తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం….మరణించిన జనసేనాని కుటుంబానికి రూ.5 లక్షలు..మాజీ డి.ఎస్.పి నలిని ఆవేదన.. నూతన బస్సులను ప్రారంభించిన మంత్రి డోలా.. పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తుముల మాజీ ఎమ్మెల్యేలు అన్నా, కుందూర

👉 దుర్వాసనకు మా ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి..పిల్లలు పెద్దలు వాంతులు చేసుకుంటున్నారు..సారూ మా బాధను జర పట్టించుకోండి లేకుంటే మేము రోగాల బారిన పడే పరిస్థితిలో ఉన్నాం*వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల్ గ్రామ శివారులోని ఒ ఫ్యాక్టరీ నుండి వెలువడే దుర్వాసనతో చుట్టూ పక్కల మూడు గ్రామాల ప్రజలలు ఇబ్బందులకు గురి అవుతున్నారు ఫ్యాక్టరీని పూర్తిస్థాయిలో మూసివేయాలని కోరుతూ దారుర్ పోలీసులకు ఆశ్రయించిన దోర్నాల గ్రామస్తులు.

👉మరణించిన జనసేనాని కుటుంబానికి రూ.5 లక్షలు.

కంభం మండలం తురిమెల్ల గ్రామము జనసేన కార్యకర్త లంకా లక్ష్మణ మూర్తి గత జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆదివారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు మరణించిన జనసేనాని లక్ష్మణ మూర్తీ కుటుంబ సభ్యులకు జనసెన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు రూ.5 లక్షలు ప్రమాద భీమా చెక్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో జనసెన గిద్దలూరు నియోజక వర్గం ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు, జిల్లా అధ్యక్ష , కార్యదర్సులు షేక్ రియాజ్,లంకా నరసింహారావు పాల్గొన్నారు.

👉 తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎంపై చర్యలు తీసుకుంటాం..కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని తప్పుడు ఆరోపణలు … ప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్‌ చేస్తే చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి అనిత..తప్పుడు ప్రచారం చేస్తోన్న మాజీ సీఎం జగన్‌ మీద చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపుడి అనిత తెలిపారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్‌ తప్పుడు ఆరోపణలు చేశారు.. 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా..? అని ప్రశ్నించారు. రాజకీయ హత్యల వివరాలను జగన్‌ ప్రభుత్వానికి ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేశారు. సమాచారం ఇవ్వకుంటే.. జగన్‌ మీద చర్యలు తీసుకునే అధికారం చట్టానికి ఉంటుంది.. ప్రభుత్వం మీద ఎవరైనా టార్గెట్‌గా ఆరోపణలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన నెంబర్‌ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా.. మైకు ఉందని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలి అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.   👉ఇక, రాష్ట్ర అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే వైఎస్ జగన్‌ ఢిల్లీకి వెళ్తున్నారు అని మంత్రి అనిత అన్నారు. దమ్ముంటే జగన్‌ అసెంబ్లీకి రావాలి.. అసెంబ్లీలో శాంతి భద్రతలపై మేం ప్రవేశపెట్టే శ్వేత పత్రంపై జగన్‌ చర్చించగలరా?.. తప్పుడు ప్రచారం చేయడం జగనుకు అలవాటుగా మారింది.. ప్రజలు ఇంకా తన మాట నమ్ముతారని జగన్‌ భ్రమిస్తున్నారు అని ఆమె మండిపడింది. చంద్రబాబు మీద ఇంటి మీద జోగి రమేష్‌ దాడి చేశారు.. జై జగన్‌ అని అనలేదని చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను పీక కోసి చంపేశారు.. రోడ్‌ మీద పరదాలు కట్టడానికి.. చెట్లు నరకడానికి.. టీడీపీ నేతలను వేధించడం కోసమే జగన్‌ పోలీసులను వాడుకున్నారు అని ఆరోపించింది. నెల రోజుల కాలంలో మేం ఎక్కడన్నా.. వైసీపీ నేతలను హౌస్‌ అరెస్టులు చేశామా అని హోం మంత్రి ప్రశ్నించింది.👉ఇక, అడుగడుగునా అడ్డుకున్న వైసీపీది అటవిక పాలన..? యధేచ్ఛగా రోడ్ మీద తిరుగుతున్న జగన్ను అడ్డుకోని మాదా అటవిక పాలనా..? అని వంగలపూడి అనిత తెలిపారు. దిశా పోలీస్‌ స్టేషన్‌ ఓపెన్‌ చేసిన సాయంత్రమే గ్యాంగ్ రేప్‌ జరిగింది.. వైసీపీ హయాంలో జరిగిన నేరాలు, హత్యలు, అత్యాచారాల మీద సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా స్పందించారా.. లా అండ్‌ ఆర్డర్‌ మీద.. గంజాయి గురించి ఒక్కసారైనా సమీక్షించారా.. వినుకొండలో పరామర్శకు వెళ్లి.. రాజకీయాలు మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వినుకొండలో బాధిత కుటుంబానికి జగన్‌ ఒక్క రూపాయైనా ఇచ్చారా.. అక్రమ ఆస్తి కూడబెట్టిన దాంట్లోంచి కొంత మేరైనా బాధిత కుటుంబానికి ఇవ్వలేకపోయిన జగన్‌కు ఆ కుటుంబం మీద ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారని చెప్పుకొచ్చింది. పోలీస్‌ వ్యవస్థను జగన్‌ నిర్వీర్యం చేశారు.. అమరావతిలో ఉన్న పాపానికి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్మాణానికి గత ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వలేదు.. చంద్రబాబుపై రాళ్లేస్తే భావ స్వేచ్ఛ ప్రకటన అని కామెంట్లు చేసిన వైసీపీ ప్రభుత్వమా.. మమ్మల్ని విమర్శిస్తోంది అని హోంమంత్రి అనిత మండిపడ్డారు.

👉నా అప్లికేషన్లు చెత్తబుత్తలో వేశారా.. మాజీ డీఎస్పీ నళిని ఆవేదన… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సడెన్‌గా ఒక మాజీ పోలీస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆ ఉద్యోగిని బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడంతో పాటు.. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమె ఆచూకీ తెలుసుకుని.. సీఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. నేరుగా సీఎం పిలవడంతో ఆమె రేవంత్‌రెడ్డిని కలిశారు. నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా.. నళిని తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్‌నెస్‌తో తాను లేనని చెబుతూ.. ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సహాయం చేయాలని అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 7 నెలలు అవుతున్నా.. ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది….నళిని రాసిన లేఖ ఇదే..ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్‌బుక్‌లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్‌ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వడంలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కొలువుకు ఎక్కగానే తనకు ఎక్కువ ప్రచారం కల్పించారని.. ఇప్పుడేమో చప్పుడే చేస్తలేదని నళిని పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలోనూ నా వూసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతకీ తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవో అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఆర్వో, ఓఎస్డీకి ఓ లేఖ రాశానంటూ ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు……👉తీవ్ర ఆవేదన..చిన్నప్పుడు అడుక్కుంటూ ఎవరైనా ఇంటి ముందుకు వస్తే.. ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెల్లవయ్య అని మెల్లగా చెప్పేవాళ్లమని.. కనీసం అలాంటి మర్యాద అయినా తనకు ఇస్తారేమో చూడాలని పేర్కొన్నారు. తాను చాలా ఏళ్లుగా ఎవ్వరినీ కలవలేని.. ఉద్యమం చేసేటప్పుడే తనకు చాలా విషయాలు అర్థం అయ్యాయని చెప్పారు. ఒక నెలలో తన పిటిషన్‌పై విచారణ పూర్తి చేస్తారని భావించానని.. ఏడు నెలలు పూర్తైనా ఎటువంటి స్పందన లేకపోవడంతో.. రిమైండ్ లెటర్ రాయాల్సి వచ్చిందని నళిని తెలిపారు. సచివాలయం చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక తన వద్ద లేవనే విషయాన్ని రేవంత్‌ రెడ్డిని కలినప్పుడే చెప్పానని నళిని తెలిపారు.. కేపి

👉 ఒంగోలు ఆర్.టి.సి డిపోలో నూతన బస్సులను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ,వికలాంగులు మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ,సచివాలయం మరియు గ్రామ వాలంటీర్ శాఖ మంత్రివర్యులు,డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

👉ఒకే జిల్లాలో భార్యాభర్తలు ఇద్దరికీ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో పోస్టింగులు..ఇరువురు దంపతులు కలిసి ఒకే జిల్లాలో పనిచేయడం జిల్లా ప్రజలందరూ హర్షించదగ్గ విషయం! ఎక్కడా అని మీరు అనుకుంటున్నారా ? ..ఏలూరు జిల్లాలో భార్య,భర్తలు ఇద్దరూ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడేర్ లో ఉద్యోగాలు ..భర్త..కొమ్మిన ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, ఏలూరు జిల్లా సూపర్డెంట్ అఫ్ పోలీస్ గా నియమించిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.*భార్య* పి.ధాత్రి రెడ్డి ఐఏఎస్ ఏలూరు జిల్లా సబ్ కలెక్టర్ గా నియమించిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

** త్రిపురాంతకం మండలంలోని విశ్వనాదపురం లాకులు,దూపాడు పంపు సెట్ పరిసర ప్రాంతాలను సందర్శించిన మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా మరియు రెవిన్యూ,యాన్నెస్పి అధికారులు.

👉గిద్దలూరు మండల అభివృద్ధికి కృషి చేస్తా : ఎమ్మెల్యే అశోక్ రెడ్డి..ప్రకాశం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి కార్యాలయంలో ఆదివారం సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గిద్దలూరు మండలంలోని ప్రజా సమస్యల పై సంబంధిత శాఖల అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు. గిద్దలూరు మండలంలో గతంలో ఎంతో అభివృద్ధి చేశానని, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో గిద్దలూరు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. మండలంలో సమస్యల పరిష్కారానికై అధికారులు తమ వంతుగా సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అధికారులను కోరారు. అలానే మండలంలో నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు మండల స్థానిక ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

👉బేస్తవారిపేట మండలం, పూసలపాడు గ్రామంలో హెడ్మాస్టర్ చక్కా కృష్ణమూర్తి పదవీ విరమణ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

👉గోలమరి వారి నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు కుందూరు, అన్నా….మార్కాపురం పట్టణంలోని బి.కన్వెన్షన్ హాల్ నందు ఆదివారం జరిగిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమరి శ్రీనివాసరెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకల్లో పాల్గొన్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, గిద్దలూరు వైసీపీ ఇంచార్జి కుందూరు నాగార్జున రెడ్డి మరియు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే,మార్కాపురం వైసీపీ ఇంచార్జి అన్నా రాంబాబు…అనంతరం కాబోయే నూతన వధువరులు పార్వతి,శేఖర్ రెడ్డిలను వారు ఇరువురు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

7k network
Recent Posts

మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం..మత సామరస్యం ప్రతీ ఒక్కరూ పాటించాలి: KLR..పవన్ కళ్యాణ్ కి వరల్డ్ రికార్డ్స్..ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటోన్న ఎంపీ మిథున్ రెడ్డి..ఘనంగా ఎస్ డబ్ల్యూఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం..మార్కాపురం డిఎస్పీగా నాగరాజు .. ప్రకాశంజిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం.. జూదరుల అరెస్టు..50 క్వార్టర్ బాటిల్స్ స్వాధీనం

ముగ్గురు ఐపీఎస్‌లపై సస్పెన్షన్ వేటు !..జగన్మోహన్ రెడ్డి కి హైడ్రా అధికారుల నోటీసులు..వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం..సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్.. సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురి సంతాపం..అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..వంట నూనెలను మంట నూనెలు గా మార్చిన మోడీ ప్రభుత్వం.. అక్రమ రేషన్ బియ్యం నిల్వలను పట్టుకున్న పోలీసులు..బీజేపీలో నేతల మధ్య తీవ్రమవుతున్న కలహాలు.. మరో మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్.. ఎస్సై పై హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో కేసు..ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న బోట్ల తొలగింపులో ఎందుకింత ఆలస్యం?…

వైసీపీ అధినేత నోటి వెంట పాపం పవన్ అన్న మాట..!కోమాలో ఉన్న కానిస్టేబుల్ కోసం 10 లక్షల వైద్య సహాయం అందజేసిన పవన్ కళ్యాణ్.. ఆస్తికోసం సినిమా ఫక్కీలో బావ మరిదిని హత్య! చేసిన బావ..ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన..ప్రకాశం బ్యారేజ్ బొట్ల పరిస్థితి! అధికారులకు మళ్లీ నిరాశే.. .

క్రీం+బన్ = క్రీమ్-బన్…నిర్మలమ్మపై కామెంట్స్ వర్షంలో బిగ్ టర్న్!..గుంటూరు నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..సిబ్బంది వేదింపులు భరించలేక కేజీబీవీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం..ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు..గిద్దలూరులో జాతీయ లోక్ అదాలత్.

ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు..జనసేనలోకి బాలినేని..వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చిన మంగళగిరి పోలీసులు..మాదాపూర్‌లో పెట్టుబడుల పేరుతో మోసం..నటి జత్వానీ కేసులో ఏసీపీ, సీఐపై సస్పెన్షన్ వేటు..కొడుకు ప్రేమ వివాహం – తల్లిని కట్టేసి చిత్రహింసలు ..పొదిలిలో నిఘా నేత్రాలు.

ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించనున్న చంద్రబాబు..తాడేపల్లి టీడీపీలో బయట పడ్డ విభేదాలు..మంత్రి నారా లోకేష్ ని కలిసి విరాళాలు అందజేసిన పలువురు ప్రముఖులు..మా భూమిని కబ్జా చేశారు..పర్మిషన్ ఇస్తే పాకిస్థాన్ వెళ్లిపోతాం..పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎంపీ మాగుంట.