👉వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్…ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు.తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయైపై 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు.
👉యూపీలో మోదీ యోగీ మ్యాజిక్ ఏదీ ? .. బిజెపి ఇమేజ్ మసకబారుతుందా?..
దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.అక్కడ ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి.దేశంలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లలో ఆరవ వంతు అన్న మాట. దేశంలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.అక్కడ ఎనభై ఎంపీ సీట్లు ఉన్నాయి.దేశంలో ఉన్న మొత్తం ఎంపీ సీట్లలో ఆరవ వంతు అన్న మాట. అంటే 15 శాతానికి పైగా ఎంపీల షేర్ మొత్తం పార్లమెంట్ లో యూపీదే. అలాంటి యూపీ 2014, 2019లలో బీజేపీని నెత్తికెత్తుకుంది. రెండు సార్లు బ్రహ్మాండమైన మెజారిటీని బీజేపీకి ఇచ్చింది.2014లో 70కి పైగా ఎంపీలను బీజేపీ గెలిస్తే 2019 నాటికి 62 దాకా గెలుచుకున్నారు. 2024 కి వచ్చేసరికి ఆ సంఖ్య కాస్తా కేవలం 345కి పడిపోయింది. అంటే సగానికి సగం అన్న మాట. మరి అక్కడ బీజేపీ విజయాన్ని ఎవరు అడ్డుకున్నారు అంటే సమాజ్ వాదీ పార్టీ అని చెప్పాలి. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో తక్కువ సీట్లే దక్కాయి.కానీ ఈసారి ఏకంగా 34 సీట్ల దాకా తెచ్చుకునేలా ఉంది. ఒక దశలో బీజేపీ కంటే ముందుకు కూడా దూసుకుని వచ్చేలా ఫలితాల సరళి ఉంది. దీనిని బట్టి చూస్తే యూపీలో బీజేపీ ప్రాభవం మెల్లగా సడలిపోతోందని అంటున్నారు.బీజేపీకి గుండె కాయ లాంటి రాష్ట్రం ఇలా హ్యాండ్ ఇవ్వడంతోనే ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది అని కూడా అంటున్నారు. ఎడం చేత్తో అధికారాన్ని సులువుగా అందుకే దశ నుంచి ఈ రోజున బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోవడానికి నానా అవస్థలూ పడుతోంది.అంతే కాదు కాంగ్రెస్ కూడా యూపీలో బాగా పుంజుకుంది.ఇలా ఇండియా కూటమి అక్కడ పై చేయి సాధించడంతో మోడీ యోగీల మ్యాజిక్ ఏమి అయిందన్న చర్చ ముందుకు వస్తోంది. కడపటి వార్తలు అందేసరికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేధీలో ఓటమిని మూటగట్టుకున్నారు. అక్కడ కాంగ్రెస్ కి వీర విధేయుడు అయిన కిశోర్ లాల్ శర్మ చేతిలో ఆమె పరాజయం పాలు చెందారు. ఆమె 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించి దేశమంతా తన వైపుచూసుకునేలా చేశారు. ఇపుడు ఆమె పరాజయం చెందడం ఆశ్చర్యంగానే ఉంది. అలాగే మరో బీజేపీ దిగ్గజ నేత మేనకాగాంధీ కూడా వెనకంజలో ఉన్నారు. ఇవన్నీ చూస్తూంటే యూపీలో కమలానికి ఎక్కడో మసకబారడం మొదలైందనీ అంటున్నారు.యోగీ ఏమీ తక్కువ వారు కాదు, 2017, 2022లలో బీజేపీని యూపీలో వరసగా రెండు సార్లు గెలిపించడంతో సిద్ధహస్తుడుగా ఉన్నారు. ఆయన పాలనలో మెరుపులు అంటూ కూడా చెప్పుకున్నారు. ఆయన కూడా ప్రజాకర్షణలో ధీటైన వారుగా ఉన్నారు.👉ఇక రామ మందిరం అన్నది ఒక రకంగా బీజేపీకి కలసి వస్తుందనుకుంటే ఆ నియోజకవర్గంలోనే బీజేపీ ఓటమి పాలు అయింది. అయోధ్య ఉన్న ఫైజాబాద్ లోక్ సభ సీటులో బీజేపీ ఎస్పీ అభ్యర్ధి చేతిలో ఓటమి పాలు అయింది.ఓవరాల్ గా చూసుకుంటే యూపీలో మోడీ కానీ యోగీ కానీ మ్యాజిక్కులు ఏవీ పనిచేయలేదని అర్ధం అవుతోంది అంటున్నారు. ఇది ఒక విధంగా బీజేపీ పొలిటికల్ కెరీర్ లో అతి పెద్ద దెబ్బ గానే అంతా చూస్తున్నారు.
👉 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా ఘన విజయం సాధించారు.కేరళలోని వయనాడ్‌లో వరుసగా రెండోసారి గెలుపొందారు. తన సమీప సీపీఐ అభ్యర్థి యానీ రాజాపై 3.5లక్షలపైగా మెజార్టీ సాధించారు.
👉కూటమి ఘన విజయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు జరిగాయి. నారా,నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి….తాతకు, బంధువులకు కేక్ తినిపించారు.
👉అల్లు అర్జున్ మద్దతు.. వైసీపీ అభ్యర్థి ఓటమి.. నంద్యాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతు తెలిపిన చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్రెడ్డి ఓటమి చవిచూశారు. రవిచంద్రపై టీడీపీ అభ్యర్థి మహ్మద్ ఫరూక్ 11000+పైగా మెజార్టీతో ఘనవిజయం సాధించారు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి తరఫున బన్నీ ప్రచారం చేయడాన్ని చాలామంది జనసైనికులు తప్పుబట్టారు. కుటుంబానికి చెందినజనసేనకు మద్దతివ్వాల్సిందని అభిప్రాయపడ్డారు.
👉వైసిపి కంచుకోటను బద్దలు కొట్టిన ముత్తుముల అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ కంచు కోటను బద్దలు కొట్టారు. 2019 ఎన్నికలలో 82 వేల ఓట్ల మెజారిటీతో ముత్తుముల అశోక్ రెడ్డి ఘోర ఓటమిని చవిచూశారు. ఘోరంగా ఓడిపోయిన ప్రాంతంలోనే ఐదు సంవత్సరాలు పాటు అలుపెరుగని పోరాటం చేసి నిరంతరం ప్రజలలో ఉంటూ ఎట్టకేలకు 2024 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించారు. ఆయన విజయంతో కూటమి నాయకులు కార్యకర్తలు ఆనందంలో మునిగిపోయారు.
👉ప్రజలకు రుణ పడి వుంటా…ఎమ్మెల్యే ముత్తుమల..గిద్దలూరు నియోజకవర్గం ప్రజలకు రుణ పడి వుంటా నని ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పేర్కొన్నారు.ఘన విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.తనకు ఘన విజయాన్ని అందించిన గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.ఓటమి బాధలో వుండేవారిని బాధించే విధంగా కూటమి శ్రేణులు ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని కోరారు. త్వరలోనే సంబరాలు చేసుకుందామని, ప్రస్తుతానికి అందరూ సంయమనం పాటించాలని కోరారు.
👉ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు:జగన్
లక్షల మందికి ఆసరా ఇచ్చినా,చేయూత అందించినా, అరకోటి మంది రైతులకు భరోసా ఇచ్చినా ఇవాల్టి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎంజగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు నడిపే డ్రైవర్లను వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్ననేస్తం, మత్యకారులకు మత్స్యకార భరోసా, నా నాయీబ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంతింత మంచిచేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబికి వస్తున్నకన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు.
👉 వారసులంతా ఓటమిపాలు ! ఈ సారి పలువురు వైసీపీ సీనియర్ నేతలు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన- బీజేపీ కూటమి హవా కొనసాగుతున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మేజిక్ ఫిగర్ దాటి మెజారటి స్థానాల గెలుపు దిశగా ముందుకు సాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఎదుర్కొంటున్నది. ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. వారసులను రంగంలోకి దింపింది.అయితే వారసులంతా ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం గమనార్హం.ఈసారి పలువురు వైసీపీ సీనియర్ నేతలు తమ వారుసులకు సీట్లు ఇప్పించుకుని ఎన్నికల బరిలోకి దింపారు. అయితే ఒక్కరు కూడా గెలవక పోవడం విశేషం. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, బందరులో పేర్నినాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి, జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి తదితరులు అందరూ ఓటమి పాలయ్యారు. ఇక ఈ ఎన్నికల్లో అనేక మంది నేతలను నియోజకవర్గాలు మార్పించి బరిలోకి దించినా ప్రయోజనం లేకుండా పోయింది. మారిన వారందరూ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించిన పార్టీ అధంపాతాళానికి జారిపోవడం గమనార్హం. మంత్రులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగిలిన వారు అందరూ ఓటమి పాలయ్యారు.
👉 39 ఏళ్ల తర్వాత పసుపుజెండా ఎగిరింది ! గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ యువనేత నారా లోకేష్ ఘనవిజయం సాధించారు.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుండి టీడీపీ యువనేత నారా లోకేష్ ఘనవిజయం సాధించారు.వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేష్ 76, 241 ఓట్ల రికార్డు మెజారిటీతో విజయం సాధించాడు.గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డిపై 5 వేల ఓట్ల తేడాతో పరాజయం పొందారు.తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన 1983, 1985 ఎన్నికల్లో మంగళగిరి నుండి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వర్ రావు వరసగా రెండు సార్లు విజయం సాధించాడు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్, 1994లో సీపీఎం, 1999 నుండి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థులు వరసగా విజయం సాధించారు 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి విజయం సాధించాడు. గత 39 ఏళ్లుగా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురలేదు. ప్రస్తుతం నారా లోకేష్ గెలుపుతో అది సాధ్యం అయింది.గత ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఈ ఎన్నికలలో లోకేష్ కసిగా పనిచేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రతో టీడీపీ మరింత బలోపేతం అయింది.
👉కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు 48 వేల 184 ఓట్లు మెజారిటీ తో ఘన విజయం సాధించారు..👉 ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి గెలుపు.1999లో కరణం బలరాం తర్వాత 25సంవత్సరాల అనంతరం ఒంగోలు గడ్డపై టీడీపీ విజయం. పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ ఘన విజయం.
👉 ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ 16746 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.👉మార్కాపురం టిడిపి అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి విజయం.👉 గిద్దలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా కంభం పట్టణంలోని బస్టాంండు కందులాపురం సెంటర్లలో టిడిపి నాయకులు కేకులు కట్ చేసి బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.