విదేశాంగ విధానంపై ప్ర‌భావం-మోడీ సర్కారుకు సవాలు..జగన్ ఫర్నిచర్ దొంగ మంత్రి:మంత్రి అనగాని సత్యప్రసాద్..చంద్రబాబు కు సవాల్ గా మారనున్న పరిపాలన?..గోదాములు తనిఖీచేసిన మంత్రి నాదెండ్ల..ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు?…వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశాం..వాలంటీర్ల ఆవేదన..సైబర్ నేరాల పట్ల ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరిక. మరిన్ని విశేషాలతో..

👉విదేశాంగ విధానంపై ప్ర‌భావం ..సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ సర్కారుకు సవాలు– టీడీపీ, జేడీ(యూ) వంటి ప్రాంతీయ పార్టీలది కీలక పాత్ర– నిపుణులు, విశ్లేషకుల అంచనా…న్యూఢిల్లీ :

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. గత రెండు దఫాలు కూడా ఎన్డీఏ కూటమే అధికారంలో ఉన్నప్పటికీ.. బీజేపీకి విస్పష్టమైన మెజారిటీ ఉండేది. అయితే, ఈ సారి మాత్రం బీజేపీకి అధికారానికి కావాల్సిన సంఖ్యలో సీట్లు రాలేదు. దీంతో కూటమిలోని టీడీపీ, జేడీ(యూ) వంటి కీలక మిత్రపక్షాల సాయంతో మోడీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో భారత విదేశాంగ విధానం ఎలా ఉండబోతుందన్న ప్రశ్నలు నిపుణుల నుంచి ఎదురవుతున్నాయి.ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఇటలీలోని పుగ్లియాలో జరుగుతున్న జీ7 సదస్సుకు ప్రధాని మోడీ వెళ్లారు. కొత్త సంకీర్ణ ఆధారిత ప్రభుత్వంలో టీడీపీ, జేడీ(యూ)లు కీలక పాత్రను వహించనున్నాయి. ఎన్డీఏ విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో ఈ పార్టీలు కూడా ముఖ్య భూమికను పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు. టీడీపీ ఏపీపై దృష్టి సారించి.. ప్రాంతీయ ఆర్థిక సంబంధాలు, సాంకేతిక సహకారాన్ని పెంపొందించే విధానాల కోసం పట్టుబట్టొచ్చు. అదేవిధంగా, బీహార్‌ అభివృద్ధి కోసం జేడీయూ వాదిస్తుంది. అభివృద్ధి ప్రాజెక్టులు, ఆర్థిక సాయం వంటి వాటిపై నితీశ్‌ పార్టీ దృష్టి సారించే అవకాశమున్నది. మరోపక్క, కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం విషయంలో మహారాష్ట్రలోని మిత్రపక్షాలైన ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం), రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు చెందిన శివసేన పార్టీలు ఇప్పటికే తమ అసంతృప్తిని ప్రదర్శించాయి. అయితే, ఈ క్లిష్టమైన సంకీర్ణ ప్రభుత్వంలో చట్టం మోడీ దౌత్యపరమైన చతురతను పరీక్షిస్తుందనీ, భారతదేశ అంతర్జాతీయ వ్యూహాలు, జాతీయ లక్ష్యాలు, సంకీర్ణ ఆధారిత సూక్ష్మ నైపుణ్యాలను ప్రతిబింబించేలా చూస్తుందని నిపుణులు అంటున్నారు.*కొత్త సంకీర్ణ ఆధారిత మోడీ ప్రభుత్వం.. కూటమిలోని టీడీపీ, జేడీ(యూ) వంటి పార్టీలతో సహా, దాని విదేశాంగ విధానం సంకీర్ణ డైనమిక్స్‌ ద్వారా ప్రభావితమవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ” టీడీపీ, జేడీ(యూ)లు వాటి ప్రాంతీయ ప్రయోజనాలు, రాజకీయ అజెండాలతో, భారతదేశ విస్తృత విదేశాంగ విధాన వ్యూహాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, తమ ప్రాంతాలకు ప్రయోజనం చేకూర్చే విధానాలను ముందుకు తీసుకురావచ్చు. ఉదాహరణకు, ఈ పార్టీలు తమ ప్రాంతాల నుంచి గణనీయమైన సంఖ్యలో ప్రవాస భారతీయులు విదేశాలలో ఉంటే.. అలాంటి దేశాలతో బలమైన సంబంధాల కోసం లేదా వారి ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలను డిమాండ్‌ చేయగలవు. ఒక పొందికైన, వ్యూహాత్మక విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తూ సంకీర్ణ డిమాండ్లను సమతుల్యం చేసుకోవటం మోడీ ప్రభుత్వానికి క్లిష్టమైన సవాలుగా ఉంటుంది” అని నిపుణులు చెప్తున్నారు.సంకీర్ణ ప్రభుత్వం.. విదేశాంగ విధాన లక్ష్యాలను క్రమబద్ధీకరించడం సవాలుగా భావించవచ్చు అని అంటున్నారు. అయినప్పటికీ, చాలా ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యతల జాబితాలో విదేశాంగ విధానం అగ్రస్థానంలో లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ సంకీర్ణ భాగస్వాములు అంతర్జాతీయ విధాన రూపకల్పనపై దృష్టి పెట్టకుండా.. తమ ప్రాంత ప్రయోజనాల కోసమే ఎక్కువగా ఆలోచిస్తాయని అంటున్నారు. అయితే, విదేశంగ విధానంలో ప్రాంతీయ పార్టీల వ్యవహారం మోడీ 3.0పై అంతగా ప్రభావం చూపకపోవచ్చనీ, ప్రభుత్వాన్ని అస్థిరపర్చటానికి ఇది బలమైన కారణం కాకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.

👉జగన్ ఫర్నిచర్ దొంగ మంత్రి: మాజీ సీఎం జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ ఫర్నిచరు జగన్ వాడుకుంటున్నారు.జగన్ ఫర్నిచర్ దొంగ. ఆయనకు నైతికత ఉంటే వాటన్నింటినీ తిరిగి ప్రభుత్వానికి అప్పగించాలి.జగన్ రూ.50 కోట్ల సీఎంఓ నిధులతో తాడేపల్లి,లోటస్ పాండ్లోని తన నివాసాలలోకి ఫర్నిచర్,ఇతర వసతులను సమకూర్చుకున్నారు.’ అని మంత్రి విమర్శలు చేశారు.👉ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు?..  ఆ బాత్రూమ్ అంత పెద్దగా ఉంది?.. ఎవరికి స్కెచ్ వేశావు జగన్?: టిడిపి నాయకుల ఆరోపణ..: రుషికొండలో భవనాలు రాష్ట్రపతి, ప్రధాని కోసం కట్టినవైతే ఇన్నాళ్లూ ఎందుకు దాచి పెట్టారంటూYCPకి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘ఇన్నాళ్లూ టూరిజం భవనాలని ఎందుకు చెప్పారు? దొరికిపోయాక ఇప్పుడెందుకు కథలు చెప్తున్నారు? బీచ్ వ్యూ పాలెస్ తనకు కావాలని భార్య అడిగిందే తడవుగా ప్రజాధనం తగలేశావు జగన్. అసలు ఆ బాత్ రూమ్ ఏంటి జగన్..అంత పెద్దగా ఉంది? అసలు ఏం ప్లాన్ చేశావు? ఎవరికి స్కెచ్ వేశారు?’ అంటూ సెటైర్లు వేసింది.

👉ఏపీ సీఎం చంద్రబాబు కు సవాల్ గా మారనున్న పరిపాలన?..ఆమరావతి:జూన్ 16..చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాడిన ప్రభుత్వానికి… జూలై 1 నాటికి రూ. 10,500 కోట్లు కావాలి. పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు మమూలుగా లేవు. రైతులకు ఏటా రూ 20 వేలు. స్కూలుకు వెళ్ళే ప్రతి బిడ్డకు 15 వేలు. 18 నుంచి 59 ఏళ్ళ దాకా ప్రతి మహిళ కు 15 వేలు. నిరుద్యోగ భృతి 3 వేలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు.ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాళ్ళు. ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది. మరో శ్రీలంకగా మారిపోతుంది. వేల కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా మైనస్ లో కూరుకుపోయింది. ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీ జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం ఆరోపించింది. ఇపుడు సీన్ రివర్స్ అయింది. జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుకు మళ్ళీ అధికారం అప్పగించారు. కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ, పార్టీ తరపున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మ్యానిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ఇపుడు చంద్రబాబుపై ఉంది. దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాల్ అనే చెప్పాలి. ఈ సవాల్ ను అధిగమించటా నికి ఆయన భారీ కసరత్తే చేయాలి.

👉గోదాములు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల ..రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ గోదాములను శనివారం తనిఖీ చేశారు. తర్వాత మంగళగిరిలోనూ గోదాములను తనిఖీ చేయించారు. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో తేలింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార,నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.

👉సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం…సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో భారత్ మహిళలు ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 265/8 పరుగులు చేసింది. 266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 37.2 ఓవరల్లో 122 పరుగులకే ఆలౌటయింది. దీంతో భారత్ కు 143 పరుగుల భారీవిజయం దక్కింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో సునే(33), జఫ్టా(27) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆశాశోభన 4, దీప్తిశర్మ 2, పూజా, రేణుక, రాధాయాదవ్ ఒక వికెట్ చొప్పున తీశారు.

👉ఐఏఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం..పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం పెట్టించేందుకు శ్రీలక్ష్మి ఫైల్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాల వంటివి వద్దని నారాయణ శ్రీలక్ష్మిని కసురుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.సీఎం చంద్రబాబు సైతం ఆమె నుంచి బొకే తీసుకోవడానికి నిరాకరించారు. బదిలీ చేసేంత వరకు ఆమెకు ఫైళ్లను పంపకూడదని భావిస్తున్నారని సమాచారం.

👉నివాసులకు ఆంక్షల నుండి విముక్తి…*తాడేపల్లి…
మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం పరిసర ప్రాంతాల్లో భారీ కెడ్ల తో, ఇనుప కంచెలతో మూసివేసిన రోడ్లకు విముక్తి కలిగింది…పోలీస్ ఆంక్షలుతో జగన్ నివాస సమీపంలో పరిసర ప్రాంత ప్రజలు రాకపోకులకు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు…నారా లోకేష్ మంత్రి అయ్యాక ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా చొరవ తీసుకున్నారు…స్థానిక ప్రజలు నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

👉 ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు బక్రీద్ శుభాకాంక్షలు*
అమరావతి : స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ముఖ్యఉద్దేశం అని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశమని, పండుగ సందర్భంగా ఖుర్బానీ ద్వారా పేదలకు ఆహారం వితరణగా ఇస్తారన్నారు. హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగని స్ఫూర్తిగా తీసుకుని సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

*ఇటీవల కాలంలో వెలుగుచూస్తున్న కొత్త రకాలైన సైబర్ నేరాలు**తక్కువ సమయంలో సులువుగా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశను అస్త్రంగా ఏంచుకుంటున్న సైబర్ నేరగాళ్లు..*పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి*..
*జిల్లా ఎస్పీ  వకుల్ జిందాల్ ఐపీఎస్ ……పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు సూచించారు. ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్న కొత్త రకమైన సైబర్ నేరాల గురించి జిల్లా ఎస్పీ గారు జూన్ 16న ఆదివారం జిల్లా ప్రజలకు వివరించారు.ప్రస్తుతం ఉన్న యాంత్రిక జీవన సమాజంలో సులభంగా డబ్బులు ఎలా సంపాదించాలని అధిక శాతం ప్రజలు ఆలోచిస్తున్నారని, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగాలు చేస్తూ వచ్చే జీతాలు సరిపోక పార్ట్ టైం జాబ్స్ కోసం అధిక శాతం మంది ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తూ ఉంటారని, ఇంట్లో ఉండే మహిళలు కూడా ఖాళీగా ఉండే సమయంలో పార్ట్ టైం జాబ్ చేస్తే బాగుంటుందని వీరు కూడా ఆన్ లైన్లో జాబ్స్ కోసం సెర్చింగ్ చేస్తూ ఉంటారని, వారి యొక్క వివరాలను అనేక రకాలైన వెబ్సైట్లలో పొందుపరుస్తున్నారని, ఆ వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరించి మోసాలకు పాల్పడుతున్నారని, స్మార్ట్ ఫోన్, డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో అదే స్థాయిలో ఆన్లైన్లో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు .సైబర్ నేరగాళ్లు వాట్సప్ నెంబర్ లకు పార్ట్ టైం జాబ్ అని సందేశాన్ని పంపుతారని, ఆ సందేశంకు జవాబు ఇవ్వగానే ఒక లింక్ వస్తుందని, దానిని క్లిక్ చెయ్యగానే ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతారని, ఆ గ్రూప్ లో వివిధ రకాల తేలికైన టాస్క్ లు ఇస్తారని ఉదాహరణకు ఏదైనా వస్తువును స్క్రీన్ షాట్ తియ్యమని, లైక్ చెయ్యమని …. మొదలగునవి. ఆ స్క్రీన్ షాట్ షేర్ చేస్తే టాస్క్ కంప్లీట్ అయ్యినట్టు, టాస్క్ ఆడిన తరువాత చిన్న మొత్తంలో సొమ్ము గెలిచినట్లు ఖాతాలో జమ చేస్తారని, ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు వచ్చాయని భావిస్తారు. తరువాత తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ గొల్పుతారని, దశల వారీగా టాస్క్ లు నిర్వహించి పెట్టుబడి మొత్తాన్ని పెంచుతారని, టాస్క్ గెలిచిన సొమ్మును ఫేక్ వెబ్సైట్ లో చూపిస్తారని, గెలిచిన సొమ్ముని రిసెప్షనిస్ట్ అనే వ్యక్తికి పంపి డబ్బులు మీ బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారు అని తెలుపుతారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మరింత ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ గొల్పుతారని, రక రకాల కారణాలు చూపించి వేలు, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తారని, డబ్బులు గెలిచినట్లుగా వాళ్ళ ఫేక్ వెబ్సైటులో చూపిస్తారని, కానీ అవి నిజమైన డబ్బులు కావు, ఆ డబ్బులు మీ బ్యాంకు అకౌంట్ లో జమకావు, దానికి వారు వివిధ కారణాలు చూపి మీకు ఆశ కల్పించి మరింత డబ్బు వారి అకౌంట్లో జమచేయించుకుంటారు. తీరా బాధితులు మోసపోయామని గుర్తించే సరికి జరగవలసిన నష్టం జరిగిపోతుందని తెలిపారు.పార్ట్ టైమ్ జాబ్ పేరిట జరిగే సైబర్ మోసం బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఈ క్రింది జాగ్రత్తలను తీసుకోవాలని ఎస్పీ తెలిపారు.👉 కంపెనీ, ఉద్యోగ అవకాశాలను పూర్తిగా పరిశోధించండి, వారి వెబ్‌సైట్, కంపెనీ చట్టబద్ధతను ధృవీకరించండి. ఇతర ఉద్యోగులు నుండి సలహాలు, అభిప్రాయాలు సేకరించుకోండి.👉 వ్యక్తిగత సమాచారం జాగ్రత్తగా ఉంచుకోండి, ఉద్యోగ అవకాశం, గ్రహీత యొక్క చట్టబద్ధత గురించిన సమాచారం మీకు ఖచ్చితంగా తెలియకపోతే, బ్యాంక్ ఖాతా నంబర్‌లు, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్‌లు, ఇతర గుర్తింపు పత్రాలు వంటి సున్నితమైన వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దు.👉 సంస్థలు జీతాలు ఇచ్చి నియమించుకుంటాయి, కానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇయ్యవు అనే విషయాన్ని గుర్తించాలి.👉 పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశాల కోసం శోధిస్తున్నప్పుడు సురక్షిత కనెక్షన్‌లు (HTTPS) కలిగిన ప్రసిద్ధ జాబ్ పోర్టల్‌లు (లేదా) వెబ్‌సైట్‌లకు కట్టుబడి ఉండండి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చెయ్యకండి.👉 చిన్న చిన్న కారణాలకు ఎక్కువ డబ్బులు లేదా ఉచితంగా డబ్బులు ఇస్తున్నారు అంటే ఆ సైట్లు వల్ల రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ముందుగానే గ్రహించాలి.ఇలాంటి పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైన సైబర్ మోసానికి గురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి లేదా సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ చెయ్యాలని లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

*మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ళ దాడి*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన నలుగురు వ్యక్తులు జోగి రమేష్ ఇంటి పైకి రాళ్లు విసురుతుండగా అక్కడ ఉన్న కానిస్టేబుల్ వారిని నిలువరించేందుకు ప్రయత్నించారు.అయితే అతనిపై కూడా వారు తిరగబడ్డారు. ఆ సమయంలో జోగి రమేష్ ఇంట్లో ఎవరు లేరు. అప్పటికే దాడి చేసే ప్రమాదం ఉండటంతో మాజీ మంత్రి ఇంటి ముందు ఇబ్రహీంపట్నం పోలీసులు ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు.జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. జోగి రమేష్ ఇంటిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

*వైసీపీ నేతల వల్లే రాజీనామా చేశాం**నెల్లూరు*: స్థానిక కార్పొరేటర్ మోయిళ్ల గౌరీ, వైసీపీ నేత మోయిళ్ల సురేష్ రెడ్డి తదితరులు బలవంతంగా వాలంటీర్ల పోస్టులకు రాజీనామా చేయించారని పలువురు వాలంటీర్లు పేర్కొన్నారు. అనంతరం ఐదవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ వెంకటనారాయణకు ఆదివారం ఫిర్యాదు చేశారు. తమకు తిరిగి ఉద్యోగాలు వచ్చేలా చూడాలని, న్యాయం చేయాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు…*పార్టీ ఓడిపోయింది… మాకు సంబంధం లేదు*_30 నెల‌లుగా అద్దె క‌ట్ట‌కుండా చేతులెత్తేసిన వైసీపీ నాయ‌కులు_స‌చివాల‌యానికి తాళమేసిన య‌జ‌మాని_ఆత్మ‌కూరు వాసిలిలో ఘ‌ట‌న_విధుల‌కు హాజ‌రు కాని స‌చివాల‌యం సిబ్బంది_ఇబ్బంది ప‌డుతున్న ప్ర‌జ‌లు_

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.