా ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌భావం ఎక్కువ‌గాఉన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లకు-నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను వేరే ఎవ‌రో వ‌చ్చి వివ‌రించాల్సిన అవ‌స‌రం లేదు. ప్ర‌జ‌లే విశ్లేష‌కులుగా మారుతున్నారు.దీంతో నాయ‌కులు చెబుతున్న మాట‌ల‌ను వారు నిశితంగానే గ‌మ‌నిస్తున్నారు.నాయ‌కులు ఎంతటి ఉద్దండులైనా.. కూడా వారు చెబుతున్న ప్ర‌తి విష‌యాన్ని గ‌మ‌నిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న దేశ సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌ధాని మోడీ.. ముస్లింల‌ను ఉద్దేశించి అనే క వ్యాఖ్య‌లు చేశారు.వారి రిజ‌ర్వేష‌న్లు ఎత్తేస్తామ‌న్నారు. అంతేకాదు.. మ‌త ప్రాతిప‌దిక‌న రిజ‌ర్వేష‌న్లు ఏంటి? అనే ప్ర‌శ్న ను కూడా తీసుకువ‌చ్చారు. వారి రిజ‌ర్వేష‌న్లు ఎత్తేసి.. వాటిని ఓబీసీల‌కు పంచేస్తామ‌ని కూడా చెప్పారు. ఇక‌, కాంగ్రెస్ వ‌స్తే.. పెద్ద ఎత్తున హిందూ వ‌ర్గాల ఆస్తులు లాగేసుకుని.. ముస్లింల‌కు పంచేస్తుంద‌ని కూడా పెద్ద వివాదం లేవ‌నెత్తారు. దీనికి కౌంట‌ర్ ఇచ్చు కోలేక కాంగ్రెస్ నోరెళ్ల బెట్టింది.ఇంత బ‌లంగా ముస్లింల‌పై విమ‌ర్శ‌లు చేసిన మోడీ.. అనూహ్యంగా టంగ్ మార్చేశారు. నాలుగోద‌శ పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. ఎన్డీయే కూట‌మి పేల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుంద‌న్న విశ్లేష‌ణ‌లు వ‌చ్చిన ద‌రిమిలా.. మోడీ ముస్లింల‌పై ప్రేమ కురిపించారు. వారిపై ఎన్ని పొగ‌డ్త‌లో కురిపించారు. ముస్లింలు చాలా పేద‌వార‌ని అన్నారు. అంతేకాదు.. 👉గ‌తంలో త‌న‌కు ఒక‌రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టి ఆక‌లి తీర్చార‌ని కూడా.. సెంటిమెంటు డైలాగులు పండించారు. మోడీ ఏమ‌న్నారంటే.. 👉 ముస్లింల‌పై తన వ్యాఖ్యలను కొంద‌రు కావాల‌ని వక్రీకరించార‌ని తెలిపారు. కౌంట‌ర్‌: తొలి మూడు ద‌శ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో 6 మీడియాచాన‌ళ్ల‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన‌ప్పుడు ఈ మాట ఎందుకు చెప్ప‌లేదు? + చిన్నప్పుడు తమ ఇంట్లో రంజాన్, ఈద్‌ పండగను కూడా నిర్వహించిన‌ట్టు చెప్పారు. కౌంట‌ర్‌: అధికారంలోకి వ‌చ్చాక‌.. ఒక్క‌రోజైనా.. ఈ విష‌యం చెప్పారా? ముస్లింల‌తో క‌లిసి ఇప్తార్ విందు తీసుకున్నారా? + ఎక్కువమంది పిల్లలు గురించి మాట్లాడినప్పుడు అది ముస్లింల గురించి అని ఎవరు చెప్పారు? అని గ‌డుసు ప్ర‌శ్న‌వేశారు. కౌంట‌ర్‌: ఇది పూర్తిగా అబ‌ద్ధం. రాజస్థాన్ నుంచి మ‌హారాష్ట్ర‌, యూపీలో మోడీ.. చేసిన ప్ర‌చారం ముస్లింల పిల్ల‌ల గురించేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగిన‌ప్పుడు మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడారు. 👉 2002లో గోద్రా రైలు దుర్ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు కూడా తన ప్రత్యర్థులు ముస్లిం వర్గంలో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కౌంట‌ర్‌: మ‌రి బీబీసీ డాక్యుమెంట‌రీని ఎందుకు అడ్డుకున్నారు. ఈ విష‌యాలు అప్పుడు ఎందుకు చెప్ప‌లేదు. 👉నా స్నేహితుల్లో చాలా మంది ముస్లింలు ఉన్నారని మోడీ చెప్పారు. కౌంట‌ర్‌: ఒక్క‌రినైనా ఏనాడైనా.. స‌మాజానికి చూపించారా? ఒక్క‌స్నేహితుడినైనా రాజ‌కీయంగా తీసుకువ‌చ్చారా? టికెట్ ఇచ్చారా? 👉హిందూ-ముస్లిం అంటూ తేడా చూపడం ప్రారంభించిన రోజు.. ప్రజాజీవితంలో ఉండే అర్హత తనకు లేద‌ని కూడా చెప్పుకొచ్చారు. కౌంట‌ర్‌: అస‌లు ప్రచారం అంతా కూడా.. ఈ `తేడా` చుట్టే తిరిగింది. కానీ, ఇప్పుడు టంగు మార్చేశారు.👉 కొస‌మెరుపు: నాలుగు ద‌శ‌ల్లో జ‌రిగిన పోలింగ్‌లో ఆయన ఇలా మాట్లాడలేదు. మైనారిటీ ఓట్లు ఎక్కువ‌గా ఉన్న యూపీలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నెల 25న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. దీంతో మోడీ టంగ్ మారింద‌నే చ‌ర్చ సాగుతోంది.

👉పల్నాడు జిల్లాలో బస్సు ప్రమాదం ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి..

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన జగన్.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్ ఆకాంక్ష.

👉ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్..

కీలక నిర్ణయం! ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.. ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ ఉన్న డీజీపీ వల్ల కాదని.. ఆయనను కూటమి నేతల ఫిర్యాదు మేరకు మార్చినా కూడా ఎందుకు ఈ స్థాయిలో హింసాత్మక ఘటనలు జరిగాయంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ సంగతి అలా ఉంటే… ఈ విషయంపై ఈసీ సీరియస్ అయ్యింది. అవును… ఏపీలో పోలింగ్ రోజు పలు హింసాత్మక ఘటనలు జరగడం.. అది జరిగి మూడు రోజులు పూర్తవుతున్న ఆ రచ్చ సద్దుమణిగినట్లు కనిపించకపోవడంపై ఈసీ సీరియస్ అయ్యింది! పోలింగ్ సమయంలోనూ.. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది. ఈ ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు పంపింది. దీంతో… ఈ ఇద్దరు అధికారులు గురువారం ఢిల్లీ వెళ్లి, కేంద్ర ఎన్నికల కమిషన్ ముందు హాజరై, ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వనున్నారని తెలుస్తుంది. ఎన్నికలతో పాటు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లిప్తంగా,నిర్లక్ష్యంగా వదిలేసినట్టు ఈసీ గుర్తించిందని తెలుస్తుంది. పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రాం మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టు తెలుస్తోంది. దీపక్ మిశ్రాపై వైసీపీ ఫిర్యాదు!: మరోపక్క టీడీపీ నేతలతో కుమ్మక్కై తెర వెనుక కథ నడిపారంటూ ఏపీ పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రాపై సీఈవో, డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది! పోలింగ్‌ రోజు కూటమికి మద్దతుగా వ్యవహరించాలని ఆయన పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారని.. పోలింగ్‌ కు 3 రోజుల ముందు టీడీపీ నేత విష్ణువర్థన్‌ ఇచ్చిన పార్టీకి ఆయన హాజరైనట్లు గుర్తించబడ్డారని ఆ ఫిర్యాదులో పెర్కొన్నట్లు తెలుస్తుంది. పోలింగ్‌ అనంతరం మంగళవారం తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌ లను పరిశీలించేందుకు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని వచ్చిన సమయంలో… తీవ్ర రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ – టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లాలో విధ్వంసం!: చంద్రగిరి రచ్చ ఒకెత్తు అయితే పల్నాడు జిల్లాలో జరిగిన దారుణాలు మరొకెత్తు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో తీవ్ర హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే సమయంలో… గురజాల నియోజకవర్గంలో ఒక పార్టీ కార్యకర్తలు వైసీపీకి ఓటు వేశారనే కారణంతో ఇళ్లపై దాడులు చేయడంతో భయబ్రాంతులకు గురైన మహిళకు గుడిలో దాక్కున్న పరిస్థితి! తాడిపత్రిలో విధ్వంస కాండ!: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ పార్టీల అనుచరులు విధ్వంసకాండను సృష్టించారు. తాడిపత్రిలోని చింతలరాయుని పాలెంలో టీడీపీ – వైసీపీ పోలింగ్ ఏజెంట్ల మధ్య తీవ్ర రచ్చ జరిగింది. అనంతరం జరిగిన ఘటనలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం.. జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురవ్వడం తెలిసిందే!

👉ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కొమరోలు పట్టణంలోని అక్రమంగా అమ్ముతున్న 33 (750ml) బాటిల్స్ మద్యాన్ని పట్టుకున్న కొమరోలు ఎస్సై మధుసూదన్ వారి సిబ్బంది….బాటిల్స్ తో పాటు ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నా పోలీస్ సిబ్బంది..

👉నిన్న యర్రగొండపాలెం మండలము వాదంపల్లి గ్రామములో జరిగిన గొడవలలో గాయపడిన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మార్కాపురం ఏరియ హాస్పిటల్ లో పరామర్శించిన యర్రగొండపాలెం నియోజకవర్గ వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు యర్రగొండపాలెం మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి చిన్నఓబుల రెడ్డి

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.