బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్‌!..కౌం’ట్రిక్స్’ కౌంటింగ్ లో ఏజెంట్లదే ప్రధానపాత్ర.. రాష్ట్రపతి అవార్డు అందుకున్న ఏసిపి కిరణ్ కుమార్..ముగ్గురు యువతులు గల్లంతు..ఇద్దరు మృతి.. జీవన్ రెడ్డి అనుచరుడు దారుణ హత్య.. క్షుద్ర పూజలు చేస్తున్న 9 మంది అరెస్ట్…వ్యక్తి అనుమానాస్పద మృతి

👉బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్‌! ఈ కేసును వాడుకుని తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ‌లో పుంజుకోవాల‌ని చూస్తున్న బీజేపీకి ఆయుధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు దొరికింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ కేసును ఉప‌యోగించుకుని అటు అధికార కాంగ్రెస్‌ను, ఇటు బీఆర్ఎస్‌ను దెబ్బ‌తీసేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే చెప్పాలి. ల‌క్ష్మ‌ణ్‌, బండి సంజ‌య్ త‌దిత‌ర బీజేపీ నేత‌లు ఇప్పుడీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై సీబీఐ విచార‌ణ కోర‌డ‌మే అందుకు రుజువ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ కేసును వాడుకుని తెలంగాణ‌లో రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేందుకు బీజేపీ క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వ హామీల‌పై ప్ర‌శ్నించ‌కుండా బీజేపీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసునే ప్ర‌ధానంగా ప్ర‌స్తావిస్తోంది. ఈ కేసును సీబీఐతో విచారించాల‌ని డిమాండ్ చేస్తోంది. ఇప్ప‌టికే కేసీఆర్ ఆదేశాల మేర‌కే ఫోన్ ట్యాపింగ్ చేసిన‌ట్లుగా రాధాకిష‌న్ రావు స్ప‌ష్టం చేశారు. దీంతో కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌కుండా పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇప్పుడు సీబీఐ విచార‌ణ కోరుతూ బీజేపీ త‌న‌దైన రాజ‌కీయం చేసేందుకు ఎత్తుగ‌డ వేస్తుంద‌నే అంచ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే ఈ కేసులో కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసుకుంటోంది. బీజేపీ ఈ కేసును వాడుకుని కేసీఆర్‌ను లొంగ‌దీసుకునే ప్ర‌య‌త్నాలూ చేస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే సీబీఐని రంగంలోకి దించాల‌ని బీజేపీ డిమాండ్ చేస్తుంద‌న్న వాద‌న కూడా ఉంది. దీని వెనుక కేసీఆర్‌ను సీబీఐ ఉచ్చులో బంధించి, బీఆర్ఎస్ మ‌ద్ద‌తుతో రేవంత్ స‌ర్కారును కూల్చేందుకు బీజేపీ వ్యూహం ఉంద‌నే టాక్ కూడా వినిపిస్తోంది.
👉 కౌంట్రిక్స్.. కౌంటింగ్ లో ప్రధాన పాత్ర..కౌంటింగ్ష్ ఏజెంట్లదే..మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుందనే సంగతి తెలిసిందే. కూటమి, వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ ఉన్న నేపథ్యంలో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. టీడీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు, వైసీపీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ నేతలు సూచనలు చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఫైట్ లో వైసీపీకి ఇప్పటికే వరుస షాకులు తగిలాయి.వైసీపీ సుప్రీం కోర్టును పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం ఆశ్రయించగా అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూటమి నేతల తీరు ఒకలా ఉంటే వైసీపీ తీరు మరోలా ఉండటం ఏపీ ఓటర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై కూటమి ఆశలు పెట్టుకున్న స్థాయిలో వైసీపీ మాత్రం ఆశలు పెట్టుకోలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల సంఖ్య భారీగా పెరిగిందని సమాచారం అందుతోంది. కౌంటింగ్ కేంద్రాలలో తప్పు జరిగితే అస్సలు అంగీకరించవద్దని ప్రధాన పార్టీలు ఏజెంట్లకు ఇప్పటికే సూచించడం జరిగింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నిబంధనలకు సంబంధించి ఏజెంట్లకు ఏ మాత్రం అవగాహన లేకపోయినా పార్టీలకు కొంప కొల్లేరే అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కౌంటింగ్ కేంద్రాలలో ఏజెంట్లు ఎక్స్ట్రాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఆవాంతరాలు సృష్టిస్తే నిర్ధాక్షిణ్యంగా ఆ ఏజెంట్లను బయటకు పంపించడంతో పాటు చట్టపరంగా వాళ్లపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్ ఏజెంట్లు నేర్పుతో వ్యవహరిస్తే మాత్రమే మోసాలు జరగకుండా జాగ్రత్త పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఏజెంట్లు గొడవ పడకుండా సమయస్పూర్తితో వ్యవహరించాల్సి ఉంటుంది. రూల్స్ పాటిస్తూ తప్పులను వేలెత్తి చూపిస్తే మాత్రం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశాలు అయితే ఉంటాయి.
👉రాష్ట్రపతి అవార్డు అందుకున్నఏసిపి కిరణ్ కుమార్..

హైదరాబాద్ లోని క్రైమ్ డిపార్ట్మెంట్లో ఏసీపీగా పనిచేస్తున్న ఏ సి పి కే ఎం కిరణ్ కుమార్ చేసిన విశిష్ట సేవలకు గాను తెలంగాణ ఆవిర్భావదినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్రపతి సేవా పథకాన్ని అందుకున్నారు.ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా బేస్తవార పేట కు చెందిన ఆయన ఎస్సై స్థాయి నుంచి డిఎస్పీగా ఏసిపి గా పనిచేసి ఎన్నో క్లిష్టమైన కేసులు చేధించి ఉన్నతాధికారులతోపలుమార్లు ప్రశంసలు అందుకున్నారు. క్రమశిక్షణతో నిజాయితీకి మారుపేరుగా నిలిచి అటు పోలీసుశాఖలో ఇటు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సాధించారు.ఆయన తండ్రి డాక్టర్ తిరుమలాచారి కర్నూలులో ఎంతో మందికి వైద్య సేవలు అందించారు. బేస్తవారిపేట, కంభం  పరిసర గ్రామాలలో వారికి కూడా ఆయన ఎంతోమందికి  వైద్య సేవలు అందించి ఎంతో మంచి పేరు గడించారు.కాగా ఆయన కుమారుడైన కిరణ్ కుమార్ అత్యంత విశిష్టమైన రాష్ట్రపతి పతకం అందుకోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయోభిలాషులు, అధికారులు ప్రశంసల జల్లులు కురిపించారు. ఆయన మరిన్ని సమానత శిఖరాలను అధిరోహించాలని కోరారు.

👉 మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దొంగ స్వాముల భరతం పట్టారు పోలీసులు. ఏకంగా బైండోవర్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులకు సంబంధించిన వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు సీరియస్ యాక్షన్ షురూ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అదేశాలు ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేసే వారిపై దాడి చేశారు. దొంగ స్వాములు, బాబాల ఇండ్లు, స్థలాలపై ఏకకాలం లో దాడులు చేసి సోదాలు నిర్వహించారు. 11 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటుగా, 9 మందిని బైండోవర్ చేశారు.కేసులు నమోదు అయిన బాబాలు, స్వాముల పేర్లను పోలీసులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా జరిపిన దాడుల్లో జవ్వాజి ధనుంజయ్, అంబటి నర్సయ్య, బొమ్మేళ మల్లేశం, జాగిరి పర్శరాములు, గొట్టే రామస్వామి, వెంకట రాములు, శ్రీనివాస్, సురేందర్, శ్రీకాంత్, ప్రవీణ్, కడమంచి రామస్వామిలపై కేసులు నమోదు చేశారు. మిగితా 9 మంది గొట్టే రవీందర్, రామకృష్ణ, దయాకర్, మహమ్మద్ మజర్, అన్నలదాస్ దశరథం, కంపెళ్లి మహేష్, నడికుల నాగేంద్ర, టేకు నర్సయ్య, కడమంచి దుర్గయ్యలను ఎమ్మార్వో ముందు బైండోవర్ చేశారు.

👉 అనకాపల్లి జిల్లా…అచ్యుతాపురం మండలం తంతడి బీచ్ లో ముగ్గురు యువతులు గల్లంతు..ఇద్దరు యువతులు మృతి ఒకరి పరిస్థితి విషమం..

విషమంగా ఉన్న మహిళను మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలింపు…బీచ్ లో సెల్ఫీ తీస్తుండగా కాలు జారిపడి సముద్రంలో గల్లంతు…కాపాడిన అక్కడే ఉన్న మత్స్యకారులు అప్పటికే ఇద్దరు యువతులు మృతి…మృతిచెందిన ఇద్దరి యువతులు అక్కా చెల్లెలుగా గుర్తింపు మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నూక రత్నం,కనకదుర్గ గా గుర్తింపు..

👉 గుంటూరు జిల్లా..మంగళగిరి..గౌతమ బుద్ధ రోడ్డు బీఎండబ్ల్యూ షోరూమ్ ఎదుట అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి…రోడ్డు పై రెండు లారీల మధ్య రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి…మృతుడు మంగళగిరి చెందిన లారీ క్లీనర్ గా గుర్తింపు….సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పట్టణ పోలీసులు

👉 కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి అనుచరుడు నరేష్ దారుణ హత్య,..నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడైన ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రేండ్ల నరేష్ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తీవ్ర గాయాలైన నరేష్ ను హుటాహుటిన కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ నరేష్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.