యుద్దాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీ ఆపలేడా ?..రుషికొండ ప్యాలెస్… చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!.. కొడాలి నాని పై కేసు నమోదు.. కంభం గిద్దలూరులో తెదేపా సంబరాలు.. నారాయణ కాలేజీలో విద్యార్థి మృతి…

👉 యుద్దాన్ని ఆపిన మోడీ పేపర్ లీకేజీ ఆపలేడా ?.. నీట్ పరీక్ష పత్రాల లీకేజీ లో మోడీపై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ..ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపారని చెబుతుంటారు. కానీ దేశంలో పోటీ పరీక్షల పేపర్ లీకేజీని మాత్రం ఆపలేకపోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. దేశంలో విద్యాసంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. పరీక్షల లీకేజీని కేంద్ర ప్రభుత్వం ఆపలేకపోతోందని, విద్యాసంస్థలను బీజేపీ మాతృసంస్థ తన గుప్పెట్లో పెట్టుకుందని, ఇప్పటికే ఒక పరీక్షను రద్దు చేశారని, ఇక నీట్ పరీక్షపై ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదని రాహుల్ అన్నారు. ప్రభుత్వ తీరుతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా తయారయిందని, పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాహుల్ అన్నారు. చేయని తప్పులకు విద్యార్థులను శిక్షించినట్లవుతోందని, వ్యవస్థలను కబ్జా చేయడం జాతి విద్రోహ చర్యే అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో దేశంలో స్వతంత్ర విద్యా వ్యవస్థ అనేది లేకుండా పోయిందని, ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సరికాదని, నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంలో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని, ప్రశ్నాపత్రాల లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ నిలదీశారు. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాసిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిన విషయం తెలిసిందే.

👉రుషికొండ ప్యాలెస్… చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!..ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.రుషికొండ ప్యాలెస్… చంద్రబాబుకు సీబీఐ మాజీ డైరెక్టర్ సలహా!..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు ఈ చర్చ రాష్ట్ర స్థాయి దాటి జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితి. దీంతో…ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.అవును… ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఆ భవనాలు లోపల ఎలా ఉంటుందో కూడా తెలియని నేపథ్యంలో… తాజాగా ఆ రుషికొండ ప్రాంతం వచ్చే భీమిలీ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకుని వెళ్లడంతో… ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి.ఈ సమయంలో ఆ భవనాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే విషయంపై తీవ్ర ఆసక్తినెలకొన్న వేళ.. పలుసలహాలూ సూచనలు అందుతున్నాయి! ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు ఈ వ్యవహారంపై చంద్రబాబుకు ఎక్స్ వేదికగా ఓ సలహా ఇచ్చారు. రుషికొండ ప్యాలెస్ ను ఎలా వినియోగిస్తే బాగుంటుందనే విషయంపై స్పందించారు.👉ఇందులో భాగంగా… తొలుత జగన్ ప్రభుత్వం హయాంలో జరిగిన రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి మొదలైన ఆరోపణలపై విచారణ జరిపించాలని చంద్రబాబు కోరారు నాగేశ్వర రావు. అనంతరం దీన్ని సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రిగా మార్చాలని.. తద్వారా ప్రజలకు అంకితం చేయాలని సూచించారు.👉ఢిల్లీలోని ఎయిమ్స్ లేదా జిప్ మర్ తరహాలో ఈ రుషికొండ ప్యాలెస్ భవనాలను మార్చి ప్రజలకు అంకితం చేయాలని.. తద్వారా ఏపీని తన వ్యక్తిగత ద్వేషంగా మార్చుకున్న జగన్ కు తగిన సమాధానం చెప్పాలని సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వర రావు కోరారు. ఇదే సమయంలో… గొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఆ ఆస్పత్రికి పెట్టాలని కూడా ఆయన బాబుకు సూచించారు.ఇలా రోజు రోజుకీ ఏపీ రాజకీయాల్లో రుషికొండ ప్యాలెస్ విషయం మరింత హాట్ టాపిక్ గా మారుతున్న వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది ఆసక్తిగా మారింది.

*మాజీ మంత్రి గుడివాడ కొడాలి నానిపై వలంటీర్ల ఫిర్యాదు తో..కేసు నమోదు!చేసిన పోలీసులు*

కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు మాజీ వలంటీర్ల ఫిర్యాదువారి ఫిర్యాదుతో వైసీపీ నేత‌పై కేసు నమోదు చేసిన గుడివాడ పోలీసులు నానితో పాటు దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను, మ‌రో ఇద్ద‌రు వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదుఎన్నికలకు ముందు పలువురు వార్డు వలంటీర్లతో వైసీపీ నేతలు రాజీనామాలు చేయించిన విష‌యం తెలిసిందే.ఈ నేప‌థ్యంలోనే తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత‌ కొడాలి నానికి గ‌ట్టి షాక్ త‌గిలింది. మాజీ వార్డు వలంటీర్లు ఆయ‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ వలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కొడాలి నానిపై గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కొడాలి నానితో పాటు ఆయన సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ పట్టణ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను మరో ఇద్దరు వైసీపీ నేతలపై 447, 506 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

👉నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి..హైదరాబాద్ :జూన్ 21..

ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెంద డంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు…

👉ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక..

నంద్యాల జిల్లా..ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయం ఎంప్లాయిస్ ఫెడరేషన్ కమిటీ ఎన్నిక గురువారం నంద్యాలలోని శ్రీ రామకృష్ణ వివేకానంద ఆడిటోరియంలో జరిగింది. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 19 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు జరిగింది అధ్యక్షులుగా పి నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్ రమాదేవి,జి రాజశేఖర్, ఎం సుబ్బలక్ష్మి, కోశాధికారిగా జి లతా, కార్యదర్శులుగా జి రామాంజనేయరెడ్డి, బి శ్రీనివాసులు, పీవీ సుబ్బారాయుడు, అయ్యస్వాములు, సహాయ కార్యదర్శిగా కే ప్రభావతి తదితరులు ఎన్నికైనారు.. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం ఫెడరేషన్ సభ్యులతో పాటు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు ,లక్ష్మణ్ పాల్గొన్నారు.

👉 ప్రకాశం జిల్లా కంభం:నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ సయ్యద్.మస్తాన్ వలి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపూర్ణ అక్షరాస్యత మన అందరి బాధ్యత అనీ,బడి ఈడు పిల్లలందరూ బడిలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఇంటింటి సర్వే ద్వారా బడి బయటి పిల్లలను గుర్తించాలని అన్నారు.6 నుండి 18 సంవత్సరాల వయసు విద్యార్థులు తప్పనిసరిగా బడిబాట పట్టేలా చూడాలని సూచించారు.అన్ని శాఖల సమన్వయంతో డ్రాప్ ఔట్ మరియు నెవర్ ఎన్రోల్డ్ వివరాలను నమోదు చేయాలని అన్నారు. మండల విద్యాశాఖ అధికారులు బి.మాల్యాద్రి ,కె.శర్వాణి, మాట్లాడుతూ బడి మధ్యలో మానిన విద్యార్థులు మరియు అసలు బడికి రాని విద్యార్థులను వేర్వేరుగా గుర్తించి అందరినీ బడిలో చేర్పించేలా చూడాలని అన్నారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని కుటుంబాలను సర్వే చేసి అందరూ చదువుకునేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి బి.విజయలక్ష్మి సిఆర్పీలు, ఎడ్యుకేషన్&వెల్ఫేర్ అసిస్టెంట్లు,అంగన్వాడీ సూపర్వైజర్లు,హాస్టల్ వార్డెన్లు మరియు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

👉గిద్దలూరు ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం సందర్భంగా సంబరాలు నిర్వహించిన తెలుగు కార్యకర్తలు ముత్తుముల అశోక్ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గానికి రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో టిడిపి నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు…

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో పట్టణంలో టిడిపి నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన ముత్తుముల అశోక్ రెడ్డి కి టిడిపి నాయకులు కార్యకర్తలు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

👉నారాయణ కాలేజీ గోడ దూకేందుకు ప్రయత్నించి విద్యార్థి మృతి..హైదరాబాద్ :జూన్ 21.. ప్రమాదవశాత్తు ఇంటర్ విద్యార్థి మృతిచెందిన విషాద ఘటన హయత్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తనకు ఇష్టం లేకపోయినా తల్లిదం డ్రులు తనను హాస్టల్ ల్లో వేశారంటూ గిరీష్ కుమార్ అనే విద్యార్థి గురువారం అర్ధరాత్రి కళాశాల గొడ దూకేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలోన గోడపై ఉన్న విద్యుత్ తీగలు గిరీష్ కుమార్‌ తలకు తగలడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అయితే, గిరీష్ విగత జీవిగా పడి ఉండటాన్ని చూసిన తోటి విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందజేశారు. అనంతరం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న గిరిష్ కుమార్ మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగి పోయారు…

 

7k network
Recent Posts

⭐సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం..గత పాలనంతా విధ్వంసం…మేము రిపేర్లు చేస్తూ వెళ్తున్నాం..తప్పుడు పనులు చేయొద్దు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక : సీఎం చంద్రబాబు ..*మాదాపూర్ పేస్ హాస్పిటల్‌లో దారుణం.. *ఒక్క పైసా కూడా అవినీతి లేదు. -కేటీఆర్‌ ..*.. ఫారిన్‌లో ఎడ్యుకేషన్‌ పేరుతో మోసాలు. బోగస్‌ కన్సల్టెన్సీ ప్రతినిధులను అరెస్ట్‌ చేసిన పోలీసులు… సైబర్ నేరాలకు అడ్డా ‘వాట్సప్’.. హోంశాఖ నివేదిక.*.. యాపిల్ పండ్ల మాటున మద్యం అక్రమ తరలింపు …*తిరుపతిలో మత్తు వదిలించిన పోలీస్

*భవిష్యత్తు తెలుగు ప్రజలదే: సీఎం చంద్రబాబు … *పవన్ ను బీజేపీ యూజ్ మాత్రమే చేసుకుంటుందా? .. *జనసేన పార్టీ కార్యకర్త పై రౌడీ షీటర్ కత్తులతో రాడ్లతో దాడి! ..అమెరికాలో తెలుగు ముఠా బ్లాక్ మెయిలింగ్ ..అదనంగా రూ.6 వేల కోట్లు.. భారీగా టోల్ ట్యాక్స్ వసూళ్లు … శుభాకాంక్షలు తెలిపిన ఒంగోలు ఎంపీ మాగుంట, మంత్రి డోలా శ్రీ .. శుభాకాంక్షలు తెలిపిన మెహతాజ్ బేగం.(రైల్వే కోడూరు..అన్నమయ్యజిల్లా)*కావలిలో మహిళ దారుణ హత్య!

*యుటిఎఫ్ ప్రచార యాత్రకు ఘనస్వాగతం :*ఎంపీ మాగుంట చేతుల మీదుగా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా ట్రెజరీ ఉద్యోగస్తులు : *సి ఎల్ ఆర్ విద్యాసంస్థల క్యాలెండర్ ఆవిష్కరణ : *బలిజ సేవా సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ :* మిరప రైతులకు శిక్షణ (కంభం) : *ఖుర్ఆన్ కంఠస్థ పోటీలలో ప్రతిభ చాటిన కంభం విద్యార్థులు..

👉 అల్లు అర్జున్‌ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు: పవన్ కళ్యాణ్… *రేవ్ పార్టీకి ఏర్పాట్లు*.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. *కేంద్రం నుంచి హోం శాఖ‌కు రావాల్సిన నిధుల కోసం కృషి చేస్తాను : ఎంపి కేశినేని శివ‌నాథ్ .. 👉అవార్డులను పంపిణీ చేసిన సిఐడి అడిషనల్ డి‌జి‌పి డా.ఏ.రవిశంకర్ ..*మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది … ఏపీలో ప్రభుత్వ అధికారులపై ఆగని దాడులు .. *మఫ్టీలో ఉన్న ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీపై దాడి.. *పేకాట అడుతూ పట్టుబడ్డ ఆరుగురు మహిళలు.

నేడు పంజాబ్ బంద్‌* .. 👉 బీజేపీ కుట్ర బట్టబయలైంది: కేజీవాల్ …👉ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..ఆ పార్టీల మధ్యనే పోటీ..👉 బియ్యం స్కామ్‌లో పేర్నినాని తన భార్యను ఇరికించారు -టీడీపీ నేత బుద్ధావెంకన్న ..*మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడాము..తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్.. 💥మెరైన్ పోలీసులు సాహసం తో ప్రాణాలతో బ్రతికి బయట పడ్డ ముగ్గురు మందుబాబులు*…అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు అడ్డుకోండి ఇలా.. *కేసీఆర్ కుటుంబానికి కరెంట్ షాక్ మాదిరి మాట చెప్పిన కోమటిరెడ్డి

👉చేతులకు సంకెళ్లతో టీచర్ల నిరసన..👉బిఆర్ఎస్ అక్రమాలపై ధ్వజమెత్తిన బిసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్*.. 👉పోలీస్స్టేషన్లో గుండెపోటుతో న్యాయవాది మృతి* .. *నకిలీ ఐపీఎస్ ప్రకాశరావుకు 14 రోజుల రిమాండ్ .. *జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ వహించాలి :ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ.వి… *హెల్మెట్ ని నిర్లక్ష్యం చేస్తే అది మీ ప్రాణాలను నిర్లక్ష్యం చేస్తుంది..మార్కాపురం డిఎస్పి నాగరాజు.